వార ఫలాలు 03-12-2023 నుండి 09-12-2023 వరకు

మేషం: ఫలితములలో పెద్దగా మార్పులు లేకపోయినప్పటికీ స్త్రీల వలన చికాకు, వ్యవహారాలలో చిక్కులు ఏర్పడే అవకాశములు ఉన్నాయి. ప్రతి విషయంలో మీకు జరిగే అవమానం, వంచన వలన నమ్మాలో, నమ్మకూడదో తెలియని ఆందోళన చెందుతారు. ఏ విషయమైనా క్షున్నంగా అలోచించి ముందుకు అడుగు వేయాలి. ఉద్యోగస్తులకు వ్యయ ప్రయాసలు తప్పవు. అనుకున్న పనులు నిదానంగా సాగుతాయి. మీరు తీసుకునే నిర్ణయాలు భవిషత్తులో ఉపయోగకరంగా ఉంటాయి.మొదలు పెట్టిన పని పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. మధ్యలో ఆటంకాలు వున్నాయి మీ యొక్క శక్తి సామర్థ్యాలు నిరూపించుకునే అవకాశాన్ని సద్వినియోగం పరచుకోండి.  

వ్యాపారస్తులకు  అసలు నిర్లక్ష్యం పనికి రాదు, చేద్దాంలే అని నిర్లక్ష్య ధోరణిలో పనులను వాయిదా వేసుకోవడం మంచిది కాదు. ఆదాయం బాగున్నప్పటికీ కొంత ఆర్థికపరమైన నష్టములు ఏర్పడే అవకాశములు  ఉన్నాయి. కుటుంబ పరంగా జీవిత భాగస్వామితో చిన్న పాటి మాట పట్టింపులు, మనస్పర్థలు వచ్చే అవకాశములు ఉన్నాయి. బయట వృత్తి, వ్యాపారములలో ఉండే ఉద్రేకమును, కోపమును కుటుంబములో చూపించుట మంచిది కాదు. అన్ని విధముల నిరాశ పడడం మంచిది కాదు, ఇప్పుడు సమయం అంత అనుకూలంగా లేనందున కొంత ఓర్పు సహనము వహించుట మంచిది. మీ ఫ్రస్ట్రేషన్ ను ఇతరుల పై  చూపించుట వలన మిత్రులే శత్రువులు అయ్యే అవకాశములు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ద వహించండి. లేనిపోని బలహీనత, అశాంతి చోటు చేసుకుంటాయి. విద్యార్థిని విద్యార్థులకు కష్టపడి చదువుకోవలసిన సమయం గా చెప్పవచ్చు. అనుకూలమైన ఫలితములు రాకపోయినప్పటికీ మీ యొక్క జ్ఞానము వృద్ధి అవుతుంది.


వృషభం: మిశ్రమ ఫలితములు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు వృధా శ్రమ ఏర్పడే అవకాశములు ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి కొంత ప్రయాణములు, వృధాగా జరిగే అవకాశములు  గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకు వ్యవహార పరంగా చిక్కులు, తగాదాలు ఉండే అవకాశములు, గోచరిస్తున్నాయి. అలాగే ఆర్ధికంగా లోన్లు, రుణముల  విషయంలో ఇబ్బందులు ఉండవచ్చు. జాగ్రత్త వహించండి. స్నేహితులతో విరోధములు అంత మంచిది కాదు. మీయొక్క తొందరపాటు నిర్ణయాలు వలన లేనిపోని అశాంతి చోటు చేసుకునే అవకాశములు ఉన్నాయి.  ఎన్ని ఖర్చులు ఉన్నప్పటికీ ఎదో ఒక రకంగా అనుకోని విధంగా డబ్బు చేతికి అందడం వలన అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. 

ఎందుకు ఈ కష్టం, మనకే ఎందుకు జరుగుతుంది అని మనోవేదనకు గురవుతారు. ఎంత కష్టపడ్డ ఫలితాలు అంతఅంతమాత్రంగా ఉంటాయి. కుటుంబ పరంగా జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్థలు ఉండే అవకాశములు ఉన్నాయి. అయితే సంతాన పరంగా అనుకూలత ఉంటుంది. మీ యొక్క తెలివితేటలతో సానుకూలత ఏర్పరచుకుంటారు. ఆరోగ్య పరంగా  స్వల్ప ఇబ్బందులు ఏర్పడవచ్చు. లేనిపోని ఆందోళనలతో ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించకండి. మానసిక ప్రశాంతత ఏర్పరచుకోండి. శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోవడం చెప్పదగ్గ సూచన. విద్యార్థిని విద్యార్థులకు మంచి అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు. అనుకున్న ఫలితములను సాధిస్తారు. ప్రశంసలు అందుకుంటారు.


