వార ఫలాలు 01-10-2023 నుండి 07-10-2023 వరకు

మేషం: ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉంటుంది.  ఒకవిధంగా శత్రువులు కూడా మిత్రులుగా మారే సమయం అని చెప్పవచ్చు. మీకంటే పెద్దవారి నుండి కూడా ప్రశంసలు అందుకుంటారు. గతంలో కష్టపడిన దానికి ప్రతిఫలం కనబడుతుంది. బంధువులలో మంచి ఆదరణ లభిస్తుంది. 

ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన ఫలితములు గోచరిస్తున్నాయి. గతంలో ఉన్న మానసిక ఆందోళనలు మీకు తెలియకుండానే చేత్తో తీసినట్లవుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. ఆర్ధికంగా అనుకూలత, సానుకూలత ఉంటుంది. అయితే అన్ని విధాల బాగున్నప్పటికీ కుటుంబంలో చిన్నపాటి మాట  పట్టింపులు ఉండే అవకాశములు ఉన్నాయి. కంగారు పడకండి. మీ మీద ఈర్ష్య, అసూయలు కూడా కారణం అవ్వవచ్చు. 

నూతన వస్తువులు కొనుగోలు చేసే అవకాశములు ఉన్నాయి. సాఫ్ట్ వేర్ రంగం వారికి అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. బంధువులతో కలయిక, సత్సంబంధాలు  ఏర్పడుతుంది. సంతానం పట్ల శ్రద్ద అధికమవుతుంది. కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన ఫలితములు గోచరిస్తున్నాయి.  విద్యార్థినివిద్యార్థులకు మంచి అనుకూలమైన, అనుకున్న ఫలితములు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. కొత్త కోర్సులు మొదలు పెట్టుటకు మంచి సమయం. క్రీడాకారులకు, కళారంగం వారికి కూడా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. 


వృషభం: ఉద్యోగస్తులకు అధికారులతో పరస్పర అవగాహన సంభాషణలు అనుకూలంగా ఉంటుంది. వ్యవసాయదారులకు అనుకూలత ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించుటకు, నూతన వ్యవసాయ (పనిముట్లు)యంత్రములు వంటివి కొనుగోలు చేయుటకు, ప్రారంభించుటకు మంచి అనుకూల సమయం. పనిచేసే చోట, వృత్తి వ్యాపారాల  యందు సానుకూలత ఉంటుంది. 

అయితే కుటుంబ పరంగా వియోగములు కానీ, విరోధములు గాని ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. సంతానం యొక్క ఆరోగ్యం  పట్ల శ్రద్ద వహించండి. సంతానంతో (మగ, ఆడ పిల్లలతో) విషయ  వ్యవహారాల పట్ల  అభిప్రాయ భేదాలుండే అవకాశాలు గోచరిస్తున్నాయి. జాగ్రత్త వహించండి. 

శారీరక ఆరోగ్యం బాగున్నప్పటికీ మానసిక ఆందోళనలు ఉండే అవకాశములు ఉన్నాయి. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఏది ఏమైనప్పటికీ అనుకున్న పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తవుతాయి. ఎలెక్ట్రిక్ ఉద్యోగస్తులకు, టెక్నీకల్ రంగాల వారికి అనుకూలమైన సమయంగా అని చెప్పవచ్చు. తొందరపాటుతో మాట్లాడడం మంచిది కాదు. విద్యార్థిని విద్యార్థులకు కష్టపడి చదివితే అనుకున్న ఫలితాలు తప్పక ఉంటాయి.


మిథునం: కుటుంబంలో కానీ, పని చేసే చోట కానీ కార్యాలయములలో కానీ మీ మాట చెలామణి అవుతుంది, గౌరవం వృద్ధి అయ్యే అవకాశములు గోచరిస్తున్నాయి. మీ మంచి తనంతో, కార్యసాధనతో ముందుకు సాగండి. అయితే ఆర్ధిక పరంగా అనుకున్న సమయానికి ధనం చేతికి అందకపోవచ్చు, ఋణములు, లోన్లు విషయంలో ఒడిదుడుకులు ఉంటాయి. జాగ్రత్త  వహించండి. కుటుంబ పరంగా అనుకూలత, కార్యక్రమముల విషయంలో బంధువులతో సమాగమంతో ఉండే అవకాశములు ఉన్నాయి. మానసిక సంతృప్తి లభిస్తుంది.  

సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తులకు, ఇతర ఉద్యోగస్తులకు కొంత  సానుకూలత, ఆర్థికాభివృద్ధి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అయితే శత్రువర్గం వారి నుండి విమర్శలు, ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి.  శారీరకంగా కొంత అలసట , అశాంతి చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. శారీరకంగా, మానసికంగా మీరుపడే శ్రమకు తగిన విశ్రాంతి అవసరమని గుర్తించండి. మీ విశ్రాంతి మీ ఆరోగ్యానికి, ఉత్సాహానికి తోడ్పడుతుంది. స్నేహితుల నుండి మంచి సంతోషకరమైన సమయం గడుపుతారు. విద్యార్థిని  విద్యార్థులకు దృష్టి పెట్టి, పట్టుదలతో చదువుకుంటే మంచి ఫలితములు సాధిస్తారు.


కర్కాటకం: ఉద్యోగస్తులకు ఉన్నతాధికారులతో సంయమనం ఏర్పడుతుంది. అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకు కూడా ఇది మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఆర్ధిక పరమైన లాభాలు ఉంటాయి. అయితే  బంధువులతో చిన్నపాటి మాట పట్టింపులు, మనస్పర్థలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మాట విషయంలో దురుసు ప్రవర్తన మంచిది కాదు. 

 అనాలోచిత ఖర్చులు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. స్నేహితుల విషయంలో జాగ్రత్త వహించండి. ఎవర్నీ నమ్మి విషయ వ్యవహారాలు, రహస్యాలు చెప్పుకోవడం మంచిది కాదు. స్నేహితులే శత్రువులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. 

అనుకున్న పనులు అనుకున్నట్టు చేయడానికి ప్రయత్నించండి. జాప్యం చేయవద్దు, తరువాత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉంటాయి. విద్యార్థినీవిద్యార్థులకు  కష్టపడి చదవవలసిన సమయం గా చెప్పవచ్చు.  విద్య పట్ల శ్రద్ద పెంచుకోండి. ఏదైనా ఒక సబ్జెక్టు తీసుకున్నాక శ్రద్ద తగ్గకుండా పట్టుదలతో ముందుకు సాగడం మంచిదని చెప్పదగ్గ సూచన. 


సింహం: ఉద్యోగ పరంగా అంత అనుకూలమైన పరిస్థితులు ఉండకపోవచ్చు, ఎవరినైతే మీరు పనిపట్ల, కార్యాలయాలలో నమ్ముతారో , మీ కంటే తక్కువ స్థాయి ఉద్యోగస్థులైనప్పటికీ వారి వలన ఇబ్బందులు  ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు కూడా ఆర్ధికంగా కొంత నష్టాలు ఉండవచ్చు. అయితే మీరు అనుకున్న పనులు, వ్యవహారములు కొంత ఎక్కువ ఖర్చుతో, శ్రమతో పూర్తవుతాయి. చిన్నపాటి అవమానాలకు, అపవాదులను కృంగిపోకండి. పట్టుదలకు పోయి బంధువులతో కానీ, సన్నిహితులతో కానీ వాగ్వాదాలు పెట్టుకోవటం మంచిది కాదు. వారం ద్వితియార్ధంలో అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. 

ఆర్ధికంగా  అనుకున్న సమయానికి  ధనం  చేతికి అందడం, అనుకోని విధంగా సమస్యలను పరిష్కరించుకుంటారు.  విద్యాభివృద్ధి అవుతుంది. విద్యార్థులకు విద్యపై ఆసక్తి పెరుగుతుంది. కృషి, పట్టుదలతో  ముందుకు సాగుతారు. వివాహ ప్రయత్నాలు చేసే వారికి అనుకూలమైన ఫలితములు గోచరిస్తున్నాయి.  శారీరక ఆరోగ్యం బాగున్నప్పటికీ కొద్దిపాటి  టెన్సన్స్ ఉండే అవకాశాలు ఉన్నాయి. 


