మేషం: మిశ్రమ ఫలితములు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు ఉన్నతిధికారుల నుండి పని ఒత్తిడి తద్వారా మీ క్రింద స్థాయి వారికి ఒత్తిడి వంటివి ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. అనుకున్న పనులు పూర్తి కాకపోయినప్పటికీ కొంత అనుకూలత విషయములు ఆనందింపచేస్తాయి. కొంత ఆలస్యం అయినప్పటికీ పనులు పూర్తవుతాయని నమ్మకం ఏర్పడతాయి. వ్యాపారస్తులకు ఆర్థికాభివృద్ధి బాగున్నప్పటికీ భాగస్వామ్యులతో, మిత్రులతో కొంత విభేధములు ఏర్పడే అవకాశములు ఉన్నాయి. కొంత సహనం, ఓర్పు వహించే సమయంగా అని చెప్పవచ్చు. అన్ని విధముల కొంత గోప్యత వహించడం మంచిది. ఏ విషయాన్నీ అందరితో చర్చించడం వలన ముఖ్యమైన విషయాలలు బయటవాళ్లకు చేరుతాయి. దాని వలన వ్యాపారంలో నష్టం వాటిల్లే అవకాశం గోచరిస్తోంది.
కుటుంబ పరంగా కూడా స్వల్ప చికాకులు ఉంటాయి. మీ యొక్క పని ఒత్తిడిని ఇంట్లో వారు అర్ధం చేసుకోలేదు అనే ధోరణితో ప్రవర్తించకండి. వారికి మీ ఇబ్బందులు అర్ధం అయ్యేలా చెప్పి కొంత ఊరట చెందడం మంచిది. లేనిపోని ఉద్రేకములతో కుటుంబ సభ్యులతో తగాదాలు పెట్టుకోవడం మంచిది కాదు. ఏ విధంగానైనా, వ్యవహారములు పట్ల కానీ నిదానమే ప్రధానం అన్నట్టుగా ఉండడం మంచిది. విద్యార్థిని విద్యార్థులకు కృషితో, పట్టుదలతో ముందుకు సాగే సమయం అని చెప్పవచ్చు. సోమరితనం అనేది దరిదాపులకు రాకుండా ముందుకు సాగడం చెప్పదగ్గ సూచన.
వృషభం: మొదలు పెట్టిన పనులు మొదట కొంత చికాకుగా అనిపించినప్పటికీ వారం ద్వితీయార్థంలో అనుకూలమైన ఫలితాలుండే అవకాశములు ఉన్నాయి. కుటుంబ పరంగా కొంత అశాంతి చోటు చేసుకునే అవకాశాలున్నాయి అయితే మీరు వాటికీ స్పందించకపోడమే మంచిది. ఉద్యోగస్థులకు కొంత అధికారులతో సానుకూలత ఏర్పడుతుంది, క్రింద స్థాయి ఉద్యోగస్థులతో గౌరవం లభిస్తాయి. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. కొంత శ్రమ తప్పదు. వ్యాపారస్తులకు ఖర్చులు అధికమవుతాయి. లాభాలు కూడా అదే విధంగా ఉంటాయి. ఏమైనప్పటికీ వ్యాపారం కొంత ఉన్నతస్థాయికి చేరుతుందని ఆశ ఏర్పడుతుంది. పాత వ్యవహారముల పట్ల చికాకులు ఉన్నప్పటికి అవి పక్కకుపెట్టి ముందుకు సాగుతారు. లేనిపోని ఆందోళనలకు గురి కావద్దు.
అప్పులు చేసి ఏపని చేయడం అంత మంచిది కాదు. నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి అనుకున్నంత (ప్యాకేజి)జీతం రాకపోవడం, కొంత నిరాశలు ఏర్పడవచ్చు. అయితే అవసరం అనుకున్నప్పుడు చేరిపోవడం మంచిది. భవిష్యత్తులో మంచి అభివృద్ధి ఉంటుంది. సొంత నిర్ణయాలు అనుకూలిస్తాయి. సంతానం పురోగతి బాగుంటుంది. విద్యార్థిని విద్యార్థులకు మంచి విజయములు ఉంటాయి. నూతన విద్యారంగంలో, కొత్తకోర్సులలో చేరుటకు ఆలోచనలు చేస్తారు. ఆరోగ్య పరంగా స్వల్ప ఇబ్బందులు ఉండే అవకాశములు ఉన్నాయి. ధీర్ఘకాలికవ్యాధులు ఉన్నవారు జాగ్రత్త వహించండి.
