మేషం: సంతానం పరంగా ఉన్నతి సాదిస్తారు. వారు తలపెట్టిన నూతన ప్రయత్నాలు చకచక ముందుకు సాగుతాయి. మిత్రులతొ మొండి వాదనలకు పట్టుదలకు పోవద్దు, అదే మీవ్యక్తిత్వాని దెబ్బ తీస్తుంది. దూరప్రయాణాలు లాభిస్తాయి. వాహనయోగంఉన్నది.
వృషభం: వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. వృత్తి-వ్యాపారాలలో అభివృద్ధి కానవస్తుంది. మిత్రుల నుండి విలువైన కీలక సమాచారం అందుతుంది. ఆరోగ్య పరంగా స్వల్ప జాగ్రత్తలు అవసరం.
మిథునం: కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకొంటారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఋణాలు కొంత వరకు తీరుస్తారు. ఆరోగ్య సమన్యలు ఎదురై చికాకులు పెడతాయి. శ్రద్ధ వహించండి. పనులు నిదానంగా పూర్తవుతాయి.
కర్కాటకం: పిల్లల భవిష్యత్తు కోసం చేయని యాగి ఉండదు. నూతన మిత్రులు పరిచయమై కొత్త పనులకు శ్రీకారం చుడతారు. కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. దూర ప్రాంతాల నుండి శుభ వార్తలు వింటారు.
సింహం: బంధువుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. గృహనిర్మాణ యత్నాలు కలిసి వస్తాయి. మిత్రుల నుండి విలువైన కాంట్రాక్టులకు సంబందించిన సమాచారం తెలుసుకుంటారు. పెట్టుబడులకు తగిన లాభాలు లేవని నిరుత్సాహానికి లోనవుతారు.
కన్య: వృత్తి-వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలిగి వ్యాపార వృద్ది చెందుతుంది. మానసిక ప్రశాంతత పొందుతారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. సంతానానికి సంబందించిన విద్యా యోగ్యతలు, నడవడికలు తెలుసుకుని దారిన పెట్టె ప్రయత్నాలు చేస్తారు.
తుల: ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం. వృత్తి-వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. అనుకోని విధంగా ఒకరి నుండి ముఖ్యమైన విషయాలు సేకరిస్తారు.
వృశ్చికం: ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. వాహనయోగం గోచరిస్తున్నది. చిన్ననాటి మిత్రుల కలయిక మీలోని ఉత్తేజాన్ని పెంచుతుంది. క్రయవిక్రయాలలో లాభాలు అంతంత మాత్రంగా ఉంటాయి.
ధనస్సు: కుటుంబ సభ్యుల నుండి సహాయసహకారాలు అందుతాయి. ప్రయాణాలు లాభిస్తాయి. పెట్టుబడులకు తగిన లాభాలు ఉండవు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. దూరప్రాంతాల నుండి చెదు వార్తని వింటారు.
మకరం: ఋణ బాధలు తొలుగుతాయి. పూర్వపు మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకొంటారు. క్రయ విక్రయాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబంలో చిన్నపాటి అలకలు ఉంటాయి.
కుంభం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వృత్తి-వ్యాపారాలు అభివృద్ధి కోసం సన్నిహితులతో చర్చిస్తారు. పనులలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. పిల్లలతో, కుటుంబసభ్యులతో సమయం గడుపుతారు. ఆకస్మిక ప్రయాణాలు అంత మంచిది కాదు.
మీనం: చేపట్టిన వ్యవహారాలలో కొంత వరకు విజయం సాధిస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి ప్రణాళికలు రూపొందించుకుంటారు. విలువైన వస్తు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అవసరానికి ధనం చేతికి అందుతుంది.
- సోమేశ్వర శర్మ
+91 8466932223,
+91 9014126121