కన్య: మీ మాట లో చంచలత్వం కారణంగా బంధు మూలకమైన ఇబ్బందులు ఏర్పడవచ్చు. మీరు ఒకటి మాట్లాడితే వేరొకటి అర్ధం అయ్యి అవి అపార్ధాలకు దారితీయవచ్చు. మాటలో కఠినత్వం ఉండడం అంత మంచిది కాదు. నిదానంగా ఆలోచించి మాట్లాడండి.  మాట్లాడేటప్పుడు సానుకూలంగా ఉన్నప్పటికీ  ఏవైతే మీరు మాట్లాడుతారో అవి మీ వెనుక దుష్ప్రచారం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అనుకున్న పనులు కోసం ఏదైనా దూర ప్రయాణాలు ఉంటె ఒకటికి పదిసార్లు ఆలోచించి ప్రయాణం చేయడం మంచిది. ప్రయాణమునకు తగిన ప్రతిఫలం కనపడకపోవచ్చు. వృధా తిరుగుడు అవుతుంది. నిదానంగా ఆలోచించి, ప్రశాంతంగా మాట్లాడండి. ఉద్యోగ, వ్యాపారస్తులకు సామాన్యంగా, సానుకూలంగా ఉంటుంది.

అనుకున్న సమయానికి పనులు అవ్వకపోయినప్పటికీ అతికష్టం మీద పనులు పూర్తవుతాయి. ఏదైనా కొత్త పనులు, ప్రణాళికలకు అంత మంచిది కాదు. నూతన కార్యక్రమాలు వాయిదా వేయడం శ్రేయస్కరం. విద్యార్థులకు అంత అనుకున్న ఫలితాలు ఉండకపోవచ్చు. చదువుపై ఏకాగ్రత లేకపోవడం , ఇతర విషయాలపైన మీ మక్కువ ఎక్కువ అవడం వలన ఇబ్బందులు ఏర్పడతాయి. శ్రద్ద, పట్టుదలతో ముందుకు సాగండి. ఎదో తెలియని భయం, ఆందోళన వంటివి పక్కన పెట్టి ముందుకు సాగండి.


తుల: విందు,విలాసాలకు ప్రాధాన్యత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఖర్చు,  ఆదాయం విషయంలో జాగ్రత్త వహించండి. సరదాలు ఉండవచ్చు కానీ, అవి మితిమీరి ఇంటిలో గొడవలకు, వివాదాలకు దారి తీయకుండా జాగ్రత్త వహించండి. ఆర్థిక పరంగా పొదుపుకి ప్రాధాన్యత ఇవ్వండి. స్నేహితుల విషయంలో, కుటుంబముల విషయంలో  సానుకూలత ఉంటుంది. సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అయితే ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి, లేదా శత్రు వర్గం నుండి సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య పరమైన శ్రద్దలు  వహించండి. చిన్నపాటి  అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. కంగారు పడకండి. ముక్ష్యమైన వ్యవహారాల పట్ల  చికాకులు, ఒడిదుడుకులు ఉండకూండా జాగ్రత్త వహించండి. 

కోపాన్ని, మాటను  అదుపులో ఉంచుకోవడం మంచిది. విద్యార్థులకు ఎంత చదివినప్పటికీ బుర్రకి ఎక్కడం లేదని ఆందోన చెందకండి. కొద్దిపాటి అలసట, విపరీతమైన మానసిక ఒత్తిడి తరువాత విజయం సంప్రాప్తిస్తుంది. సాఫ్ట్ వేర్ రంగం వారికి అనుకూలం . ఏదైనా కొత్త విషయం కానీ,  కొత్త పనులు, ప్రాజెక్ట్ వంటి వాటివి మొదలు పెట్టకపోవడం మంచిది. కొంత ఆలస్యం అయ్యే అవకాశములు ఉన్నాయి. 


వృశ్చికం: ఉద్యోగస్తులకు మంచి అనుకూలత, ఆర్థిక పరమైన అభివృద్ధి ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు గౌరవంతో కూడిన అభివృద్ధి,  తృప్తి లభిస్తుంది. స్నేహితుల వలన అనుకోని లాభాలు కలసి వస్తాయి. సంతాన పరంగా  వారి జయం మీకు ఆనందాన్ని కలుగచేసే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు పోటీ  పరీక్షలలో  అనుకున్న విజయాలను అందుకుంటారు. అలాగే నూతన విద్య, ఉద్యోగ ప్రయత్నాలు మంచి ఫలితాలను ఇస్తాయి.

