మేషం: కుటుంబ పరంగా, జీవిత భాగస్వామితో జాగ్రత్త వహించాల్సిన సమయంగా చెప్పవచ్చు. చిన్నపాటి మాట పట్టింపులు ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. దూరం ప్రయాణముల విషయంలో కంగారు పడకండి, ఆలోచించి నిదానంగా నిర్ణయములు తీసుకోండి. ఏదైనా వ్యవహారములు విషయంలో తొందరపడి కాకుండా నిదానంగా వ్యవహరించడం మంచిది. ఉద్యోగస్తులకు సానుకూలంగా వుంది అని చెప్పవచ్చు. అలాగే ఉద్యోగంలో మార్పు , ట్రాన్స్ఫర్ కోసం చేసే ప్రయ్నత్నాలకు ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ద వహించండి. కొంత ఆశాంతి, అలసట చోటు చేసుకునే అవకాశములు ఉన్నాయి. మానసిక ప్రశాంతత ఏర్పరచుకోండి. ఏదైనా పని, వ్యవహారములకు వెళ్లే ముందు పెద్దవారి ఆశీస్సులు తీసుకుని వెళ్లడం మంచిది.
వ్యాపారస్తులకు శత్రువర్గం నుండి అనుకూలమైన స్పందనలు, సంతోషం లభించే అవకాశములు ఉన్నాయి. ఎంతో కొంత సాధించామన్న తృప్తి లభిస్తుంది. కొత్త కాంట్రాక్ట్స్, ఏదైనా కొత్త వ్యాపారం చేయుటకు అనుకూలం అని చెప్పవచ్చు. పార్టీనేర్షిప్స్ వ్యాపారం అంతగా లాభించదు. విద్యార్థిని విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలుంటాయి. అలాగే విదేశీయానానికి ప్రయత్నములు చేసే వారికి మంచి అనుకూలమైన కాలం. నూతన ఉద్యోగములు, నూతన విద్య ప్రారంభించే వారికి ప్రణాళికలకు మంచి కాలం అని చెప్పవచ్చు . ఈవారం స్త్రీలకు అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు. వృత్తి ఉద్యోగాలలో మంచి పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి. ఆరోగ్యం పట్ల అజాగ్రత్త వుండకూడదు. నిత్యం మన్యు సూక్తం స్తోత్రం పఠించడం శ్రేయస్కరం.
వృషభం: సర్వత్రా అనుకూలమైన ఫలితములు గోచరిస్తున్నాయి.ఉద్యోగస్తులకు సానుకూలత, అధికార అభివృద్ధి ఉంటుంది. పైఅధికారులతో ప్రశంసలు అందుకునే అవకాశములు ఉన్నాయి. ఏపనైనా నిదానంగా సాగుతుంది, కానీ పని పూర్తి అయ్యింది అనే సంతృప్తి లంభిస్తుంది. జీవిత భాగస్వామి తో సఖ్యత ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు ప్రజాభిమానం, ఆర్థికాభివృద్ధి ఏర్పడే అవకాశములు గోచరిస్తున్నాయి.చిరు వ్యాపారస్తులకు సైతం ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. సాఫ్ట్ వేర్ రంగం వారికి, టెక్నీకల్ రంగం వారికి కూడా అనుకూలిస్తుంది. డబ్బు వృధా అయ్యే అవకాశాలున్నాయి, జాగర్త వహించాలి, ఇచ్చిన అప్పు తిరిగిరాకపొగ వాళ్ళు ఇవ్వలేదు అనడం మీ మనో వేదనం రవుతారు. ఏ పనైనా జీవిత భాగస్వామి తో చర్చించి నిర్ణయం తీసుకోండి. నూతన ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి ఈ వారం అనుకూలమైన ఫలితాలుంటాయి.
