దిన ఫలాలు 22-10-2023

మేషం:  శ్రమాధికం. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురై చికాకులు పెట్టిన మిత్రుల సాయంతో పూర్తి చేస్తారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. వాహనాల ప్రయాణాల పట్ల కొంత అప్రమత్తత అవసరం.


వృషభం: పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. విందు, వినోదాలు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చర్చా గోష్టులలో చురుకుగా పాల్గొంటారు. నూతన వన్తు, వస్తా కొనుగోలు చేస్తారు.


మిథునం: కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. నూతన యత్నాలు అనుకూలిస్తాయి. రాజకీయ, కళారంగాల వారు సన్మానాలు పొందుతారు. అర్దికాభివృద్ది అంతంత మాత్రంగా ఉంటుంది.


కర్కాటకం: వృత్తి-వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. సోదరుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. జీవితభాగస్వామి ఆరోగ్యం కొంత ఇబ్బంది పెడుతుంది.


సింహం: కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. అనుకోని అతిథుల నుండి అహ్వానాలు అందుకొంటారు. నూతన వస్తు కొనుగోలు చేస్తారు.


కన్య: విలువైన వస్తు, ఆభరణాలు, వాహనాల కొనుగోలు చేస్తారు. సంఘంలో గౌరవం పొందుతారు. దూరపు బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. సోదరుల నుండి ఆస్తిలాభం పొందుతారు. కాంట్రాక్టులు కొరకు పైరవీలు చేస్తారు.


తుల: ఆర్థిక లావాదేవీలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. ఋణ ఒత్తిడులు తొలుగుతాయి. మానసిక ప్రశాంతత పొందుతారు. వ్యత్తి-వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. సహోదర వర్గంతో విబేధాలు వచ్చే అవకాశాలు గోచరిస్తున్నాయి.


వృశ్చికం: వృత్తి, వ్యాపారాలలో అదనపు బాధ్యతలు పెరిగడం వలన అలసటకి గురవుతారు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది. బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు.


ధనస్సు:  భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందామని ఆనందాన్ని కుటుంబ సభ్యులతో పాలుపంచుకుంటారు. ఉద్యోగస్తులకి ఇంక్రిమెంట్లు అందుకుంటారు. శ్రమకు తగిన ఫలితం దక్కలేదని విచారిస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత అనుకూలంగా ఉంటుంది.


మకరం: బంధువుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల కలయిక వలన భవిష్యత్తు కార్యాచరణ చేస్తారు. వాహన యోగం గోచరిస్తున్నది. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.


కుంభం: ప్రయాణాలలో తొందరపాటు తనం వద్దు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు ధనం అందుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. జీవిత భాగస్వామి నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.


మీనం: కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. ధన, వస్తు లాభాలు పొందుతారు. ఆప్తులను కలిసి ఆనందంగా గడుపుతారు. దైవ చింతన ఏర్పడతాయి. పూజాది శుభకార్యాల కోసం కొంత ధనం వేచ్చిస్తారు.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121