Article Search
Articles meeting the search criteria
కార్తీక పౌర్ణమి విశిష్టత?
పౌర్ణమి ప్రతి నెలా వస్తుంది కానీ చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసి ఉండే కార్తీక పౌర్ణమికి ఉండే ప్రత్యేకత మరే పౌర్ణమికీ ఉండదు. కార్తీక శుద్ధ పౌర్ణమి లేదా కార్తీక పౌర్ణమి అంటే కార్తీకమాసంలో శుక్లపక్షంలో పున్నమి తిథి కలిగిన పదిహేనవ రోజు. కార్తీకమాసంలో పౌర్ణమి రోజును చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.
శ్రీ కేదారేశ్వర వ్రత కథ
పరమేశ్వరుని అర్థాంగి పార్వతి తన పతి శరీరంలో అర్థభాగం పొందు నిమిత్తము చేసిన వ్రతమైన కేదారేశ్వరుని వ్రతం గురించి చెబుతాను. శ్రద్ధతో వినవలసింది అని సూతుడు శౌనకాదులకు చెప్పాడు.
శివుడు పార్వతీ సమేతుడై కైలాసంలో నిండుసభలో కూర్చుని ఉన్నారు. సిద్ధ-సాధ్య-కింపురుష-యక్ష-గంధర్వులు శివిదిని సేవిస్తూ ఉన్నారు. దేవముని గణాలు శివుడిని స్తుతిస్తూ ఉన్నారు. ఋషులు, మునులు, అగ్ని, వాయువు, వరుణుడు, సూర్యచంద్రులు, తారలు, గ్రహాలు,