Article Search
Articles meeting the search criteria
ప్రతి ఏట ధనుర్మాసం శుక్లపక్ష పౌర్ణమికి ముందు వచ్చే ఏకాదశీని ‘వైకుంఠ ఏకాదశి ‘ పండుగగా పరిగణిస్తారు.ముక్కోటిఏకాదశి నాడు అన్ని వైషవాలయాల్లో ఉత్తరంవైపు ఉండే వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు. ఈ రోజు మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు, దేవయానం, పితృయానం అంటారు. ఉత్తరాయణంలో దేవయానంలో మరణించినవారు సూర్యమండలాన్ని , భేదించుకుని వెళ్లి మోక్షాన్ని పొందుతారు. దక్షిణాయనంలో పితృయానంలో పోయినవారు చంద్రమండలానికి చేరి, మళ్లీ జన్మిస్తారు. అందుకే భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చేవరకు అంపశయ్యపై ఎదురుచూశ..
చాలామంది దేవతల్ని, దేవుళ్ల, అమ్మవార్ల విగ్రహాల్ని దేవాలయాల్లో ప్రతిష్ఠిస్తాం. దేవాలయ ప్రతిష్ఠ సమయంలో మహాకుంభాభిషేకం జరుపబడుతుంది. తర్వాత పన్నెండు సంవత్సరాల కొకసారి ఆలయంలో దైవత్వాన్ని స్థిరీకరించటానికి జీర్ణోద్ధరణకు కుంభాభిషేకం నిర్వహింప బడుతుంది.రామాయణ మహాభారతాది మతగ్రంథాల్లో ప్రవచింపబడ్డ ధర్మాల్ని రక్షించాల్సిన ఆవశ్యకతను, స్వధర్మాన్ని గురించిన ఆలోచనలను మనకీ కుంభాభీషేకం సందర్భాలు గుర్తుచేస్తాయి. కుంభాభిషేకం రోజున మనం ఎక్కువ సంఖ్యలో ఆలయం వద్ద ఆ మహోత్సవాన్ని తిలకించడానికి సమావేశమౌతాం.కుంభాభిషేక సమయానికి దేశంలోని పుణ్య నదుల నుండి, తీర్థాలనుండి పవిత్ర జలాల్ని తెచ్చి కుంభాలను నింపి వాటిని యాగశాలలో ..
హైదరాబాద్ నగరానికి 30కిలో మీటర్ల దూరంలోని ఈ ఆలయం పురాతనమైనదిగా చారిత్రక ఆధారాలను బట్టి తెలుస్తోంది. ఈ క్షేత్రం భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. రాష్ట్రంలోనే ప్రముఖ శైవక్షేత్రం కీసరగుట్ట సాక్షాత్తు శ్రీరామచంద్రుడి చేతుల మీ దుగా మలిచిన ఆ పరమ శివుడు ఈ క్షేత్రంలో రామలింగేశ్వరుడిగా పూజలందుకుంటున్నాడు.క్షేత్ర పురాణం..బ్రాహ్మణుడైన రావణుడిని సంహరించిన అనంతరం సీతా సమేతంగా శ్రీరాముడు అయోధ్య నగరానికి బయల్దేరాడు. బ్రాహ్మణ హత్యా పాపాన్ని పోగుట్టుకునేందుకు రుషుల సూచనల మేరకు శ్రీరాముడు పలు ప్రాంతాల్లో శివలింగ ప్రతిష్ఠాపనలు చేయ సం కల్పిస్తాడు. శ్రీరాము డు ఈ ప్రాంతం గుండా వెళ్తూ.. ఇక్కడి ప్రక..