కుటుంబ పరంగా సంతోషాలు, అభివృద్ధి ఏర్పడుతుంది, అయితే మానసిక ఆనందం ఉన్నప్పటికీ చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. అయితే  మానసిక ధైర్యంతో ముందుకు సాగుతారు. సాఫ్ట్ వేర్ రంగం వారికి, చిరు వ్యాపారస్తులకు సైతం కొంత ఊరట లభిస్తుంది. వివాహ ప్రయత్నాలకు మంచి సమయం, అయితే ప్రయత్నాలు కొద్దిపాటిగా కాకుండాముమ్మరంగా పట్టుదలతో చేస్తే కానీ ఫలితాలు కనబడవు. జాప్యం, నిర్లక్ష్యం పనికి రాదు. యువత వ్యసనాలకు, విలాసాలకు లోనయ్యే సమయంగా చెప్పవచ్చు, జాగ్రత్త వహించండి.  


ధనస్సు: గతంలో ఉన్న మానసిక ఆందోళనలు తగ్గి, కొంత మానసిక ధైర్యం ఏర్పడుతుంది. అనుకున్న పనులు సాధిస్తారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, అలాగే స్థిరాస్తి వృద్ధి చేసుకునే ఆలోచనలు ఉన్నవారికి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ప్రణాళికలు, ఆలోచనలు చేస్తారు. పెద్దలపై  ప్రేమాభిమానాలు, వారి పట్ల శ్రద్ద తీసుకోవాలనే ఆలోచనలను కలుగుతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్య యందు అనుకూలత, మంచి అనుకున్న ఫలితములు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. మన శక్తీ, సామర్ధ్యాలకు  గుర్తింపు లభించిందని ఆనంద పడతారు.

ఉద్యోగస్తులకు ఆర్థికాభివృద్ధి, కార్యాలయాలలో శత్రువర్గం ఉన్నప్పటికీ వారే మిత్రులు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందరితో స్నేహ భావం, కలయిక ఏర్పడుతుంది. వారి అభిమానంను పొందుతారు. అయితే మనసులో సంకోచం ఉంటుంది. అయితే బయట పడకుండా మాట్లాడే టప్పుడు జాగ్రత్త వహించి, తప్పెంచక, తానొప్పించక అన్నట్లు ప్రవర్తిస్తారు. కొత్త వస్తువులు కొనుగోలుకు, ఎప్పటినుండో జరగని పాత మొండి బాకీలు వంటివి వసూలు అయ్యి, సానుకూల పడే అవకాశములు ఉన్నాయి. ప్రయత్నాలు చేయండి. అనుకూల ఫలితములు ఉంటాయి.


మకరం: మీరు  ఉద్యోగంలో బాధ్యతల పట్ల మరింత శ్రద్ద వహించండి, ఏ మాత్రం నిర్లక్ష్య ధోరణితో ఉన్నచో దానివలన మీ పై అధికారులతో వివాదాలు ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా మీరు ఇన్నాళ్లు పడ్డ కష్టం, శ్రమకు కూడా గుర్తింపు పోయే అవకాశం ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే  చిన్న తప్పుకు పెద్ద శిక్ష రావచ్చు అని చెప్పవచ్చు. దానివలన మీ మంచి పేరు మీద కూడా బురద చాల్లే అవకాశాలు ఉంటాయి. అలాంటి నిర్లక్ష్యం వద్దు, చురుకుగా ఉండండి. అలాగే మాట్లాడేటప్పుడు ఇతరులను  దృష్టిలో ఉంచుకుని కాకుండా చుట్టుపక్కల వారి అంతరంగమును  గ్రహించి సమాధానం చెప్పడం మంచిది.

మీరు ఒకటి అంటే ఇంకొకటి అర్ధం అయ్యి వివాదములు దారితీయవచ్చు. శత్రువర్గం పెరిగే అవకాశాలు లేకపోలేదు.  ఉన్న పనులు, పూర్తి చేసుకోవడం మంచిది, కొత్త ప్రణాళికలకు ఇది సమయం కాదని చెప్పదగిన సూచన. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. కొద్దిపాటి జ్వరం, ఒళ్లునొప్పులు వంటివి ఉండే అవకాశములు ఉన్నాయి. అన్ని విధాల రాబడి కంటే ఖర్చు ఎక్కువ కనబడుతుంది. అయితే పనిచేసే చోట పని అయిపోగానే ఎక్కువ సమయం ఇంటిలో గడపడం మంచిది. జీవితభాగస్వామి, కుటుంబం సభ్యులతో సానుకూలత ఉంటుంది. కొంత ప్రశాంతత లభిస్తుంది.


