వార ఫలాలు 05-11-2023 నుండి 11-11-2023 వరకు

మేషం:  అన్ని విధముల కొంత జాగ్రత్త వహించాల్సిన సమయం అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు సామాన్యంగా గోచరిస్తోంది. పని చేసే చోట, కార్యాలయాలలో సానుకూలంగా ఉన్నప్పటికీ ఋణముల విషయంలో అప్పులు ఇచ్చిన వారికైనా, తీసుకున్న వారికైనా ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఒకవేళ ఋణం ఇచినట్లైతే మీకు తిరిగి ఇవ్వడంలో అడ్డంకులు, ఒకవేళ ఋణం తీసుకున్నట్లైతే అప్పు ఇచ్చిన వారినుండి ఒత్తిడి ఉండే అవకాశములు ఉన్నాయి. వ్యవహారములు పట్ల జాగ్రత్త వహించడం మంచిది. కుటుంబంలో, జీవితభాగస్వామి తో చిన్నపాటి తగాదాలు ఉండే అవకాశములు ఉన్నాయి.మాట్లాడేటప్పుడు ఆవేశ పూరితంగా కాకుండా ఆలోచించి నిదానంగా మాట్లాడడం మంచిది. ప్రయాణములు వృధాగా అయ్యే అవకాశములు ఉన్నాయి. ఆలోచించి ప్రయాణం చేయడం మంచిది. ఖర్చులు చేసేటప్పుడు కూడా ఆలోచించి ఖర్చు చేయడం మంచిది. ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొనవలసి ఉంటుంది. 

వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితాలుంటాయి. మందకొడిగా లాభము కాదు అలాగని నష్టము కాదు అన్నట్టుగా సాగుతాయి. మీ బాధను, కష్టమును స్నేహితులే కదా అని ఎవరికీ పడితే వారికి చెప్పడం అంత మంచిది కాదు, స్నేహితులే శత్రువులు అయ్యే అవకాశములు గోచరిస్తున్నాయి. విద్యార్థిని విద్యార్థులకు కష్టపడి చదవవలసిన సమయం అని చెప్పవచ్చు. దూరం దేశం వెళ్లి ఉద్యోగం కొరకు కానీ, చదువుకోవాలనుకునే వారికి కానీ ఈ వారం ప్రయత్నములు అనుకూలిస్తాయి. ఆరోగ్య పరంగా శ్రద్ద తీసుకోండి. ఇతరుల వ్యవహారములలో సలహాలు కానీ, హామీలు కానీ మంచిది కాదు. ముత్యపు గణపతి లాకెట్ ధరించడం చెప్పదగిన సూచన. ఈవారం స్త్రీలకు బాగుంది అని చెప్పవచ్చు, ఏ పనైనా అలోచించి నిర్ణయాలు తీసుకోండి. మేలు జరుగుతుంది. వ్యాపారాభివృద్ధి, సంతానాభివృద్ధి వుంది. నిత్యం ఖడ్గమాలా స్తోత్రం పఠించడం శ్రేయస్కరం. 


వృషభం: ఇనుము, స్టీల్, ఎలక్ట్రానిక్స్ వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఆర్థికాభివృద్ధి ఉంటుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకు, సాఫ్ట్ వేర్ రంగం వారికీ అభివృద్ధి ఉంటుంది. ప్రమోషన్లు, బదిలీలు వంటి వాటి కోసం చేసే ప్రయత్నములు మంచి ఫలితాన్ని ఇస్తాయి. విదేశీయానమునకు చేసే ప్రయత్నములు అనుకూలిస్తాయి. వివాహ ప్రయత్నములు చేసే వారికి, గృహములో శుభకార్యములు చేయదలచిన వారి ప్రయత్నములు ఫలిస్తాయి. అనుకున్న పనిని పట్టుదలతో నెరవేరుస్తారు. వ్యాపారంలో, వ్యవహారంలో మంచి అనుకూలతని సాధించుకుంటారు. ఇంటాబయట కూడా మంచి పేరు సంపాదించుకుంటారు. 

