వార ఫలాలు 08-10-2023 నుండి 14-10-2023 వరకు

మేషం: మీ మనోధైర్యానికి మించినది ఏదీ లేదని తెలుసుకుంటారు. ఉద్యోగస్తులకు పైఅధికారులతో కానీ, కార్యాలయంలలో కానీ గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు నూతన ప్రణాళికలు, కొత్త పద్దతులతో వ్యాపారాభివృద్ధికి ఆలోచనలు చేస్తారు. ప్రజాదరణ లభిస్తుంది. శత్రువర్గం కూడా అభినందించేలా నడుచుకుంటారు. స్నేహితుల నుండి, పెద్దలనుండి ఆదరణ లభిస్తుంది. అయితే అంతర్గత విమర్శలు తప్పవు. ఆందోళన చెందకండి. ఎవరో ఎదో అన్నారని ఆలోచించకండి. 

ఆ విమర్శలు ఈర్ష్యా, అసూయల వల్ల  వచ్చేవే అవుతాయి. పట్టించుకోకుండా ముందుకు సాగండి.  బయట నుండి ఇన్ని మన్ననలు పొందుతున్న మనం అయిన వారికి అర్ధం కావట్లేదు అనే భావన ఉంటుంది. నూతన  ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన ఫలితములు ఉంటాయి.  ఉద్యోగస్తులకు అభివృద్ధి , ప్రమోషన్లు వంటివి ఉండే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు  ఉంటాయి. పోటీపరీక్షల యందు విజయం వరిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది.  చిన్న పాటి ఆందోళనలు, ఆలోచనలు  పక్కకు పెట్టండి. మనో ధైర్యం, శాంతి ఏర్పడతాయి.  వివాహం కానీ వారికీ వివాహ ప్రయత్నాలు  చేయ్యండి. మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. 


వృషభం: కుటుంబ పరంగా, కుటుంబలో జరిగే కార్యకలాపాల పరంగా అనుకూల పరిస్థితులు గోచరిస్తున్నాయి.  అయితే పనుల విషయంలో జాప్యం వద్దు, ఆలస్యం చేసినట్లైతే ఆ పనులు మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి.  అనుకున్న పనిని వెంటనే అమలు చేయండి. మంచి  ఫలితాలను  పొందగలరు. వ్యవసాయ రంగంవారికి, బట్టల దుకాణం వారికి , చేతి వృత్తుల వారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు శత్రువులను సైతం దాటుకుని మీ శక్తి  సామర్ధ్యములతో అభివృద్ధి సాధిస్తారు. మాట్లాడేటప్పుడు ముందువెనుకా ఆలోచించండి.

ఎందుకంటే ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పేవారు ఉంటారు. మీ  మీద దుష్ప్రచారాలు జరిగే అవకాశాలు ఉంటాయి. టెక్నీకల్ రంగం వారికి  మంచి అనుకూలత ఏర్పడుతుంది. విద్యార్థులకు వినోదయాత్రలు, విహార యాత్రలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఉత్సాహంగా పాల్గొంటారు. వ్యాపారంలో శత్రువర్గం నుండి ఇబ్బందులు తలెత్తవచ్చు. కుటుంబ పరంగా వ్యవహారాలు చేసేటప్పుడు సంతానంతో కానీ, జీవిత భాగస్వామితో కానీ మనస్పర్థలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి.  ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. మానసిక ఆందోళనలు వాటివల్ల వచ్చే తలనొప్పి వంటివి ఇబ్బంది పెడతాయి. 


