Article Search

Articles meeting the search criteria

ఈ రోజు నృసింహ జయంతి .లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము --ఆది శంకరాచార్యుడు శ్రీ శంకర భగవత్పాదులు శిష్యులతో దేశ సంచారము చేయుచూ శ్రీశైలమునకు వచ్చినపుడు శ్రీ సంకరులను ఒక కాపాలికుడు చంప నిశ్చయించెను. ఒక గొప్ప రాజును గాని, యోగిని గాని బలి యిచ్చినచో కపాలి (ఈశ్వరుడు) తనకు కోరిన వరములిచ్చునని కాపాలికుని విశ్వాసము. శ్రీ శంకరులు దీనికి అంగీకరించి, నాశిష్యులవలన నీకు అపాయము కలుగకుండా చూచుకొనుము అని చెప్పిరి.కాపాలికుడు కత్తి నెత్తిన పెట్టు సమయమున శ్రీ శంకరులు అంగరక్షకులైన పద్మపాదు అను శిష్యునకు తమ గురువు ఆపదలో ఉన్నట్లు స్పురించి, అతడు నృసింహ మంత్రమును జపించుచూ ..
అంతర్వేది తీర్థం ( రథోత్సవం) : తూర్పు గోదావరి జిల్లాలో అత్యంత ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం అంతర్వేది. అంతర్వేది త్రికోణాకారపు (లంక) దీవిలో ఉంటుంది. ఇక్కడ నరసింహ స్వామి లక్ష్మీ సమేతుడై కొలువుతీరాడు. ఈ క్షేత్రానికి భక్తుల కోర్కెలు తీర్చే పుణ్యక్షేత్రం అని పేరు వచ్చింది. సముద్ర తీరాన ఉన్న ఈ ఆలయం ఎంతో విశిష్టతను సంతరించుకుంది. ఇది దక్షిణ కాశిగా పేరుపొందింది. కాశీకి వెళ్ళలేని వారు ఒక్కసారి అంతర్వేది వెళ్ళి వస్తే చాలని అంటారు. ప్రతి ఏటా మాఘమాసం శుద్ధ సప్తమి నుంచి బపుళ పాడ్యమి వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. మాఘ శుద్ధ దశమి నాడు స్వామివారి కల్యాణం, ఏ..
ఫాల్గుణ మాస శుక్ల ద్వాదశి ని నృసింహ ద్వాదశి లేదా గోవింద ద్వాదశి అని అంటారు. చైత్రాది మాసాల క్రమంలో చిట్ట చివరిది ఫాల్గుణ మాసం. శిశిర రుతువుకు ముగింపు పలికే ఫాల్గుణ మాసంలో వచ్చే ప్రతి తిథిలోనూ ఓ వ్రతం చేస్తారు. ఫాల్గుణ నెలలో శుక్ల పక్షమి చంద్రుని ప్రకాశవంతమైన పక్షం కాలం  'ద్వాదశి' అనగా పన్నెండవ రోజు, ఇంగ్లీష్ క్యాలెండర్ అనుసరిస్తున్నవారికి ఈ తేదీ ఫిబ్రవరి మధ్య నుండి మార్చి మధ్య లోపు వస్తుంది.  ఫాల్గుణ మాసంలో వచ్చే నృసింహ ద్వాదశిన వైష్ణవ ఆలయాలను సందర్శించడం ద్వారా శుభఫలితాలు చేకూరుతాయి. ఫాల్గుణ శుద్ద ద్వాదశిని నృసింహ ద్వాదశి అంటారు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో ఒకటైన నరసింహస్వామి..
నేటి నుండి మంగళగిరి శ్రీ పానకాల నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం ..మంగళగిరి పానకాల నరసింహ స్వామి(క్షేత్రం).......మంగళగిరి గుంటూరు జిల్లాలో ఉన్నది. గుంటూరు - విజయవాడ జాతీయ రహదారి పై గుంటూరుకు 20 కి.మీ దూరంలో ఉన్న ఈ చారిత్రక పట్టణములో ప్రసిద్ధి చెందిన, పురాతనమైన లక్ష్మీనరసింహ స్వామి దేవాలయం ఉన్నది. మంగళగిరి అనగానే పానకాల స్వామి స్ఫురణకు వస్తాడు. లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం :ఇక్కడ ఉన్న లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం వాస్తవంగా రెండు దేవాలయాల కింద లెక్క. కొండ కింద ఉన్న దేవుడి పేరు లక్ష్మీనరసింహ స్వామి. కొండ పైన ఉన్న దేవుడిని పానకాల స్వామి అని అంటారు. కొండ పైని దేవాలయంలో విగ్రహమేమీ ఉం..
