Article Search

Articles meeting the search criteria

తిరుప్పావై పాశురము - 25

భగవానుడే తన కుమారుడుగా కావలెనని కోరి, శంఖచక్రగదాధరుడు అగు భగవానునే కుమారునిగా పొందగల్గిన సాటిలేని దేవకీ దేవికి కుమారుడవై జన్మించి, శ్రీకృష్ణుని లీలలను పరిపూర్ణంగా అనుభవించి, కట్టను - కొట్టాను భగవానుని వశమొనర్చుకొనిన అద్వితీయ వైభవము గల యశోదకు, ఆ రాత్రియే కుమారుడవై, దాగి పెరిగినవాడా! అట్లు పరుగుచున్న నిన్ను చూచి ఓర్వలేక చంపవలెనని దుష్టభావముతో

తిరుప్పావై పాశురము - 24

 

పూర్వం లోకాలన్నిటినీ నీ అడుగులతో కొలిచిన స్వామీ! నీ పాదాలకు మంగళం! లంకలోని రక్కసుల్ని అందర్నీ మట్టుపెట్టినవాడా! నీ బాహుబలానికి శుభమంగళం! శకటాసురుణ్ణి చిన్నపాదాలతో తన్నిన స్వామీ! నీ కీర్తికి మంగళం! వత్సాసురుణ్ణి ఒడిసెలరాయివలె విసిరివేసి, కపిత్థాసురుని కూల్చివేసిన బలశాలీ! నీ అడుగులకు మంగళం ! శుభమంగళం!! గోవర్థనగిరిని గొడుగుగా ఎత్తి కాపాడిన స్వామీ నీ కృపకు దివ్య మంగళం !

తిరుప్పావై పాశురము - 23

 

వానాకాలంలో గుహలో నిద్రిస్తున్న సింహం ఒక్కసారిగా నిద్రలేచి, వళ్ళు సాగదీసి విరుచుకొని, గగుర్పాటుగా వళ్ళు దులుపుకొని శౌర్యంగా చూస్తూ గంభీరంగా గర్జిస్తూ వచ్చినట్లుగానే అవిసెపుష్పంవలె నల్లని మేనితో నిగనిగ మెరుస్తున్న ఓ కన్నయ్య! శయన మందిరంనుండి బయలు వెడలి కొలువుమంటపానికి విజయంచేసి సింహాసనంపై

తిరుప్పావై పాశురము - 22 

 

భూమండలంలోని చక్రవర్తులంతా తమ శరీరాభిమానాలను, అహంకారాలను పూర్తిగా వదలివేసి, నీ మంచము దగరికి వచ్చి, దేవరవారి దయకై కాచుకొని వున్నవారివలె, మేమూ గుంపుగా వచ్చి నీ దివ్యసన్నిధిలో నిలిచివున్నాము. కృష్ణా! మువ్వల నోరులాగ, అరవిరిసిన ఎఱ్ఱని తామర మొగ్గవలెనున్న నీ కన్నుల్ని మెల్లమెల్లగా తెరచి నీ చల్లనిచూపు మాపై ప్రసరింపజేయుమా! ఓ కన్నయ్య! సూర్యచంద్రులు ఉదయించినట్లుగా

తిరుప్పావై పాశురము - 21

 

కుండలు అన్నీ నిండి పోర్లిపోయేవిధంగా పాలను ఇచ్చే ఆవులమందను దండిగా సంపాదించి ప్రసిద్ధిగన్న నందగోపుని కుమారుడైన ఓ గోపాలకృష్ణా! నిదుర మేల్కొవయ్యా! అశ్రితరక్షకా! ప్రపన్నార్తిహరా! శత్రువులు నీవల్ల పరాజితులై దిక్కుగానక నీ ముంగిట వచ్చి నీ పాదాలమీద పడి మీకు సేవచేస్తున్న రీతిని, మేము పొగడుతూ నీకు మంగళాశాసనం పాడటానికిగాను,

తిరుప్పావై పాశురము - 20

 

ముప్పైమూడుకోట్ల దేవతలకు భయాలు కలగడానికి ముందే వారి దగ్గరకు వెళ్ళి వారి ఆపదలను తొలగించే ఓ గోపాలకృష్ణా! ఇక నిద్దుర మేలుకొనవయ్యా! (కృష్ణయ్య పలుకనందువల్ల) స్వర్గ కలశాలవంటి వక్షోజాలు, పగడాలవంటి ఎఱ్ఱని పెదవులు, సొంపైన సన్నని నడుమూ గలిగి శ్రీమహాలక్ష్మి వంటి సౌందర్యంగల ఓ నీలాదేవీ!

