మేషం: ఎంత శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. తగాదాలకు దూరంగా ఉండండి.
వృషభం: వృత్తి-వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. పని భారం పెరుగుతుంది. ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. కుటుంబంలో ఏర్పడిన చికాకులు తొలగించుకొంటారు. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది.
మిథునం: కొత్త వ్యక్తులు పరిచయమై సాయం అందిస్తారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ప్రముఖుల పరిచయాలు అవుతాయి.
కర్కాటకం: గృహనిర్మాణ ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబంలో ఏర్పడిన తగాదాలు పరిష్కారదిశగా సాగుతాయి. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ధనలాభం.
సింహం: పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు ఆప్తుల సలహాలతో సఫలమవుతాయి. విందు వినోదాలు. వస్తు, వస్త్ర లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.
కన్య: ముఖ్యమైన వ్యవహారాలలో ఏర్పడిన అవరోధాలు కొంత వరకు తొలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆరోగ్య పరంగా కొన్ని స్వల్ప ఇబ్బందులు గోచరిస్తున్నాయి.
తుల: ఋణ భారాలు తొలగుతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. సంతానంకి సంబంధించిన విద్యా, ఉద్యోగ విషయాలు చర్చించుకుంటారు. సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి అనుకూలం.
వృశ్చికం: కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. పెండింగ్ లో ఉన్న వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యత్తి-వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తలు అవసరం.
ధనస్సు: ఋణ బాధలు కొంత వరకు తీరుతాయి. ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రులు పరిచయాలు. ఇంటా బయట ఒకే రకమైన ధోరణి ఉంటుంది. సోదరుల నుండి ధనలాభం.
మకరం: బంధువుల నుండి ఒత్తిడులు ఎదురైన అధిగమిస్తారు. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. పనులు నిదానంగా సాగుతాయి. ఉద్యోగస్తులు స్వల్ప లాభాలు పొందుతారు. వస్తు లాభాలు ఉంటాయి. ఆర్ధిక పరంగా ఖర్చులు అధికం.
కుంభం: కార్య జయం కలుగుతుంది. ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల నుండి కీలక సమాచారం అందుతుంది. భూమిని కొనుగోలు చేసే విషయమై ఒక ఆలోచనకి వస్తారు.
మీనం: వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. పాత, కొత్త మిత్రుల నుండి ఆహ్వానాలు అందుతాయి. జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు పొందుతారు. సంఘంలో మీదే పై చేయిగా ఉంటుంది.
- సోమేశ్వర శర్మ
+91 8466932223,
+91 9014126121