మేషం: మీరు పెద్దవారిపై చూపించే శ్రద్ద భక్తుల వలన, స్నేహవర్గం నుండి అనుకూలమైన ఫలితములు, సలహాలు సానుకూలత ఉంటుంది. శత్రువర్గం నుండి కూడా ఆదరాభిమానములు పొందగలరు. అయితే కుటుంబంలో కానీ, జీవిత భాగస్వామి తో మనస్పర్థలు ఏర్పడే అవకాశములు గోచరిస్తున్నాయి. జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు సామాన్యంగా, యధావిధిగా కొనసాగుతుంది. ఆరోగ్యం పట్ల జాగర్త వహించాలి. నూతన వస్తువులు కొనుగోళ్లు చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు కొంత ఆర్ధిక లాభములు తక్కువగా ఉండే అవకాశములు ఉన్నాయి.
మానసిక ఆందోళనలు వాటివల్ల వచ్చే తలనొప్పి వంటివి ఇబ్బంది పెడతాయి. ఎక్కువగా ఆలోచిస్తారు. ఆలోచనలను పక్కనపెట్టి వ్యాపారం మీద దృష్టి పెట్టండి. మేలు జరుగుంది. వివాహ ప్రయత్నములు చేసే వారికి ఈవారం అనుకూలమైన ఫలితాలుంటాయి. విద్యార్థిని విద్యార్థులకు స్నేహితులతో కలసి ఆటపాటలు, అలాగే చదువులు ఉండే అవకాశములు ఉన్నాయి. కృషితో ముందుకు సాగండి. తగాదాలకు దూరంగా ఉండడం మంచిది. ఈవారం స్త్రీలకు బాగుంది అని చెప్పవచ్చు, ఏ పనైనా అలోచించి నిర్ణయాలు తీసుకోండి. మేలు జరుగుతుంది. వ్యాపారాభివృద్ధి, సంతానాభివృద్ధి వుంది.
వృషభం: సర్వత్రా శుభ ఫలితములు ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. ఉద్యోగ పరంగా ప్రమోషన్లు వంటివి కానీ అభివృద్ధి వంటివి అనుకూలమైన ఫలితములను ఇస్తాయి. వ్యవసాయ రంగం, కళారంగం వారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు
సాఫ్ట్ వేర్, టెక్నీకల్ రంగం వారికి అనుకూలమైన ఫలితాలుంటాయి. అనుకున్న అభివృద్ధి ఉంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి స్థిరాస్తి వృద్ధి అయ్యే అవకాశములు గోచరిస్తున్నాయి. విద్యార్థిని విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయము. మంచి, నూతన విద్య విషయముల విషయంలో, అలాగే విదేశములకు వెళ్ళడానికి ప్రయత్నములు చేసే వారికి అనుకూలమైన ఫలితములు ఉండే అవకాశములు ఉన్నాయి.
వ్యాపారములు అనుకూలిస్తాయి. వివాహ ప్రయత్నములు చేయు వారికి కూడా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. కార్యానుకూలత ఏర్పడుతుంది. అయితే ఎవరో అన్న మాటలు పట్టుకుని మానసిక ఆందోళనలకు గురి అవుతారు. మానసిక ప్రశాంతత ఏర్పరచుకోండి. కుటుంబంలో కంటే ప్రజాభిమానం పొందగలుగుతారు. సర్వ దుఃఖములు తగ్గినట్టుగా అనిపిస్తుంది. సంతోషం ఏర్పడుతుంది. ఆర్ధికంగా అనుకున్న ప్రకారం అభివృద్ధి ఏర్పడుతుంది. అయితే ఖర్చుల విషయంలో జాగర్త వహించండి.
మిథునం: ఉద్యోగపరముగా సామాన్యంగా నడిచే అవకాశములు ఉన్నాయి. పెండింగ్ పనులు ఉంటే వాటి గురించి ఆలోచించకండి. నిదానంగా కుదుటపడుతాయి. ఉద్యోగంలో కానీ, పని చేసే చోట కానీ శత్రువర్గం నుండి మీ మీద లేనిపోని నిందలు వేసే అవకాశములు ఉన్నాయి. మీరు ఎక్కువగా కోపము ప్రదర్శించుట మంచిది కాదు. ఆచి తూచి అడుగులు వేయండి. వ్యాపారస్తులకు పలుకుబడి పెరిగి గౌరవం వృద్ధి అయ్యే అవకాశములు ఉన్నాయి. బంధువులతో విరోధములు వచ్చే అవకాశములు ఉన్నాయి. జాగర్త వహించాలి.