తిరుప్పావై పాశురము - 19

 

నాలుగుమూలల్లో దీపపు సెమ్మెలు వెలుగుతుండగా, దంతపుకోళ్ళ మంచమ్మీద సుతిమెత్తని దూదిపరుపుపై, జడలో గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులను పెట్టుకొన్న, నీలాదేవి కౌగిలిలో నిద్రిస్తున్న శ్రీకృష్ణదేవా! నోరు తెరచి ఒక్కమాటైనా మాటాడరాదా!

తిరుప్పావై పాశురము - 18

 

మదగజాలను అణచునట్టి మహాబలశాలి, శత్రువులను చూసి వెనుకంజవేయని భుజబలశాలి అయిన నందగోపరాయని ముద్దులకోడలా! ఓ నీలాసుందరీదేవీ! నిద్ర మేలుకోవమ్మా! కమ్మనైన పువ్వులతో సుగంధాలు వెదజల్లే కురులుగల రమణీమణీ! నిద్దురలేచి తలుపు తెరువు! అంతటా కోళ్ళు కూస్తున్నవి. గురువిందతీగెల పందిళ్ళపైన కోయిలగుంపులు కూతలు పెడుతున్నాయి.

తిరుప్పావై పాశురము - 17  

 

సంతృప్తిగా నీళ్ళు, అన్నవస్త్రాలనిచ్చి, ఆదరంగా మమ్ము ఆదుకొంటున్న నాయకశిరోమణీ! ఓ నందగోపస్వామీ! నిద్దురమేలుకొనవయ్యా! మానినీ మణులందరిలోను మిన్నయై వన్నె తెస్తూ కులదీపమై ప్రకాశిస్తూవున్న ఓ యశోదమ్మా! నిద్దుర మేలుకోవమ్మా!!

తిరుప్పావై పాశురము - 16

 

మా నాయకుడైన నందగోపుని భవనానికి కావలివున్న ద్వారపాలకస్వామీ! మకరతోరణాదులు చెక్కబడి పతాకాలతో అందంగా కనపడుతున్న రతనాల వాకిలి గడియతీసి తలుపులు తెరచిపెట్టు. మేము యదువంశంలో పుట్టిన అమాయకమైన భామలం! విచిత్రమైన మాయగాడు, నీలమణుల వంటి శరీరచ్చాయగలిగిన ఆ నల్లని కన్నయ్య, మాకు ఓకే వాద్యాన్ని (వరాన్ని) 

సుబ్రహ్మణ్య షష్ఠి

 

ఓం మమ ఉపాత్తదురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే అద్య బ్రాహ్మణ ద్వితీయ పరార్థే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే, కలియుగే, ప్రథమపాదే, జంబూద్వీపే, భరతవర్షే, భరతఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే అస్మిన్ (ఆయా ప్రాంతాలకు మార్చుకోవాలి) వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠి సంవత్సరానాం మధ్యే శ్రీ …. (సంవత్సరం పేరు)

తిరుప్పావై పాశురము - 15  

 

 చెలికత్తెలు ఓసీ! చిలుకపలుకుదానా! ఇంటను నిద్రిస్తూ వున్నావా! కీరవాణి - ష్, ఒళ్ళు ఆదరేట్లు ఏమిటా అరుపు! ఇదే లేచి వస్తున్నా. చెలికత్తెలు చతురవాక్కులు కలదానా! నీ నోరు మాకు తెలియదా! కీరవాణి - సరే కానీ, నేను రాలేదని అంటున్నారు కాని, అందరూ వచ్చినారా! చెలికత్తెలు అందరూ వచ్చినారు.

తిరుప్పావై పాశురము - 14 

 

కన్యకామణి! మమ్ము మేల్కొలుపుతానని బీరాలు పలికి నీవే ఆదమరచి నిద్రిస్తున్నావా! ఏమిటి? ఇంకా తెల్లవారలేదని బుకాయింపు మాటలు సిగ్గులేకుండా పలుకుతున్నావా? అటు చూడు మీ ఇంటి పెరడు కొలనులోని ఎర్రతామరాలు వికసించాయి! నల్లకలువలు ముడుచుకొన్నాయి! అటు వీథిలో కాషాయాంబరధారులైన సన్యాసులు దేవాలయం తలుపులు తెరచుటకై తాళాల గుత్తులను తీసుకొనిపోతున్నారు.

వెండి దీపాలతో ఆరాధన, ఫలితాలు 

 

ఈ విశ్వములో రకరకాల మనుషులు , రక రకాల మనసులు ... మనిషి మనిషి కి తేడా , మనసు మనషు కి తేడా ఉంటుంది . మనసు + శరీరము కలిస్తేనే మానవ జీవి . (psycho + soma ) ప్రాణము గాలి నుండి , శరీరము భూమి (మట్టి)నుండి పుడతాయి . పంచభూతాల మిళితమే ఈ విశ్వములోని జీవుల తయారీ . అయితే ఈ పంచభాతాలు ఏమిటి ?. 

Showing 561 to 574 of 799 (58 Pages)