మిథునం: అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. నూతన వస్తువులు కొనాలనే ఆలోచనలు చేస్తారు. సొంత ఇంటి కల సాకారం చేసేలా ప్రయత్నం చేయండి, మీరు ఒక అడుగు ముందుకు వేస్తేనే పనులు మొదలవుతాయి కాబట్టి ప్రయత్నాలు ప్రారంభించండి. ఉద్యోగస్తులకు అధికారులతో సానుకూలత ఉంటుంది. శత్రువర్గం కూడా మిత్రులుగా మారే అవకాశం వుంది. కుటుంబ పరంగా వ్యవహారములు అనుకూలమైన ఫలితములను అందిస్తాయి. ఏదైనా కోర్ట్ వ్యవహారములు ఉన్నవారికి కూడా కొంత సానుకూలత ఏర్పడుతుంది. కుటుంబంలో జరిగిన శుభకార్యముల తరువాత మీ కుటుంబంలో మరింత గౌరవం, పెద్దలపై గౌరవాభిమానములు పెరుగుతాయి.
స్నేహితులతో కూడా సన్నిహిత్యము, వారి ఆదరణ మీకు సంతోషాన్ని కలుగచేస్తుంది. వ్యాపారస్తులకు నూతన ప్రణాళికలు సిద్ధిస్తాయి. అయితే మీరు వృధా ఖర్చులు కొంత తగ్గించుకోవాలి. విలాసములు విషయంలో అనాలోచిత ఖర్చుల విషయంలో, ఆలోచించి ఖర్చు చేయండి. ఆర్ధిక లాభములు బాగుంటాయి. స్థిరమైన వస్తువులు కొనుగోలుకు మంచి సమయం. ఖర్చులు అధికమవుతాయి. విద్యార్థిని విద్యార్థులకు శ్రద్ద తగ్గకుండా దృష్టి పెట్టినట్లయితే మంచి విజయములు సంప్రాప్తిస్తాయి. నూతన విద్య ప్రణాళికలు కు ఆలోచనలు చేసే వారికి కుటుంబంలో పెద్దవారి సలహాలు సలహాలు అనుకూలిస్తాయి. వారి ఆదరణ, ఆశీస్సులు మీకు ఉంటాయి.
కర్కాటకం: పూర్తి మిశ్రమ ఫలితములు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్థులకు చిన్న పాటి టెన్సన్స్ ఉండే అవకాశములు ఉన్నాయి. అయితే అధికారం వృద్ధి చెందుతుంది. మీ గురించి విమర్శలు, మీ అభివృద్ధి చూసి తట్టుకోలేని వారు మీ మీద బురద చల్లడానికి ప్రణాళికాబద్ధంగా చేసే ప్రయత్నాలు మీరు ముందుగా తెలుసుకుని జాగ్రత్త వహించండి. మీ అంతర్గత విషయములు గోప్యంగా ఉంచుకోవడం మంచిది. లేనిపోని విషయముల గురించి కొంత మానసిక ఆందోళనలు, కొంత అశాంతి ఏర్పడుతుంది. మానసిక ధైర్యం పెంచుకోండి. లేనిపోని విషయాలకు ఆందోళన చెందవద్దు. వ్యాపారస్తులకు ప్రజాభిమానం బాగుంటుంది. అభివృద్ధి ఆర్ధిక పరంగా కూడా కనబడుతుంది. అనుకున్న పనులు, వ్యవహారములలో విజయం సాధించగలుగుతారు.
విలాస వస్తువుల వ్యాపారములు, విలాస పూరిత వ్యాపారస్థులకు మంచి ఆర్ధిక లాభములుండె అవకాశములున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కొద్దిగా వృద్ధి అయ్యే అవకాశములు కనిపిస్తాయి. కుటుంబంలో స్వల్ప చికాకులు ఏర్పడవచ్చు. సంతాన పరంగా వారి ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించడం చెప్పదగ్గ సూచన. విద్యార్థిని విద్యార్థులకు మంచి అనుకూలమైన ఫలితములు ఉంటాయి. కృషి పట్టుదల తగ్గ కుండా జాగ్రత్త వహించండి. ఓవర్ కాన్ఫిడెన్స్ కి వెళ్లడం మంచి కాదు. ప్రతి పని నిదానంగా సాగుతుంది, కాబట్టి ప్రతి పనిని అలోచించి ముందుకు సాగండి మంచి ఫలితాలుంటాయి.