 21-02-2023: యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహా స్వామివారి బ్రహ్మోత్సవ ప్రారంభమ్శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయము నల్లగొండజిల్లా యాదగిరిగుట్ట మండలములో మండల కేంద్రము సమీపములో ఎత్తయిన గుట్టపై ఉన్న ఆలయము. ఇది ఆంధ్రప్రదేశ్ లోని ప్రముఖ ఆలయాలలో ఒకటి. స్థల పురాణం:ఋష్యశృంగ మహర్షి, శాంతల పుత్రుడు యాదమహర్షి. ఈయన చిన్నతనం నుంచే హరి భక్తుడు. ఈయన ఆంజనేయస్వామి సలహా మీద ప్రస్తుతం యాదగిరిగా పిలవబడుతున్న ప్రదేశంలో చాలా కాలం తపస్సు చేశారు. అప్పుడు ఒక రాక్షసుడు ఆహార అన్వేషణలో అటుగావచ్చి నిశ్చల తపస్సులో వున్న ఈ ఋషిని చూసి తినబోయాడు. ఆ విషయం తపస్సులోవున్న ఋషికి తెలియలేదుగానీ, ఆయన ఎపరి గురించైతే త..
కళ్యాణం కమనీయం శ్రీలక్ష్మీనరసింహుని వైభోగం. నేత్రపర్వంగా అంతర్వేది నరసింహుని కల్యాణం. లక్షలాదిగా తరలి వచ్చిన భక్తులు. అలవైకుంఠ ఇలకు వచ్చిందా అన్నట్లు సాగింది నరసింహుని కళ్యాణం. సాగర తీరాన కెరటాలతో పోటీపడుతూ భక్త తరంగాలు అంతర్వేదికి పోటెత్తాయి. ఈ పావన భాగ్యాన్ని చూసిన భక్తులు ఆనంద డోలికలలో మునిగితేలారు.అశేష భక్తుల మధ్య సాగిన దివ్య ఘట్టం న్ని చూసిన వారి మది తన్మయత్వంతో పులకించింది. సర్వజగన్నియామకుడైన ఆ దేవదేవుని కల్యాణ వేళ.. అంతర్వేది పుణ్యక్షేత్రం దివ్యధామంగా శోభిల్లింది. రంగురంగుల విద్యుద్దీపాలు.. పరిమళాలు వెదజల్లే పూలమాలల అలంకరణలతో తీర్చిదిద్దిన ఆలయ ప్రాంగణంలోని ..
INTRODUCTIONWe can keep on telling about the significance of Lord Narasimha, day and night and for all the 365 days in a year. The Meaning for the word Narasimha is half lion with human body. Since Lord Narasimha had appeared in this form, even some Vishnu devotees are also getting afraid to worship him. But, the main purpose of the Narasimha avatar is to destroy the evil forces and to maintain proper law and order position in the earth. Actually though the form of Lord Narasimha appears in a fierce form, but for his staunch devotees, he used to appear only in a beautiful form. Still ..

ఋణ విమోచన నృసింహ స్తోత్రం

దేవతా కార్య సిద్ధ్యర్థం సభా స్తంభ సముద్భవమ్ |
శ్రీ నృసింహం మహావీరం నమామి ఋణ ముక్తయే || ౧ ||

 

Showing 1 to 8 of 8 (1 Pages)