Article Search

Articles meeting the search criteria

కాలదేవి.....ప్రపంచమంతటా ఏ ఆలయం ఐనా పగటి పూట తెరిచి రాత్రి పూట మూసివేయబడుతుంది. కానీ.. రాత్రంతా తెరిచి వుంచే ఆలయం ఒకటి ఉంది. అదే కాలదేవి ఆలయం.మానవులు అనుభవిస్తున్నా చెడు సమయాన్ని మంచి సమయంగా మార్చాగలిగే కాలదేవి దేవతను ప్రార్థిస్తే చింతలు పరిష్కారమవుతాయని, ఇబ్బందులు తొలగిపోతాయనేది భక్తుల నమ్మకం.అందుకే ఈ దేవతను సమయ దేవత అని కూడా అంటారు.కాలదేవి దేవత విగ్రహంలో 12 రాశిచక్ర, 27 నక్షత్రాలు మరియు నవ గ్రహాలు ఉన్నాయి. ఈ కళాదేవి అమ్మన్ సమయ చక్రం నడిపే అమ్మవారిగా కొలుస్తారు. ఈ దేవత యొక్క దర్శనం మీకు లభిస్తే, చెడు కాలాలు మంచి కాలంగా మారుతాయి. ఇది సమయం మారుతున్న ఆలయం కనుక దీనిని..
నేడు నృసింహ ద్వాదశి 21-03-2024నృసింహ ద్వాదశిఓం నమో నృసింహా…ఫాల్గుణ శుద్ధ ద్వాదశిని నృసింహ ద్వాదశి అంటారు. నరసింహ అవతారం దాల్చింది విష్ణువే కాబట్టి ఈ రోజును గోవింద ద్వాదశి అని కూడా అంటారు. భారత దేశంలోని అనేక వైష్ణవాలయాల్లో ఈ రోజున విశేషంగా ఉత్సవాలు జరుపుతారు. ఈ రోజున, గంగా, సరస్వతి, యమునా, గోదావరి వంటి పవిత్ర నదులలో స్నానాలు ఆచరిస్తారు. సూర్యోదయానికి ముందే లేచి నదుల్లో స్నానాలు చేస్తారు. ఈ నదులు అందుబాటులో లేనివారు ఏ సరస్సులోనైనా, నదుల దగ్గర కూడా స్నానాలు చేయవచ్చు. అలా చేస్తున్నప్పుడు గంగా దేవి, విష్ణువులను స్మరించుకోవాలి. ఈ రోజు భక్తులు గోవింద ద్వదశి వ్రతం ఆచర..
శ్రీ మేధా దక్షిణామూర్తి రూపు ఉన్నత విద్య కొరకు, పిల్లలకు చదువు పట్ల ఆసక్తి, జ్ఞాపకశక్తి పెరిగి పరీక్షలలో విజయం చేకూర్చే శ్రీ మేధా దక్షిణామూర్తి రూపు  శివ జ్ఞాన స్వరూపుడు మేధా దక్షిణామూర్తి, విష్ణు జ్ఞాన స్వరూపుడు హయగ్రీవుడు. వీరిద్దరూ జ్ఞాన స్వరూపులే. జ్ఞాన ప్రదాతలే .ఇక విద్యల గురించి వేరే చెప్పనక్క ర్లేదు. దక్షిణామూర్తి స్తోత్రం గురు గ్రహ అనుగ్రహాన్ని కూడా కలిగిస్తుందని పెద్దలు చెబుతారు   గురవే సర్వలోకానాం భిషజే భవ రోగిణాం నిధయే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయేనమః,అన్నిలోకాలకూ గురువు సంసారమనే రోగంతో బాధపడుతుతన్న వారికి వైద్యుడు, అన్ని విద్యలకూ ..
సోమవారం శివపూజ …శివానుగ్రహంశివపూజకు ఎంతో ప్రధానమైనది సోమవారం, శివానుగ్రహానికి నెలవైందని సంప్రదాయం చెబుతోంది..!రుద్రుడి రౌద్రం దుష్టశక్తులను దునుమాడుతుంది, సాధుస్వభావులను కాపాడుతుంది, శివార్చనలో శివలింగం ప్రధానం, లింగం శివుడికి ప్రతిరూపం, శివుడు అభిషేక ప్రియుడు, అందుకే నెత్తిమీద గంగను ధరించి గంగాధరుడయ్యాడు... పంచభూతాల్లో భక్తుడు శివుణ్ని దర్శిస్తాడు...మట్టితో శివలింగాన్ని రూపొందించుకొని స్వయంభూలింగంగా భావించి పూజిస్తారు...జలబిందువుల రూపంలో లింగాలెన్నో , జ్వలిస్తున్న విస్ఫులింగం భక్తుడికి శివలింగంలా కనిపిస్తుంది, అందుకే అగ్నికి నమస్కరిస్తాడు, ఆకాశం అంతా శివలింగ రూ..