మిథునం: ఆచీతూచీ , ఆలోచించి మాట్లాడడం మంచిది. మీ విచక్షణ వలన మీ మాటకు విలువ ఏర్పడుతుంది. శత్రువులను పెంచేది, తగ్గించేది కూడా మాటే అనే విషయం అర్ధం చేసుకుని ప్రవర్తించడం మంచిది. ఋణాల విషయంలో కొంత ఇబ్బందులు ఏర్పడతాయి. బంధువర్గంలో కానీ, మిత్రవర్గంలో కానీ మనస్పర్థలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

జాగ్రత్త వహించండి. మీ మంచితనం మిమ్మల్ని కాపాడుతుంది. సాఫ్ట్ వేర్ రంగం వారికి అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఉద్యోగస్తులకు సానుకూలత ఉంటుంది. వ్యాపారస్తులకు ప్రతికూల ఫలితాలుండే అవకాశాలున్నాయి. సంతానం విషయంలో మీరు తీసుకునే నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. అనుకున్న ఫలితాలుండకపోవచ్చు. అభివృద్ధి నిదానంగా ఉంటుంది. ఏదైనా ఒక పని మొదలు పెట్టేసరికి కొద్దిపాటి అంటంకాలు ఏర్పడతాయి.

అలా అని పనిని ఆపవద్దు, నిర్లక్ష్యం చేయవద్దు. ఫలితం ఆశించి ఏపని చేయకండి. ఫలితాలు నిదానంగా ఉంటాయి. విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. ఒక సబ్జెక్టు ఎంచుకున్నాక శ్రద్ద తగ్గకుండా జాగ్రత్త వహించండి. పట్టుదలతో, కృషితో చదువుకుంటే విజయాలు మీ వెంటే ఉంటాయి. కోపంను, బద్దకమును విడిచిపెడితే మంచిది. శారీరక ఆరోగ్యం బాగుంటుంది. అయితే మానసిక ప్రశాంతత ఏర్పరచుకోండి. శ్రమకు  తగిన విశ్రాంతి తీసుకోండి. 


కర్కాటకం: ఉద్యోగ పరంగా అభివృద్ధి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగ  పరంగా పైఅధికారుల నుండి, కార్యాలయాలలో అభివృద్ధి కనబడుతుంది. ఎవరైనా ప్రమోషన్లు, బదిలీలు వంటివాటికి ప్రయత్నాలు చేయవచ్చు. సానుకూల ఫలితాలు ఏర్పడతాయి. ఆర్ధిక పరంగా ధనం చేతికి వస్తుంది. అనుకున్న  పనుల గురించి ఎంత ఖర్చుకైనా వెనుకాడకుండా ఖర్చు చేస్తారు. వ్యాపారస్తులకు కూడా విలాసవంతమైన జీవితం గడపటం, అధిక ఖర్చులు ఉంటాయి. కుటుంబ పరంగా సుఖం, సంతోషం లభిస్తాయి. బంధువులతో  మాత్రం కొంత ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. స్నేహితులు కానివ్వండి, మిత్రులు కానివ్వండి నమ్మిన వారివలన ఇబ్బందులు ఏర్పడే అవకాశములు గోచరిస్తున్నాయి.

కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కొంత అనుకూల ఫలితాలుండవచ్చు. ఆరోగ్య విషయంలో స్వల్ప ఇబ్బందులు ఉండే అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. అయితే కొంత అధిక ఖర్చులు, జాబ్ టెంక్షన్ వంటివి ఉంటాయి. ఆందోళన చెందకండి. ఆర్ధికంగా లాభములు ఉంటాయి.  విద్యార్థులు విలాసాలకు, వ్యసనాల దరికి చేరవద్దు. విలాసవంతమైన జీవితం కొరకు ఇప్పుడు  ఖర్చు చేసే సమయం కానీ, ధనం గాని వృధా అయ్యేఅవకాశాలు ఉన్నాయి. రాబోయే జీవితంలో అది మీకు ఇబ్బందికరంగా ఉంటుంది. వివాహం కానీ వారికి వివాహ ప్రయత్నాలు సానుకులపడతాయి.