శత్రువర్గం నుండి కూడా ప్రశంసలు అందుకునే  అవకాశములు ఉన్నాయి. పెద్దవారిపై గౌరవాభిమానములు చూపుతారు, తద్వారా మీ మాట మీ కంటే పెద్దవాళ్ళు కూడా విలువ ఇచ్చేటట్టుగా మసలుతారు. అయితే ఇన్నీ చేసిన కొంత ఆరోగ్యం పరంగా కాని, కుటుంబ పరంగా కానీ కొంత ఇబ్బంది పడే అవకాశములు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. ఏదైనా నూతన వస్తువులు కొనాలనుకునేవారికి ఈ వరం అనుకూలం. మానసిక సంతృప్తి ఏర్పడుతుంది. విద్యార్థిని విద్యార్థులకు మంచి అనుకూలమైన ఫలితాలుంటాయి. విదేవశాలకు వెళ్లి చదువుకోవాలి అనుకునే వారికి ప్రయత్నములు అనుకూలిస్తాయి. విద్య పట్ల శ్రద్ద, ఆసక్తి పెరుగుతుంది. స్నేహవర్గం అభివృద్ధి అవుతుంది. 


మిథునం: ఉద్యోగస్తులకు అధికారం, ఆర్థికాభివృద్ధి అయ్యే అవకాశములు గోచరిస్తున్నాయి. వ్యవసాయ దారులకు, చేతివృత్తుల వారికి అనుకూలమైన ఫలితములు ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తిచేయ గల్గుతారు. ఉద్యోగాభివృద్ది ఉన్నప్పటికీ పని ఒత్తిడి, టెన్సన్స్ ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు అనవసరమైన శ్రమ ఎక్కువ అవుతుంది. శత్రువుల నుండి ఇబ్బందులు వచ్చే అవకాశములు ఉన్నాయి. మీ మీద లేనిపోని దుష్ప్రచారములు జరిగే అవకాశములు ఉన్నాయి, ఏదైనా వ్యవహారములు విషయంలో, రహస్యములు, మీ సొంత విషయములు ఎవరికీ చెప్పడం మంచిది కాదు. 

కుటుంబ పరంగా సంతానంతో అభిప్రాయభేదములు వచ్చే అవకాశములు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో కూర్చుని ప్రశాంతముగా ఆలోచించి నిర్ణయములు తీసుకోండి. తగాదాలు పెట్టుకోవడం, ఉద్రేకంగా స్పందించడం మంచిది కాదు . విద్యార్థిని విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలుంటాయి. స్నేహ వర్గం అనుకూలత ఏర్పడుతుంది, వినోద యాత్రల చేసే అవకాశం ఏర్పడవచ్చు. బంధువులతో మనస్పర్థలు కానీ, అశాంతి ఫలితములు కానీ ఉండే అవకాశములు ఉన్నాయి. ఆరోగ్య పరంగా శ్రద్ద వహించండి, అలాగే మీ యొక్క కుటుంబంలో వారి ఆరోగ్యం గురించి కూడా శ్రద్ద తీసుకోండి.


కర్కాటకం: అన్ని విధముల మిశ్రమ ఫలితములు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాలలో, స్నేహవర్గంలో కూడా సానుకూలత ఉంటుంది. మీ మాట చెలామణి అవుతుంది, దానివలన మీలోని ఉత్సాహం రెట్టింపు అయ్యి పనులు మరింత శ్రద్ధతో పూర్తి చేస్తారు. ఆర్ధిక పరమైన చిన్న చిన్న ఇబ్బందుల నుండి బయటపడతారు. బయట ఇంత మంచి పేరుప్రతిష్టలు సంపాదిస్తున్నాం కదా !కుటుంబంలో వారికి విలువ తెలియడంలేదు అనే మానసిక అశాంతి వెంటాడుతుంది. అయితే గొడవలు పెట్టుకుని ఎం ప్రయోజనం అనుకుని  వారికి కావాల్సిన విధంగా మాట్లాడి వారిని, వారు అనుకున్న పనులు నెరవేర్చి సంతోష పెట్టడానికే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు.

వ్యాపారస్తులకు శత్రువర్గంతో ఎదుర్కొనే సమస్యలను కూడా అధిగమిస్తారు. మీ  యొక్క అభివృద్ధి బాగుంటుంది. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆర్థికాభివృద్ధి కంటే పబ్లిసిటీ కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. లోన్లు, అప్పుల విషయంలో కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ వాటిని ధైర్యంగా ఎదుర్కొంటారు. ఎవరి చేత మాట పడకూడదు అనే విధంగా ఆలోచనలు ఎక్కువ అవుతాయి. ఆరోగ్య విషయంలో టెన్సన్స్, తలనొప్పి వంటి ఉండవచ్చు. గతంలో పెద్ద పెద్ద ఇబ్బందులు ఉన్నవారికి కొంత తగ్గుముఖం పెట్టె అవకాశములు ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి అనుకూలం, విద్యార్థిని విద్యార్థులకు మంచి అభివృద్ధి ఉంటుంది. స్నేహ వర్గం పెరుగుతుంది.