శ్రీ ఆదిశంకరాచర్య విరచితశ్రీ లలితా పంచరత్న స్తోత్రం(1) ప్రాతః స్మరామి లలితావదనారవిందంబింబాధరం పృథులమౌక్తికశోభినాసమ్ |ఆకర్ణదీర్ఘనయనం మణికుండలాఢ్యంమందస్మితం మృగమదోజ్జ్వలఫాలదేశమ్||(2) ప్రాతర్భజామి లలితాభుజకల్పవల్లీంరక్తాంగుళీయలసదంగుళిపల్లవాఢ్యామ్ |మాణిక్యహేమవలయాంగదశోభమానాంపుండ్రేక్షుచాపకుసుమేషుసృణీర్దధానామ్ ||(3) ప్రాతర్నమామి లలితాచరణారవిందంభక్తేష్టదాననిరతం భవసింధుపోతమ్ |పద్మాసనాదిసురనాయకపూజనీయంపద్మాంకుశధ్వజసుదర్శనలాంఛనాఢ్యమ్ ||(4)ప్రాతః స్తువే పరశివాం లలితాం భవానీంత్రయ్యంతవేద్యవిభవాం కరుణానవద్యామ్ |విశ్వస్య సృష్టవిలయస్థితిహేతుభూతాంవిద్యేశ్వరీం నిగమవాఙ్మమనసాతిదూరామ్ ||(5)..
మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామిశ్రీ గురు రాఘవేంద్ర స్వామి (1595-1671), హిందూ మతంలో ఓ ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో జీవించాడు. ఇతను వైష్ణవాన్ని అనుసరించాడు. మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించాడు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు.తమిళనాడు-భువనగిరి వాసులైన తిమ్మనభట్టు-గోపికాంబ దంపతులకు వెంకటనాథుడు (రాఘవేంద్రస్వామికి తల్లిదండ్రులు పెట్టిన పేరు ఇదే!) 1595లో జన్మించారు. ఐదేళ్లప్రాయంలో అక్షరాభ్యాసం చేసి.. ఆపై నాలుగు వేదాల అధ్యయనం చేశారు. యుక్తవయసు వచ్చేసరికే విద్యల సారాన్ని గ్రహించిన వెంకటనాథుడు సాధారణ కుటుంబ జీవితాన్ని వద్దనుకుని.. సన్..
ఈ రోజు (సోమవారం 11-03-2024) నుంచి ఏప్రిల్ 8-2024 వరకూ ఫాల్గుణమాసం.ఫాల్గుణ మాసం సర్వదేవతా సమాహారం. తిథుల్లో ద్వాదశి మణిపూస లాంటిది. సంఖ్యాపరంగా పన్నెండుకు ఒక ప్రత్యేకత ఉంది. సూర్యుడికి 12 పేర్లున్నాయి. సంవత్సరానికి 12 మాసాలు. ఫాల్గుణం పన్నెండోది. దాని తర్వాత కొత్త ఏడాది మొదలవుతుంది. ప్రకృతికంగా స్త్రీలకు పన్నెండో ఏడు, సమాజపరంగా విద్యార్థులకు పన్నెండో తరగతి ప్రధానం.ఫాల్గుణ శుద్ధ ద్వాదశి నృసింహ ద్వాదశిగా ప్రసిద్ధం. ఈ ద్వాదశిని గోవింద ద్వాదశి అని, విష్ణుమూర్తికి ప్రియమైన ఉసిరి పేరుతో అమలక ద్వాదశి అని పిలుస్తారు. ఫాల్గుణ బహుళ పాఢ్యమి రోజున రావణుడితో యుద్ధం కోసం శ్రీరామచంద్రుడు లంకకు బయల్దేరాడన..