అయితే వ్యాపారస్తులకు పలుకుబడి వలన మంచి అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. విలాస వస్తువుల వ్యాపారస్తులకు అనుకూలం, మీ మంచితనంతో మాట చెలామణి అయ్యేలా ప్రవర్తిస్తారు. స్నేహవర్గంతో సాన్నిహిత్యం ఏర్పడుతుంది. సంతానం ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించండి. అనవసరమైన శ్రమ పడే అవకాశములు ఉన్నాయి. ప్రయాణములు ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. వివాహ ప్రయత్నములు చేసే వారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. విద్యార్థిని విద్యార్థులకు తమ ప్రతిభను ప్రదర్శించే సమయం అని చెప్పవచ్చు. కష్టపడి ఫలితాలను సాధిస్తారు. ఆరోగ్య పరముగా శారీరకంగా కొంత అలసట, బలహీనత వంటివి ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించండి. మానసిక ధైర్యం పెంచుకోండి.
కర్కాటకం: ఆర్ధిక పరమైన లాభములు, చిన్నపాటి బహుమానములు వంటివి పొందే అవకాశములు గోచరిసున్నాయి. కుటుంబ పరముగా సౌఖ్యం, వృద్ధి ఉంటుంది. అయితే బంధువర్గం లో కొద్దిపాటి తగాదాలు, మాట పట్టింపులు ఉండే అవకాశములు ఉన్నాయి. మనసులో తెలియని ఆందోళనలు టెన్సన్స్ వంటివి ఏర్పడతాయి. ఋణాలు, లోన్లు వంటి వాటి విషయంలో ఒత్తిడి ఉండే అవకాశములు ఉన్నాయి. సాఫ్ట్ వేర్ రంగం వారికి అనుకూలమైన ఫలితములుంటాయి. వ్యాపారస్తులకు ముఖ్యంగా తెలివి ఎక్కువ పెట్టుబడి పెట్టె కన్సెల్టెన్సీలు వంటి వారికి మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు.
ఉద్యోగస్తులకు మాత్రం కొంత అధికారుల వల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు. బయట జరిగే చికాకులకు ఇంట్లో కుటుంబం పట్ల శ్రద్ధ చూపించడం మంచిది. ఆర్ధిక ఇబ్బందులు కంటే మానసిక ఆందోళనలు ఇబ్బంది పెట్టె అవకాశములు ఉన్నాయి. ఆరోగ్య పరమైన జాగ్రత్తలు తీసుకోండి. లేనిపోని ఆందోళనలు పెట్టుకోవద్డు. గ్యాస్ట్రిక్ వంటి సమస్యలు తలెత్తవచ్చు. శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది. విద్యార్థిని విద్యార్థులకు కష్టపడిన దాని కంటే తక్కువ ఫలితాలుండే అవకాశములు గోచరిస్తున్నాయి. పట్టుదలతో ముందుకు సాగడం చెప్పదగ్గ సూచన.
సింహం: ఉద్యోగ పరంగా బాగుంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి అనుకూలం అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు వారు పని చేసే చోట శత్రువర్గం ఉన్నప్పటికీ వారిని అధిగమించి అభివృద్ధి అందుకుంటారు. వ్యాపారస్తులకు కూడా మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. పేరుతో పాటు ఆర్ధిక పరంగా కూడా లాభములు ఉంటాయి. అనుకున్న వ్యవహారములు చక్కబెడతారు. కుటుంబంలో జీవిత భాగస్వామి పట్ల , స్నేహవర్గంలో సంతోషంగా ఉన్నప్పటికీ బంధువర్గంలో కొంత ఈర్ష్య అసూయలు వచ్చే అవకాశములు ఉన్నాయి. వారు అసూయతో అన్న మాటలకు మీరు స్పందించకపోవడం మంచిది.
విద్యార్థిని విద్యార్థులకు మంచి అభివృద్ధి ఉంటుంది. విద్యపై శ్రద్ద , పట్టుదల పెరుగుతుంది. మంచి ఫలితములు అందుకుంటారు. అలాగే వివాహం కానీ వారికి వివాహ ప్రయత్నములు చేయడానికి అనుకూలమైన సమయం. నూతన వస్తు, వాహనములు కొనుగోలుకు మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఆరోగ్యం బాగుంటుంది, గతంలో అనారోగ్యం ఎక్కువ ఉన్నవారికి కొంత అనుకూలత ఏర్పడుతుంది. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు.
