మేషం: కొంత ప్రతికూలమైన అవకాశములు గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా జీవిత భాగస్వామితో మనస్పర్థలు కొంత తగ్గినప్పటికీ, పెద్దవారితో మాట పట్టింపులు ఏర్పడే అవకాశములు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అన్నట్టుగా ఉండడం చెప్పదగ్గ సూచన. అయితే మీ మనో ధైర్యం తో ముందుకు సాగండి, మంచి ఫలితాలుంటాయి. ఇతరుల వ్యవహారములలో, ఆర్ధిక లావాదేవీలలో తలదూర్చడం అంత మంచిది కాదు. డబ్బు విషయంలో హామీలు ఇతరులకు ఇవ్వడం అంత శ్రేయస్కరం కాదు. కొంత నిరాశ ఎదురవుతుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించండి. ఉద్యోగస్తులకు కొంత పని ఒత్తిడి, అధికారులనుండి విమర్శలు తగ్గినప్పటికీ మీ పేరు ప్రతిష్టల విషయంలో కొంత మంది తప్పుడు ప్రచారములు చేసే అవకాశం వుంది. ఓర్పు వహించండి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఈవారం అంత అనుకూలం కాదు.
మీ ముక్కు సూటి తనం వలన కొంత ఇబ్బంది పడతారారు. ఏమి జరిగిన మనకెందుకులే అనే ధోరణి ఉండకండి. అందరితో కలసి పని చేయడం వలన భవిష్యత్తులో మంచి ఉపయోగాలుంటాయి. వ్యాపారస్తులకు ఈ వరం బాగుంది అని చెప్పవచ్చు, అయితే పనిని అశ్రద్ధ అనుకోకుండా ముందుకు వెళ్లడం వలన మంచి ఫలితాలుంటాయి. సంగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. శత్రు వర్గం మీ మీద బురద జల్లే అవకాశం వుంది, జీవిత భాగస్వామి అండదండలు మీకు ఉంటాయి, అందువలన ఏ కార్యమైనా నిర్విజ్ఞానంగా చేయగలుగుతారు. విందు వినోదాలలో పాల్గొంటారు. వివాహం కానీ వారికీ వివాహ ప్రయత్నాలు చేయనుకోవచ్చు, కొంత మందికి ఎన్ని ప్రయత్నాలు చేసిన సంబంధాలు కుదరడంతో ఆలస్యం జరుగుతుంది. భృగు పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. విదేశాలలో చదువుకునే వారికీ చదువు పట్ల శ్రద్ధ చూపాలి, ఈ రోజు కష్టపడి చదివితే భవిషత్తు బాగుటుంది. విద్యార్థులు గణపతి ముత్యపు లాకెట్ ధరించడం వలన చదువులో మంచి పురోగతి ఉంటుంది.
వృషభం: సంతాన పరంగా అభివృద్ధి ఫలితములుండే అవకాశములు ఉన్నాయి. బంధువులతో బేధాభిప్రాయాలు అలాగే కుటుంబ పరంగా జీవిత భాగస్వామి తో విభేదాలు వచ్చే అవకాశములు ఉన్నాయి. ప్రశాంతంగా ఆలోచించి మాట్లాడడం చెప్పదగిన సూచన. ఉద్యోగస్తులకు అనుకున్నంత స్థాయిలో ఈవారం ఉండదు, కష్టపడినా దానికి ఫలితం తక్కువగా ఉంటుంది. అధికారుల వలన ఇబ్బందులు పడవచ్చు. రుణాలు విషయంలో లోన్స్ తీసుకోకపోవడం మంచిది. ఋణ వ్యవహారములలో స్వల్ప ఇబ్బందులు ఉండవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి కొంత నిరాశ అని చెప్పవచ్చు. కానీ ప్రయత్నాలు ఆపకండి, దైవ బలం తోడువుంటుంది. అతి కష్టం మీద అనుకున్న పనులు చేయగలుగుతారు.
