మేషం: పట్టుదలతో ముందుకు సాగుతారు. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. జీవితభాగస్వామి నుండి ధన వస్తు లాభాలు పొందుతారు. ఋణాలు తీరి ఊరట చెందుతారు. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు.
వృషభం: బంధువుల నుండి వచ్చిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. తండ్రి నుండి ఆస్తి లాభం పొందుతారు. క్రయవిక్రయాలలో లాభాల బాట పడతాయి. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు.
మిథునం: ఆస్తి వివాదాలు తీరి నూతన బప్పందాలు కుదురుతాయి. కొత్త మిత్రులు పరిచయమైన నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. గృహ ఆలోచనలు అంతగా కలిసి రావు. దైవ కార్యక్రమాలకు సమయం కేటాయిస్తారు.
కర్కాటకం: చేపట్టిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురైన సన్నిహితుల సాయంతో పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కారం. ఇతరుల విషయాలలో జోక్యం వద్దు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.
సింహం: భాగస్వామ్య వ్యాపారాలు ఒడిదుడుకులు, ఆటంకాలు ఎదురై చికాకులు పెడతాయి. జీవిత భాగస్వామి నుండి సహాయ సహకారాలు అందుతాయి. దూర ప్రయాణాలు కొంత వరకు లాభిస్తాయి. వస్తు లాభం ఉంటుంది. మిత్రుల నుండి కీలక సమాచారం తెలుసుకొంటారు.
కన్య: షేర్లు, భూముల క్రయ విక్రయాలు లాభాలు పొందుతారు. నూతన ప్రయత్నాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. వృత్తి-వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. దూరప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు. ప్రయాణాలు గొప్పగా లాభించవు.
తుల: అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేనుకోండి. పనులలో ఆటంకాలు ఎదురైన అధిగమిస్తారు. మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కారమై ఊరట చెందుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.
వృశ్చికం: అనుకోని అతిథుల నుండి కీలక సమాచారం తెలుసుకుంటారు. వాహన యోగం ఉన్నది. భూ వివాదాలు తీరి నూతన ఒప్పందాలు చేసుకుంటారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు.
ధనస్సు: ఆరోగ్యం, వాహనాల విషయాలలో జాగ్రత్త చాలా అవసరం. కుటుంబ సభ్యులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. పనులు నెమ్మదిగా సాగుతాయి. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు. వృధా ఖర్చులు అధికమవుతాయి.
మకరం: నూతన పదవీ, ఉద్యోగ అవకాశాలు పొందుతారు. బంధువులని కలిసి ఆనందంగా గడుపుతారు. షేర్లు, భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఆరోగ్య విషయంలో మెలకువ అవసరం.
కుంభం: సంఘంలో గౌరవ మర్యాదలు పొందుతారు. ఇంటాబయట మీదే పై చెయ్యిగా ఉంటుంది. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. బంధువుల నుండి వచ్చిన వార్త వలన ఆనందం కలుగుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన పెట్టుబడులకు అనుకూలం ఉంటుంది.
మీనం: ఆరోగ్య సమన్యల నుండి బయటపడతారు. ఉద్యోగాలలో స్థానమార్పులు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. దీర్ఘ ర్ధకాలిక సమస్యల నుండి బయటపడతారు. సోదరుల నుండి ఆర్ధికాభివృద్ధి ఉంటుంది.
- సోమేశ్వర శర్మ
+91 8466932223,
+91 9014126121