Article Search
Articles meeting the search criteria
తిరుమలలో
ఫిబ్రవరి 24వ
తేదీన శ్రీ కుమారధార తీర్థ
ముక్కోటి ఘనంగా జరుగనుంది.
ఈ
పర్వదినాన భక్తులు తీర్థ
స్నానమాచరించి,
దానధర్మాలు
చేసి స్వామివారిని దర్శించుకుంటారు.
ప్రకృతి
సౌందర్యాల నడుమ కుమారధార
తీర్థంలో స్నానమాచరించడాన్ని
భక్తులు ప్రత్యేకంగా
భావిస్తారు.వరాహ,
మార్కండేయ
పురాణాల ప్రకారం ఒక వృద్ధ
బ్రాహ్మణుడు శేషాచల గిరుల్లో
ఒంటరిగా సంచరిస్తుండేవాడు.
శ్రీవేంకటేశ్వరస్వామివారు
ప్రత్యక్షమై ”ఈ వయసులో చెవులు
వినిపించవు,
కళ్లు
కనిపించవు..
అడవిలో
ఏంచేస్తున్నావు” అని ప్రశ్నించారు.
యజ్ఞయాగాలు
ఆచరించి దైవరుణం తీర్చుకోవాలనే
తలంపుతో ఉన్నాను అని వృద్ధుడు
బదులిచ్చాడు.
అనంతరం
స్వామివా..
అప్పలాయగుంటలో వైభవంగా పుష్పయాగం అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో గురువారం పుష్పయాగం వైభవంగా జరిగింది. ఆద్యంతం శోభాయమానంగా సాగిన ఈ పుష్పయాగ మహోత్సవాన్ని చూసి భక్తులు తన్మయత్వం చెందారు. ఆలయంలో మే 31 నుంచి జూన్ 8వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరిగాయి. నిత్యకైంకర్యాల్లో గానీ, బ్రహ్మోత్సవాల్లో గానీ, అర్చక పరిచారకుల వల్ల, అధికార అనధికారుల వల్ల, భక్తుల వల్ల తెలియక ఏవైనా లోపాలు జరిగి ఉంటే వాటిని నివృత్తి చేసుకునేందుకు పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఉదయం ఉభయదేవేరులతో కూడిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారిక..
వేడుకగా శ్రీ రామకృష్ణ తీర్థ ముక్కోటి : తిరుమల శేషాచల అడవుల్లోని పుణ్యతీర్థాల్లో ఒకటైన శ్రీ రామకృష్ణతీర్థ ముక్కోటి ఆదివారం వేడుకగా జరిగింది. ప్రతిఏటా మాఘ మాసంలో పౌర్ణమినాడు శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి నిర్వహించడం ఆనవాయితీ. శ్రీరామకృష్ణ మహర్షి తపోబలంతో ఈ పుణ్యతీర్థాన్ని సృష్టించినట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. శ్రీవారి ఆలయం నుంచి అర్చక సిబ్బంది మంత్రోచ్ఛారణ చేసుకుంటూ ఊరేగింపుగా బయలుదేరి ఉదయం 9 గం||లకు శ్రీ రామకృష్ణ తీర్థానికి చేరుకున్నారు. అక్కడ కొలువై ఉన్న శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ భగవానుల విగ్రహాలకు..