సింహం: ఉద్యోగ పరంగా కార్యాలయములలో, పని చేసే చోట సానుకూలత ఉంటుంది. మీ గౌరవం పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. అయితే కుటుంబ పరంగా ఇబ్బందులు, చిన్న పాటి మనస్పర్థలు ఏర్పడే అవకాశములు ఉన్నాయి. జీవిత భాగస్వామితో, సంతానంతో అభిప్రాయభేదములు వచ్చే అవకాశములు ఉన్నాయి. బయట ఎంత పేరు తెచుకున్నప్పటికీ, ఎంత సంపాదించినప్పటికీ ఇంటిలో గౌరవము లేదని బాధపడతారు. ఎవరికీ చెప్పుకోలేని చిన్న చిన్న సమస్యలు ఆలోదోళనకు గురి చేస్తాయి. ఈ ఆందోళనల వలన కొంత అనారోగ్య పరిస్థితులు కూడా ఏర్పడవచ్చు.
కాబట్టి ఆరోగ్యం పట్ల శ్రద్ద ఆవహించండి. లేనిపోని ఆందోళనలకు గురి అవ్వద్దు. మౌనమే మనిషి విలువ తెలిసేలా చేస్తుంది అనే విషయాన్నీ గుర్తు ఉంచుకోండి. వ్యాపారస్తులకు వ్యాపారం బాగుంటుంది అలాగే పలుకుబడి పెరుగుతుంది, నలుగురిలో మాట చెలామణి అవుతుంది. అయితే మీరు ఎదుటి వారి చెప్పుడు మాటల కంటే మీ సొంత ఆలోచన చేసుకుని నిర్ణయాలు తీసుకోండి.
అనాలోచిత నిర్ణయములు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. శ్రమ వృధా అయ్యే అవకాశములు ఉన్నాయి. విద్యార్థిని విద్యార్థులకు స్నేహితుల వలన మంచి అవకాశములు, ఫలితములు ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. పట్టుదలతో, కృషితో ముందుకు సాగడం మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ద వహించండి. ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది.
కన్య: అన్ని విధముల బాగుందని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు మంచి అనుకూలమైన ఫలితములుంటాయి. సాఫీగా, యధావిధిగా కొనసాగుతుంది. అధికారం అభివృద్ధి అవుతుంది. మీరు గతంలో తీసుకున్న ధైర్యమైన నిర్ణయములు ఇప్పుడు అనుకూలమైన లాభములు ఉండడం మీకు సంతోషాన్ని కలుగచేస్తుంది. వివాహ సంబంధిత విషయములు, వ్యవహారములు వంటివి సానుకూల పడతాయి. అయితే మీయొక్క మనసును మీ యొక్క అధీనంలో ఉంచుకుని మాట్లాడడం చెప్పదగ్గ సూచన. మీయొక్క సంతోషంలో, అభివృద్ధిలో ఉన్నప్పుడు ఇచ్చిన వాగ్దానములు, హామీలు నెరవేర్చేటప్పుడు కొంత ఇబ్బందులు ఎదురవ్వవచ్చు.
కాబట్టి ఎంత అభివృద్ధి ఉన్నప్పటికీ నిదానంగా అలోచించి నిర్ణయములు తీసుకోవడం మంచిది. వ్యాపారస్తులకు ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. మంచి పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. కుటుంబ పరంగా కూడా అభివృద్ధి బాగుంటుంది. వారి సౌఖ్యం కొరకు నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి వెనుకాడరు. అనుకోని విధంగా అవార్డులు, రివార్డులు అందుకునే అవకాశములు ఉన్నాయి. బంధువర్గంలో కూడా మన్ననలు పొందుతారు. విద్యార్థిని విద్యార్థులకు మంచి అభివృద్ధి ఉంటుంది. మంచి ధైర్యంతో పట్టుదలతో ముందుకు సాగితే మంచి ఫలితములు ఉంటాయి. ఇంట్లో వాళ్ళు చెప్పిన మాట విని ముందుకు వెళ్లడం వలన మంచి ఫలితాలుంటాయి.
