Article Search

Articles meeting the search criteria

'కార్తీక పౌర్ణిమ' నేపథ్యం , ప్రత్యేకతలు ఏంటి ?కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి అంటే హిందువులకి ఎంతో పవిత్రమైన రోజు. కానీ ఈ పరమ పవిత్రమైన రోజు వెనుకున్న నేపథ్యం , ప్రత్యేకతలు ఏంటి ?    కార్తీక మాసంలో వచ్చే ఈ పౌర్ణమి అంటే హిందువులకి ఎంతో పవిత్రమైన రోజు. శివుడు , శ్రీమహా విష్ణువులని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి , వారి అనుగ్రహం పొందేందుకు ఈ కార్తీక మాసం కన్నా పవిత్రమైనది మరొకటి లేదని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈ కార్తీక మాసంలో కానీ ప్రత్యేకంగా ఈ కార్తీక పౌర్ణమి రోజున కానీ శివాలయాలు , విష్ణువు నెలవైన పుణ్యక్షేత్రాల్లో భగవంతుడిని దర్శించుకోవాలనుకునే భక్తుల తాకిడి అధికంగా వుంటుం..
ఉసిరి చెట్టు క్రింద దీపారాధన చేసి...వనభోజనాలు ఎందుకు చేస్తారో తెలుసా........!!కార్తీకమాసం వచ్చిందంటే చాలు, వనభోజనాల కోసం ఉసిరిచెట్టు ఎక్కడవుందా అని జనులు అన్వేషిస్తుంటారు. ఈ మాసంలో ఎంతో పవిత్రమైనదిగా పూజించే ఉసిరి చెట్టు కింద, ఒక్క పూటైన భోజనం చేయాలన్నది హైందవ సంప్రదాయం. అందుబాటులో చెట్టు లేకపోతే, దాని కొమ్మయినా వెంట తీసుకువెళ్ళి మరీ భోజనం చేస్తుంటారు. ఎందుకంటే కార్తీకమాసంలో శ్రీ మహావిష్ణువు, లక్ష్మీ దేవి ఇద్దరూ కొలువై ఉంటారన్నది విష్ణుపురాణ కథనం. ఉసిరిని భూమాతగాను కొలుస్తారు. దేవదానవ సంగ్రామంలో, కొన్ని అమృత బిందువులు పొరపాటున భూమ్మీద పడటంతో, పుట్టిందే ఉసిరి అన్నది ఓ కథనం.&nbs..
కార్తీకం కార్తీక మాసం సందర్భం గా రోజుకో శైవక్షేత్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము.. ఈరోజు విశేషామైన  ఆలయం.. శ్రీ భిక్షేశ్వరుడు - శ్రీ గౌతమేశ్వర ఆలయం...( కరీంనగర్ జిల్లా మంథని  ) పురాతనకాలంలో ఈ ప్రదేశం వేద అభ్యాస కేంద్రంగా ఉండేది. ఇక్కడ ఎందరో  వేద పండితులు ఉండేవారు. అందుకే ఈ ప్రాంతాన్ని మంత్రకుటం లేదా మంత్రపురి పిలిచేవారు మంథని క్షేత్రానికి అనాది నామం "మంత్రకూటం". అనగా ఈ క్షేత్రం "దివ్య మంత్రాల కూటమి". అసలు ఈ క్షేత్రం గొప్పదనం వివరించడం దేవతలకు కూడా సాధ్యం కాదు అని శాస్త్రాలు చెప్తున్నాయి....ఎందుకంటే...విశ్వం మొత్తం పరమేశ్వరుని గృహమైతే  అందులో ..
కార్తీక మాసం సందర్భం గా రోజుకో శైవక్షేత్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము..ఈరోజు విశేషామైన  ఆలయం.....శ్రీ ఎండల మల్లిఖార్జునస్వామిఆలయము , రావివలస  గ్రామం,శ్రీకాకుళం......!! పరమశివుడు లింగరూపంలో దర్శనమిచ్చే ఈ ఆలయంలో విశేషం ఏంటంటే ఆలయానికి పైకప్పు, ద్వారం లాంటివి లేవు. ఇంకా ఇక్కడి శివలింగం ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగంగా గుర్తింపు పొందింది. మరి ఇక్కడి శివలింగాన్ని ఎండల మల్లికార్జునుడు అని ఎందుకు పిలుస్తారు,ఈ ఆలయం ఎక్కడ ఉందనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని, శ్రీకాకాకుళం జిల్లా, టెక్కలికి కొంత దూరంలో రావి వలస గ్రామంలో ఎండల మల్లికార్జునుడు..
