మేషం: ధనమే అన్నింటికీ మూలమని నిరూపించే విధంగా సంఘటనలు మీ అనుభవంలోకి వస్తాయి. చిరపరచితుల ద్వారా ఉపయుక్తమైన సమాచారాన్ని తెలుసుకుంటారు.
వృషభం: లౌక్యంగా వ్యవహరించి ప్రతిపనిలోనూ ఎంతోకొంత వృద్ధిని సాధించగలుగుతారు. మీ వ్యక్తిగత రహస్యాలను బయటకు వెళ్ళడి చేసే వ్యక్తుల వషయంలో తగు జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది.
మిథునం: కోర్టుకు సంబంధించిన కేసులను నూతన న్యాయవాదికి బదిలీ చేస్తారు. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. స్వయంకృతాపరాధాలు చేయకుండా జాగ్రత్తలు పాటించండి.
కర్కాటకం: సంతానం కీర్తి ప్రతిష్టలను పెంపొందించే విధంగా నడచుకోవడం మీకెంతో సంతృప్తిని నిస్తుంది. ప్రత్యేకమైన కారణాలేవీ లేకపోయినా వేళకు ఆహారం తీనుకోరు. అదే మీకు పెద్ద ఇబ్బంది కలుగ చేస్తుంది. నూతన వస్త్రాలు కొనుగోలు చేస్తారు.
సింహం: నిత్యావసర వన్తువుల కొనుగోళ్లు చేస్తారు. జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించండి. పెద్దల సహాయ సహకారాలను అందుకుంటారు. దైవ చింతన కలిగి ఉంటారు.
కన్య: ఎలక్ష్రానిక్ మీడియా రంగంలోని ఉద్యోగస్తులకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. నూతన వ్యాపారాలకు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. స్వల్ప ధనలాభ నూచన.
తుల: ఉద్యోగస్తులు కార్యాలయంలో తమ నూతన బాధ్యతలను సక్రమంగా నిర్వహించ గలుగుతారు. లౌక్యంగా వ్యవహరించి ప్రతిపనిలోనూ ఎంతోకొంత వృద్ధిని సాధించ గలుగుతారు.
వృశ్చికం: చెల్లించ వలసిన చెల్లింపులకు గాను వత్తిడి అధికంగా ఉంటుంది.ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది. ఆలోచించి ముఖ్యమైన విషయాలలో ఆచితూచి నిర్ణయాలను తీసుకుంటారు.
ధనస్సు: విద్యా, సాంస్కృతిక, వాణిజ్య రంగాల వారికి ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగస్తులు విధి నిర్వహణను సక్రమంగా నిర్వహించగలుగుతారు. వ్యాపారంలో రొటేషన్స్ బాగున్నప్పటికీ లాభాలు అందని ద్రాక్షలా ఉంటుంది.
మకరం: ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మనోధైర్యం కలిగి ఉంటారు. క్రీడలలో విందు, వినోదాలు ప్రాధాన్యతను సంతరించుకుంటాయి. మీకు రావాల్సిన ధనానికి గట్టి హామీ లభిస్తుంది.
కుంభం: నిర్మాణాత్మకమైన నిర్ణయాలను అమలు చేయడానికి తగిన వ్యక్తులు కలిసి వస్తారు. మీకు రావలసిన ధనానికి గాను గట్టి మధ్యవర్తిత్వం లభిస్తుంది. గ్రూప్ రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది.
మీనం: సుధీర్ఘంగా మొండి పడిన వ్యవహారాలు ఒక దారికి వస్తాయి. కుటుంబ బాధ్యతలకు ప్రాధాన్యతనిస్తారు. బంధువులు లేక ఆత్మీయులతో భేదాభిప్రాయాలు చోటు చేసుకుంటాయి. దైవ చింతనే దారి చూపుతుంది.
- సోమేశ్వర శర్మ
+91 8466932223,
+91 9014126121