Article Search

Articles meeting the search criteria

సత్యనారాయణ స్వామి వ్రత కధల అంతరార్ధం మనకున్న ఎన్నో గొప్ప విశేషమైన పూజలలో, వ్రతాలలో  శ్రీ సత్యన్నారాయణస్వామి వ్రతం చాలా ఉత్కృష్టమైనది.  పెళ్ళిళ్ళలో, గృహప్రవేశాలలో, ఏ శుభ సందర్భంలో అయినా; మనం ఆచారంగా ఈ వ్రతం చేసుకుంటాము.  ముందుగా అష్టదిక్పాలకులను, నవగ్రహాలను, దేవతాసమూహాన్ని వారి సపరివారంగా ఆహ్వానించి, ఆవాహన చేసి ఉచితాసనాలతో సత్కరించి, వారి ఆశీస్సులను స్వీకరించి మంత్రపుష్పం సమర్పించి, అప్పుడు స్వామివారి లీలా విశేషాలను కధల రూపంగా విని తరిస్తాము. ఈ వ్రత విధానం “స్కాందపురాణం” రేవాఖండంలో వివరింపబడి వున్నది. ఇక్కడ 5 కధల సమాహారం ఎన్నో విశేషాలను మనకు తెలుపుతాయి. 1. మొదటగా ..
రేపటి నుండి మూడు రోజులు   దేవి త్రిరాత్ర వ్రతం ప్రారంభం ,  ‘త్రిరాత్ర వ్రతదీక్ష’ అంటే ఏమిటి ?అమ్మ దయతోనే సర్వ జగత్తూ నడయాడుతోంది. ఆ అమ్మ కరుణా పారీణ. ఆ తల్లి అమృతహృదయ. ఆమె చల్లని చూపులకోసం అఖిలాండాలు ఎదురు చూస్తుంటాయ. అందుకే ఆరాధించడానికి తిథి వార నక్షత్రాలు లేకపోయినా ఈ ఆశ్వీయుజమాసాన వచ్చే శుద్ధ పాడమి మొదలుకుని నవమి వరకు ఆ తల్లిని కొలిచినవారికి కోటిజన్మలలోని పాపరాశి భస్మమవడమే కాదు తుదిలేని పుణ్యరాశి లభ్యవౌతుందట. అందుకే సజ్జను లందరూ ఈ జగాలనేలే జగన్మాత వ్రతాన్ని ఆచరించడానికి వేయ్యి కనులతో ఎదురు చూస్తుంటారని అలా చూసి అమ్మ వ్రతాన్ని ఆచరించిన వారికి కోరుకున్న కోరికలన్నీ సిద్ధిస్తాయని..
పిల్లల శ్రేయస్సు కోరే 'పోలాల అమావాస్య' పూజ పోలాల అమావాస్య వ్రత కథ: సనాతన ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి వ్రతం, నోముకు ఒక కథ ఉంటుంది. నియమ నిష్ఠతో, భక్తి శ్రద్ధలతో వ్రతం పూర్తి చేసుకున్న తర్వాత వ్రత కథను చదువుకుని అక్షింతలు వేసుకుంటేనే వ్రతం పరిపూర్ణమై, వ్రత ఫలం దక్కుతుందని శాస్త్రవచనం. అలాగే పోలాల అమావాస్య పూజ చేసుకున్న తర్వాత వ్రత కథను చదువుకోవాలి. పోలాల అమావాస్య కథ:పూర్వ కాలంలో ఓ బ్రాహ్మణ మహిళకు ప్రతి ఏటా పిల్లలు పుడుతుంటారు. అయితే పుట్టీ పుట్టగానే ఆ పసికందులు ఏదో ఒక కారణంతో మరణిస్తూ ఉంటారు. అలా పుట్టిన కొన్ని గంటల్లోపే మరణిస్తున్న బిడ్డలను చూసి ఎంతో దుఃఖంతో ఆ మహిళ ఊరి వెలుపల ఉన్న గ్రా..
అమలక ఏకాదశి సందర్భంగాశ్రీ లక్ష్మీనారాయణాష్టకం.1)ఆర్తానాం దుఃఖశమనే దీక్షితం ప్రభుమవ్యయమ్ | అశేషజగదాధారం లక్ష్మీనారాయణం భజే ||2)అపారకరుణాంభోధిం ఆపద్బాంధవ మచ్యుతమ్ | అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే ||3)భక్తానాం వత్సలం భక్తిగమ్యం సర్వ గుణాకరమ్ | అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే ||4)సుహృదం సర్వ భూతానాం సర్వ లక్షణ సంయుతమ్ | అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే ||5) చిదచిత్సర్వ జంతూనాం ఆధారం వరదం పరమ్ |అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే ||6) శంఖచక్రధరం దేవం లోకనాథం దయానిధిమ్ | అశేష దుఃఖ శాంత్యర్థం లక్ష్మీనారాయణం భజే ||7)పీతాంబరధరం విష్ణుం విలసత్సూత్ర శోభితమ్ | అశేష దుఃఖ శాంత్యర..
పాల్గుణ మాసం లో వచ్చే శుక్ల పక్ష చతుర్థి నాడు పుత్ర గణపతి వ్రతం జరుపుకుంటారు. వినాయక చవితి వ్రతంలానే ఈ వ్రతాన్ని ఆచరించవలసి ఉంటుంది. మంచి సంతానం కోసం , సంతానం లేని వాళ్ళు సంతానం కలగడం కోసం ఈ వ్రతం జరుపుకుంటారు అని పురాణాలు చెబుతున్నాయి.  చతుర్థి నాడు గణపతి కి చేసే పూజ కార్యక్రమాల వలన సంతానం కలుగుతుంది అని నమ్మకం.‘‘సాక్షాత్‌ రుద్ర ఇవాపరః’’ అన్నట్లుగా జగదాంబ అనుగ్రహముతో జన్మించి రుద్రానుగ్రహముతో సకల విఘ్నములకు అధిపతి అయిన గణపతిని శివుడు శిరస్సు ఖండన చేసి మరలా గజముఖము పెట్టినప్పుడు జగదాంబ పార్వతీ దేవిని ఆనందింప చేయుటకు పరమేశ్వరుడితో సహా దేవతలందరూ పార్వతీ ఒడిలో ఉన్న వినాయకుని స్తుతించిన స్తుత..