వ్యాపారస్థులకు ఎదో ఒక రూపంలో ఆర్థికాభివృద్ధి కలసి వస్తుంది. ఖర్చులు కూడా ఎక్కువగా ఖర్చు చేస్తారు. విందు వినోదాలలో పాల్గొంటారు. అయితే స్నేహితులతో విరోధము వచ్చే విధంగా మాట్లాడడం, తగాదాలు పెట్టుకోవడం మంచిది కాదు. లేనిపోని ఉద్రేకములు, ఆందోళనలు పెట్టుకోవడం మంచిది కాదు. ఆరోగ్య పరంగా కొంత జాగ్రత్త వహించండి. గోచారరీత్యా లాభంలో రాహు సంచారం వలన ఖర్చు విషయంలో జాగర్త వహించాలి. లాభాలు వస్తాయి కానీ వాటిని ఖర్చు చేసే విషయంలో అవసరమైతే తప్ప ఖర్చు చేయకుండా ఉండడం మంచిది.
మిథునం: అనుకున్న పనులు నెరవేరక పోవడం వలన కొంత మానసిక వత్తిడికి గురవుతారు, ఉద్యోగస్తులకు అధికారం, అభివృద్ధి చేతికి అందిందని ఏమరుపాటుగా ఉండడం మంచిది కాదు. దాని వలన కొత్త సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. ఎవరిని నమ్మి అంతర్గత విషయములు చెప్పడం మంచిది కాదు. అన్ని విషయాలు గోప్యాంగ ఉంచండి. నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి కొంత అడ్డంకులతో కాస్త ఆలస్యంగా ఫలితములుంటాయి. వృధా ప్రయాణములు మిమ్మల్ని ఇబ్బంది పెట్టె అవకాశములు ఉన్నాయి. వ్యాపారస్తులకు మంచి కార్యసానుకూలత, వ్యవహారములు పట్ల విజయములు ఉండే అవకాశములు ఉన్నాయి. శత్రువర్గం నుండి విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ అనుకూలమైన ఫలితములు ఉంటాయి. మానసిక సంతృప్తి లభిస్తుంది.
కుటుంబ పరంగా జీవిత భాగస్వామితో చిన్నపాటి మాట పట్టింపులు ఉండే అవకాశములు ఉన్నాయి. కోపమును నియంత్రించుకోండి. తగాదాలకు దూరంగా ఉండడం అలాగే స్నేహితులతో సన్నిహితంగా ఉండడం చెప్పదగ్గ సూచనా. వివాహ ప్రయత్నములు చేసే వారికి కొంత అనుకూలమైన ఫలితములు గోచరిస్తున్నాయి. నూతన వస్తువులు కొనుగోలు చేసే అవకాశములు ఉన్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థిని విద్యార్థులకు మంచి అనుకూలమైన ఫలితములుండె సమయం అని చెప్పవచ్చు. పట్టుదలతో ముందుకు సాగండి. ఈ రాసి వారు మరింత ఫలితాలకు అంగారక పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. నిత్యం హనుమాన్ చాలీసా పఠించండి మంచి ఫలితాలుంటాయి. అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి అనే మీ భావన మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కొంత మంది మీకు నష్టం కలిగించే ప్రయత్నం చేస్తారు కానీ వాటి వలన ఎటువంటి ఇబ్బంది కలగదు దైవానుగ్రహం తోడువుంది.
కర్కాటకం: అన్ని విధముల అనుకూలమైన ఫలితములు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకు మంచి సానుకూలత ఉంటుంది. అధికార వృద్ధి అవుతుంది. మీరు తలపెట్టిన పనులు పూర్తి చేయగలుగుతారు. సాఫ్ట్ వేర్ రంగం వారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. పెండింగ్ లో వున్న ప్రమోటీన్స్ ఇంక్రెమెంట్స్ వచ్చే అవకాశం వుంది, అయితే అవి సంతృప్తి కరంగా ఉండకపోవచ్చు కానీ అధైర్య పడకండి, ఏమి జరిగిన మన మంచికే అనుకుని మీ పని మీరు చేసుకోండి. వ్యవసాయ రంగం వారికి, వినోద రంగం వారికి కొత్త పనులు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం. ఆటంకాలు వున్నాయి, అధిగమించి ముందుకు సాగండి. వ్యాపారస్తులకు, కంప్యూటర్ రంగం వారికి మంచి విజయములు సంప్రాప్తిస్తాయి. ప్రజాభిమానం, గౌరవం పెరుగుతుంది. ఆర్ధికంగా, అభివృద్ధి బాగుంటుంది.
రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు గడ్డు కలం అని చెప్పవచ్చు, వ్యాపారం అంత ఆశాజనకంగా ఉండదు. ఒక్క అడుగు ముందుకు వెళితే పది అడుగులు వెనకు నెట్టినట్టు అనిపిస్తుంది. అష్టమ శని వల్ల 8 శనివారలు శనికి తైలాభిషేకం చేయడం అఘోర పాశుపత హోమం చేయించడం చెప్పదగిన సూచన. విద్యార్థిని విద్యార్థులకు మంచి సమయం అని చెప్పవచ్చు. నూతన విద్యా ప్రణాళికలకు, కొత్త కోర్సులలో చేరుటకు మంచి సమయం అని చెప్పవచ్చు. విద్యాభివృద్ధి , శ్రద్ద పెరుగుతుంది. కుటుంబ పరముగా అన్ని విధాలా సౌఖ్యం ఏర్పడుతుంది. కుటుంబతో సంతోషంగా గడుపుతారు. సంతానంతో స్వల్ప మనస్పర్థలు ఉండే అవకాశములు ఉన్నాయి. కోపమును అదుపులో ఉంచుకోండి. గౌరవం మర్యాదలు పెరుగుతాయి. నలుగురిలో మాట చెలామణి అయ్యే అవకాశములు ఉన్నాయి. ఎలా ఉన్నప్పటికీ అంతర్గత విమర్శలు తప్పవు. ఆరోగ్యం బాగుంటుంది. వాహనములు నడిపేటప్పుడు, ప్రయాణముల విషయంలో జాగ్రత్త వహించండి. వివాహ ప్రయత్నములు చేసేవారికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు.
సింహం: కుటుంబ పరంగా, బంధువులు మూలంగా కష్టములు కానీ, ఇబ్బందులు కానీ ఏర్పడవచ్చు. లేదా జీవిత భాగస్వామితో, సంతానంతో విభేధములు వచ్చే అవకాశములు ఉన్నాయి. ఇంట్లో అశాంతి నెలకొంటుంది, పిల్లల వివాహం విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. నలుగురిలో మాట చెలామణి అవుతుంది. బయట స్నేహవర్గంలో గౌరవం, నలుగురిలో పలుకుబడి ఉంటుంది. బయట పేరు ప్రతిష్టలు వున్నా ఇంట్లో పరిస్థితులకు కొంత భాధ పడే అవకాశములు ఉన్నాయి. ఏమిటి ఇది అన్ని తెలిసిన మనకే ఇలా ఎందుకు జరుగుతోంది అని మానసికమైన క్షోభకు గురవుతారు. శివాలయంలో అభిషేకం కానీ అర్చన కానీ చేయించండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఉద్యోగస్తులకు సామాన్యంగా ఫలితములు ఉంటాయి ఈవారం. డబ్బు విలాసాలకు ఎక్కువ ఖర్చు చేస్తారు సేవింగ్స్ చేయడం కూడా ఒక భాగమని గుర్తుచేసుకోండి, రేపటి రోజు మనం ఇబ్బంది పడకూడదు అని గుర్తు పెట్టుకోండి.