మిథునం: అనుకూలమైన  ఫలితములు గోచరిస్తున్నాయి.  ఉద్యోగస్తులకు కార్యాలయములో ఏదైనా గతంలో నుండి కోన సాగుతున్న పెండింగ్ పనులు వంటివి నెరవేరుతాయి. ఉన్నతధికారుల నుండి సానుకూలమైన పరిస్థితులు ఏర్పడతాయి. ప్రమోషన్ వంటివి అలాగే అధికారము పెరిగే అవకాశములు ఉన్నాయి. మీ ప్రవర్తనను శాంతంగా ఉండేటట్లు, కోపాన్ని నియంత్రించుకొనుట మంచిది. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయములు తీసుకోండి. అన్ని విధాలా అనుకూలమైన పరిస్థితులు ఉన్నప్పటికీ, అన్ని విధముల మీరు కష్టపడి సాధించినప్పటికీ మీయొక్క మాటల వలన కానీ, ప్రవర్తన వలన కానీ ఎదుటి వారి దృష్టిలో చెడుగా  కనిపించడం అనేది జరుగవచ్చు. 

వ్యాపారస్తులకు వ్యవహారములు పట్ల, విజయం సాధిస్తారు. నూతన వ్యాపారాభివృద్ధి ప్రణాళికలు ముందుకు సాగుతాయి. అయితే అన్ని విషయములలో అత్యాశకు పోవడం, ఎవరి మాట పడితే వారి మాట వినడం చంచలత్వంగా ఉండడం మంచిది కాదు. కుటుంబ పరంగా సానుకూలత ఉంటుంది. కుటుంబం యొక్క అండదండలు లభిస్తాయి. కుటుంబంలో పెద్దల ఆశీస్సులు మీకు తోడవవుతాయి.  విద్యార్థిని విద్యార్థులకు మంచి ఫలితములను అందుకునే సమయం అని చెప్పవచ్చు. స్నేహితుల తో విహార యాత్రలు చేసే అవకాశములు ఉన్నాయి.  ఉత్సాహంగా పాల్గొంటారు. చిన్న చిన్న అనారోగ్యములను పక్కకు పెట్టి మానసిక ధైర్యంతో ముందుకు సాగుతారు.


కర్కాటకం: అనుకున్న పనులు పూర్తి చేయగలిగాము అనే సంతృప్తి  లభిస్తుంది. అయితే బయట వారి నుండి కంటే కుటుంబంలో, సంతానం నుండి విమర్శలు, చిన్నపాటి తగాదాలు వచ్చే అవకాశములు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. స్థిరమైన పనులు పూర్తవుతాయి. వ్యాపారస్తులకు ప్రజాదరణ మెరుగవుతుంది. ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. వ్యాపార పరంగా  పలుకుబడి, ఒక మంచి స్థిరత్వం లభిస్తుంది.  శత్రువర్గం నుండి విమర్శలు తప్పవు, అయితే మీ అభివృద్ధి, మీకుండే తీరిక లేని పనులతో వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతారు. 

నరదిష్ఠి అనేది కొంత పెరుగుతుంది. విమర్శించే వారితో మాటపట్టింపులు, తగాదాలుకు దూరంగా ఉంటారు.  వ్యవసాయ దారులకు, కళారంగం వారికి సానుకూలమైన సమయం అని చెప్పవచ్చు. మంచి అభివృద్ధి ఉంటుంది. వ్యవసాయ పరంగ నూతన పనులు ప్రారంభించుటకు కానీ, నూతన యంత్రములు కొనుగోలు చేయుటకు కూడా ఇది మంచి సమయం అని చెప్పవచ్చు.  స్థిరమైన పనులు నెరవేరుతాయి. ఉద్యోగస్తులకు కొంత ఆలస్యంగా ఫలితములు ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. అధికార వృద్ధి అయినప్పటికీ కొంత ఒత్తిడి ఏర్పడుతుంది. టెన్షన్లు, ఆత్రుత వంటివి ఏర్పడతాయి. ఏది ఏమైనప్పటికీ కోపాన్ని అధీనంలో ఉంచుకుని ప్రశాంతంగా ముందుకు సాగండి. మంచి ఫలితాలుంటాయి. విద్యార్థిని విద్యార్థులకు మంచి విజయములు సంప్రాప్తిస్తాయి. విద్యాభివృద్ధి బాగుంటుంది.


