Article Search
Articles meeting the search criteria
కార్తీక పురాణము - పదహారవ రోజు పారాయణ
ఈ విధంగా సూతుడు ప్రవచించిన స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యాన్ని విని, సంతుష్ట మనస్కులైన శౌనకాది కులపతులు 'హే పురాణకథా కథనవచో సురథునీ! సూతమునీ! లోకోత్తర
పుణ్యదాయక ఈ కార్తీక పురాణము స్కాందమందేగాక, పద్మపురాణాంతరవర్తి! అని కూడా విని ఉన్నాము. మాయందు కృపాశుడవై ఆ విషయాలను కూడా విశదపరచు'' అని ప్రార్థించగా, సురుచిర
కార్తీక పురాణము - పదిహేనవ రోజు పారాయణము
ఆ మరునాడు కార్తీకపౌర్ణమి కావడంవలన, నైమిశారణ్యంలోని మునులు అందరూ సూతమహర్షి ఆధ్వర్యంలో - వనభోజనాలను ఏర్పాటు చేసుకున్నారు. ధాత్రీ వృక్ష సంపద ఉన్న చక్కటి ప్రదేశానికి
చేరుకున్నారు. ఉసిరిచెట్టు క్రింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమను ఏర్పాటుచేశారు. ఉసిరికలతో హరిని పూజించారు. తరువాత 'గోవింద' నామస్మరణతో - వనభోజన సమారాధన
కార్తీక పురాణము - పదనాలుగవ రోజు పారాయణ
తరువాత అంబరీషుడు దూర్వాసుడికి నమస్కరించి - 'మహామునీ! నేను బహు పాపాత్ముడిని. ఆకలితోవుండి అన్నం కోసం నా ఇంటికి వచ్చిన నిన్ను అలసట పాలుచేసిన మందభాగ్యుడిని. అయినా
నాయందు దయతో మళ్ళీ నా యింటికి అతిథిగా వచ్చావు. దయచేసి నా ఇంట విందు ఆరగించి, నా సర్వదోషాలను ఉపశమింప చేయి' అని ప్రార్థించాడు. దూర్వాసుడి అతనిని తన బాహువులతో
కార్తీక శుద్ధ ఏకాదశి విశిష్టత?
తోలి ఏకాదశి (ఆషాఢ శుద్ధ ఏకాదశి) రోజున శయనించిన శ్రీమహావిష్ణువు కార్తీకశుద్ధ ఏకాదశి రోజున యోగనిద్ర నుండి మేల్కొనే రోజు అందుకే ఇది ఉత్థాన ఏకాదశిగా పేరుపొందింది. దీనినే హరిబోధిని ఏకాదశి, దేవప్రబోధిని అని కూడా పిలుస్తారు. చాతుర్మాస వ్రతం ప్రారంబించిన తొలి ఏకాదశి, కార్తీక శుద్ధ ఏకాదశితో ముగుస్తుంది. భీష్మపితామహుడు మహాభారత యుద్ధంలో ఈ ఏకాదశి రోజునే అస్త్రసన్యాసం చేసి అంపశయ్య మీద శయనించాడు.
కార్తీక పురాణము - పదమూడవ రోజు పారాయణము
విష్ణు ఉవాచ: "దూర్వాసా! బ్రాహ్మణుడవైన నీపట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విచారగ్రస్తుడై, ప్రాయోపవిష్టుడిలాగా బ్రాహ్మణ పరివేష్టితుడై వున్నాడు. నా సుదర్శనచక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఖిస్తున్నాడు. రాజయినందుకుగాను గో, బ్రాహ్మణరక్షణ తన ప్రథమ కర్తవ్యమై ఉండగా, విప్రుడైవైన నీకు విపత్తు కలిగినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు. రాజదాననీతితోనే ధర్మ పరిపాలనం చేయాలి కాని, బ్రాహ్మణుడిని మాత్రం దండించకూడదు.
కార్తీక పురాణము - పన్నెండవ రోజు పారాయణం
అత్రిమహముని చెబుతున్నాడు:- అగస్త్యా! కార్తీకమాస శుక్ల ద్వాదశిని 'హరిబోధిని' అని అంటారు. ఆ ఒక్క పర్వతిథీ వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాలలోనూ స్నానం చేసిన, అన్ని విధాలైన యజ్ఞాలు ఆచరించిన కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది. విష్ణువుపట్లా, ఏకాదశిపట్లా భక్తిని కలిగిస్తుంది. సూర్యచంద్ర గ్రహణ పర్వాలకంటే గొప్పదీ ఏకాదశి కంటే వందరెట్లు మహిమాన్వితమైనదీ అయిన ఈ ద్వాదశినాడు ఏ పుణ్యం చేసినా, పాపం చేసినా అది కోటిరెట్లుగా పరిణమిస్తుంది.
కార్తీక పురాణము - పదకొండవరోజు పారాయణ
ఆత్ర ఉవాచ : అగస్త్య - సాధారణమైన కొట్లాటగా ప్రారంభమై, దొమ్మీగా మారి, ఆ సమరం ఒక మహాయుద్ధంగా పరిణమించింది. అస్త్రశాస్త్రాలతో, పదునైన బాణాలతో, వాడివాడి గుదియలతో, ఇనుపకట్ల తాడి కర్రలతో, ఖడ్గ, పట్టిన, ముపల, శూల, భాల్లాతక, తోమర, కుంభ, కుఠారాద్యా ఆయుధాలతో ఘోరంగా యుద్ధం చేశారు. ఆ సంకుల సమరంలో కాంభోజరాజు మూడువందల బాణాలను ప్రయోగించి, పురంజయుడి గొడుగును, జెండానూ, రథాన్ని కూలగొట్టాడు.