ప్ర : శివరాత్రి రోజున ఉపవాస దీక్షను ఎలా చేయాలి?జ : సాధారణంగా ఉపవాసం అన్నప్పుడుఆహార విసర్జనం ఉపవాసంగా చెప్పబడింది.ఇది ఒక పెద్ద తపస్సు. ఎందుకంటే మానవునికి ఆహారం మీద ఒక మోహం ఉంటుంది.దానిని నిగ్రహించడం వల్ల జన్మజన్మాంతరాలుగామన శరీరంలో సంచితమై ఉన్న పాపాలుపోతాయి.బాహ్యార్థంలో ఆహారవిసర్జన వల్ల శుద్ధి అవుతాం.శుద్ధి అయితేనే సిద్ధి. కనుక ఉపవాసం చాలా ప్రధాన వ్రతంగా పురాణాలలో అనేక రకాలుగా చెప్పారు.ఉపవాసం చేసేటప్పుడు వారి వారి శారీరక అవస్థలను అనుసరించి ఉపవాసాలు చెప్పారు.కొంతమంది జలం కూడా పుచ్చుకోకుండా కటిక ఉపవాసం చేస్తారు. అది వారి...శారీరక స్వస్థతల మీద ఆధారపడి ఉంటుంది.మొండిగా "మేం పాటిస్తున్నాం" అని చ..
మల్లన్న పెళ్లికి నేతన్న ‘తలపాగా’ మూడు తరాలుగా పృథ్వీ వంశస్తుల ఆచారం శ్రీశైలం మల్లన్న కల్యాణానికి ముహూర్తం ముంచుకొస్తోంది. పెళ్లికోసం తలపాగా సిద్ధమైంది. శివరాత్రి రోజున చీరాల నేతన్న నేసిన తలపాగాను చుట్టిన తర్వాతే పెళ్లితంతు మొదలవుతుంది. ఈ అదృష్టం చీరాల చేనేత కార్మికుడికి దక్కడం ఈ ప్రాంతవాసుల అదృష్టం. ఈ ఆచారం మూడు తరాలుగా వస్తోంది. ఇదీ తంతు.. : ఏటా శివరాత్రి రోజు శ్రీశైలం మల్లన్న కల్యాణం జరుగుతుంది. ఆయనను వరుడిని చేసేందుకు తలపాగాలంకరణ చేస్తారు. శివరాత్రి లింగోద్భవ సమయంలో రాత్రి 10 నుంచి 12 గంటల మధ్య కల్యాణం నిర్వహిస్తారు. ఇందుకు గాను చీరాలలో తయారు చేసిన చేనేత వస్..
మహాశివ రాత్రి పూజా విధానం .జ్యోతిష శాస్త్రాన్ననుసరించి మాఘ బహుళ చతుర్దశి తిథిన చంద్రుడు సూర్యునికి దగ్గరవుతాడు. ఆ సమయంలో జీవన రూపమైన చంద్రునికి, శివరూపుడైన సూర్యునికి మధ్య యోగం కలుగుతుంది. అందువల్ల ఈ చతుర్దశినాడు శివపూజ చేసిన వారికి అభీష్టసిద్ధి కలుగుతుంది. శివుడు అభిషేకప్రియుడు. కాబట్టి దుఃఖనివృత్తికై క్షీరంతోనూ, బుద్ధివికాసానికి పంచదారతోనూ, శత్రునాశనానికి తైలంతోనూ, భోగప్రాప్తికి సుగంధ ద్రవ్యజలంతో, ఐశ్వర్యానికి తేనెతో, సంతానప్రాప్తికి చెరకు రసంతో, మోక్షప్రాప్తికి గంగాజలంతో అభిషేకించాలని పురాణాలు పేర్కొన్నాయి.ఉప మపేపిశత్తమః కృష్ణం వ్యవక్తమస్థిత్ !    ఉష ఋణేన యాతయ !!మహాశివరాత్రి వ్రతా..
సప్త ఋషులు:ఈరోజుల్లో సప్త ఋషులు మనకు కనపడతారా? అంటే ఖచ్చితంగా కనబడతారు అని చెప్పవచ్చును. ఇంకా గట్టిగా చెప్పాలంటే...అందరికీ కనపడతారు, చూడగలిగితే ప్రతీరోజూ కనపడతారు. ఇంకా చెప్పాలంటే ప్రతీ దంపతులూ సాయంత్రంపూట సప్త ఋషులకు, అరుంధతీ వశిష్ఠులకు నమస్కరించుకోవాలికూడా.ఎక్కడ ఉంటారు? ఎలా ఉంటారు?అనేది మన పెళ్ళిళ్ళలో 'అరుంధతీ దర్శనం' చేయిస్తూ పురోహితులు తెలియజేస్తారు.సాయంత్రం పూట ఆకాశంలో ఉత్తరం దిక్కున ప్రతీరోజూ వారిని మనం దర్శించుకోవచ్చు.ఇంతకీ సప్త ఋషులు ఎవరు? వారి వివరాలు ఏమిటి? అంటే..కశ్యప అత్రి భరద్వాజవిశ్వామిత్రోథ గౌతమః!వశిష్టో జమదగ్నిశ్చసప్తైతే ఋషయః..