సింహం: సర్వత్రా శుభ ఫలితాలుంటాయని చెప్పవచ్చు. ఉద్యోగ పరంగా అభివృద్ధి ఉంటుంది. ప్రమోషన్లు, బదిలీలు వంటి ప్రయత్నములకు అనుకూలత ఏర్పడుతుంది. అయితే మీరు అనుకున్న పనులు పూర్తవుతూనే పనిలో ఒత్తిడి, అధికారుల వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశములు ఉన్నాయి. కుటుంబ పరంగా సానుకూలత ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఎన్ని టెన్సన్స్ ఉన్నప్పటికీ కుటుంబ సౌఖ్యం కోరుకుంటారు. కుటుంబంలో  వారు  కూడా  మీకు  అత్యంత విలువను ఇస్తారు. వ్యాపారస్తులకు రియల్ ఎస్టేట్ రంగం వారికి మంచి ఫలితాలుంటాయి. అనుకున్న విధంగా ప్రణాళికలు చేస్తారు. 

అనుకోని విధంగా వచ్చే బహుమానములు చిన్నవైనా, పెద్దవైనా మీకు మరింత సంతోషాన్న్ని కలుగచేస్తాయి. ఏదైనా కొత్త పనులు మొదలు పెట్టుటకు, వివాహ ప్రయత్నములు చేయుటకు, నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. విద్యార్థిని విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయం, విద్య యందు ఆసక్తి కనబరుస్తారు. స్థిరమైన ఆలోచనలు చేస్తారు. బంధువుల మూలంగా చిన్న పాటి మాట పట్టింపు ఉండవచ్చు, జాగ్రత్త వహించండి. మీరు మాట్లాడేటప్పుడు జాగ్రత్త, మీ మీద ఈర్ష్యా, అసూయలతో విమర్శలు వచ్చే అవకాశములుంటాయి.  మిత్రుల నుండి మంచి సహాయ సహకారాలు అందుతాయి, అలాగే ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ప్రశాంతత ఏర్పరచుకుంటారు.


కన్య: విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు, విదేశములకు వెళ్లి చదువుకోవాలనుకునే వారికి , విద్య  యందు భవిష్యత్తు ప్రణాళికలు చేస్తారు. విద్య యందు శ్రద్ద, ఆసక్తి పెరుగుతుంది. పట్టుదలతో ముందుకు సాగండి, తప్పక విజయాలు వరిస్తాయి. కుటుంబ పరంగా సంతోషంగా గడుపుతారు. గృహోపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో చిన్న పాటి ఇబ్బందులు ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. కార్యాలయములలో కూడా ఎవరిని నమ్మక పోవడం మంచిది.  యథార్థవాది  బంధువిరోధి అన్నట్టుగా మీరు మాట్లాడే కఠిన విషయాలకు ఇతరులచే మోసపోయే అవకాశములు ఉన్నాయి. ఏది ఏమైనా మీ జాగ్రత్తలో మీరు ఉండడం మంచిది. 

వ్యాపారస్తులకు  లేనిపోని ఆందోళనలు, టెన్షన్లు ఉండే అవకాశములు ఉన్నాయి. ఆర్ధికంగా అన్ని విధముల బాగున్నప్పటికీ చిన్న చిన్న విషయాలు మనస్సంకోచానికి కారణమవుతాయి. స్నేహితువులే శత్రువులుగా మారినట్లు అనిపిస్తుంది. మరింత జాగ్రత్తగా ఉండడం మంచిది. కుటుంబంలో వారి సహాయ సహకారములు ఎప్పుడు ఉంటాయి. కోపమును నియంత్రించుకోండి. ఖర్చులు అధికంగా కనబడతాయి. అవసరముల మేరకు ఆర్ధిక  పరంగా డబ్బు చేతికి అందుతుంది, అనుకున్న పనులు పూర్తి చేస్తారు. శారీరక ఆరోగ్యం బాగుంటుంది. మానసిక ధైర్యం (విల్ పవర్) అనేది మీకు సర్వత్రా విజయాలను చేకూర్చుతుంది.