కన్య: ఉద్యోగ పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ అనుకున్న పనులు పూర్తవుతాయనుకునే సరికి నమ్మిన వారి వలన మోసాలు జరగడం, అనుకున్న పనులు వాయిదాలు పడడం వంటివి ఉండే అవకాశములు ఉన్నాయి. కాబట్టి మీ సామర్ధ్యంతో ముందుకు సాగండి, ఎవరిని నమ్మి రహస్యాలు, పనియందు మెళకువలు చెప్పడం మంచిది కాదు. మాట విషయంలో జాగ్రత్త వహించండి. అనుకున్న దానికంటే ఎక్కువ ఖర్చులు అవ్వడం బాధాకరంగా ఉంటుంది, అయినప్పటికీ పనులు పూర్తవడమే ధ్యేయంగా పెట్టుకుంటారు. వ్యవహారములు విషయంలో చిన్నపాటి అవమానములు, అలాగే అపవాదులు ఉండే అవకాశములు ఉన్నాయి.
మీరు కఠినంగా మాట్లాడడం కూడా అంత మంచిది కాదు, మీ ముందు బానే ఉంది మీ వెనకాల మీ గురించి తప్పుగా మాట్లాడేవారుంటారు. అయితే ఎవరు ఏమనుకున్నా ఆర్ధికంగా అనుకున్న సమయానికి డబ్బుల విషయంలో లోటు ఉండదు, అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి తాత్కాలికంగా వచ్చినట్టే ఉన్నప్పటికీ పూర్తి సంతృప్తి ఉండకపోవచ్చు. పట్టుదలతో అడుగు ముందుకు వేయండి. విద్యార్థిని విద్యార్థులకు స్నేహితులతో సరదాలకు ప్రాధాన్యత తగ్గించి చదువు మీద దృష్టి పెట్టడం మంచిది. మీ సొంత కృషిని నమ్ముకోవడం మంచిది.
తుల: కొంత జాగ్రత్త వహించాల్సిన సమయం అని చెప్పవచ్చు. కుటుంబం లో సుఖశాంతులు ఉంటాయి. స్నేహవర్గంలో కూడా మంచి సాయం అందుతుంది. అయితే ఉద్యోగంలో అనుకున్న అభివృద్ధి లో ప్రతికూలమైన ఫలితాలుండే అవకాశములు ఉన్నాయి. ఇంతకాలం నుండి పని చేస్తే ఇదేనా ప్రతిఫలం అనే భావన వస్తుంది. పని చేసే చోట శత్రువర్గం వలన, మనకంటే తక్కువ వారి వలన కూడా మాటలు పడుతున్నాం అనే ఆందోళన ఏర్పడుతుంది. వ్యాపారంలో కూడా అనుకున్న పనులకు ఆటంకములు, ఇబ్బందులు ఉండే అవకాశములు ఉన్నాయి. సొంత వారి వలన నష్టములు వచ్చే అవకాశములు ఉన్నాయి.
ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయములు తీసుకోండి. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ద వహించండి. శారీరక అనారోగ్యం కంటే మానసిక ఆందోళనలు వాటివల్ల అనారోగ్య సమస్యలు ఉండే అవకాశములు ఉన్నాయి. ఆర్ధికంగా డబ్బుల విషయంలో యధాతధంగా ఉంటుంది. అవసరాల మేరకు లోటు ఉండదు. కోపాన్ని నియంత్రించుకోండి. ప్రశాంతంగా ఆలోచించి మాట్లాడటం చెప్పదగ్గ సూచన. విద్యార్థిని విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయం, అయితే స్నేహములు విషయంలో జాగ్రత్త వహించండి. చదువు పై శ్రద్ద పెంచుకుని, దృష్టి మరలకుండా చూసుకోండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.
వృశ్చికం: ప్రతికూలమైన ఫలితములు గోచరిస్తున్నాయి. అన్ని విధముల మిశ్రమ ఫలితములు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు పని చేసే చోట కార్యాలయములలో శత్రువర్గం నుండి ఇబ్బందులు, పై అధికారులతో పని ఒత్తిడి ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు లాభాలు కంటే ఖర్చులు అధికం అయ్యే అవకాశములు గోచరిస్తున్నాయి. అన్ని విధముల వ్యయ ప్రయాసలు ఎక్కువ అయ్యే సూచనలు ఉన్నాయి. విద్యార్థినీవిద్యార్థులకు సానుకూలంగా ఉంటుంది. యువత వ్యక్తిత్వం విషయంలో ఆత్మస్థైర్యంతో ఉండండి.
