మేషం: కుటుంబ సమస్యలు ఎదురై చికాకులు పెట్టిన అధిగమిస్తారు. వివాదాలకు దూరంగా వుండండి. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. పెట్టుబడులకు స్వల్ప లాభాలు. సంతానం నుండి ధనవస్తు లాభాలు.
వృషభం: నూతన విద్యా, ఉద్యోగావకాశాలు పొందుతారు. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో గౌరవం పొందుతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కలిసివస్తాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి.
మిథునం: నూతన వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పలుకబడి కలిగిన వ్యక్తులను కలుస్తారు. పాతమిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. క్రయవిక్రయాలలో ప్రోత్సాహం పొందుతారు.
కర్కాటకం: ముఖ్యమైన పనులలో జాప్టం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. శ్రమకు తగిన ఫలితం తగదు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి.
సింహం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. సోదరుల నుండి శుభవార్తలు వింటారు.
కన్య: మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్య సమస్యల నుండి బయటపడతారు. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు.
తుల: శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.
వృశ్చికం: బంధువుల నుండి విలువైన సమాచారం అందుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. ముఖ్యమైన పనులు నిదానంగా సాగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. వస్తు లాభం.
ధనస్సు: మిత్రులతో ఏర్పడిన కలహాలు పరిష్కరించుకొంటారు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. సాంకేతిక విద్యావకాశాలు.
మకరం: కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకొంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. గృహనిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యా, ఉద్యోగ యత్నాలు కలిసి వస్తాయి.
కుంభం: దీర్ఘకాలిక సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వివాదాలకు దూరంగా వుండండి. సోదరుల కలయిక.
మీనం: ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. బంధువుల నుండి శుభవార్తలు అందుకొంటారు. వాహనయోగం. జీవిత భాగస్వామి నుండి ఆస్తి లాభం పొందుతారు. క్రయవిక్రయాలలో లాభాలు అందుకొంటారు. వస్తు లాభం.
- సోమేశ్వర శర్మ
+91 8466932223,
+91 9014126121