అవసరానికి మన అనుకున్న వాళ్లే సహాయం చేయరు. అవసారిణికి మించి ఖర్చు చేయకపోవడం చెప్పదగిన సూచన. వ్యాపారస్తులకు ఆర్ధిక లాభముల కంటే గౌరవం అభివృద్ధి అవుతుంది. అయితే స్నేహితులే శత్రువులు అయ్యే అవకాశములు గోచరిస్తున్నాయి. మీమీద లేనిపోని విమర్శలు నిందలు చేసే అవకాశం వుంది. వాటిని పక్కన పెట్టి మీ నమ్మకంతో ముందుకు సాగండి మంచి ఫలితాలుంటాయి. విద్యార్థిని విద్యార్థులకు అతి కష్టం మీద అనుకున్న ఫలితాలు సాధిస్స్రు. శ్రద్ధ ఆసక్తి మారకుండా జాగ్రత్త వహించండి. ఆరోగ్యం కూడా జాగ్రత్తగా ఉంచుకోవడం చెప్పదగ్గ సూచన. సంతానం పై కొంత ప్రత్యేక శ్రద్ద వహించడం మంచిది. కుటుంబం లో కూడా కొంత ప్రశాంతత ఏర్పరచుకోండి. మీ సమస్యలను వారికి అర్ధమయ్యేల చెప్పడం మంచిది. లేకపోతే అనవసరమైన శ్రమ పడే అవకాశములు ఉన్నాయి.
కన్య: ఉద్యోగస్తులకు కొంత అశాంతి, అలసట వంటివి ఏర్పడే అవకాశములు గోచరిస్తున్నాయి. మీ బాధ్యతలను నిర్లక్ష్యం ఉండకుండా మీ పనులు మీరు అనుకున్నట్టు చేసుకుని పోవడం మంచిది. పని ఒత్తిడి పెంచుకోకుండా జాగ్రత్త వహించండి. ఇది అన్ని విషయములలో అనుకూలమైన ఫలితములు ఉండే అవకాశములు ఉన్నాయి. కుటుంబ పరంగా అండదండలు లభిస్తాయి. కుటుంబ సౌఖ్యం మీ ఆనందమునకు కారణమవుతుంది. ఏది ఏమైనప్పటికీ కుటుంబం ముఖ్యం అన్న భావనకు వస్తారు. అది ఇంట్లో వాళ్ళకి సంతోషాన్ని కలిగిస్తుంది. వ్యాపారస్తులకు మంచి అనుకూలమైన సమయం. ఆర్ధిక లాభములతో పాటు కీర్తి ప్రతిష్టలు పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి , సాఫ్ట్ వేర్ రంగం వారికి సానుకూల ఫలితాలు ఏర్పడతాయి.
ఎప్పటి నుండో ఇబ్బంది పడే విషయాలు, సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. పార్టీనేర్షిప్ వ్యాపారాలు అనుకూలిస్తాయి. నలుగురిలో కలవకపోవడం వల్ల భవిషత్తు లో ఇబ్బంది పడవచ్చు. అందిరిని కలుపుకుని వెళ్లడం వలన మంచి ఫలితాలను అందుకుంటారు. వివాహ ప్రయత్నములు అనుకూల ఫలితాలను ఇస్తాయి. జాతకాలను చూపించి అన్ని కుదిరితేనే ముందుకు వెళ్ళండి. మధ్యవర్తి చెప్పారు సంబంధం బాగుంది అని కాకుండా మనం కూడా అన్నివిధాలా అబ్బాయి కానీ అమ్మాయి కానీ వల్ల ఇష్టాలను తెలుసుకుని వెళ్లడం మంచిది. బంధువులతో, స్నేహితులతో వినోద యాత్రలు వంటివి చేసే అవకాశములు ఉన్నాయి. ఆరోగ్యం బాగుంటుంది. శారీరక ఆరోగ్యం కంటే మానసిక ఉల్లాసం పెరుగుతుంది. అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు.
తుల: గతంలో ఏర్పడిన కొన్ని ఇబ్బందులు తొలగిపోయే అవకాశములు గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా బంధువర్గంలో చిన్నపాటి అభిప్రాయం భేదములు ఉన్నప్పటికీ జీవిత భాగస్వామితో సానుకూలత ఏర్పడుతుంది. కుటుంబంలో వారికి నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి మంచి సమయం అని చెప్పవచ్చు. విద్యార్థిని విద్యార్థులకు మంచి ఫలితాలుండే సమయం అని కూడా చెప్పవచ్చు. ఎవరైనా నూతన విద్యా ప్రణాళికలకు, కొత్త కోర్సులలో చేరుటకు మంచి సమయం. విదేశములకు పైచదువులకోసం వెళ్ళడానికి ప్రయత్నములు చేసే వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. పట్టుదలతో ముంకుకు సాగండి. వృత్తి ఉద్యోగాలలో వున్నవారికీ పైఅధికారులతో గతంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లైతే కొంత సానుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశములు ఉన్నాయి.