విద్యార్థిని విద్యార్థులకు ఆహ్లాదకరమైన సమయం అని చెప్పవచ్చు. అలాగే కొత్త కోర్సులకు మొదలు పెట్టుటకు శుభ సమయం అని చెప్పవచ్చు. కుటుంబ పరంగా ఎప్పటి నుండో వాయిదా పడుతున్న శుభకార్యములు వంటివి ఒక కొలిక్కి వచ్చే అవకాశములు గోచరిస్తున్నాయి. ప్రయత్నములు అధికం చేయడం మంచిది. వివాహ ప్రయత్నములు చేసే వారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. కోర్ట్ వ్యవహారములు ఉన్నవారికి కొంత ఊరట లభిస్తుంది. శత్రువులు కూడా మిత్రులయ్యే సమయం అని చెప్పవవచ్చు. అన్ని విధముల బాగున్నప్పటికీ ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించడం మంచిది. కొంత అశాంతి, అలసట చోటుచేసుకునే అవకాశములు ఉన్నాయి. ఈవారం స్త్రీలకు సంతోషకరమైన వార్తలు వింటారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారం బాగుంటుంది. ప్రతి చిన్న విషయాన్నీ ఆందోళన చెందకుండా సమయస్ఫూర్తితో ముందుకు సాగండి. ఫలితాలు అనుకూలిస్తాయి. నిత్యం దక్షిణామూర్తి స్తోత్రం పాటించండి మంచి ఫలితాలు ఉంటాయి.
మిథునం: ప్రతికూలమైన ఫలితాలుండే అవకాశములు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు గౌరవం వృద్ధి చెందుతుంది, అయితే ఆర్థికాభివృద్ధి అంతంత మాత్రం అన్నట్టుగా ఉంటుంది. హోదాకు ప్రాధాన్యత వచ్చిందని సంతోషంతో గడుపుతారు. పని చేసే చోట కానీ, కార్యాలయములలో కానీ, స్నేహ వర్గంలో మాట చెలామణి అయ్యే అవకాశములు ఉన్నాయి. వ్యాపారస్తులకు పలుకుబడి బాగుంటుంది. లాభాలతో పాటు పెట్టుబడులు కూడా ఎక్కువ పెట్టె అవకాశాలున్నాయి. జాగర్త వహించండి. అయితే అవసరముల మేరకు లోటు ఉండదు. అయితే శత్రువర్గం ఉన్నట్లైతే వారితో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది, ఎదో ఒకరకంగా ఇబ్బందులు ఉండే అవకాశములు ఉన్నాయి.
వ్యవహారములు పట్ల కానీ, కుటుంబంలో కార్యక్రమముల విషయంలో కానీ ఆచీతూచీ అడుగు వేయాలి. కుటుంబంలో జీవిత భాగస్వామితో అలాగే సంతానంతో చిన్న పాటి విభేధములు ఉండే అవకాశములు ఉన్నాయి. విద్యార్థిని విద్యార్థినులకు ఆందోళన తగ్గించుకుని ప్రశాంతముగా ముందుకు సాగితే అనుకూలమైన ఫలితాలుంటాయి. ఆరోగ్య పరంగా శారీరకంగా కంటే మానసిక ఆందోళనలు ఉండే అవకాశములు ఉన్నాయి. శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈవారం స్త్రీలకు కార్యాలయంలో ఒత్తిడి ఉండే అవకాశములు ఉన్నాయి. మీరు చేసే చిన్న చిన్న పనుల వల్ల ఇబ్బందులు ఏర్పడవచ్చు జాగర్త వహించండి. కాబట్టి వృత్తి, ఉద్యోగములు విషయాల యందు జాగ్రత్త వహించాలి. నిత్యం గణపతి గకారక స్తోత్రం పాటించండి మంచి ఫలితాలు ఉంటాయి.
కర్కాటకం: సర్వత్రా మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా ఎవరైతే మిమ్మల్ని అంత్యంత అభిమానిస్తారో వారి నుండే అవమానములు ఎదుర్కొనవచు. నమ్మకాన్ని పోగొట్టుకునే విధముగా మాట్లాడడం మంచిది కాదు. ముందు మిమ్మల్ని అన్నవారు తర్వాత అయ్యో ఎందుకు అన్నామా అనుకునే సమయం వస్తుంది. ఆందోళన చెందకండి. కేవలం మిమ్మల్ని అర్ధం చేసుకోవడంలో పొరపాట్లు వస్తాయి. కాబట్టి మీ తెలివి తేటలు ఒక్కటే మిమ్మల్ని ఇబ్బందుల నుండి బయట పడేస్తాయి. ఉద్యోగస్తులకు సానుకూలంగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఆర్ధిక లావాదేవీలు ఒత్తిడి పెరిగే అవకాశములు ఉన్నాయి.