జ్ఞాని భక్తుల కలయికభగవద్గీతకు జ్ఞానేశ్వరి అనే ప్రసిద్ధమైన వ్యాఖ్యానం మహారాష్ట్రభాషలో ఉంది. దాన్ని రచించిన మహాపండితుడు జ్ఞానేశ్వరుడు. అద్భుతమైన మహిమలుగల వాడాయన. మహాభక్తుడైన నామదేవుడు కూడా ఆయన కాలంవాడే కావడం చరిత్రలో అద్భుతమైన ఘటన. ఆయన నిరంతరం శ్రీ పాండురంగని భజిస్తూ ఉండేవాడు. నామసంకీర్తనంతో కాలం గడిపేవాడు. ఒకనాడు జ్ఞానేశ్వరుడు ఆయన దగ్గరికి వచ్చి "అయ్యా! భగవద్భజన ఎలా చెయ్యాలి? మనస్సు - బుద్ధి సాత్త్విక స్థితికి ఎలా వస్తాయి? శ్రవణభక్తిలోని రహస్యం ఏమిటి? భక్తి ధ్యానాలకుగల తారతమ్యం ఏమిటి?" అని ప్రశ్నల వర్షం కురిపించాడు.ఆ ప్రశ్నలు వినడంతోటే నామదేవుడు ఎంతో వినమ్రుడయ్యాడు. అతని కంఠం డగ్గుత్తికపడింది. ..
గణపతి తాళంవికటోత్కట సుందర దంతి ముఖం |భుజ కేంద్రసుసర్ప గదాభరణం ||గజ నీల గజేంద్ర గణాధిపతిమ్ |ప్రణతోస్మి వినాయక హస్తి ముఖం ||సుర సుర గణపతి సుందర కేశం |ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం ||భవ భవ గణపతి పద్మ శరీరం |జయ జయ గణపతి దివ్య నమస్తే ||గజ ముఖ వక్త్రమ్ గిరిజా పుత్రం |గణ గుణ మిత్రం గణపతి నిశప్రియం ||కరద్రుత పరశుమ్ కంగణ పాణిమ్ కపళిత పద్మరుచిం | సురపతి వంద్యం సుందర డక్తం సురచిత మణిమకుటం ||ప్రణమత దేహం ప్రకటిత కాలం షట్గిరి తాళం ఇదం,తత్ తత్ షట్గిరి తాళం ఇదం,తత్ తత్ షట్గిరి తాళం ఇదం |లంబోధర వర కుంజా సురకృత కుంకుమ వర్ణ ధరం |శ్వేత సశృంకం మోదక హస్తం ప్రీతి సపనసఫలం ||నయనత్రయ వర నాగ విభూషిత,నా నా గణపతితం,తతం నయనత్రయ..
తిరుమలలో ఫిబ్రవరి 24వ తేదీన శ్రీ కుమారధార తీర్థ ముక్కోటి ఘనంగా జరుగనుంది. ఈ పర్వదినాన భక్తులు తీర్థ స్నానమాచరించి, దానధర్మాలు చేసి స్వామివారిని దర్శించుకుంటారు. ప్రకృతి సౌందర్యాల నడుమ కుమారధార తీర్థంలో స్నానమాచరించడాన్ని భక్తులు ప్రత్యేకంగా భావిస్తారు.వరాహ, మార్కండేయ పురాణాల ప్రకారం ఒక వృద్ధ బ్రాహ్మణుడు శేషాచల గిరుల్లో ఒంటరిగా సంచరిస్తుండేవాడు. శ్రీవేంకటేశ్వరస్వామివారు ప్రత్యక్షమై ”ఈ వయసులో చెవులు వినిపించవు, కళ్లు కనిపించవు.. అడవిలో ఏంచేస్తున్నావు” అని ప్రశ్నించారు. యజ్ఞయాగాలు ఆచరించి దైవరుణం తీర్చుకోవాలనే తలంపుతో ఉన్నాను అని వృద్ధుడు బదులిచ్చాడు. అనంతరం స్వామివా..
Showing 113 to 126 of 815 (59 Pages)