దిన ఫలాలు 08-11-2023

మేషం:  రుణాలు కొంతవరకు తీరుతాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. సంతానం విద్యా, ఉద్యోగ అవకాశాలు పొందుతారు. ఇంటాబయట మీదే పై చేయిగా ఉంటుంది. మీ పరపతి పదింతలు అవుతుంది ఆనందంలో తేలుతారు.


వృషభం: నూతన పరిచయాలు పెరుగుతాయి. మీరు మొదలు చేసినా నూతన కార్యక్రమాలు విజయ వంతంగా ముందుకు సాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతానం తలపెట్టిన పనులలో విజయం సాధిస్తారు.


మిథునం:  స్వల్పంగా ధన లాభం ఉంటుంది. సాధ్యమైనంతవరకు వివాదాలకు, అనాలోచిత విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ముఖ్యమైన పనులలో ఒడిదుడుకులు. వచ్చిన కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో నిదానంగా పూర్తి చేస్తారు.


కర్కాటకం: ఆస్తి వివాదాలు తీరి నూతన ఒప్పందాలకు కుదురుతాయి, గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. మానసిక ఉల్లాసంతో పనులు త్వరగతిన పూర్తి చేస్తారు. సన్నిహితులతో కలిసి ఆనందంగా గడుపుతారు. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం.


సింహం: జీవిత భాగస్వామి నుండి ఆర్థికపరంగా అభివృద్ధి పొందుతారు. గతంలో మీరు తలపెట్టిన పెట్టుబడులకు అనుకున్న లాభాలు అందుకుంటారు. వాహన సౌఖ్యం. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహ అలంకార సామాగ్రి వస్తు లాభాలు పొందుతారు.


కన్య: సహోదర వర్గంతో ఆర్థికపరమైన లావాదేవీల విషయంపై వివాదాలు ఏర్పడతాయి. మీరు చేసే పనులలో తప్పులు జరిగినా నిదానంగా పూర్తి చేస్తారు. మీ శ్రమకు మిశ్రమ ఫలితాలు పొందుతారు. దూరప్రాంతాల నుండి ఆకస్మిక శుభ ఆహ్వానాలు అందుకుంటారు.


తుల: ఆర్థిక ఇబ్బందులు చికాకు పెడతాయి. మనం ఒకటి తలిస్తే పైవాడు ఒకటి తలుస్తాడు అనే విధంగా ఉంటుంది. కానీ చేసే పనులు నిబద్ధతతో చేస్తే విజయం అందుకునే అవకాశాలు ఉన్నాయి. వృత్తి వ్యాపారాల పరంగా స్వల్ప లాభాలు పొందుతారు.


వృశ్చికం: నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. ఇంటిలో శుభకార్యాల ప్రస్తావన ఉంటుంది. ఆడంబరాలకు ధనం అధికంగా ఖర్చవుతుంది. ఏ నిర్ణయం చేసిన వెనుక ముందు ఆలోచించి చేయండి. లేదంటే మొదటికే మోసం అవుతుంది.


ధనస్సు:  పెట్టుబడులకు తగిన ఫలితాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రుణాలు కొంతవరకు తీరుస్తారు ప్రశాంత వాతావరణ నెలకొంటుంది. అనుకొని విధంగా కాంట్రాక్టులు దక్కుతాయి. వాటిని నిలుపుకోవడానికి శతవిధాలుగా శ్రమిస్తారు సాధిస్తారు.


మకరం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. మానసిక ధైర్యం విడవద్దు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధన లాభం పొందుతారు.


కుంభం: కుటుంబ సభ్యుల సహాయ సహకారాలతో మీరు తలపెట్టిన పనులు వేగంగా సాగుతాయి. స్థిర చరాస్తులు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. రాజకీయ రంగాల వారు శుభవార్తలు వింటారు.


మీనం: రాజకీయ, కళారంగం, పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వ రంగాల నుండి ఆహ్వానం అందుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరప్రాంతాల సందర్శనం ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన వస్తు,వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు.

                                                                               


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121