వరలక్ష్మీదేవి వ్రతకథ 

సూత మహాముని శౌనకుడు మొదలైన మహర్షులను చూసి ఈ విధంగా అన్నాడు. 'ఓ మునీశ్వరులారా! స్త్రీలకు సర్వ సౌభాగ్యాలు కలిగే వరం ఒకటి పూర్వం శివుడు పార్వతీదేవికి చెప్పాడు. దాన్ని మీకు చెపుతాను వినండి.

ఒకరోజు కైలాస పర్వతంపై శివుడు తన సింహాసనం మీద కూర్చుని ఉండగా, పార్వతీద్వి ఆయన దగ్గరకు వచ్చి 'దేవా! లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే 

వరలక్ష్మీవ్రత పూజావిధానం

హిందూ స్త్రీలు తమ సౌభాగ్యాన్ని కాపాడుకోవడానికి తగిన మార్గాన్ని ఉపదేశించమని పార్వతీదేవి శివుడిని కోరిందట. అప్పుడు పరమశివుడు వరలక్షీ వ్రతాన్ని గురించి తెలిపినట్లు వేదపండితులు తెలుపుతున్నారు. వరలక్ష్మీ వ్రతం శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున చేస్తారు. ముత్తైదువులు అందరూ ఈ నోమును భక్తిశ్రద్ధలతో నోచుకుంటారు. వరలక్ష్మీవ్రతం రోజున మహిళలు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి ఇళ్ళు, వాకిళ్ళు శుభ్రపరిచి చిమ్మి ముగ్గులు పెట్టాలి. 