కార్తీక మాస విధులు  కార్తీకము బహుళార్థసాధకముగా  శివ కేశవ జగన్మాతలను,  శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరస్వామి వారిని యధాశక్తి పూజించుట ప్రధానము.     ఆసక్తి, శక్తి కలిగినవారు.... ఈ మాసమంతా దీక్ష అవలంబించడం, మాసమంతా నక్త భోజన వ్రతమును ఆచరించటం ఉత్తమము.     ఈ మాసమంతా......1) సూర్యోదయానికి పూర్వమే కార్తీకస్నానం సంకల్పయుతముగా..2) కార్తీక దీప ప్రజ్వలన ప్రాతః సాయంకాల ఉభయ సంధ్యలలో.3) శక్తిమేరకు శివ అభిషేకమో, ఇష్టదేవతా అనుష్ఠానమో, అర్చనో, జపమో, పూజ నామపారాయణమో, అవశ్యం దానము అనుసరణీయమే.4) "కార్తిక్యామిందువారేతు:స్నాన దాన జపాదికం  |అశ్వమేధ సహస్రాణాం ఫలం ..
కార్తీకమాసం విశిష్టత  : ప్రాతఃకాల స్నానదానాదులతో - కార్తీక స్నానాలు ప్రారంభం♪. కార్తీకమాసం అత్యంత పవిత్రమైంది♪. ఈ మాసంలో శివకేశవుల పూజ చేసేవారికి, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం♪. ఈ మాసంలో వచ్చే... ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ, సోమవారాల్లో శివారాధన చేసేవారికి, పుణ్యఫలం చేకూరుతుంది♪.  కార్తీక మాసం మొత్తం మీద - కార్తీక ఏకాదశి, ద్వాదశులకు ప్రత్యేకత ఉంది♪. అందుకే ఈ రెండు తిథుల్లో, వైష్ణవ సంబంధమైన పూజలు ఎక్కువ చేస్తుంటారు♪. కార్తీకమాసం అంటేనే సాధారణంగా శివప్రధానమైన పూజలు నిర్వహించడం కనిపిస్తుంటే.. వీటితో పాటు జరిగే విష్ణుపూజలు.. మనకు శైవ, వైష్ణవ భేదాలు పాటించకూడద..
శ్రీ గురుభ్యోన్నమః | శ్రీ మహాగణాధిపతయే నమః | శివాయ గురవే నమఃకార్తీకమాసం ఎప్పటి నుంచి ప్రారంభం, కార్తీకమాసంలో ముఖ్యమైన పర్వదినాలు మరియు కార్తీక మాసం విశిష్టత గురుంచి తెలుసుకుందాం"న కార్తీక నమో మాసః న దేవం కేశవాత్పరం! నచవేద సమం శాస్త్రం న తీర్థం గంగాయాస్థమమ్" అని స్కంద పురాణంలో పేర్కొనబడింది. అంటే కార్తీక మాసానికి సమానమైన మాసము లేదు. శ్రీ మహావిష్ణువుకు సమానమైన దేవుడు లేడు. వేదముతో సమానమైన శాస్త్రము లేదు గంగతో సమానమైన తీర్థము లేదు.” అని అర్ధం.కార్తీకమాసం శివ,కేశవులిద్దరికీ అత్యంత ప్రీతికరమైన మాసం. ఏటా దీపావళి మర్నాడే కార్తీకమాసం ప్రారంభమవుతుంది. కానీ ఈ ఏడాద..
1.సకృదావర్తనము :ప్రతి దినము ఒక సారి నమకమును, చమకమును పూర్తిగా చెప్పి, అభిషేకార్చనలు చేయడం సకృదావర్తనము అంటారు. దీని వలన గంగా స్నాన ఫలితంతో పాటు ఏ దినము ఏ పాపాలు ఆ దినముననే నశించి పోతాయి.2.రుద్రైకాదశిని(రౌద్రీ) :"ఏక పాఠో నమస్తేస్యహ్యనువాక: పరస్యచ" ఒక సారి నమకమును పూర్తిగా చెప్పి, చమకంలోని మొదటి అనువాకమును చెప్పి అభిషేకించుటను ఒక ఆవర్తము అంటారు. ఇలా 11 ఆవర్తములు అభిషేకించినచో ఏకాదశావర్తము అవుతుంది. దీన్నే ఏకాదశ రుద్రం అని కూడా అంటారు. దీని వలన అనేక జన్మల పాపాలు సమసిపోతాయి.3.లఘు రుద్రము :"తైరేకాదశభీ రుద్రై:లఘు రుద్ర ప్రకీర్తిత:"పైన చెప్పిన ఏకాదశ రుద్రములను ఏక దీక్షతో 11 మార్లు జరిపినచో అతి రుద్రమ..