సింహం: కుటుంబ పరంగా, సంతాన పరంగా మంచి అనుకూలమైన ఫలితములు గోచరిస్తున్నాయి. కుటుంబంలో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నిస్తారు. వివాహాది శుభకార్యాల గురించి ఆలోచనలు, ప్రణాళికలు అధికం అవుతాయి. సంతానం యొక్క అభివృద్ధి గురించి పరితపిస్తారు. ఉద్యోగ పరంగా కొంత నష్టాలు, భయం ఉండే అవకాశాలు ఉన్నాయి.  ఇతరులచే వంచించబడుట వంటి వాటి విషయంలో జాగ్రత్త వహించండి.

చిన్నపాటి అవమానాలు, అపవాదులు ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు కొంత అనుకూలత ఉంటుంది. ఇనుము, స్టీల్ వ్యాపారస్తులకు, విలాస వస్తువుల వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఉన్నదానితో ఉన్నంత విలాసవంతమైన జీవిత గడుపుతారు. తృప్తి అనేది లభిస్తుంది. విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. తల్లిదండ్రుల నుండి మంచి ఆదరణ లభిస్తుంది.

నూతన వస్తువులు ఏవైనా కొనుగోలు  చేయాలనుకునే  వారికి బాగుంటుంది. వారం ప్రధమార్ధం కంటే మధ్యమంలో మంచి ఫలితాలను అందుకుంటారు. అయితే అనుకున్న వాటి కంటే అధిక వ్యయం అవ్వడం అనేది ఇంక తప్పదు. వాటిని కట్టడి చేయాలనే ప్రయత్నం వృధా ప్రయాసగా ఉంటుంది, అనుకున్న పనులు పూర్తవుతాయి. వివాహం కానీ వారికి అనుకూలమైన సమయం, ప్రయత్నాలు త్వరగతిన చేయండి.  కుటుంబంలో శుభకార్యాలకు  సహకరిస్తారు.


కన్య: కొంత జాగ్రత్త వహించాల్సిన సమయం గా చెప్పవచ్చు. మీరు తలపెట్టిన పనులలో ఆటంకాలు ఏర్పడవచ్చు. అధైర్య పడకండి.   వృధా ప్రయాస  పడడం జరుగవచ్చు, జాగ్రత్త వహించండి. ఉద్యోగరీత్యా అధికారులతో అనుకున్న పనులు విషయంలో ఆలస్యంగా ఫలితాలుండే అవకాశాలున్నాయి. వ్యాపారస్తులకు తాత్కాలిక లాభాలు, సుఖాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అనుకున్న పనులకు అనుకున్న దాని కంటే ఎక్కువ శ్రమతో పాటు ఖర్చు కూడా  అధికమవడం కొంత ఆందోళనకు కారణమవుతుంది.

అయితే  టెన్సన్స్ తో కుటుంబంలో కానీ,  స్నేహితుల పట్ల కానీ తీవ్రమైన కోపం, ఫ్రస్ట్రేషన్(నిసహాయతను) చూపించడం అంత మంచిది కాదు. అనుకూలమైన చోటులో కూడా ప్రతికూలమైన పరిణామములు ఎదురవుతాయి. కొంత ప్రశాంతతను ఏర్పరచుకోండి. నిదానంగా మాట్లాడడానికి ప్రయత్నించండి. వారం మొదలులో అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి, అనుకున్న పనులను వెంటనే ఆచరణలోకి పెట్టడం మంచిది.  శత్రువర్గం పట్ల కొంత జాగ్రత్త వహించండి. కొత్త పరిచయాలు, స్నేహాల విషయంలో జాగ్రత్త వహించండి. విద్యార్థులకు విద్య పట్ల నిర్లక్ష్యం, అశ్రద్ధ ఏర్పడవచ్చు. శ్రద్ద తగ్గకుండా ప్రణాళికా బద్ధంగా చదువుకోవడం మంచిదని చెప్పదగ్గ సూచన.