సింహం: కొంత ప్రతికూల పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఋణములు, లోన్లు వంటి వాటి విషయంలో వచ్చే ఇబ్బందులు మిమ్మల్ని మానసిక ఆందోళనకు, మానసిక ఒత్తిడికి గురి చేస్తాయి. కుటుంబ పరంగా కూడా అంత సానుకూలత లభించకపోవచ్చు. కుటుంబంలో జీవిత భాగస్వామి నుండి కానీ, సంతానం నుండి వ్యతిరేకత ఎక్కువగా కనిపిస్తోంది. జాగర్త వహించండి. ఆర్ధిక పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు బంధువులతో కూడా విరోధములు వస్తున్నాయి అని మధన పడతారు. అయితే ఇది ఒక పరీక్షా సమయంగా భావించండి. కాలమే సమాధానం చెబుతుంది అని తెలుసుకోండి. ఉద్యోగస్తులకు కుటుంబంలో విషయాలను మనసులో పెట్టుకుని కార్యాలయములలో  మాట్లాడడం, దురుసుగా ప్రవర్తన మంచిది కాదు. 

మీ స్థితిగతులకు వచ్చిన నష్టం ఏమి లేదు. కొంత ప్రశాంతముగా అలోచించి నిర్ణయములు తీసుకోండి. లేకపోతే గతంలో మీరు ఎదుర్కొన్న సమస్యలు ఏమైనా ఉంటె అవి మళ్ళీ తిరగబడే అవకాశములు ఉన్నాయి. మీ శ్రేయోభిలాషులు, స్నేహితుల సలహాలు అనుకులిస్తాయి. మీ యొక్క తెలివితేటలతో, చాకచక్యంతో పరిస్థితులను ఎదుర్కొంటారు. మీరు మాట్లాడే విధానానికి మీకు గౌరవం లభిస్తుంది. కష్టాలను తెచ్చేది మాటే, ఆపేది కూడా ఆ మాటే అనే విషయం గుర్తు ఉంచుకోండి. విద్యార్థిని విద్యార్థులకు మంచి ఫలితాలుంటాయి.  ప్రశంసలు అందుకునే అవకాశములు ఉన్నాయి.  విదేశీ వ్యహారాలు అనుకూలిస్తాయి.


కన్య: అన్ని విధముల సర్వత్రా విజయములు చేకూరుతాయని చెప్పవచ్చు. విద్యార్థిని విద్యార్థులకు పోటీ పరీక్షలకు మంచి ఫలితములుండె సమయం అని చెప్పవచ్చు. నూతన ఉద్యోగ  ప్రయత్నములు చేసే వారికి మంచిది. విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నించే వారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు అభివృద్ధి బాగుంటుంది, మీ యొక్క తేలివి తేటలవలన మంచి పేరు తెచ్చుకుంటారు. వ్యాపారస్తులకు అన్ని విధముల బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి, టెక్నీకల్ రంగం వారికి, సాఫ్ట్ వేర్ రంగం వారికే  కాకుండా చిరు వ్యాపారస్తులకు సైతం మంచి ఆదాయ అభివృద్ధి అనేది కనబడుతుంది.  కుటుంబ పరంగా కూడా మంచి సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. 

ఏదైనా శుభకార్యములు, వివాహ ప్రయత్నములు వంటివి సఫలీకృతం అవుతాయి. లేదా బంధువుల తో కలసి శుభకార్యములలో పాల్గొంటారు. నూతన వస్తువులు కొనాలనే ఆలోచనచేస్తారు. గతంలో ఇబ్బంది పడిన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్య విషయాలు కూడా కుదుట పడతాయి. అయితే ఆర్ధికంగా, మానసికంగా అన్ని విధముల బాగున్నప్పటికీ మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. గురువు గోచార రీత్యా అష్టమ స్థానంలో వక్రించి ఉన్నందున అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పటికీ మీరు మాట్లాడే విధానం సరదాగా ఉన్నప్పటికీ ఎదుటి వారికి గర్వంతో కూడిన మాటలుగా భావించవచ్చు. కాబట్టి నలుగురిలో మాట్లాడేటప్పుడు ప్రశాంతముగా,  నెమ్మదిగా మాట్లాడడం మంచిదని సూచన. ఏది ఏమైనా ఈవారం మొత్తంగా బాగుంది అని చెప్పవచ్చు. శివాలయంలో రుద్రాభిషేకం జరిపించండి అలాగే రుధ్ర పాశుపత హోమం చేయడం వలన మంచి ఫలితాలను అందుకుంటారు.