తుల: విద్యార్థులకు అత్యంత అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. నూతన విద్యా ఆలోచనలకు, కొత్త కోర్సులలో చేరుటకు మంచి సమయం అని చెప్పవచ్చు. ఇప్పుడు తీసుకునే నిర్ణయములు లాభిస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల వలన ఇబ్బందులు, వారి నుండి వర్క్ ప్రెషర్ ఉండే అవకాశములు ఉన్నాయి. ఈ సమయంలో కఠినమైన మాటలు సమాధానం చెప్పడం మంచిది కాదు. ఎవరు ఏమి అన్న మౌనంగా ఉండడం చెప్పదగిన సూచన. దాని వలన భవిశ్యత్తులో ఇంక్రీమెంట్లకి, ప్రమోషన్స్ కి ఇబ్బంది లేకుండా ఉంటుంది. వ్యాపారస్తులకు కొంత నష్టములు చవిచూసే అవకాశములు ఉన్నాయి ఈ వారం, జాగ్రత్త వహించాలి. ఇతరుల వంచనకు గురి అయ్యే అవకాశములు కూడా లేకపోలేదు. కాబట్టి ఎవరిని పడితే వారిని నమ్మడం అంత మంచిది కాదు.
శత్రువర్గం ఉన్నట్లైతే వారి నుండి చికాకులు ఏర్పడవచ్చు. ఖర్చులు అధికమవుతాయి. కుటుంబ పరంగా అనుకూలత ఉంటుంది. కుటుంబం యొక్క అండదండలు ఉంటాయి. నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి మంచి సమయం అని చెప్పవచ్చు. కుటుంబ పరంగా అనుకూలంగా ఉన్నప్పటికీ బంధువర్గంలో కొంత భిన్నాభిప్రాయములు ఏర్పడే అవకాశములు ఉన్నాయి. స్నేహితుల సలహాలు, ఆదరణ లభిస్తుంది. ఏదైనా ఒక విషయం గురించి అతిగా ఆలోచించడం, పట్టుదలకు పోవడం మంచిది కాదు. మానసిక ఆందోళనలను పక్కకు పెట్టి ప్రశాంతంగా ఆలోచించి ముందుకు సాగితే శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుంది.
వృశ్చికం: అన్ని విధముల జాగ్రత్త వహించాల్సిన సమయం అని చెప్పవచ్చు. తాత్కాలిక విజయములకు, మాటలకు లొంగిపోయి చేసే పనుల పట్ల నిర్లక్ష్యం వహించడం మంచిది కాదు. మీరు అనుకున్న వ్యవహారములు, పనులు పూర్తయినట్టు అనిపించినప్పటికీ చిన్న చిన్న కారణములు వలన వాయిదా పడే అవకాశములు గోచరిస్తున్నాయి. ఆచీతూచీ అడుగు వేయడం చెప్పదగ్గ సూచన. ఉద్యోగస్తులకు అధికారులతో లేనిపోని వైరం, అపవాదులు ఏర్పడవచ్చు. వాటి వలన మీకు తెలియకుండా, మీ వెనుక జరిగే పనులకు మీరు చిన్నపాటి అవమానములు ఎదుర్కొనవలసి రావచ్చు. మీ పనులు మీరు నిర్లక్ష్యం చేయకుండా సమయానికి ముగించుకోవడం, నిరంతరం ఎలెర్ట్ గా ఉండడం చెప్పదగ్గ సూచన.
వ్యాపారస్తులకు డబ్బుతో పటు కొంత కీర్తి ప్రతిష్టలకు భంగం వాటిల్లవచ్చు. వ్యవహారాలలో కొంత విఘ్నాలు ఏర్పడవచ్చు. అనుకున్న పనులు కొంత ఆలస్యంగా జరిగే అవకాశములు ఉన్నాయి. కోపమును నియంత్రించుకోవడం అలాగే ఆలోచించి నిర్ణయములు తీసుకోవడం వలన మేలు జరుగుతుంది. కుటుంబ పరంగా సొంత వారితో కొద్దిపాటి విరోధములు, తగాదాలు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించండి. విద్యార్థిని విద్యార్థులకు కష్టపడితే కానీ అనుకూలమైన ఫలితములు రాకపోవచ్చు. వివాహ సంబంధమైన విషయాలు ఒక కొలిక్కి వస్తాయి.