తుల:  ప్రతికూలమైన ఫలితములు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుండి నిరాదరణ  ఏర్పడవచ్చు,  ప్రమోషన్లు, అభివృద్ధి వంటివి వాయిదాపడే అవకాశాలు ఉన్నాయి. అనుకున్న పనులలో ఆటంకాలు ఉండే అవకాశాలు ఎదురవుతాయి. కంగారు పడకండి. పని చేసే చోట, వృత్తి-వ్యాపారాల యందు  మీరంటే పడనీ వారి వలన వారు చేసే పనుల వలన కొంత మాట పడవలసి రావచ్చు. మీకుండే అభిప్రాయాలు, తెలియని మాటలు వేరొకరితో పంచుకోవడం మంచిది కాదు.

ఎవరు మనవరో ఎవరు పరాయివారు అనేది కొంత ఆలస్యంగా అర్ధం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కొంత ఓర్పు, సహనం వహించండి.  వ్యాపారస్తులకు కొద్దిపాటి అనుకూలత ఉంటుంది. అనవసరపు ఖర్చులు మిమ్మల్ని ఆలోచింపచేస్తాయి. స్నేహితులతో, కుటుంబంలో సానుకూలత ఉంటుంది.

సంతోషంగా గడిపే అవకాశాలు ఉన్నాయి. అవసరాల మేరకు డబ్బులు చేతికి అందడం వలన పనులు త్వరగా పూర్తవుతాయి. వివాహం కానీ వారికీ వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఉద్యోగావకాశాలు గురించి ప్రయత్నాలు సఫలీకృతం అయినప్పటికీ వాయిదాలు పడే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది. యధాతధంగా ఫలితాలు గోచరిస్తున్నాయి. 


వృశ్చికం:  ఉద్యోగస్తులకు  అభివృద్ధి పరంగా  మంచి అనుకూలమైన ఫలితాలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి.  ఆర్ధికంగా అనుకోని విధంగా  అభివృద్ధి ఉంటుంది. సంతాన పరంగా , కుటుంబ పరంగా సంతోషంగా గడుపుతారు. వ్యాపారస్తులకు, చిరు వ్యాపారస్తులకు సైతం  కూడా ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తులకు ఆర్థికాభివృద్ధి, ప్రమోషన్లు వంటివి ఉండే అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాలలో గౌరవం పొందుతారు. సంతానం కొరకు ప్రయత్నాలు చేసే వారికి మంచి సమయం అని చెప్పవచ్చు. వివాహా ప్రయత్నాలు చేసే వారికి ఈ వారం శుభ ఫలితంతాలు ఉంటాయి. స్నేహితులతో, సన్నిహితులతో అనుకోకుండా సహాయ సహకారాలు అందుతాయి.

మీ శక్తీ సామర్ద్యాల మీద నమ్మకం  ఏర్పడుతుంది. చిన్నపాటి అనారోగ్య సమస్యలు తప్పవు. అయినా మానసిక ధైర్యంతో ముందుకు సాగుతారు. చిన్నచిన్న అనారోగ్య సమస్యలను పట్టించుకోరు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అయితే అన్ని పనుల యందు ఎదో ఒక విధంగా ఆర్ధికంగా ఖర్చులు అధికం అవుతాయి, అయితే పట్టించుకోకుండా ఖర్చు చేస్తారు. స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు కొంత కుదుట పడుతుంది. విద్యార్థులకు అనుకున్న ఫలితాలను సాధిస్తారు. కొత్త కోర్సులు అభ్యసించడానికి, నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి.


ధనస్సు: సర్వత్రా అన్ని విధాల అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలలో ఉద్యోగ ప్రయత్నాలు చేయువారికి కూడా కొంత అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. సాఫ్ట్ వేర్ రంగం వారికి, టెక్నీకల్ రంగం వారికి ఉద్యోగ పరంగా అభివృద్ధి, ప్రశంసలు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. రియల్ ఎస్టేట్ వారికి అమ్మకాల కంటే కొనుగోలు చేసే సమయం, స్థిరాస్తి వృద్ధి అయ్యే సమయమని చెప్పవచ్చు.