తుల: కొంత జాగ్రత వహించాల్సిన సమయం గా చెప్పవచ్చు. అన్ని విధములుగా మీరు అనుకున్న పనులు కొంత వాయిదా పడే అవకాశములు ఉంటాయి. అన్ని బాగానే చేసాం కదా! ఎందుకు ఇలా అయిందనే భావం మీకు కలుగుతుంది. కంగారు పడకండి. కంగారు పడకుండా నిదానంగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళండి. విజయం వరిస్తుంది. ఉద్యోగస్తులకు ప్రమోషన్ల విషయంలో అనుకున్న సమయానికి ఫలితాలు ఉండకపోవచ్చు. శత్రువులు మీకు తెలియకుండానే మీ మీద ఉంచిన నిఘా ని మీరు గుర్తించగలుగుతారు. కార్యాలయాలలో కానీ, పనిచేసే చోట కానీ మీ క్రింద పని చేసేవారు, మీ వలన బాగా లబ్ది పొందినవారే  మీ మీద దుష్ప్రచారములు చేయడం మీకు బాగా భాధను కలుగ చేస్తుంది. అయితే అయిందేదో అయిపోయింది అనుకునే విధంగా ఉండరు. 

కోపాన్ని నియంత్రించుకోండి. ఉద్యోగం పట్ల మీరు నిర్లక్ష్య ధోరణిని చూపించకండి, అది అవతల వారికి ఉపయోగ పడుతుంది. నిదానమే ప్రధానం అన్నట్టుగా ఉండడం చెప్పదగ్గ సూచన. వ్యాపారస్తులకు ఆర్ధికంగా ప్రతికూల ఫలితాలుండే అవకాశములు ఉన్నాయి. బంధువులను సైతం వ్యాపార, వ్యవహారములలో నమ్మకపోవడం మంచిది. మీ పనులు కొంత శ్రమ అధికమైనప్పటికీ మీరే చేసుకోవడం మంచిది. విద్యార్థిని విద్యార్థులకు అతి నమ్మకం పనికిరాదు, అన్ని వచ్చేసాయి పర్లేదు అనేటట్టు వద్దు.  తాత్కాలికంగా అలా అనిపిస్తుంది. కానీ కస్టపడి, ప్రణాళిక బద్ధంగా చదువుకోవడం మంచిది. అనుకూలమైన ఫలితాలుంటాయి. కార్యాలయంలో, ఇంట్లో, వ్యాపార ప్రదేశాలలో జిల్లేడు గణపతిని పెట్టడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయి.


వృశ్చికం: గతంలో జరిగిన నష్టములకు కొంత ఊరట లభిస్తుంది. బంధువర్గంలో ఎలా ఉన్నప్పటికీ మీ కుటుంబంలో అలాగే మిత్రవర్గములో మంచి సహాయ సహకారములు అందుతాయి. అయితే అంతర్గత విమర్శలు తప్పవు. ఇప్పుడున్న పరిస్థితులకు శాంతమే అలంకారం అన్నట్టుగా ఉండడం వలన చాలా మేలు కలుగుతుంది. ఉద్యోగస్తులకు యధావిధిగా సామాన్యంగా గోచరిస్తుంది. చిన్నపాటి సమస్యలకు అనుమానములు పెంచుకోవద్దు. నేటి సమాజంలో ఈ జయాపజయాలు అనేవి తాత్కాలికం అనేది గుర్తు పెట్టుకోండి. కాలభైరవ రూపు ధరించడం శ్రేయస్కరం. 