ధనస్సు: మధ్యస్థ ఫలితములు గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా సుఖ సంతోషములు ఏర్పడతాయి. బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు. అయితే మిత్రులతో చిన్న మనస్పర్థలు ఏర్పడవచ్చు. అది మీ అభివృద్ధి చూసి ఈర్ష్య, అసూయలతో మాట్లాడే వారి నుండి దూరంగా ఉండడానికి ఇష్టపడతారు. కుటుంబమే ప్రధానం అన్నట్టుగా భావిస్తారు. ఇది మంచి పరిణామంగా చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు మార్పులకు అంత మంచి సమయం కాదు. చంచలంగా మీరు తీసుకునే నిర్ణయములు మీకు ఇబ్బందులను తెచ్చిపెడతాయి. నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు.
వ్యాపారస్తులకు లాభనష్టముల విషయంలో మిశ్రమ ఫలితములు ఉండే అవకాశములు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు. శత్రువర్గం పొంచి వుంది జాగర్త వహించాలి. మీకు ఆర్ధిక నష్టమే కాకుండా కీర్తిప్రతిష్టలు పోగొట్టే ప్రయత్నములు, మీమీద దుష్ప్రచారములు చేసే అవకాశములు ఉన్నాయి. కొంత అప్రమత్తంగా ఉండడం చెప్పదగ్గ సూచన. విద్యార్థిని విద్యార్థులకు మిశ్రమ ఫలితములుంటాయి. అనుకున్న ఫలితాల కొరకు కొంత కృషి, పట్టుదలతో ముందుకు సాగడం మంచిది. లేనిపోని ఆతృత తగ్గించుకోవడం మంచిది, మానసిక ధైర్యం పెంచుకోండి.
మకరం: ఉద్యోగ పరంగా అభివృద్ధి పైఅధికారులతో అనుకూలత ఏర్పడుతుంది. చిన్నపాటి అనుమానములతో మీ వారెవరో, పరాయి వారెవరో తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఉండకండి. కొంత ఓర్పు సహనం వహించడం మంచిది. ఆర్థికాభివృద్ధి బాగుంటుంది. వ్యాపారస్తులకు అన్ని విధముల బాగుంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, స్థిరాస్తి వృద్ధి చేసుకోవాలనుకునే వారికి మంచి సమయం అని చెప్పవచ్చు, అయితే వ్యసనములు, విలాసములు విషయంలో జాగ్రత్త వహించండి. వాటి వలన కొంత అవమానములు, లేనిపోని తగాదాలు ఉండే అవకాశములు ఉన్నాయి. కుటుంబ పరంగా కొంత చిన్నపాటి తగాదాలు ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. సంతాన పరంగా వారి యొక్క అభివృద్ధి మీకు సంతోషాన్ని కలుగచేస్తుంది.
ఎప్పటినుండో కొనాలనుకునే ఇష్టమైన వస్తువులు కొనుగోలు చేస్తారు. నూతన ఉద్యోగావకాశములు కొరకు చేసే ప్రయత్నములు ఫలిస్తాయి. సంతాన పరంగా శుభవార్తలు వినే అవకాశములు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కొంత అనుకూలమైన ఫలితములు ఉండే అవకాశములు వున్నాయి ఈ వారం. విద్యార్థిని విద్యార్థులకు మంచి అనుకూలమైన ఫలితములు ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. మీరు కష్టపడిన దానికి ప్రతిఫలం లభిస్తుంది. వివాహ ప్రయత్నముల కొరకు ప్రయత్నములు చేసే వారికి మంచి ఫలితములు ఎదురవుతాయి. ఆరోగ్య పరంగా కొంత ప్రశాంతత ఏర్పడుతుంది. గతంలో ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లైతే కొంత ఆరోగ్యం మెరుగు అవుతుంది.