అయితే మీయొక్క మాట తీరు లో కఠినత్వం ఉండకుండా నిదానంగా ఉండడం చెప్పదగ్గ సూచనా. ప్రశాంతంగా ఆలోచించి మాట్లాడండి. అన్ని బాగానే చేస్తారు కానీ చివరికి వచ్చే సరికి ఎదో ఒకటి మాట్లాడం వల్ల పడ్డ కష్టం అంతా వృధా అవుతుంది. వ్యాపారస్తులకు కూడా అనుకూలమైన లాభములు ఉంటాయి, అయితే మీ ముందు ఒకలాగా మీవెనుక ఒకలాగా మాట్లాడే మనుషులను గుర్తిస్తారు. అంతర్గత విషయాల విషయంలో గోప్యంగా ఉండడం మంచిది. ఎవరిని పడితే వారిని నమ్మడం మంచిది కాదు. అధికారమును సద్వినియోగ పరుచుకోవడం, నిలబెట్టుకోవడం మంచిది. ఆరోగ్య విషయంలో గతంలో ఉండే సమస్యలు తగ్గుతాయి. ఆరోగ్యం కొంత కుదుట పడుతుంది. ప్రేమ పెళ్లి విషయాలలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. ఇప్పుడు తీసుకునే నిర్ణయం వల్ల భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది అని గమనించాలి.
వృశ్చికం: అత్యంత జాగ్రత్త వహించాల్సిన సమయం అని చెప్పవచ్చు. అతి కష్టం మీద పనులు పూర్తయ్యే అవకాశములు ఉన్నాయి. జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తులకు పైఅధికారుల నుండి పని ఒత్తిడి, లేనిపోని నిందలు కానీ, చేయని తప్పుకు మాటలు పడాల్సి రావచ్చు. కొంత పని యందు నిర్లక్ష్యం లేకుండా అలెర్ట్ గా ఉండడం మంచిది. వ్యాపారస్తులకు కూడా కొంత జాగ్రత్త వహించడం మంచిది. బాగా నమ్మిన వారి వలన మోస పోవడం కానీ, వంచనకు గురి అవ్వడం కానీ జరిగే అవకాశములు ఉన్నాయి. కొంత అవమానుములు, అపవాదులు ఉండే అవకాశములు ఉన్నాయి. అయితే మీయొక్క మానసిక ధైర్యం వలన ముందుకు సాగుతారు. ధనం కూడా అధికంగా ఖర్చు అయ్యే అవకాశములు ఉన్నాయి.
కుటుంబ పరంగా చిన్న పాటి మనస్పర్థలు ఏర్పడే అవకాశములు ఉన్నాయి. కోపమును ప్రదర్శించకుండా ఉండడం చెప్పదగ్గ సూచన. ఇప్పుడు మీరు చూపించే ఓర్పు, సహనం మీకు భవిష్యత్తులో సమస్యలను పెరగకుండా ఉండడానికి సాయపడుతుంది. ఏదైనా ఒక విషయమునకు అతిగా ఆలోచించడం, పట్టుదలకు పోవడం మంచిది కాదు. చాలా నిదానం అవసరం. విద్యార్థిని విద్యార్థులకు అనుకున్నంత ఫలితాలు ఉండకపోవచ్చు. ఆందోళన చెందకండి. కష్టపడి కాకుండా, ఇష్టపడి చదివితే మంచి ఫలితాలుంటాయి. ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించండి. దీర్ఘకాలికంగా ఉన్న అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు.