లోన్లు, రుణముల విషయంలో జాగ్రత్త వహించండి. ఆర్ధిక పరంగా బంధువర్గంలో ఇబ్బందులు, మాట పట్టింపులు ఉన్నప్పటికీ కుటుంబ పరంగా జీవిత భాగస్వామి అందండలు ఉంటాయి.వ్యాపారస్తులకు ఆర్ధికంగా అభివృద్ధి ఉంటుంది. సన్మానాలలో పాల్గొంటారు, మిత్రుల నుండి సలహాలు, సంప్రదింపులు అనుకూలిస్తాయి. విద్యార్థిని విద్యార్థులకు కష్టపడిన దానికి ప్రతిఫలం దక్కుతుంది. ఆరోగ్య పరంగా జాగర్తలు తీసుకోవాలి. ఈవారం స్త్రీలకు ఏ విషయమైనా జీవిత భాగస్వామి తో చర్చించి నిర్ణయాలు తీసుకోండి. ఎంత పెద్ద పనయినా మీ ఆలోచన శక్తి తో ముందుకు సాగుతారు. ప్రతి నిత్యం ఆదిత్య స్తోత్రం పఠించండి చెప్పదగిన సూచన.
సింహం: అనుకూలమైన ఫలితములుండె అవకాశములు ఉన్నాయి. ఏదైనా కొత్త పనులు ప్రారంభించుటకు, వ్యవహారములుకు మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి ఈవారం అనుకూలం అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు అధికారులతో ప్రశంసలు, ఉద్యోగంలో ఆర్థికాభివృద్ధి ఏర్పుడుతుంది. ఎప్పటి నుండో ప్రమోషన్లు, బదిలీలు ప్రయత్నించే వారికి అనుకూల ఫలితాలుండే అవకాశములున్నాయి. కుటుంబ పరంగా బాధ్యతలు, ఖర్చులు పెరుగుతాయి. నూతన వస్తువులు కానీ, వాహనములు కానీ కొనుగోలు చేసే అవకాశములు గోచరిస్తున్నాయి.
విద్యార్థిని విద్యార్థులకు మంచి అభివృద్ధి ఏర్పడుతుంది. విద్యా విషయంలో ఆచరించే విధానం యందు మంచి ఆలోచనలు చేస్తారు. అది మీ పురోగతికి కారణమవుతుంది. వ్యాపారస్తులకు లాభములతో పాటు మంచి పేరుప్రతిష్టలు సంపాదిస్తారు. వివాహ ప్రయత్నములు చేసే వారికి మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. స్నేహితులతో సత్సంబంధములు ఏర్పడతాయి. శత్రువర్గం వలన భయం, విరోధం ఉండే అవకాశములు ఉన్నాయి. ఎంత డబ్బు, పేరు సంపాదించినప్పటికి బంధువర్గంలో చిన్నపాటి మనస్పర్థలు ఏర్పడే అవకాశములు ఉన్నాయి. ఎదో ఒకరకంగా ఖర్చు ఎక్కువ అవుతుంది. కొంత జాగర్త వహించాలి. ఈవారం స్త్రీలకు వ్యహారాలు పట్ల నిర్ణయాలు అలోచించి తీసుకోవాలి. కష్టపడినా దానికి ఫలితం తక్కువగా ఉంటుంది. మీ కింద వారితో ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఏ పని చేసిన నిదానంగా సాగుతుంది. ఉద్రేకాలకు పోయి తగాదాలకు వెళ్లడం మంచిది కాదు. ప్రతి నిత్యం దుర్గా అమ్మవారి స్తోత్రం పఠించండి చెప్పదగిన సూచన.