కుంభం: గతంలో పడిన ఇబ్బందులు ఒక కొలిక్కి వస్తాయి అని చెప్పవచ్చు. కొంత సానుకూలత ఏర్పడుతుంది. ఆర్థికపరంగా కూడా ఇబ్బందులు ఒక కొలిక్కి వస్తాయి. సంతాన పరంగా వారి అభివృద్ధి బాగుంటుంది. గతంలో పడిన ఇబ్బందులు తగ్గి కొంత తృప్తి అనేది ఉంటుంది. ఉద్యోగస్తులకు అనుకున్న పనులు నెరవేరుతాయి. కార్యాలయములలో, పని చేసే చోట అందరితో మంచి సాన్నిహిత్యం ఏర్పడుతుంది. అలాగే వ్యాపారస్థులకు ఆర్ధికంగా ఇబ్బందులు తొలగుతాయి. మనోవాంఛలు సిద్దిస్తాయి. సంఘంలో గౌరవం పెరిగిందనే విషయం గుర్తిస్తారు. కుటుంబ పరంగా సంతోషం లభిస్తుంది. ఆరోగ్య పరంగా గతంలో ఇబ్బందులు కొంత తగ్గుతాయి. ఆరోగ్యం మెరుగు అవుతుంది.
విద్యార్థిని విద్యార్థులకు మంచి అనుకూలమైన ఫలితాలుండే సమయం అని చెప్పవచ్చు. కృషి పట్టుదలతో ముందుకు సాగుతారు. విద్యపై శ్రద్ద పెరుగుతుంది. కుటుంబంలో పెద్దలపై ప్రేమాభిమానములు, వారు మీగురించి పడే ఆరాటం తెలుసుకోగలుగుతారు. కుంభరాశి వారికి ఈ వారం పూర్తి ఫలితములు అందకపోయినప్పటికీ కొంత మానసిక ప్రశాంతత, పనులు నెరవేరుతాయని నమ్మకం ఏర్పడుతుంది. ఏది ఏమైనప్పటికీ అంతర్గత విమర్శలు తప్పవు. శత్రువుల నుండి వచ్చే చిన్న పాటి విమర్శలను పట్టించుకోకపోవడం చెప్పదగ్గ సూచన.
మీనం: అతికష్టం మీద పనులు పూర్తి చేయగలుగుతారు. అన్ని విధముల లాభములు ఉన్నప్పటికీ అంత కంటే ఎక్కువ ఖర్చులు మీకు ఆందోళనలను కలుగచేస్తాయి. ఉద్యోగస్తులకు చిన్నపాటి తగాదాలు ఉన్నప్పటికీ అధికారం చేతికి వస్తుంది. అధికారమును జాగ్రత్తగా కాపాడుకోవడం మీ బాధ్యతగా గుర్తించండి. పెద్దవారితో, సహా ఉద్యోగస్థులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఎదుటివారి నుండి వచ్చే చిన్న పాటి కామెంట్స్ కి, మాటలకి స్పందించడం అంత మంచిది కాదు. సాఫ్ట్ వేర్ రంగంలో వున్నవారికి మంచి ఫలితాలున్నాయి ఈ వారం. టెక్నీకల్ రంగం వారు, వ్యాపారస్తులకు కొంత జాగ్రత్త వహించాల్సిన సమయం గా చెప్పవచ్చు.
ఆర్ధిక పరంగా లాభనష్టములు మిశ్రమ ఫలితములు ను అందిస్తాయి. ప్రయాణముల విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అత్యవసరమైతే తప్ప దూర ప్రయాణములు చేయడం మంచిది కాదు. శారీరక ఆరోగ్యం బాగుంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి కొంత నిరాశ ఎదురవ్వవచ్చు, జాగ్రత్త వహించండి. స్త్రీలకూ వివాహ ప్రయత్నములు చేసే వారికి మంచి అనుకూలమైన ఫలితములు గోచరిస్తున్నాయి. ప్రయత్నములు చేయండి. విద్యార్థిని విద్యార్థులకు విజయములు వరిస్తాయి. అయితే మెంటల్ టెన్సన్స్ ఎక్కువగా ఉంటాయి. కొత్త స్నేహితులతో సన్నిహితం ఏర్పడవచ్చు.
- సోమేశ్వర శర్మ
+91 8466932223,
+91 9014126121