తుల: మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారులతో జాగర్త వహించాలి, పని ఒత్తిడి కూడా ఉండే అవకాశములు ఉన్నాయి. ఎవరు ఏమి చెబితే అది వినడం మంచిది కాదు. మీ దగ్గర ఒకలాగా, మీరు లేనప్పుడు ఇంకోలాగా ప్రవర్తిస్తారు. కాబట్టి ఎవరిని నమ్మి అంతర్గత విషయాలు చర్చించడం మంచిది కాదు. వ్యాపారస్తులకు ఆర్ధికంగా లాభములు సాధారణంగా ఉన్నప్పటికీ వ్యాపారాభివృద్ధి బాగుంటుంది. నూతన యంత్రములు కొనుగోళ్లు చేసే అవకాశం వుంది. నూతనప్రణాళికలు అమలు చేసే అవకాశములు ఉన్నాయి ఫలిస్తుంది. కుటుంబ పరంగా బంధువులతో మాట పట్టింపులు చిన్నపాటి తగాదాలు వచ్చే అవకాశములు గోచరిస్తున్నాయి. 

అయితే బంధువర్గంలో మనస్పర్థలు ఉన్నప్పటికీ కుటుంబం యొక్క అండదండలు ఏర్పడతాయి. ఇప్పుడు మాట్లాడే మాటల వలన భవిష్యత్తులో ఇబ్బందులు ఏర్పడి సమాధానం చెప్పవలసిన పరిస్థితులు ఏర్పడవచ్చు. ఏదైనా ఒక విషయమునకు అతిగా ఆలోచించడం, పట్టుదలకు పోవడం మంచిది కాదు. అలాగే విపరీతమైన ఖర్చులు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థిని విద్యార్థులకు మంచి అనుకూలమైన ఫలితములు ఉంటాయి. మంచి విద్యాభివృద్ధి కనబడుతుంది. కృషితో పట్టుదలతో ముందుకు సాగడం చెప్పదగ్గ సూచన. మీ యొక్క తెలివితేటలు వృధా కాకుండా వ్యవహరించాలి.


వృశ్చికం: కొంత జాగ్రత్త వహించాల్సిన సమయంగా చెప్పవచ్చు. అన్ని విధముల మీరు అనుకున్న పనులు, వ్యవహారములు అయినట్టు అనిపించినప్పటికీ చివరికి వచ్చే సరికి వాయిదా పడే అవకాశములు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు అధికారులతో జాగ్రత్త వహించడం మంచిది. అధికారులుగా ఉద్యోగం చేసేవారికి వ్యవహారములు పట్ల కొంత ఆలస్య ఫలితములు ఉండే అవకాశములు ఉన్నాయి. చిన్నపాటి అపవాదులు పడినప్పటికీ వారం చివరిలో కొంత కార్యానుకూలత ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు వృధా ప్రయాణములు, వృధా ప్రయాసలు ఉండే అవకాశములు ఉన్నాయి. 

ఆర్ధికంగా ఖర్చుల విషయంలో ఆందోళన ఉంటుంది. సొంత వారే కొంత అవమాన కరమైన మాటలు మాట్లాడడం వంటివి ఉండవచ్చు. ఆందోళన చెందకండి. కోపమును నియంత్రించుకోండి. ఏది ఏమైనప్పటికీ ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. కుటుంబ పరంగా కొంత దూరం అయినట్టు అనిపిస్తుంది. మీమీద బురద చాల్లే వారికీ అనుకూల పరిస్థితులు ఏర్పడతాయి. మాట్లాడేటప్పుడు నిదానంగా ఆలోచించి మాట్లాడడం మంచిది. ఆరోగ్య పరంగా శారీరక అనారోగ్యం కంటే మానసిక ఆందోళనలు ఉండే అవకాశములు ఉన్నాయి. విద్యార్థిని విద్యార్థులకు లేనిపోని టెన్సన్స్ పెట్టుకోకుండా కాకుండా జ్ఞానమునకు, సబ్జెక్టు కి ప్రాధాన్యత  చదువుకోవడం మంచిది. విద్యా విషయంలో  ప్రణాళికా బద్దంగా చదువు కోవడం చెప్పదగ్గ సూచన.