చిన్నపాటి జ్వరం వచ్చే అవకాశములు ఉన్నాయి, జాగర్త వహించండి. వ్యసనములకు, విలాసములకు చెడు అలవాట్లకు దూరంగా ఉండండి, బానిసలైతే భవిష్యత్తులో ఇబ్బందులపాలు అవ్వవలసి ఉంటుంది. చిన్న చిన్న మాట పట్టింపులతో తగాదాలకు దిగడం మంచిది కాదు. ఆరోగ్య విషయములలో ఖర్చు అయ్యే అవకాశములు ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి అతికష్టం మీద ప్రతిఫలములు ఉంటాయి. అయితే ఊహించినంత ఉద్యోగాభివృద్ది ఉండకపోవచ్చు, ఆందోళన చెందకండి. కృషితో, పట్టుదలతో ముందుకు సాగండి. కుటుంబ పరంగా కొంత భిన్నాభిప్రాయభేదములు, మాట అవకాశములు ఉన్నాయి. కొంత నిదానాన్ని అలవాటు చేసుకోండి.
ధనస్సు: సర్వత్రా విజయములు వరిస్తాయని చెప్పవచ్చు. సాఫ్ట్ వేర్ రంగం వారికి, టెక్నీకల్ రంగం వారికి కూడా ఉద్యోగ పరంగా అనుకూలత ఉంటుంది. ప్రమోషన్లు, బదిలీలు వంటి వాటికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు, ప్రయత్నములు చేయండి. వ్యాపారస్తులకు అనుకున్న అభివృద్ధి, ఎదుగుదల కనబడుతుంది. రియల్ ఎస్టేట్ వారికి స్థిరాస్తి వృద్ధి అవుతుంది, అమ్మకములు కంటే కొనుగోలు విషయంలో ఎక్కువ శ్రద్ద చూపిస్తారు.సంతానం కోరుకునే వారికీ శుభవార్తలు వినే అవకాశములు ఉన్నాయి. సంతాన పరంగా వారి అభివృద్ధి కి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. కుటుంబ పరంగా సంతృప్తి, సంతోషకరమైన సమయం గడుపుతారు.
శారీరకంగా చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ మానసికధైర్యంతో ముందుకు సాగుతారు. అయితే ఆరోగ్యం గురించి పట్టించుకోరు. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ద వహించండి, నిర్లక్ష్యం చేయవద్దు. నూతన వివాహ ప్రయత్నములు చేసేవారికి అనుకూలమైన సమయం. ఉద్యోగ ప్రయత్నములు కూడా అనుకూలిస్తాయి. విద్యార్థినీవిద్యార్థులకు అనుకూలమైన సమయం, కొత్తకోర్సులు నేర్చుకొనుటకు మంచిది. విదేశీయానమునకు ప్రయత్నములు చేసే వారికి కూడా మంచి సమయం. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ రాశి వారికి అన్ని విధముల బాగుంటుందని చెప్పవచ్చు, ఎప్పటి నుండో ఉంది పోయిన స్థిరాస్తి తగాదాలు ఏమైనా ఉన్నవారికి ఇబ్బందులు తొలగి పోతాయి. అయితే నిర్లక్ష్యం, అశ్రద్ధ మంచిది కాదు.
మకరం: పూర్తిగా అనుకూలంగా లేకపోయినప్పటికీ గతంలో కంటే కొంత సానుకూలత ఏర్పడుతుంది. మీ ఉద్యోగాభివృద్ది ఒకేసారి కాకుండా క్రమక్రమాభివృద్ది అవుతుంది. ఉద్యోగ విషయంలో అభివృద్ధి, ఆర్థికాభివృద్ధి ఉంటుంది. అందరితో సన్నిహితం పెరుగుతుంది. శత్రువర్గం ఏదైనా ఉంటె కొంత ఇబ్బందులు తొలగిపోయి మిత్రులుగా మారే అవకాశములు ఉన్నాయి. మీ మంచితనం, ఓర్పు దీనికి కారణమని చెప్పవచ్చు. అంతర్గత విమర్శలు తప్పవు. అయితే సంపాదన ఎంత ఉన్నప్పటికీ ఖర్చు కూడా అంతే ఉంటుంది, మీరు పెట్టె ఖర్చులో ఎక్కువ శాతం మీ సొంత ఖర్చులకే ఉండే అవకాశములు ఉంటాయి, మంచి పనులకు వినియోగిస్తారు.