కార్తీక సోమవారం విశిష్టత?
కార్తీకమాసంలో శ్రీమహాశివుడికి అత్యంత ప్రీతికరమైనది కార్తీక సోమవార వ్రతం. కార్తీకంలో వచ్చే ఏ సోమవారం రోజునైనా స్నాన, దానాలు, జపాలు ఆచరించేవారికి వెయ్యి అశ్వమేథ యాగాలు చేసిన ఫలాన్ని పొందుతారు. ఈ సోమవార వ్రతవిధి ఆరు రకాలుగా ....
కార్తీక పురాణము - ఏడవరోజు పారాయణం
రాజా! ఎంత చెపినా తరగని ఈ కార్తీక మహాత్య మహాపురాణంలో కార్తీకమాసంలో చేయవలసిన ధర్మాల గురించి చెబుతాను, ఏకాగ్రత చిత్తంతో విను. తప్పనిసరిగా చేయవలసినవీ, చేయకపోవడం వలన పాపం కలిగించేవీ అయిన ఈ కార్తీక ధర్మాలన్నీ కూడా ఆ తండ్రి అయిన బ్రహ్మదేవుని ద్వారా నాకు బోధింపబడ్డాయి. నీకు ఇప్పుడు వాటిని వివరిస్తాను.
కార్తీక పురాణము - మొదటిరోజు పారాయణము
శ్రీ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టిలో విశిష్టమైన శ్రీనైమిశారణ్యానికి విచ్చేసిన సూతమహర్షిని సత్కరించి,, సంతుష్టుడిని చేసి, స్థానికులైన శౌనకాది ఋషులు ఆయన వద్దకు వచ్చి 'సకల పురాణగాథ అయిన, నూతమునీ కలికల్మశ నాశానకం అయిన కైవల్య దాయకమయిన కార్తీకమాస మహత్యము విన్పించి మమ్మల్ని ధన్యులను చేయమని అడిగారు. వారి కోరికను మన్నించిన వ్యాసశిస్యుడు అయిన సూతమహర్షి 'శౌనకాదురాలా! మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షులవారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణాలలోని స్కాంద, పద్మపురాణాలు రెండింటిలోనూ తెలియజేసి ఉన్నారు.
ధనత్రయోదశి కథ:
పూర్వం హిమ అనే రాజుకి ఒక్కడే సంతానం. ఆ బాలుడు క్షత్రియుడు కనుక కత్తిసాము, గుర్రపుస్వారీ మొదలైన క్షత్రియ విద్యలు నేర్చుకున్నాడు. యువరాజు జాతకరీత్యా వివాహం అయిన నాలుగవ రోజున మరణిస్తాడు అని పురోహితులు తెలిపారు. అయినా ఒక రాకుమారి అతడిని వివాహం చేసుకోవడానికి సిద్ధపడుతుంది. వారిరివురికీ వివాహం జరిగిన నాలుగవ రోజున రాకుమారి తన భర్త ప్రాణాలు కాపాడుకోవడానికి రాకుమారిడి ఇంటిముందు బంగారు ఆభరణాలను రాశిగా పోసి, దీపాలను వెలిగిస్తుంది.
దేవీ నవరాత్రుల ప్రాశస్త్యం – ‘శమీపూజ’ కథ
దేవి అంటే ఒక దేవతాశక్తి. సర్వశక్తిమంతమైన ఈ దేవీ ఆరాధన తొమ్మిది రాత్రులు మరియు పది రోజులలో, అంబ లేదా జగదంబగా, విశ్వానికి మాత;అన్నపూర్ణ, సమృధ్ధిగా ధాన్యాన్ని (అన్నం) ప్రసాదించే తల్లిగా; సర్వమంగళ, అందరికీ మంచి చేకూర్చే తల్లిగా; భైరవిగా; చంద్రిక లేదా చండిగా; లలితగా; భవానిగా; మూకాంబికగా, ఈ తొమ్మిది రూపాలలో పూజించటం.
గోవులో దాగివున్న దేవుళ్ల పేరేంటి..? పూజించడం వల్ల లాభమేంటి?
హిందూ సంప్రదాయంలో గోవును పూజించడం ఓ ఆచారం. దీన్నే గోపూజ అంటారు. దీనికి మన పురాణాల్లో ఎంతో విశిష్ట ఉంది. గోక్షీరం (ఆవుపాలు)లో చతుస్సముద్రాలుంటాయని ఈ పురాణాలు చెపుతున్నాయి. సర్వాంగాలలో సమస్త భువనాలు దాగి ఉంటాయంటాయని వేద పండితులు చెపుతుంటారు.
వినాయకుడి గురించి ‘ఓంకారం’ చెప్పే రహస్యం
సృష్టిలో తొలి శబ్దం ‘ఓం’కారం. సంస్కృత భాషలో ‘ఓం’ అనే అక్షరం 3 అంకెలా వుండి దాని మధ్యనుంచి వంకరగా ఒక తోక వచ్చి, దానిపైన అర్థచంద్రరేఖ వుండి, అందులో ఒక బిందువు వుంటుంది. ‘ఓం’కారానికి ఆకారం అది. ‘ఓం’కారం అంటే ‘ప్రణవం’. వినాయకుడు ప్రణవస్వరూపుడు. 3 అంకెలో వుండే పైభాగం ఆయన తల. క్రింద భాగం కాస్త పెద్దదిగా వుంటుంది.