మేషం: అనుకోని విధంగా ధన లాభం పొందుతారు. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆహార విషయంలో జాగ్రత్తలు అవసరం. గృహ నిర్మాణ ఆలోచనలు చకచక సాగుతాయి. షేర్లు, భూముల క్రయవిక్రయాలలో లాభాలు ఆర్జిస్తారు.
వృషభం: చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. విందు, వినోదాలలో పాల్గొంటారు. దూర ప్రాంత ఆప్తుల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.
మిథునం: ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు చేతికి అందుతాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. పెట్టుబడులు చేయడానికి సరైన సమయం అని చెప్పవచ్చు.
కర్కాటకం: బంధువులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలుగుతాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. శ్రమ తప్ప ఫలితం కష్టమే. సోదరుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు.
సింహం: దీర్ధకాలిక సమన్యల నుండి బయటపడతారు. మానసిక ప్రశాంతత పొందుతారు. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. షేర్లు, భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి.
కన్య: వృత్తి-వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది.
తుల: ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ఆర్ధిక పరిస్తితి మెరుగుపడుతుంది. అనుకోని సంఘటనలు, ఆహ్వానాలు ఆశ్చర్యాని కలిగిస్తాయి. పెట్టుబడికి తగిన ప్రతి ఫలాలను అందుకుంటారు.
వృశ్చికం: వృత్తి-వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయట పడతారు. సోదరుల నుండి ఆర్ధిక పరమైన సమాచారం అందుతుంది. సంతానంకి సంబంధించి నూతన విద్యా-ఉద్యోగవకాశాలు పొందుతారు. ధన లాభం గోచరిస్తున్నది.
ధనస్సు: షేర్లు, భూముల క్రయ విక్రయాలలో లాభాలు పొందుతారు. ప్రముఖుల కలయికతో మీ భవిష్యత్తుకి సంబందించి కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సమస్యల నుండి బయట పడతారు. మానసిక ప్రశాంతత పొందుతారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు.
మకరం: ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. పూర్వపు మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. వాహనయోగం గోచరిస్తున్నది. ఆర్థిక పరంగా అనుకున్న లాభాలు ఆర్జిస్తారు. అతిథుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. అది మీ ఉన్నతికి దోహద పడుతుంది.
కుంభం: చేపట్టిన కార్యక్రమాలలో ఏర్పడిన ఆటంకాలు తొలుగి దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఋణ వత్తిడులు ఎదురైన సోదరుల సాయం అందుకొంటారు. అనుకోని అతిథుల నుండి అండదండలు అందుతాయి. ఆర్ధిక పరంగా ఒడిదుడుకులు ఎదురైనా తట్టుకొని ధైర్యంగా నిలబడతారు.
మీనం: కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. వివాదాలకు దూరంగా వుండండి. దీర్ఘకాలిక సమన్యల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. దూర ప్రాంతాల సందర్శనకు ప్రణాళిక చేస్తారు. నూతన వన్తు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.
- సోమేశ్వర శర్మ
+91 8466932223,
+91 9014126121