దిన ఫలాలు 16-10-2023

మేషం:  ధన, వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. విందు, వినోదాలలో ఉత్సాహంగా పాలుపంచుకుంటారు, స్థిరాస్థి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఉద్యోగాలలో ఎదురైన చిక్కులు తొలుగుతాయి.


వృషభం: పనులు చకచకా సాగుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. బంధువులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి- వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి.


మిథునం: పనుల్లో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు ధనం అందుతుంది. సేవ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. సోదరుల నుండి కీలక సమాచారం. ఇంటాబయట మీదే పైచేయిగా ఉంటుంది.


కర్కాటకం: వృత్తి-ఉద్యోగ వ్యవహారాలలో అవరోధాలు ఏర్పడినా అధిగమిస్తారు. కోపతాపాలకు, వివాదాలకి దూరంగా ఉండండి. బంధువులని కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కాంట్రాక్టులు దక్కుతాయి.


సింహం: శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. పాత బాకీలు వసూలు అవుతాయి. బంధువులతో ఏర్పడిన ఆర్ధిక పరమైనవివాదాలు సమసిపోతాయి వృత్తి-వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. ఉద్యోగస్తులకి, కార్మికులకి పదోన్నతలు లభిస్తాయి.


కన్య: ప్రముఖల నుండి ఊహించని అతిధి ఆహ్వానాలు ఆనందం కలిగిస్తాయి. మిత్రులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు తొలుగును. సన్నిహితులతో సఖ్యత అవసరం. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం.


తుల: భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన మనస్పర్ధలు మరచిపోయి ఆనందంగా గడుపుతారు. దూరప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు.


వృశ్చికం: నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యమైన పనులలో ఎదురైన ఆటంకాలు మిత్రుల సాయంతో తొలగించు కుంటారు. బంధువుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. సమాచార విషయాలు గోప్యత అవసరం.


ధనస్సు:  విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. పాత బాకీలు వసూలవుతాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, బోనస్ లు పొందుతారు. అగ్రజుల నుండి విలువైన సమాచారం అందుతుంది.


మకరం: నిరుద్యోగులకి ఉద్యోగ ప్రాప్తి, ఉద్యోగ మార్పుకోసం చేసే ప్రయత్నాలు సానుకూల పడే అవకాశాలు ఉంటాయి. సంఘంలో ఆదరణ పొందుతారు. చిరకాల మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. ఇంటాబయటా అనుకూలంగా వుండును. సేవకార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.


కుంభం: ఆర్థిక వ్యవహారాలలో స్వల్బ లాభాలు పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన తగాదాలు మధ్యవర్తుల ద్వారా పరిష్కారం చేసుకుంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. వస్తులాభం గోచరిస్తున్నది.


మీనం: భవిష్యత్తుకి సంబందించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకొంటారు. బంధువుల నుండి వచ్చిన సమాచారం మిమ్మల్ని అమితంగా బాధిస్తుంది. ఆరోగ్య సమన్యల నుండి బయటపడతారు. కార్యాలయంలో సిబ్బంది పనిపట్ల సానుకూలత ఉంటుంది. ఉద్యోగాలలో ఏర్పడిన చికాకులు తొలగించుకొంటారు.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121