ధనస్సు: అంత అనుకూలమైన సమయం కాదు. ప్రతికూల ఫలితములు గోచరిస్తున్నాయి. ఏది ఏమైనా కుటుంబ పరంగా అండదండలు ఉంటాయి అని భావిస్తారు. కుటుంబ పరంగా, జీవిత భాగస్వామితో, స్నేహితులతో సానుకూలత ఉంటుంది. విద్యార్థిని విద్యార్థులకు నీచ స్నేహములు, దుర్వ్యసనములకు దూరంగా ఉండడం మంచిది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. స్నేహితులని నమ్మి మోసపోవద్దు. మన అనుకున్న వాళ్లే మోసం చేసే అవకాశం వుంది. పట్టుదలతో, కృషితో ముందుకు సాగితే మంచి ఫలితాలుంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నములు కొంత ఆలస్య ఫలితాలును ఇచ్చే అవకాశములు ఉన్నాయి. ఉద్యోగస్తులకు వృధాప్రయాస పడే అవకాశములు ఉన్నాయి. పని చేసే చోట కానీ, కార్యాలయములలో కానీ సహా ఉద్యోగస్థులతో తో స్వల్ప ఇబ్బందులేర్పడవచు.
కాబట్టి వ్యవరాహారాల పట్ల జాగ్రత్త వహించండి. పని భారం పెరిగే అవకాశములు ఉన్నాయి. అధికవ్యయం అయ్యే అవకాశములు ఉన్నాయి. వ్యాపారస్తులకు ఆర్ధిక లాభములు ఉంటాయి. శత్రువులు కూడా అలాగే ఈర్ష్యా అసూయ తో వ్యవహరిస్తారు. మీ దగ్గర పని చేసే వారి పట్ల అప్రమత్తంగా ఉండడం మంచిది, లోకువగా అంటే వారి దృష్టిలో చులకన అయ్యే విధంగా ప్రవర్తించకండి. పనివారే కదా అనుకోవద్దు. తర్వాత ఇబ్బందులుండవచు. మీరు ఆవేశంగా ప్రవర్తించడం మంచిది కాదు. బంధువులతో కూడా విమర్శలకు గురి అవుతారు.
మకరం: రియల్ ఎస్టేట్ రంగం వారికి భూసంబంధమైన కార్య కలాపాలకు మంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. అయితే మీ అభివృద్ధి చూసి తట్టుకోలేని వారు అంటే అది మీ సొంత కుటుంబంలోని వారు అవ్వచ్చు వారికి మీమీద లేనిపోని అనుమానములతో, మీకు స్వల్ప అవమానములు చేసి, మీకు ఉద్రేకం కలిగించే అవకాశములు ఉన్నాయి. మనం ఏమి తప్పుచేయలేదు కదా అనే కోపంతో మీరు ప్రదర్శించే ఆవేశం చిన్నపాటి తగాదాలు జరుగవచ్చు. అయితే మీరు మీ విచక్షణ ను కోల్పోవద్దు. కొంత ఆలోచనాపూర్వకంగా మాట్లాడడం మంచిది.
వ్యాపారస్తులకు కూడా సానుకూలమైన ఫలితాలుంటాయి. ఉద్యోగస్తులు మాత్రం ముఖ్యంగా నూతనంగా ఉద్యోగంలో చేరినవారు మరింత జాగ్రత్త వహించి ఓర్పుతో ఉండడం మంచిది. పని ఒత్తిడి పెరుగుతుంది. విద్యార్థిని విద్యార్థులకు మంచి అనుకూల ఫలితాలుంటాయి. అయితే పోటీ పరీక్షలు, కాపిటషన్ పరీక్షలలో అనుకున్న ర్యాంక్ రాకపోవచ్చు. అనుకున్న మార్కులు రాలేదనే నిరాశ ఉండవచ్చు. కృషితో పట్టుదల తగ్గకుండా కృషి చేయండి. అలాగే యువత వ్యసనాల విషయంలో, విలాసముల విషయంలో అప్రమత్తంగా జాగ్రత్త వహించండి. లేనిపోని ఆడంబరములకు లొంగడం మంచిది కాదు. తద్వారా ఆరోగ్య పరంగా ఇబ్బందులుంటాయి. మానసిక ధైర్యం, ఆత్మ గౌరవం తో మెలగడం మంచిది.