కార్తీక పురాణము - ముప్పైవ రోజు పారాయణ

 

సూతుడు చెప్పిన విషయాలను విన్న ఋషులు 'ఓ మునిరాజా! రావిచెట్టు ఎందువలన అంటరానిది అయ్యింది. ఆయినప్పటికీ శనివారం నాడు మాత్రం ఎందుకు పూజనీయతను పొందింది? అని ప్రశ్నించగా, సూతమహర్షి సమాధాన పరచసాగాడు ...

 

 

కార్తీక పురాణము - ఇరవై తొమ్మిదవ రోజు పారాయణ

 

నారదుడి హితవుపై రవ్వంత చింతించిన యముడు, ఆ ధనేశ్వరునకు ప్రేతపతి అనే తన దూతను తోడిచ్చి, నరకాన్ని తరింపచేయవలసినదిగా ఆదేశించాడు. ఆ దూత, ధనేశ్వరుడిని తనతో తీసుకొనివెడుతూ మార్గమధ్యంలో నరక భేదాలను చూపిస్తూ, వాటి గురించి ఇలా వినిపించసాగాడు ...

కార్తీక పురాణము - ఇరవై ఎనిమిదవ రోజు పారాయణ

 

సత్యభామ! నారదప్రోక్తలైన (నారదుడు చెప్పిన)సంగతులతో ఆశ్చర్యమనస్కుడు అయిన పృథువు, ఆ ఋషిని పూజించి, అతని వద్ద శలవు తీసుకున్నాడు. ఆ కారణంగా ఈ మూడు వ్రతాలూ కూడా నాకు అత్యంత ప్రీతిపాత్రం అయి ఉన్నాయి. మాఘ కార్తీక వ్రతముల వలెనే తిథులలో ఏకాదశి, క్షేత్రములలో ద్వారక నాకు అత్యంత ప్రియమైనవి సుమా! ఎవరయితే వీటిని విధివిధానంగా ఆచరిస్తారో, 

 

కార్తీక పురాణము - ఇరవై ఏడవ రోజు పారాయణ

 

విష్ణుగణాలు చెప్పిన చోళ, విష్ణుదాసుల కథ తరువాత, ధర్మదత్తుడు మళ్ళీ వారిని 'ఓ గణాధిపతులారా! జయ-విజయులు వైకుంఠంలో విష్ణుద్వారపాలకులని విని వున్నాను. వారు ఎటువంటి పుణ్యం చేసుకోవడం వలన విష్ణుస్వరూపులై అంతటి స్థానాన్ని పొందారో తెలియజేయండి' అని అడగడంతో, ఆ గణాధిపతులు చెప్పడం ప్రారంభించారు.

 

కార్తీక పురాణము - ఇరవై ఆరవరోజు పారాయణ

 

విష్ణు గణాలు చెప్పినది అంతా విని - విస్మృతచేష్టుడూ, విస్మయ రూపుడూ అయిన ధర్మదత్తుడు తిరిగి వారికి దండప్రమాణాలు ఆచరించి, 'ఓ విష్ణు స్వరూపురాలా! ఈ జనానికి అంతా అనేకానేక క్రతు వ్రత దానాలచేత నా కమలనాభుడిని సేవించుకుంటూ వున్నారు. 

కార్తీక పురాణము - ఇరవై ఐదవ రోజు పారాయణ

 

పృథువు అడుగుతున్నాడు: 'నారదా! నీచే అత్యద్భుతంగా చెప్పబడిన తులసీ మహత్యాన్ని విని ధన్యుడినైనాను. అదే విధంగా కార్తీక వ్రతాచరణ ఫలితాలను కూడా ఎంతో చక్కగా చెప్పావు. అయితే, గతంలో ఈ వ్రతం ఎవరెవరిచేత ఎలా ఎలా ఆచరించబడిందో తెలియజేయి' అని కోరగానే, నారదుడు వినిపించసాగాడు.

Showing 1 to 14 of 30 (3 Pages)