అనుకున్న పనులు తొందరగా ఫలితాలను ఇవ్వకపోవడం వంటివి ఉండవచ్చు, ఆందోళన చెందకండి. అతికష్టం మీద పనులు పూర్తవవుతాయి. మనోవాంఛ సిద్ధిస్తుంది. కుటుంబ పరంగా సంతోషం లభిస్తుంది. అయితే ఆరోగ్య పరంగా కొంత అలసట, బలహీనత ఉండే అవకాశములు ఉన్నాయి. విద్యార్థిని విద్యార్థులకు చదువు విలువ తెలిసే సమయం అని చెప్పవచు, మొక్కుబడి చదువుతున్నట్టు కాకుండా పట్టుదలతో, కృషితో ముందుకు సాగండి. మంచి ఫలితాలుంటాయి. మొత్తం మీద మిశ్రమ ఫలితాలుంటాయి. ఆచీతూచీ అడుగు వేయడం మంచిది.
కుంభం: జాగ్రత్త వహించాల్సిన సమయం గా చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు పైఅధికారులతో మాటపట్టింపులు ఉండే అవకాశములు ఉన్నాయి, ఆ కారణముగా ఒత్తిడికి, వేదనకు గురి అవుతారు. అనుకోని ప్రయాణముల వలన ఖర్చు అధికమవుతుంది. ఉద్యోగంలో కానీ, వ్యాపారంలో కానీ ఎక్కడ అయినా మీ యొక్క పని పట్ల నిర్లక్ష్యం పనికి రాదు, కొంత బద్దకమును, సోమరితనం ఉంటె పక్కకు పెట్టి అనుకున్న పనులు వెంటనే చేయడం మంచిది. లేకపోతే మీ యొక్క సమస్యలు మరింత పెరిగే అవకాశములు ఉంటాయి. పెద్దవారితో మాట్లాడేటప్పుడు, పరులను కష్టపెట్టే మాటలు మాట్లాడడం వంటివి మంచిది కాదు.
మీ ఆవేశపూరితమైన మాటలు వలన తర్వాత ఇబ్బందులు ఏర్పడవచ్చు. మీ ఫ్రస్ట్రేషన్ కుటుంబంలో వ్యక్తులమీద చూపించడం వంటివి మంచిది కాదు, మీకు మీ కుటుంబం యొక్క ఆదరణ, సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. అది పోగొట్టుకునే పనులు చేయడం మంచిది కాదు. కొత్త వ్యవహారములు, నూతన ప్రణాళికలకు ఇది అంత అనుకూలమైన సమయం కాదు. కంగారు పడకండి. మీ ఆరోగ్యంతో పాటు జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ద వహించండి. విద్యార్థిని విద్యార్థులకు మీరు ఆశించినంత ఫలితాలుండకపోవచ్చు. ఆందోళన చెందకండి. మార్కుల కంటే టాలెంట్ విషయంలో ముందుంటారు.
మీనం: ఒక విధంగా మీ బుద్ది బలానికి పరీక్షా సమయం అని చెప్పవచ్చు. ఏ విధమైన సమస్యలు వచ్చినప్పటికీ మీ యొక్క తెలివితేటలతో, ఆలోచనలతో బయటపడతారు. కుటుంబంలో జీవిత భాగస్వామి తో చిన్నపాటి మనస్పర్థలు ఉండే అవకాశములు ఉన్నాయి. ఖర్చులు అధికం అవుతాయి. ఉద్యోగంలో అధికారులతో, పని ఒత్తిడి అధికమవుతుంది. వ్యాపారస్తులకు లాభములు ఉన్నప్పటికీ మీకు సన్నిహితంగా ఉండే వారితో చిన్న పాటి మనస్పర్థలు ఉండవచ్చు జాగర్త వహించడం చెప్పదగిన సూచన. .
సంతాన పరంగా బాగుంటుంది. వారి అభివృద్ధి బాగుంటుంది. మంచిపేరు సంపాదిస్తారు. ఆర్థికపరంగా డబ్బులు విషయంలో లోటు ఉండదు, అవసరాల మేరకు చేతిలో ఉంటాయి. అనుకున్న విధంగా మీ సామర్ధ్యంతో పనులు పూర్తి చేస్తారు. విద్యార్థిని విద్యార్థులకు అనుకూలమైన సమయం, టాలెంట్ పరీక్షలు, పోటీ పరీక్షల వంటివి అనుకూలిస్తాయి. క్రీడారంగంలో ఉన్న వారికి బాగుంటుంది. వాహనములు నడిపేటప్పుడు, ప్రయాణములలో జాగ్రత్త వహించండి. శారీరక ఆరోగ్యం బాగున్నప్పటికీ మానసిక అందోళనలు ఎక్కువ అవుతాయి. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.
- సోమేశ్వర శర్మ
+91 8466932223,
+91 9014126121