Article Search

Articles meeting the search criteria

సాధారణంగా సీతా రామ కళ్యాణమని, శ్రీనివాస కళ్యాణమని ఇలా ఎన్నో కళ్యాణోత్సవాలు జరుపుకుంటుంటాం. గోదా రంగనాథుల కళ్యాణానికి ఒక వైలక్షణ్యం ఉంది మిగతా కళ్యాణాలతో పోల్చితే. శ్రీనివాసుని కళ్యాణోత్సవంలో స్వామికి వైభవం, సీతారామ కళ్యాణంలో కూడా స్వామికే వైభవం కానీ గోదా రంగనాథుల కళ్యాణంలో వైభవం అంతా అమ్మ గోదాదేవికే...ఎందుకంటే రెండు కారణాలు. గోదాదేవి అద్భుతమైన వ్రతాన్ని ఆచరించి, ఆ ఆచరించిన దాన్ని మన దాకా ఆచరించేట్టుగా చేసింది అందుకే "పాడియరుళవల్ల పల్-వళై యాయ్" అని అంటుంటాం కదా. తాను ఆచరించిన దాన్ని ఎంతో కాలం దాక ఆచరించగలిగేట్టుగా ప్రబంధాన్ని అందించింది. అది గోదా దేవి గొప్పతనం. ఇది వరకు ఇలాంటి వ్రతాన్ని గో..
తమిళనాడు లోని శ్రీవిల్లిపుత్తూరు లో విష్ణుచిత్తుడనే భక్తుడు ఉండేవాడు... ఈ విల్లిపుత్తూరు లోనే శ్రీకృష్ణుడు మర్రి ఆకు మీద తేలియాడుతూ లోకాన్ని రక్షించాడని నమ్మకం... అందుకే ఇక్కడి ఆలయం లోని ప్రధాన దైవం ఆ చిన్నికృష్ణుడే... విష్ణుచిత్తుడు నిత్యం ఆ కృష్ణునికి పుష్పమాలలని అర్పిస్తూ ఉండేవాడు... విష్ణుచిత్తుడి అసలు పేరు భట్టనాథుడు. నిరంతరం ఆయన చిత్తం విష్ణుమూర్తి మీదే ఉండేది కాబట్టి ఆ బిరుదు దక్కింది.. ఆయనను విష్ణుభక్తులైన ఆళ్వారులలో ఒకరిగా ఎంచి ఆయనకు పెరియాళ్వారు అంటే - పెద్ద ఆళ్వారు అన్న గౌరవాన్ని కూడా అందించారు.. అలాంటి పెరియాళ్వారు ఒకసారి తులసి మొక్కల కోసం పాదులు తీస్తుండగా ఒక పాప కనిపించింది...
Showing 1 to 2 of 2 (1 Pages)