వ్యాపారస్తులకు ఖర్చు అధికముగా గోచరిస్తోంది, జాగర్త వహించాలి. శత్రువర్గం నుండి విమర్శలు, వెన్నుపోట్లు ఉండే అవకాశములు ఉన్నాయి. అయితే వారు ఏ విధంగా ప్రయత్నించినప్పటికీ మీ ఆర్థికాభివృద్ధిని ఆపలేరు. అనుకున్న విధముగా డబ్బులు చేతికి అందుతాయి. ఆరోగ్య పరమైన జాగ్రత్తలు తీసుకోండి. లేనిపోని ఆందోళనలు పెట్టుకోవద్దు. ఏదైనా ఒక విషయం గురించి ఆందోళన చెందడం, అతిగా ఆలోచించడం, పట్టుదలకు పోవడం మంచిది కాదు. విద్యార్థిని విద్యార్థులకు కష్టపడి చదివితే మంచి ఫలితాలుంటాయి. కుటుంబ పరంగా మంచి సపోర్ట్ లభిస్తుంది. ఫలితాలు తాత్కాలికం, జ్ఞానం స్థిరం అనే విషయాన్నీ గుర్తుంచుకోండి. పట్టుదలతో ముందుకు సాగండి.


ధనస్సు: మంచి అనుకూలమైన ఫలితములు ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. ఉద్యోగ పరంగా అభివృద్ధి బాగుంటుంది. ఆదాయం కూడా పెరిగే అవకాశములు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, సాఫ్ట్ వేర్ రంగం వారికి అనుకూలమైన మార్పులు కనబడతాయి. సంతాన పరంగా మంచి ఫలితాలు సంతోష కరమైన వార్తలు వినే అవకాశములు ఉన్నాయి. మంచి పేరుప్రతిష్టలు పెరిగే అవకాశములు ఉన్నాయి. స్థిరాస్తి వృద్ధి చేసే ఆలోచనలు ఉన్నవారికి మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. అలాగే నూతన గృహము, నూతన ఉద్యోగ ప్రయత్నం చేసే వారికి అణుకుతా ఏర్పడుతుంది. 

ఎంత ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సమయానికి ఎదో ఒక విధంగా డబ్బు చేతికి అంది పనులు పూర్తవుతాయి. స్నేహితుల, సన్నిహితుల సలహాలు తీసుకోవడం మంచిది.  ఇతరులకు సలహాలు ఇచ్చేటప్పుడు జాగ్రత్త వహించండి. ఈరోజు మీ మాట విన్నప్పటికీ ఏదైనా ఇబ్బందులు ఎదురైనపుడు మీ మాటల వల్లే ఇలా జరిగింది  అని మీ మీదే బురదజల్లే అవకాశములు ఉన్నాయి. విలాసాలకు వ్యసనాలకు దూరంగా వుండండి. ఖర్చులు అధికం అయ్యే అవకాశములు ఉన్నాయి. విద్యార్థిని విద్యార్థులకు   మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. అనుకున్న విధంగా ఫలితాలు వస్తాయి.


మకరం: శత్రువర్గం పట్ల జాగ్రత్త వహించి వ్యవహారములు జరిపినట్లయితే మంచి అనుకూలమైన ఫలితాలుంటాయి. కార్యాలయములలో కానీ, పనిచేసే చోట కానీ ఎవరితోటి అతి స్నేహం, చనువు పనికి రాదు. మీ జాగ్రత్తలో మీరు ఉండడం మంచిది. ఆదాయ పరంగా అభివృద్ధి ఉంటుంది. వ్యాపారస్తులకు మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం కనబడుతుంది. ఆర్ధికంగా లాభములు బాగుంటాయి. క్రమక్రమంగా అభివృద్ధి కనబడుతుంది. సాఫ్ట్ వేర్ రంగం వారికి అనుకూలం, టెక్నీకల్ రంగం వారికి కొంత ఒడిదుడుకులు ఉండవచ్చు. మనోవాంఛ సిద్ధిస్తుంది. 

వివాహ ప్రయత్నములు చేసే వారికి అనుకూలమైన సమయం, ప్రయత్నములు చేయండి. శుభకార్యక్రమముల విషయంలో కానీ, ఏదైనా వ్యవహార విసహాయంలో కానీ  కుటుంబంలో అందరితో కలయిక ఏర్పడుతుంది. స్నేహితుల నుండి సహాయ సహకారములు అందుతాయి. సుఖశాంతులు లభిస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. కార్యానుకూలత ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయం అని చెపపవచ్చు. టెక్నీకల్ కోర్సులు చేసే వాళ్లకు అంత అనుకూలమైన ఫలితాలు సాధించలేకపోవచ్చు.   ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. శ్రమ అధికం అవుతుంది. శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది.