ధనస్సు: కుటుంబ పరంగా మంచి అభివృద్ధి  ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అన్ని విధాలా ఖర్చులు ఎక్కువ అవుతాయి. అయితే కుటుంబం కొరకు ఎన్ని ఇబ్బందులు ఉన్న వారి సౌఖ్యమే ముఖ్యమని ఖర్చు చేస్తారు. విద్యార్థిని విద్యార్థులకు మంచి అనుకూలమైన ఫలితాలుంటాయి. స్నేహితులతో కలసి వినోద, విహార యాత్రలు చేసే  అవకాశములు ఉన్నాయి.  అయితే ఒక్కో సారి స్నేహితుల వలెనే ఇబ్బందులు ఏర్పడవచ్చు. పిల్లలు స్నేహం చేసేటప్పుడు మంచిచెడులు ఆలోచించడం మీ బాధ్యత. జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు సామాన్యంగా, యధావిధిగా ఉండవచ్చు. సాఫీగా జరుగుతుంది. వ్యాపారస్తులకు అనాలోచిత పెట్టుబడులు, నిర్ణయముల వలన కొంత ఆర్ధిక నష్టం ఉండవచ్చు.  

అది మిమ్మల్ని మాటలు అనే వారికి కొంత అనుకూలంగా ఉంటుంది. ఎదుటి వారి మాటలు పట్టించుకోకుండా ముందుకు సాగండి. అయితే ఆర్ధిక నష్టం ఉన్నప్పటికీ అనుకున్న సమయానికి ఎదో ఒక విధంగా డబ్బులు చేతికి అందడం వలన అనుకునం పనులు పూర్తి చేస్తారు. వివాహ ప్రయత్నములు చేసే వారికి అనుకూలమైన ఫలితములు గోచరిస్తున్నాయి. శుభకార్యములలో పాల్గొనే అవకాశములు ఉన్నాయి.  ఆరోగ్య పరంగా బాగున్నప్పటికీ ఎప్పటి నుండో ఇబ్బంది పెడుతున్న దీర్ఘ కాలిక సమస్యలు ఏమైనా ఉంటె అవి మరింత ఇబ్బంది పెట్టె అవకాశములు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. కొంత అశాంతికి గురి అవుతారు. మానసిక ప్రశాంతత ఏర్పరచుకోండి.


మకరం: ఉద్యోగస్తులకు మంచి అభివృద్ధి ఉండే అవకాశములు ఉన్నాయి. గత కొంతకాలంగా ఉన్న పెండింగ్ పనులు ఏమైనా ఉన్నవారికి అనుకూలమైన ఫలితములుంటాయి. కొత్తగా ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి అనుకూలమైన జీతంతో పాటు మంచి అవకాశములు కలసి వస్తాయి. మీ సొంత ఆలోచనల కంటే శ్రేయోభిలాషుల సలహాలు, సంప్రదింపులు అనుకూలిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు వ్యాపారం కాస్త పుంజుకుంటుంది. ఎప్పటినుండో ఎదురుచుస్తున్న వారికీ మంచి లాభాలు వుండే  అవకాశములు ఉన్నాయి. స్థిరాస్తి వృద్ధి అయ్యే అవకాశములు ఉంటాయి. సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తులకు ఉద్యోగ మార్పుకు అంత మంచి సమయం కాదు. 

టెక్నీకల్ ఉద్యోగస్తులకు మంచి సానుకూలమైన ఫలితాలుంటాయి. కుటుంబ పరంగా సంతోషం ఏర్పడుతుంది. సంతానం యొక్క అభివృద్ధి మీకు ఆనందాన్ని కలుగచేస్తోంది. అయితే శత్రు వర్గం ఉన్నట్లైతే, ఏదైనా వ్యవహారములు పట్ల కొంత ఇబ్బందులు ఏర్పడవచ్చు. వ్యవహారంలో కొంత గోప్యత వహించడం మంచిది. విద్యార్థిని విద్యార్థులకు కష్టపడి చదువుకుంటే మంచి అనుకూలమైన ఫలితాలు, విజయాలు ఉండే అవకాశములు ఉన్నాయి. అయితే  యువత వ్యసనాలకు, విలాసములకు దూరంగా ఉండడం చెప్పదగ్గ సూచన. ఆరోగ్య పరంగా  బాగుంటుంది. గతంలో ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నట్లైతే తగ్గుముఖం పడతాయి. మానసిక సంతృప్తి ఏర్పడుతుంది.


