మేషం: పనులు చకచకా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలలో కొత్త మిత్రుల పరిచయాలు. ఇంటా బయటా ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి, వ్యాపారాలలో ఏర్పడిన చికాకులు తొలుగుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.
వృషభం: ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. అనుకోని అవకాశాలు పొందుతారు.
మిథునం: కుటుంబ సమస్యలు ఎదురైన అధిగమిస్తారు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. మిత్రులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. భాగస్వామ్య వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. శుభవార్తలు.
కర్కాటకం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు పొందుతారు. సంతానం నుండి కీలక సమాచారం అందుకొంటారు. నూతన వస్తు, వస్త్ర కొనుగోలు.
సింహం: వ్యవహారాలలో ఆటంకాలు ఎదురై చికాకు పెడతాయి. దూర ప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. ఆరోగ్య సమస్యల నుండి కొంత వరకు బయటపడతారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.
కన్య: దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. సన్నిహితుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. జీవితభాగస్వామి నుండి ఆస్తిలాభం పొందుతారు. విద్యావకాశాలు.
తుల: సంతానంనకు నూతన ఉద్యోగం లభించడం మీకు ఆనందాన్నికలిగిస్తుంది. పనులు సజావుగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలలో అభివృద్ధి సాధిస్తారు. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త కొంత ఆనందం కలిగిస్తుంది.
వృశ్చికం: బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుకొంటారు.వాహనాలు నడిపే విషయంలో జాగ్రత్త వహించాలి.
ధనస్సు: విద్యార్థులకు శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన చికాకులు తొలుగుతాయి. ఉద్యోగాలలో స్వల్ప మార్పులు వుంటాయి. ప్రయాణాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు.
మకరం: కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును.వృత్తి, వ్యాపారాల అభివృద్ధి సాధిస్తారు. ఉద్యోగులకు కొత్త హోదాలు పొందుతారు.
కుంభం: నూతన పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా వుంటాయి. తండ్రి ద్వారా ఆస్తి లాభం పొందుతారు. ఉద్యోగులకు ఉన్నత హోదాలు లభిస్తాయి. అరుదైన ఆహ్వానాలు.
మీనం: ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అధిగమిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. బంధువులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకొంటారు. ఆరోగ్యం పట్ల మెలుకువలు అవసరం. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం.
- సోమేశ్వర శర్మ
+91 8466932223,
+91 9014126121