కుంభం: వ్యాపారస్తులకు అనుకున్నంత లాభాలు ఉండక పోయినప్పటికీ  నష్టాలు లేకుండా కొద్దిపాటి లాభాలతో సాగుతుంది. కొంత ప్రశాంతత ఏర్పడుతుంది. అలాగే సాఫ్ట్ వేర్ రంగం వారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు తమ తెలివితేటలకు  పరీక్షా సమయంగా   చెప్పవచ్చు.  మిత్రులు ఎవరో, శత్రువులు ఎవరో తెలుసుకుని  జాగ్రత్తగా వ్యవరించండి. ఎవరితో పడితే వారితో రహస్యాలు చెప్పడం, మీరు ఇబ్బందిలో పడే మాటలు మాట్లాడడం  వంటివి జరుగవచ్చు, తస్మాత్ జాగ్రత్త !  వాటి వలన చిన్న పాటి అవమానాలు ఉండవచ్చు. పై అధికారులతో ఒత్తిడి ఉండవచ్చు.

కుటుంబ పరంగా జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు, లేదా చిన్నపాటి మనస్పర్థలు వలన మానసిక ప్రశాంతత లోపించే అవకాశాలున్నాయి. జాగ్రత్త వహించండి. కుటుంబ పరంగా కానీ, మీకు కానీ ఆరోగ్య విషములలో శ్రద్ద వహించడం మంచిదని చెప్పదగ్గ సూచన.  అనవసరపు ప్రయాణాలు, విపరీతమైన ఖర్చులు ఉండే అవకాశాలు  ఉన్నాయి. ప్రయాణాలలో,వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త వహించండి. విద్యార్థులకు మంచి తెలివితేటలతో ముందుకు సాగుతారు. మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రణాళికా బద్ధంగా నడచు కోవడం మంచిదని చెప్పదగ్గ సూచన. 


మీనం: జాగ్రత్తగా వ్యవహరించండి. అనాలోచిత ఖర్చులు, వృధా కోర్కెలు వంటివి మిమ్మల్ని ఇబ్బనది పెట్టె అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏదైనా ఒక పని మీద,  వ్యవహారాల మీద చేసే ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించండి. అనుకున్న ఫలితాలు ఆలస్యం అవ్వడం వృధాగా తిరిగే అవకాశాలు ఉన్నాయి. ఋణాలు, లోన్లు విషయంలో ఒత్తిడి ఉండే అవకాశాలు ఉన్నాయి. అదే మీరు వేరే వారికి ఋణాలు ఇచినట్లైతే వారు సమయానికి మీకు తిరిగి ఇవ్వక మిమ్మల్ని ఇబ్బంది పెట్టె అవకాశాలు గోచరిస్తున్నాయి. కాబట్టి ఆర్ధికంగా ఖర్చుల విషయంలో ఒక ప్లాన్, పద్దతిలో ముందుగానే అంచనా వేసుకోండి. జీవిత భాగస్వామికి మీ పరిస్థితులు అర్ధం అయ్యేటట్టు చెప్పండి లేకపోతే వారు మిమ్మల్ని సరిగా అర్ధం చేసుకోక అపార్ధం చేసుకుని, మనస్పర్థలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. డబ్బులు మంచినీళ్ళల ఖర్చు అయినట్టు అనిపిస్తుంది.

అయితే ఎదో ఒక రకంగా మొండిగా సమస్యలను ఎదుర్కొని పరిష్కరించుకుంటారు. ఆర్ధిక ఇబ్బందులు తప్పవు. ఈ  మానసిక ఆందోళనల వలన కొంత ఆరోగ్యం పట్ల, ఆహారం పట్ల అశ్రద్ధ చేయడం వలన చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉండే అవకాశాలు ఉన్నాయి.  మనసు గందరగోళంగా ఉండడం నిద్రపట్టక పోవడం వంటివి ఏర్పడవచ్చు.  ప్రశాంతంగా నిద్రపోండి. సమస్యలు అవే  వస్తాయి, అవే పోతాయి. మంచుతెరలా వీడిపోతాయి. ఆందోళన చెందకండి. భవిష్యత్తు బాగుంటుంది. విద్యార్థులు  పట్టుదలతో ముందుకు సాగండి.


                                                Weekly Rasi Phalalu - Oct 01st - Oct 07th 2023 | వార ఫలాలు - View Video...


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121