కన్య: అన్ని పనులు అయిపోయినట్టు కనబడతాయి, కానీ ఆఖరు సమయానికి వాయిదాలు పడే అవకాశములు ఉన్నాయి. ఉద్యోగస్తులు పైఅధికారులతో మాట్లాడేటప్పుడు, విధులు నిర్వహించడంలో కొంత అప్రమత్తంగా ఉండడం మంచిది. ఎందుకంటే మీ కోపంలోనో, ఫ్రస్ట్రేషన్ లోనో ఏదైనా చిక్కులు, తగాదాలు వచ్చినట్లైతే మీ భవిష్యత్తుపై కొంత అలజడి ఉండే అవకాశములు ఉన్నాయి. లేనిపోని నిందలు వచ్చే అవకాశములు ఉన్నాయి. కాబట్టి మాట విషయంలో ప్రశాంతముగా వ్యవహరించడమే మంచిది. బాగా నమ్మిన వారి వలన మోసపోయే అవకాశములు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు, సాఫ్ట్ వేర్ రంగం బిజినెస్ వారికి కొంత ఆర్ధిక పరమైన ఇబ్బందులు, ఖర్చులు అధికం అయ్యే అవకాశములు ఉన్నాయి. అయితే మీకు వచ్చే కోపాన్ని పక్కకు పెట్టి పట్టుదలతో, ఓర్పుతో ముందుకు సాగితే మంచి ఫలితాలను అందుకుంటారు.
విద్యార్థిని విద్యార్థులకు పరీక్షా సమయం అని చెప్పవచ్చు. చదువుతుంటే అన్ని వచ్చినట్టు వచ్చి పరీక్షా సమయంలో గుర్తు రాకపోవడము జరిగే అవకాశములు గోచరిస్తున్నాయి. కాబట్టి చదువుతో పాటు ప్రాక్టీకల్స్ కి కూడా ప్రాధాన్యత ఇవ్వండి. మంచి ఫలితములను అందుకోగలుతారు. ఆరోగ్య పరంగా శారీరక ఆరోగ్యం బాగుంటుంది. లేనిపోని భయాలు, టెన్సన్స్ వంటివి ఉంటాయి. మానసిక ప్రశాంతత ఏర్పరచుకోండి. ఈవారం స్త్రీలకు ఉద్యోగం లో పురోగతి బాగుంటుంది. ఏ పని చేసిన నిదానంగా ఆలోచించి చేయడం ద్వారా మంచి ఫలితాలుంటాయి. ఇంట బయట అన్ని విధాలుగా అనుకూలం. వృధా ప్రయాణాలు తగ్గించాలి. నిత్యం ఖడ్గమాలా స్తోత్రం పఠించండి చెప్పదగిన సూచన.
తుల: కుటుంబ పరంగా సుఖ శాంతులు లభిస్తాయి. ఆర్ధిక పరంగా కూడా కుటుంబంలో వారి నుండి కానీ, స్నేహితుల నుండి కానీ సహాయ సహకారములు అందుతాయి. అయితే ఉద్యోగ పరంగా కార్యాలయాలలో తోటి ఉద్యోగస్తుల నుండి కానీ, ఫై అధికారుల నుండి కానీ కొంత ప్రతికూలమైన ఫలితములు ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. శత్రువులకు అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. అది మీ ఆర్థికస్థితికే కాకుండా పేరుని చెడగొట్టే విధంగా కూడా ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి ఆఫీస్ వ్యవహారములు పట్ల జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపారస్తులకు కొంత ఆస్తి నష్టం జరిగే అవకాశములు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. అయితే భాగస్వామ్య వ్యాపారస్తులకు ఆర్ధికంగా మెరుగు ఉంటుంది. విలాస వంతమైన వస్తువుల వ్యాపారస్తులకు మంచి కాలం అని చెప్పవచ్చు.
శుభ కార్యక్రమములు, వివాహ ప్రయత్నములు చేసేటప్పుడు చిన్న పాటి ఆటంకములు ఏర్పడే అవకాశములు ఉన్నాయి. కుటుంబంలో వారి సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిదని సూచన. ఆరోగ్య పరంగా కొంత కాలం వుండి ఉన్న అనారోగ్య సమస్యలు ఇప్పుడు తిరిగి బయట పెట్టె అవకాశములు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. విద్యార్థిని విద్యార్థులకు చంచలత్వం వదిలిపెట్టి పట్టుదలతో ముందుకు సాగడం మంచిది. అనుకూలమైన ఫలితముంయి. ఈవారం స్త్రీలకు అద్భుతంగా ఉంది అని చెప్పవచ్చు. సంతోషకరమైన వార్తలు వింటారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారం బాగుంటుంది. జీవిత భాగస్వామి తో చిన్న పాటి విభేదాలు వచ్చే అవకాశాలు వున్నాయి. ప్రతి విషయాన్నీ సూక్షమంగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మేలు జరుగుతుంది.