 శ్రీ సాయి నవగురువార వ్రతము

శ్రీసాయి గురిచి తెలియని వారెవరూ ఉండరు. కలియుగంలో సద్గురు అవతారం. నేటికీ సమస్త జనులకూ హితం కలిగిస్తూ ఉంటారు. పదహారేళ్ళ వయస్సులో షిర్డీలోని వేపచెట్టు కింద కూర్చుని గ్రామస్తులకు కనిపించారు. మళ్ళీ చాంద్ భాయీ పాటిల్ తో పెళ్ళి ఊరేగింపులో వచ్చి షిర్డీలో కనిపించారు. 

శ్రీసాయి నవగురువార వ్రతం ఎందుకు చేయాలి ?

సకల కార్యసిద్ధికి, విదేశీ ప్రయాణం కోసం, మనశ్శాంతి కోసం, వ్యాపార అభివృద్ధి కోసం, శత్రునివారణ కోసం, మీ మనస్సులో కోరికలు తీరడానికి, పరీక్షలలో ఉత్తీర్ణత కోసం, శీఘ్ర సంతానం కోసం, సంతానాభివృద్ధి కోసం, అధిక సంపాదన కోసం, సంతోషం కోసం. 

శ్రీ సాయి నవగురువార వ్రతము

*    శ్రీ సాయి నవగురువార వ్రతాన్ని స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు, పెద్దలు (వృద్ధులు)అనే భేదం లేకుండా అందరూ చేయవచ్చు. కులమత భేదం లేకుండా ఆచరించాలి.

*          మహారాష్ట్ర ప్రాంతంలో బాగా ఆచరిస్తున్న వ్రతము చాలా ప్రభావంతమైనది. తొమ్మిది గురువారాలు విధిగా ఆచరిస్తే కోరిన కోరిక సఫలం అవుతుంది.

 శ్రీ సాయి నవగురువార వ్రతము

వ్రత నియమాలు :

*          శ్రీ సాయి నవగురువార వ్రతాన్ని స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు, పెద్దలు (వృద్ధులు)అనే భేదం లేకుండా అందరూ చేయవచ్చు. కులమత భేదం లేకుండా ఆచరించాలి

 

శ్రీ సాయి నవగురువార వ్రతము

సకల కార్యసిద్ధికి, విదేశీ ప్రయాణం కోసం, మనశ్శాంతి కోసం, వ్యాపార అభివృద్ధి కోసం, శత్రునివారణ కోసం, మీ మనస్సులో కోరికలు తీరడానికి, పరీక్షలలో ఉత్తీర్ణత కోసం, శీఘ్ర సంతానం కోసం, సంతానాభివృద్ధి కోసం, అధిక సంపాదన కోసం, సంతోషం కోసం.

సౌభాగ్యగౌరీ వ్రతం

శివడోలోత్సవం చైత్ర శుద్ధ తృతీయ రోజున పండుగ జరుపుకుంటారు. వసంత నవరాత్రులలో తొమ్మిది రోజులలో ఇది మూడవరోజు . పంచాంగకర్తలు దీన్నే సౌభాగ్యగౌరీ వ్రతం, సౌభాగ్యశయన వ్రతం, మసగౌరీ వ్రతం, ఉత్తమ మన్వాది అని కూడా అంటారు. ఈ రోజున ఉమాశివులకు దమనంతో పూజించి డోలోత్సవం నిర్వహించినట్లయితే గొప్ప ఫలితాన్ని ఇస్తుందని శాస్త్ర గ్రంథాల ద్వారా తెలుస్తుంది.

మనం చేసే దోషాలు మనకు అంటకుండా తొలగించుకోవాలంటే గణపతిని ఏ పూజారాధన చేస్తే ఏ దోషం పోతుందో మీకు తెలుసా?

సూర్యదోషం  తొలగిపోవాలంటే ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించాలి.

చంద్రదోషం తొలగిపోవాలంటే పాలరాయితో లేదా వెండితో చేసిన గణపతిని పూజించాలి

కుజదోషం తొలగిపోవాలంటే రాగితో చేసిన గణపతిని పూజిస్తే ఫలితం ఉంటుంది

Showing 1 to 14 of 24 (2 Pages)