కుంభం: ఉద్యోగ పరంగా చేసే ప్రయత్నములు అనుకూలించే సమయంగా అని చెప్పవచ్చు. ఉద్యోగంలో ఉండే సమస్యలు, వివాదములు కొంత పరిష్కారము చేయగలుగుతారు. ఉద్యోగాభివృద్ది బాగుంటుంది. మీ యొక్క కష్టమునకు ఫలితములు ఏర్పడతాయి. సాఫ్ట్ వేర్ ఉద్యోగస్తులకు మంచి సానుకూలత ఉంటుంది. ఆదాయం తో పాటు హోదాకు ప్రాధాన్యత లభిస్తుంది. కార్యాలయములో కానీ, పని చేసే చోట కానీ గౌరవం పెరుగుతుంది. మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది. వ్యాపారస్తులకు కొంత అభివృద్ధి ఉన్నప్పటికీ శత్రువృద్ధి అయ్యే  అవకాశములు ఉన్నాయి. పెద్ద మొత్తాలలో పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. 

టెక్నీకల్ రంగం వారికి మార్పులు అంత మంచి సమయం కాదు అని చెప్పవచ్చు, ఒకవేళ మార్పులు తప్పనిసరి అయితే ఆచీతూచీ అడుగు వేయడం మంచిది. కుటుంబ పరంగా సంతానం యొక్క అభివృద్ధి ఏర్పడుతుంది. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. పెద్దల పట్ల గౌరవాభిమానములు పెరుగుతాయి. కుటుంబంలో కానీ,  శుభకార్యములలో, బంధువర్గంతో కలయిక ఏర్పడుతుంది. మానసిక సంతృప్తి ఏర్పడుతుంది. కుటుంబంలో మాటకు విలువ పెరుగుతుంది. శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోవడం మంచిది. విద్యార్థిని విద్యార్థులకు మంచి అనుకూలమైన ఫలితాలుండే అవకాశములు  గోచరిస్తున్నాయి.  విదేవశాలకు  వెళ్ళడానికి ప్రయత్నించే వారి ప్రయత్నాలు ఈ వరం ఒక కొలిక్కి వస్తాయి.


మీనం: కొంత అనుకూలమైన ఫలితములు గోచరిస్తున్నాయి. గతంలో గురి అయిన కష్ట, నష్టముల నుండి కొంత ఊరట చెందుతారు. ఎదో ఒక రకంగా అధికారం, ఆర్ధిక పరంగా లాభములు ఉంటాయి. కుటుంబంలో కూడా సుఖశాంతులు నెలకొంటాయి. వ్యవహారములు ఒక కొలిక్కి వస్తాయి. ఉద్యోగస్తులకు ఆర్ధికంగా అభివృద్ధి బాగున్నప్పటికీ పని ఒత్తిడి పెరుగుతుంది. కొంత అలసటకు గురి అవుతారు. మానసిక అశాంతి ఏర్పడుతుంది. ఇప్పుడు పని ఒత్తిడి తట్టుకుంటేనే భవిష్యత్తులో అభివృద్ధి ఉంటుందనే విషయం గుర్తు ఉంచుకోండి.  పెద్దవారితో, ఉన్నతాధికారులతో తగాదాలు పెట్టుకోవడం పరిస్థితులకు ఉద్రేక పడడం మంచిది కాదు.  గతంలో అనారోగ్య సమస్యలు ఉన్నవారికి ఆరోగ్యం కొంత మెరుగు పడుతుంది. 

వ్యాపారస్తులకు ఒక దానిలో కాకపోయినా ఇంకొక దానిలో అన్నట్టుగా ఆర్ధిక లాభములు ఉంటాయి. అయితే గతం లో జరిగిన నష్టాలను పోల్చుకుంటే కొంత ఇబ్బందులు తప్పవు, అయితే కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. మీమీద మీకు నమ్మకం ఏర్పడుతుంది.  ఆరోగ్య పరంగా అన్ని విధముల బాగుంటుంది. కానీ చిన్న చిన్న అపాయములుండె అవకాశములున్నాయి, కాబట్టి వాహనములు నడిపేటప్పుడు, ప్రయాణములలో జాగ్రత్త వహించండి.  విద్యార్థిని విద్యార్థులకు మంచి విజయములను పొందే సమయం అని చెప్పవచ్చు.  మీ తెలివితేటలకు గుర్తింపు లభిస్తుంది. కంప్యూటర్ కోర్సులు, సాఫ్ట్ వేర్ సంబంధించిన కోర్సులు నేర్చుకొనుటకు మంచి సమయం. నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి కూడా అనుకూలమైన సమయం.


                                            


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121