విద్యార్థులకు  వారి సామర్ధ్యతకు తగిన గుర్తింపు లభిస్తుంది. కొత్త కోర్సులు, కల్చురల్  అక్టీవ్స్  వంటివి అనుకూలిస్తాయి. పోటీ పరీక్షలకు కూడా మంచి సమయం అని చెప్పవచ్చు. వివాహం కానీ వారికి గట్టిగా ప్రయత్నాలు చేస్తే   మంచిది.  శుభకార్యక్రమాలలో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసే వారికి కూడా మీరు అనుకున్న విధంగా ఫలితములుండె అవకాశాలు గోచరిస్తున్నాయి.

అయితే కొంత మానసిక ఆందోళన , అలసట ఉంటాయి. కృషి పట్టుదలతో ముందుకు సాగితే వారం ద్వితియార్ధంలో అన్ని అనుకూల ఫలితాలుంటాయి. మునుపటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కొంత ఆరోగ్యం మెరుగు అయినట్టు కనబడుతుంది. మానసిక ఉత్సాహం పెరుగుతుంది. స్త్రీల విషయంలో పెద్దల నుండి అభిమానంను పొందుతారు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. సంతోషంగా స్వీకరిస్తారు.


మకరం: శ్రమ, మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఏమి  మాట్లాడినా కుటుంబంలో కానివ్వండి. కార్యాలయంలో కానివ్వండి వారు తప్పుగా అర్ధం చేసుకుని అవి చిన్నపాటి తగాదాలకు దారి తీసే అవకాశాలు ఉన్నాయి. దీని వలన మీరు కోపాన్ని పెంచుకుని వారిని ఇబ్బంది పెట్టె మాటలు కానీ, చేతలు కానీ చేయడం మంచిది కాదు. వాటివల్ల మీ మంచితనం మరుగున పడి మీ పేరు ప్రఖ్యాతలు తగ్గవచ్చు. కాబట్టి మీరు ఇది పరీక్షా సమయం గా భావించి ఓర్పు, సహనంతో ఉండడం మంచిది. దానికి  తోడు  ఏలినాటి శని ప్రభావం వలన  మానసిక ప్రశాంతత కరువయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే వ్యాపార రంగంలో ఉండే వారు కూడా నిరాశ నిస్పృహలు  మంచిది కాదు. కష్టపడి, పట్టుదలతో ముందుకు సాగండి.

భవిష్యత్తు  బాగుంటుంది. విద్యార్థులు  సోమరితనాన్ని కొంత  విడిచిపెట్టి   ప్రణాళికా బద్ధంగా చదువుకోవడం మంచిది. మంచి  ఉత్తీర్ణత  సాధించగలుగుతారు. ఆ దేవుడు పరీక్ష పెడతాడు కానీ అన్యాయం  చేయడు అన్నట్టు కొంత శ్రమ, ఒత్తిడి పడినప్పటికీ అనుకున్న సమయానికి చేతికి డబ్బులు అందడంతో అవసరముల మేరకు లోటు ఉండదు. పెద్దవారితో మాట, పట్టింపులు, తగాదాలు మంచిది కాదు. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి.


కుంభం: ఉద్యోగులకు, అధికారుల పట్ల కొంత అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి.  స్వస్థానమునకు  అంటే సొంత ఊరికి వెళ్లడం, కుటుంబానికి   ప్రాధాన్యత ఇస్తారు.  అయితే కుటుంబంలోని వారి ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. వృధా ఖర్చులు ఎక్కువ అవుతున్నాయనే మీ ఆందోళన  ఎక్కువ అవుతుంది. ఎంత సంపాదన ఉన్నప్పటికీ పొదుపు కనిపించడం లేదని భాధ పడతారు.

