Article Search
Articles meeting the search criteria
కార్తీక పురాణము - పదహారవ రోజు పారాయణ
ఈ విధంగా సూతుడు ప్రవచించిన స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యాన్ని విని, సంతుష్ట మనస్కులైన శౌనకాది కులపతులు 'హే పురాణకథా కథనవచో సురథునీ! సూతమునీ! లోకోత్తర
పుణ్యదాయక ఈ కార్తీక పురాణము స్కాందమందేగాక, పద్మపురాణాంతరవర్తి! అని కూడా విని ఉన్నాము. మాయందు కృపాశుడవై ఆ విషయాలను కూడా విశదపరచు'' అని ప్రార్థించగా, సురుచిర
కార్తీక పురాణము - పదిహేనవ రోజు పారాయణము
ఆ మరునాడు కార్తీకపౌర్ణమి కావడంవలన, నైమిశారణ్యంలోని మునులు అందరూ సూతమహర్షి ఆధ్వర్యంలో - వనభోజనాలను ఏర్పాటు చేసుకున్నారు. ధాత్రీ వృక్ష సంపద ఉన్న చక్కటి ప్రదేశానికి
చేరుకున్నారు. ఉసిరిచెట్టు క్రింద కార్తీక దామోదరునిగా ప్రఖ్యాతుడైన శ్రీహరి ప్రతిమను ఏర్పాటుచేశారు. ఉసిరికలతో హరిని పూజించారు. తరువాత 'గోవింద' నామస్మరణతో - వనభోజన సమారాధన
కార్తీక పురాణము - పదనాలుగవ రోజు పారాయణ
తరువాత అంబరీషుడు దూర్వాసుడికి నమస్కరించి - 'మహామునీ! నేను బహు పాపాత్ముడిని. ఆకలితోవుండి అన్నం కోసం నా ఇంటికి వచ్చిన నిన్ను అలసట పాలుచేసిన మందభాగ్యుడిని. అయినా
నాయందు దయతో మళ్ళీ నా యింటికి అతిథిగా వచ్చావు. దయచేసి నా ఇంట విందు ఆరగించి, నా సర్వదోషాలను ఉపశమింప చేయి' అని ప్రార్థించాడు. దూర్వాసుడి అతనిని తన బాహువులతో
కార్తీక పురాణము - పదమూడవ రోజు పారాయణము
విష్ణు ఉవాచ: "దూర్వాసా! బ్రాహ్మణుడవైన నీపట్ల అపచారం జరిగిందన్న తపనతో ఆ అంబరీషుడు విచారగ్రస్తుడై, ప్రాయోపవిష్టుడిలాగా బ్రాహ్మణ పరివేష్టితుడై వున్నాడు. నా సుదర్శనచక్రం తన కారణంగానే నిన్ను తరుముతోందని దుఖిస్తున్నాడు. రాజయినందుకుగాను గో, బ్రాహ్మణరక్షణ తన ప్రథమ కర్తవ్యమై ఉండగా, విప్రుడైవైన నీకు విపత్తు కలిగినందుకు ఎంతగానో బాధపడుతున్నాడు. రాజదాననీతితోనే ధర్మ పరిపాలనం చేయాలి కాని, బ్రాహ్మణుడిని మాత్రం దండించకూడదు.
కార్తీక పురాణము - పన్నెండవ రోజు పారాయణం
అత్రిమహముని చెబుతున్నాడు:- అగస్త్యా! కార్తీకమాస శుక్ల ద్వాదశిని 'హరిబోధిని' అని అంటారు. ఆ ఒక్క పర్వతిథీ వ్రతాచరణం చేస్తే అన్ని తీర్థాలలోనూ స్నానం చేసిన, అన్ని విధాలైన యజ్ఞాలు ఆచరించిన కలిగే పుణ్యం ప్రాప్తిస్తుంది. విష్ణువుపట్లా, ఏకాదశిపట్లా భక్తిని కలిగిస్తుంది. సూర్యచంద్ర గ్రహణ పర్వాలకంటే గొప్పదీ ఏకాదశి కంటే వందరెట్లు మహిమాన్వితమైనదీ అయిన ఈ ద్వాదశినాడు ఏ పుణ్యం చేసినా, పాపం చేసినా అది కోటిరెట్లుగా పరిణమిస్తుంది.
కార్తీక పురాణము - పదకొండవరోజు పారాయణ
ఆత్ర ఉవాచ : అగస్త్య - సాధారణమైన కొట్లాటగా ప్రారంభమై, దొమ్మీగా మారి, ఆ సమరం ఒక మహాయుద్ధంగా పరిణమించింది. అస్త్రశాస్త్రాలతో, పదునైన బాణాలతో, వాడివాడి గుదియలతో, ఇనుపకట్ల తాడి కర్రలతో, ఖడ్గ, పట్టిన, ముపల, శూల, భాల్లాతక, తోమర, కుంభ, కుఠారాద్యా ఆయుధాలతో ఘోరంగా యుద్ధం చేశారు. ఆ సంకుల సమరంలో కాంభోజరాజు మూడువందల బాణాలను ప్రయోగించి, పురంజయుడి గొడుగును, జెండానూ, రథాన్ని కూలగొట్టాడు.
కార్తీక పురాణము - మొదటిరోజు పారాయణము
శ్రీ అనంతకోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టిలో విశిష్టమైన శ్రీనైమిశారణ్యానికి విచ్చేసిన సూతమహర్షిని సత్కరించి,, సంతుష్టుడిని చేసి, స్థానికులైన శౌనకాది ఋషులు ఆయన వద్దకు వచ్చి 'సకల పురాణగాథ అయిన, నూతమునీ కలికల్మశ నాశానకం అయిన కైవల్య దాయకమయిన కార్తీకమాస మహత్యము విన్పించి మమ్మల్ని ధన్యులను చేయమని అడిగారు. వారి కోరికను మన్నించిన వ్యాసశిస్యుడు అయిన సూతమహర్షి 'శౌనకాదురాలా! మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షులవారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణాలలోని స్కాంద, పద్మపురాణాలు రెండింటిలోనూ తెలియజేసి ఉన్నారు.