వృశ్చికం: అత్యంత జాగ్రత్త వహించాల్సిన సమయం అని చెప్పవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి మీరు అనుకున్నంత జీతం రాకపోవచ్చు, అయినా చేరడం మంచిది. మన చదువుకి, టాలెంట్ కి తగిన ఉద్యోగం కాదు అనే భావన ఉంటుంది. అయితే ఇప్పుడు అశ్రద్ధ చేస్తే ఇంకా ఇబ్బందులు వచ్చే అవకాశములు ఉన్నాయి. ఆందోళన చెందకండి. విద్యార్థిని విద్యార్థులకు అనుకున్నంత ఫలితములు ఉండకపోవచ్చు. విలాసములకు, వ్యసనముల విషయంలో యువత జాగ్రత్త వహించడం మంచిది. వ్యాపారస్తులకు అనేక విధాలుగా ఖర్చులు కనిపిస్తున్నాయి. లాభాలు సామాన్యంగా ఉంటాయి. మీరు తీసుకునే నిర్ణయాల వాళ్ళ కొంత ఇబ్బంది ఏర్పడుతుంది. అయితే ఏది ఏమైనప్పటికీ మీకు వుండే మానసిక ధైర్యం వలన అన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు.
శత్రువర్గం నుండి విమర్శలు ఉండే అవకాశములు ఉన్నాయి. స్నేహవర్గం నుండి సానుకూలత ఉంటుంది. కుటుంబంలో వారితో కొంత సహనంతో వ్యవహరించడం మంచిది. తగాదాలకు, వివాదాలకు దూరంగా ఉండండి. విమర్శలను పట్టించుకోకుండా ముందుకు సాగండి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. కొంత అశాంతి, అలసట వంటివి ఉండవచ్చు. అర్ధాష్టమ శని నడుస్తున్నది వలన , 8 శని వారలు శని కి తైలాభిషేకం చేయడం మంచిది అని చెప్పదగిన సూచన. ఈవారం స్త్రీలకు కుటుంబంలో భార్య భర్తల మధ్య బెదప్రాయం వచ్చే అవకాశాలు వున్నాయి. జాగర్త వహించిండి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో ఒత్తిడి ఉండే అవకాశములు ఉన్నాయి. వ్యాపారస్తులకు చిన్న పాటి ఇబ్బందులు ఉంటాయి. ఏర్పడవచ్చు. అయితే మీ మేధాశక్తితో సమస్యలన్నీ పరిష్కరిస్తారు. ఆరోగ్య పరమైన జాగర్తలు తీసుకోవాలి. నిత్యం గణపతి గకారక స్తోత్రం పాటించండి మంచి ఫలితాలు ఉంటాయి.
ధనస్సు: సర్వత్రా అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు పైఅధికారులతో సానుకూలత ఏర్పడుతుంది. ప్రమోషన్స్, బదిలీలు వంటి వాటికి చేసే ప్రయత్నములు అనుకూలిస్తాయి. ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. సాఫ్ట్ వేర్ రంగం, టెక్నీకల్ రంగం, రియల్ ఎస్టేట్ అలాగే అన్ని రంగముల వారికి అనుకూలమైన ఫలితములుంటాయి. వ్యాపారాభివృద్ధి కనబడుతుంది. వివాహ ప్రయత్నములు చేసే వారికి అనుకూలమైన ఫలితాలుంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి కూడా అనుకూలమైన అవకాశములు ఉంటాయి. వ్యవహారములు, ఏదైనా కోర్ట్ వ్యవహారములు నడిచే వారికి కూడా అనుకూల ఫలితాలుండే అవకాశములు ఉన్నాయి. సంతాన పరంగా కూడా అభివృద్ధి ఉంటుంది. కుటుంబ పరంగా సంతోషం లభిస్తుంది. ఎదో సాధించామన్న తృప్తి లభిస్తుంది. ఇష్టవస్తు ప్రాప్తి ఉండే అవకాశములు ఉన్నాయి.