ఉద్యోగస్తులకు అధికారులతో పని ఒత్తిడి ఉంటుంది. వ్యాపారస్తులకు లాభాలు మందకొడిగా సాగే అవకాశాలు ఉన్నాయి. సంతానం పట్ల అనుకూలత ఉంటుంది. వారి అభివృద్ధి పరంగా మీకు సంతోషం లభిస్తుంది. ఎదో ఒకరకంగా ఆర్ధిక  ఇబ్బందులు తొలగుతాయి. బాధ్యతతో నా  పనులు నేను పూర్తి చేయగలిగాను, ఇంతకంటే నావల్ల కాదు అనే భావనకు వస్తారు. స్నేహితులతో శాంతియుతంగా ప్రవర్తించండి. ఉద్రేకంగా మాట్లాడడం   మంచిది కాదు.

విద్యార్థిని విద్యార్థులకు వారి కష్టానికి తగిన ప్రతి ఫలం వచ్చే సమయమని చెప్పవచ్చు. వారి ఫలితాలు వారి కష్టం మీదే ఆధారపడి ఉంటుంది. అదృష్టాన్ని నమ్ముకోవడం మంచిది కాదు. మీ ప్రతిభని నమ్ముకుంటే అన్నీ సానుకూల ఫలితాలు అందుకుంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. చిన్నపాటి జ్వరం వంటివి ఉండే అవకాశాలు ఉన్నాయి. మానసిక ధైర్యం పెంచుకోండి. 


మీనం: జాగ్రత్తగా ఉండవలసిన సమయం అని చెప్పవచ్చు. ఉద్యోగ పరంగా పని ఒత్తిడి ఎక్కువ అవుతుంది. ఏదైనా ఒక పని మొదలు పెడితే ఒకటికి పదింతలు శ్రమ ఖర్చు అవుతుంది. అప్పులు, లోన్లు విషయంలో కొంత ఇబ్బందులకు గురి అవుతారు. ఆర్ధిక విషయంలో బాగా ఇబ్బందులు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు ఎంత సంపాదన  ఉన్నప్పటికీ  పెట్టుబడుల రూపంలో కానీ, సేవింగ్స్ చేసినప్పటికీ నిత్యకృత్యంలో ఇబ్బందులు తప్పవు.

పెట్టుబడుల రూపంలో ఉంటాయి అవసరాలకు మనకు రావట్లేదు అని అనుకుంటారు. కానీ వ్యాపార దక్షత ఎక్కువ వలన సమస్యలను మొండిగా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఏదైనా ఒక పని మొదలు పెడితే మధ్యలో అడ్డంకులు ఎదురవుతాయి, పని అవుతున్నప్పటికీ విమర్శలు వలన కొంత తోట్రుపాటు అనేది జరుగుతుంది. వివాహం కానీ వారు, వివాహ ప్రయత్నాలు చేసేవారు గట్టిగా ప్రయత్నాలు చేసుకొనుట మంచిది. వివాహ ప్రయత్నాలకు మంచి సమయం. గట్టిగా ప్రయత్నిస్తే విషయాలు ఒక కొలిక్కి వస్తాయి.

వ్యవహారాల విషయంలో అగ్రిమెంట్లు, హామీలు వంటి వాటిలో జాగ్రత్తగా వ్యవహరించుట మంచిది. అటువంటి వ్యవహారాలకు , ఇతరుల విషయంలో సలహాలు, సంప్రదింపులకు కూడా ఇది మంచి సమయం కాదు. మీరు ఒకప్పుడు ఇలాంటివి చేసి ఉండచ్చు, కానీ ఇప్పుడు జాగ్రత్త వహించడం మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. మానసిక ప్రశాంతత కొరకు  తగిన విశ్రాంతి  తీసుకోవడం మంచిది. 


                                                Weekly Rasi Phalalu - Oct 08th - Oct 14th 2023 | వార ఫలాలు - View Video...


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121