కుంభం: ఆరోగ్య పరంగా బాగా ఇబ్బంది పడుతున్న వారికి కొంత ఉపశమనం కలగడం అనేది జరిగే అవకాశములు ఉన్నాయి. ఉద్యోగస్తులకు సానుకూలత ఉన్నప్పటికీ పని ఒత్తిడి పెరుగుతుంది. పైఅధికారులతో మాటపట్టింపులు కానీ, తగాదాలు కానీ తెచ్చుకోవడం మంచిది కాదు, ఒకవేళ పట్టింపులు ఉన్నట్లైతే కొంత శాంతం వహించడం అనేది చెప్పదగ్గ సూచన. నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి అనుకూలమైన ఫలితములుండె అవకాశములు ఉన్నాయి. గతంలో ఉద్యోగం పోగొట్టుకుని ఉన్నవారికి కొంత రాజీపడి చేరవలసిన సమయం అని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు జరిగిన నష్టములకు కొంత భర్తీ అయ్యే అవకాశములు ఉన్నాయి. అయితే పూర్తి లాభములు ఉంటాయని చెప్పలేము. చిన్నపాటి నిర్లక్ష్యంకూడా  చేయకుండా పట్టుదలతో ముందుకు సాగండి. 

అనుకూలమైన ఫలితములు ఉంటాయి. ఆరోగ్యము  పట్ల శ్రద్ద వాహినచండి. శారీరక ఆరోగ్యం బాగున్నప్పటికీ వాహనముల పట్ల, ప్రయాణముల విషయంలో జాగ్రత్త వహించండి. అంజనేయ స్వామి వారికీ ఆకు పూజ చేయడం చెప్పదగిన సూచన. విద్యార్థిని విద్యార్థులకు స్నేహ వర్గం సానుకూలత ఉంటుంది. పూర్వవిద్యార్ధులతో కలయిక ఉండవచ్చు. సంతోష కరంగా గడుపుతారు. సోమరితనమును, బద్దకమును విడిచి ముందుకు సాగడం చెప్పదగ్గ సూచన. ప్రయాణముల విషయంలో కంగారుపడకండి. దూరం ప్రయాణములు చేయవలసి వస్తే ఆలోచించి, తప్పనిసరి అయితేనే చేయండి. కోపాన్ని నియంత్రించుకోండి. ఫలితములు సామాన్యంగా ఉంటాయి.


మీనం: ఉద్యోగస్తులకు పని ఒత్తిడి ఉండే అవకాశములు ఉన్నాయి. మిత్రుల వలన కూడా కొంత ఇబ్బందుల పాలయ్యే అవకాశములు ఉంటాయి. జీవిత భాగస్వామితో  మాటపట్టింపులు, కొంత అనారోగ్యం ఉండే  అవకాశాలు గోచరిస్తున్నాయి. అన్ని విధములుగా ఎదో ఒకరకంగా ఖర్చు అధికం కనబడుతుంది. అయితే రెండు మూడు వృత్తులు లేదా వ్యాపారములు ఉన్నవారికి ఎదో ఒక రకంగా లాభములు ఉంటాయి. మీరు అనుకున్నదానిలో కంటే అనుకోని విధంగా లాభములు కలసి వస్తాయి. సంతానం వలన సంతోషమును పొందుతారు. కొద్దిపాటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ విజయములు తప్పక వరిస్తాయి. మీ సొంత ఆలోచనలు అనుకూలిస్తాయి. 

పనిచేసే చోట, కార్యాలయాలలో ఉండే టెన్సన్స్ కారణంగా మీకుండే కోపమును నియంత్రించుకోండి. ఈ రోజు మీ కోపం వలన లేనిపోని తగాదాలు, నిందలు వచ్చే అవకాశములు ఉన్నాయి. నిరాశకు గురి కావద్దు.  ఒక విధంగా ఆర్ధికంగా డబ్బు విషయంలో పూర్తి గా మిశ్రమ ఫలితాలుంటాయని చెప్పవచ్చు. అయితే విపరీతమైన  మానసిక ఒత్తిడి తరువాత అనుకున్న పనులు నెరవేరుతాయి. వారం ద్వితీయార్థంలో  అనుకూలమైన ఫలితములు ఉండే అవకాశములు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. శారీరక బలహీనత ఉండవచ్చు. అశ్రద్ధ వహించండి. విద్యార్థిని విద్యార్థులకు సానుకూలంగా ఉంటుంది. అనుకున్న విజయాలు వరిస్తాయి.


                                            


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121