విద్యార్థిని విద్యార్థులకు మంచి అనుకూలమైన ఫలితములుండె సమయం అని చెప్పవచ్చు. కొత్త కోర్సులు , విద్యావిధానంలో మార్పులకు మంచి సమయం. స్థిరాస్తి వృద్ధి చేసుకునే ప్రయత్నములు ఫలిస్తాయిమానసిక సంతృప్తి లభిస్తుంది. అయితే రాహువు మార్పు వలన అర్ధాష్టమ రాహువు ప్రారంభం అయినందువలన ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించడం మంచిది. గతంలో నిర్లక్ష్యం చేసిన అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టె అవకాశములు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. ఈవారం స్త్రీలకు బాగుంది అని చెప్పవచ్చు, ఉద్యోగ వ్యాపార విషయాలలో సానుకలత ఉంటుంది. ధన లాభం వస్తు లాభం వుంది. నిత్యం ఖడ్గమాలా స్తోత్రం పఠించండి చెప్పదగిన సూచన.
మకరం: క్రమక్రమాభివృద్ది జరుగుచున్నట్లుగా గోచరిస్తుంది. గతంలో పడిన కష్టమునకు ఫలితం లభిస్తుంది. మనోవాంఛ సిద్ధిస్తుంది. ఉద్యోగస్తులకు ఆర్థికాభివృద్ధి ఉంటుంది. తోటి ఉద్యోగస్తుల నుండి గౌరవాభిమానములు పొందుతారు. వ్యాపారస్తులకు అనుకున్న ఫలితములు ఉంటాయి. కార్యక్రమములు, వ్యవహారముల విషయాలు ఎట్టకేలకు ఒక కొలిక్కి వస్తాయి. అయితే శత్రువర్గం నుండి కూడా మన్ననలు పొందుతారు. ఎదుటి వారి నుండి కొంత ఈర్ష్యా అసూయలకు గురి అవుతారు. ఏది ఏమైనా ఆర్థికాభివృద్ధి ఉంటుంది. కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మిత్రులతో సాన్నిహిత్యం బాగుంటుంది. ఏదైనా సమస్యలు, టెన్షన్లు స్నేహితులతో పంచుకోవడానికి ఇష్టపడతారు. ఆలా పంచుకోవడంలో భవిషత్తులో ఇబ్బంది ఏర్పడవచ్చు. శ్రమ అధికం అవుతుంది. వ్యవహారములు విషయంలో కొంత జాప్యం ఏర్పడుతుంది.
కుటుంబ పరంగా సుఖ సంతోషములు ఉంటాయి. వారం ద్వితియార్థంలో అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆరోగ్య పరంగా స్వల్ప ఇబ్బందులు ఏర్పడినప్పటికీ మానసిక ధైర్యంతో ముందుకు సాగుతారు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలను పట్టించుకోరు. శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోవడం చెప్పదగ్గ సూచన. విద్యార్థిని విద్యార్థులకు సామాన్యంగా ఉందని చెప్పవచ్చు. విద్య పట్ల ఆసక్తి చూపాలి. కష్టపడి, పట్టుదలతో చదివితే అనుకూల ఫలితాలుంటాయి. ఈవారం స్త్రీలకు బాగుంది అని చెప్పవచ్చు, ఏ పని చేసిన నిదానంగా ఆలోచించి చేయడం ద్వారా మంచి ఫలితాలుంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో పురోగతి బాగుంటుంది. సంగంలో మీకంటూ ఒక గుర్తింపు లభిస్తుంది.
కుంభం: జాగ్రత్త వహించాల్సిన సమయం గా చెప్పవచ్చు. ప్రతికూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో పెద్దవారితో మాట పట్టింపులు, తగాదాలు వంటివి అంత మంచిది కాదు. మీరు సర్వ సాధారణముగా అనే మాటలు కూడా వారు సీరియస్ గా తీసుకుని మీ మీద అపవాదు వేసే అవకాశములు ఉన్నాయి. ఎదుటివారుని కష్టపెట్టే మాటలు మాట్లాకపోవడం అనేది చెప్పదగ్గ సూచన. కోపాన్ని నియంత్రించుకుని ప్రశాంతముగా వ్యవహరించండి. అనుకున్న పనులు నిర్లక్ష్యం చేయకుండా పూర్తిచేయండి. వారం ప్రమార్థంలో అనుకూలమైన ఫలితములు గోచరిస్తున్నాయి. ప్రయాణముల కారణంగా డబ్బులు ఖర్చు అయ్యే అవకాశములు ఉన్నాయి. ఆలోచించి ప్రయాణములు చేయండి, అయితే ప్రయాణములు తప్పనిసరి అయితేనే ప్రయాణం చేయడం మంచిది.