కుంభం: అన్ని విధముల అనుకూలమైన ఫలితములు గోచరిస్తున్నాయి. ఆర్ధికంగా, కెరియర్ పరంగా ఎప్పటి నుండో సతమవుతున్న సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి, సాఫ్ట్ వేర్ రంగం వారికిమంచి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. టెక్నీకల్ రంగం వారికి, కొంత ఒడిదుడుకులు ఉండే అవకాశములు ఉన్నప్పటికీ పనులు నిదానంగా సాగుతాయి. అలాగే వివాహ విషయంలో చాలాకాలం నుండి ప్రయత్నములు చేస్తున్నాం, ఫలితంలేదు అనుకునే వారికి కూడా మంచి శుభసూచికలు గోచరిస్తున్నాయి. వివాహా ప్రయత్నములు చేయండి. వివాహం కుదురుతుంది. ఫలితములు అవే వస్తాయి.
అలాగే సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి సంతోషకరమైన వార్త వింటారు. ఇంట్లో కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఉద్యోగస్తులకు అభివృద్ధి ఉంటుంది. ఆదాయం స్థిరత్వం కనబడుతుంది. అయితే వ్యాపారస్తులకు అదృష్టముల కంటే కష్టమునకు తగిన ప్రతిఫలం ఉంటుందనే విషయంలో సందేహం లేదు. నలుగురిలో గౌరవం పెరిగిందనే తృప్తి లభిస్తుంది. కుటుంబ పరంగా సంతోషంగా గడుపుతారు. శుభకార్యములు, వ్యవహారములు అనుకూలిస్తాయి. విద్యార్థిని విద్యార్థులకు కూడా పెద్దల మాట విని, అవగాహనతో ప్రవర్తిస్తే మంచి విజయాలు వరిస్తాయి. ఆరోగ్యం కూడా గతంలో కంటే బాగుంటుంది. మానసిక ధైర్యం పెరుగుతుంది.
మీనం: కొంత అనుకూలమైన ఫలితములు గోచరిస్తున్నాయి. నూతన ఉద్యోగం కొరకు చేసే ప్రయత్నములు అనుకూలిస్తాయి. అయితే మీ యొక్క అభివృద్ధి క్రమక్రమంగా పెరుగుతుంది. మీ కష్టమునకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. విచారములు తొలగుతాయి. ప్రశాంతత ఏర్పడుతుంది. సాఫ్ట్ వేర్ రంగం వారికి స్వయం ఉపాధి రంగముల వారికి అనుకూలమైన ఫలితములు ఉండే అవకాశములు ఉన్నాయి. ఉద్యోగస్తులకు అధికారులతో ఏదైనా విభేధములు ఉంటె తొలగి పోతాయి. అభివృద్ధి కనబడుతుంది. వ్యాపారస్తులకు మంచి లాభములుంటాయి. ఎదో ఒక రకంగా అంటే ధన లాభం ఉంటుంది. మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తుంది. అయితే అనాలోచిత నిర్ణయములు, ప్రయాణములు ఇబ్బంది పెడతాయి.
ప్రయాణముల విషయంలో ఆలోచించి తప్పదు అంటేనే దూర ప్రయాణములు చేయడం మంచిది కాదు. వ్యవహారములు ఒక కొలిక్కివస్తాయి. వివాహాం కానీ వారికి, ప్రయత్నములు ముమ్మరం చేయండి. మంచి అవకాశములు గోచరిస్తున్నాయి. కుటుంబపరంగా, జీవిత భగస్వామితో సానుకూలత ఉంటుంది. స్నేహ వర్గంతో కలయిక ఏర్పడుతుంది. మనోవాంఛలు సిద్ధిస్తాయి. కుటుంబంలో ఏదైనా స్థిరమైన నిర్ణయములు, కానీ, శుభకార్యములుకు సంబందించిన ఎప్పటి నుండో అనుకున్న వివాహము వంటి విషయములలో తొందరగా నిర్ణయం తీసుకోండి. ఆలస్యం చేయవద్దు. విదేశాలలో చదువుకుంటున్న వారికీ మంచి కలం అని చెప్పవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఖర్చులు విషయంలో జాగర్త వహించండి.
- సోమేశ్వర శర్మ
+91 8466932223,
+91 9014126121