ఉద్యోగస్తులకు కార్యాలయాలలో చిన్నపాటి అవమానములు ఎదుర్కోవలసిరావచ్చు జాగ్రత్తగా వ్యవహరించడం చెప్పదగ్గ సూచన. ఆరోగ్య విషయంలో మీ ఆరోగ్యంతో పాటు జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ద వహించండి. ఎదో తెలియని ఆందోళనలు, మనోవిచారం ఏర్పడతాయి. మీ యొక్క మానసిక ధైర్యమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. విద్యార్థులు కృషితో, పట్టుదలతో ముందుకు సాగడం మంచిది. మంచి ఫలితాలను సాధించగలరు. ఏది ఏమైనప్పటికీ మాటల విషయంలో జాగ్రత్త ఆవహించడం చెప్పదగ్గ సూచన. ఈవారం స్త్రీలకు వ్యాపారంలో ఆటు-పోట్లు తప్పవు, డబ్బు ఎంత సంపాదించినా మనశాంతి ఉండదు. ఆరోగ్య పరంగా జాగర్తలు తీసుకోవాలి. నమ్మిన వారు మోసం చేశారనే బాధ మీ మనోవేదనకు గురి చేస్తుంది. కానీ ఒకప్పుడు మనం కూడా ఇలా చేశామే అన్న దానికి ఇలా జరిగింది అని అనుకుంటారు. పచ్చాత్తాపంకు మించి ప్రాయశ్చిత్తం లేదని గ్రహిస్తారు. వృధా ఖర్చులు కనిపిస్తున్నాయి జాగర్త వహించండి.
మీనం: మిశ్రమ ఫలితాలు ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడిలు ఉండే అవకాశములు ఉన్నాయి. మనం చేయని తప్పుకు మనం భాధ పడాల్సి వస్తోంది అనే భాధ పడే అవకాశములు ఉన్నాయి. వ్యాపారస్తులకు వ్యవహారముల పట్ల చిక్కులు ఉండే అవకాశములు ఉన్నాయి. అయితే మీరు చెప్పుడు మాటలు వినడం, వ్యవహారములు పట్ల అశ్రద్ధ చేయడం కారణమని తెలుసుకుంటారు. మీరు ఇప్పటికైనా ఎవరి మాట వినకుండా మీ సొంత ఆలోచనలతో ముందుకు సాగడం, అలాగే సొంత ఆలోచనలతో సమాధానం చెప్పడం మంచిది. గతంలో ఎక్కడైనా నిలిచిపోయిన ధనం తిరిగి చేతికి అందే అవకాశాలున్నాయి. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం పెరగడంతో ఆర్ధిక పరిస్థితి మెరుగుపడుతుంది.
కేతువు సప్తమాధిపతి స్తానంలో కి మారడం వల్ల కుటుంబంలో కానీ, భాగస్వామి తో కానీ విరోధములు చిన్నపాటి మాట పట్టింపులు ఉండే అవకాశములు ఉన్నాయి జాగర్త వహించాలి. మీ మానసిక ధైర్యం, మీ సొంత ఆలోచనలతో ముందుకు సాగండి. విజయం కలుగుతుంది. ఒక విధంగా మీ ఆలోచనలకు, బుద్ది బలానికి మంచి పరీక్షా సమయం అని చెప్పవచ్చు. శ్రమ అధికంగా ఉంటుంది, ఆర్ధిక పరంగా అనుకున్న సమయానికి డబ్బు చేతికి రావడం వలన అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. ఆరోగ్యం పట్ల శ్రద్ద తీసుకోండి. అలసట, ఆందోళన వంటివి నివారించేందుకు శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈవారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మానసిక ఆందోళనలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. వ్యాపారస్తులకు చిన్న పాటి ఇబ్బందులు ఉంటాయి. వ్యాపారంలో సన్నిహితులను కూడా ఎక్కువగా నమ్మడం మంచిది జాగర్త వహించండి. ఎవరు మంచి చెప్తున్నారో ఎవరు చెడు చెప్తున్నారో అనే వాస్తవ విషయాలను గ్రహించి ముందుకు వెళ్ళండి. శుభఫలితాలను అందుకుంటారు.
- సోమేశ్వర శర్మ
+91 8466932223,
+91 9014126121