వార ఫలాలు 24-12-2023 నుండి 30-12-2023 వరకు

మేషం: మిగిలిన అన్ని వ్యవహారములు కంటే కూడా  కుటుంబ పరంగా  మంచి సఖ్యత పొందే సమయం అని చెప్పవచ్చు. గతంలో ఏదైనా సమస్యలు ఉన్నప్పటికీ కుటుంబంలో ఆదరణ లభిస్తుంది. స్నేహవర్గంలో సహాయ సహకారములు, పాత మిత్రులను కలుసుకోవడం  వంటివి  జరుగవచ్చు. అనుకోని విధంగా  డబ్బు చేతికి అందడం వలన కుటుంబ పరంగా అనుకున్న పనులు నెరవేరుతాయి మంచి వాతావరణం నెలకొంటుంది. అయితే పని చేసే చోట కానీ, కార్యాలయాలలో కానీ, ఎక్కడైనా పెద్దవారితో, సీనియర్లతో  జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది.  ఉద్యోగస్తులకు పని భారం పెరుగుతుంది, అధికారులతలో జాగర్తగా వ్యవహరించాలి.  

నిర్లక్ష్యం చేయకుండా మీపని మీరు చూసుకుని అలెర్టుగా ఉండడం మంచిది. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోవడం, సలహాలు ఇవ్వడం అంత మంచిది కాదు. వ్యాపారస్తులకు  ఈ వారం ఆదాయం బాగుంటుంది, అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు, ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడం మంచిది, లేకపోతె అపరాధాలకు దారి తీస్తుంది. ఖర్చులను అదుపులో ఉంచుకోవాలి. విద్యార్థిని విద్యార్థులకు సానుకూలంగా ఉంటుంది. విద్యపై శ్రద్ద తగ్గకుండా జాగ్రత్త వహించండి. ఆరోగ్యపరంగా  బాగుంటుంది.  చిన్న చిన్న సమస్యలకు పట్టించుకోకండి. కొంత నిరాశ పక్కకు పెట్టి ముందుకు సాగండి.


వృషభం: ఉద్యోగరీత్యా మంచి అనుకూలమైన ఫలితములు ఉంటాయి. ప్రమోషన్లు, బదిలీలు వంటి వాటికి ప్రయత్నములు చేయడానికి ఇది మంచి సమయం అని చెప్పవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నములు వారికి  అతికష్టం  మీద ఫలిస్తాయి. కార్యాలయములలో  కానీ పనిచేసే చోట ఏవిధమైన సమస్యలైనప్పటికీ మీ యొక్క తేలితేటలు, శక్తీ సామర్ధ్యములతో పరిష్కరించుకుంటారు.  వ్యాపారస్తులకు ఆర్థికాభివృద్ధి ఉంటుంది. సాఫ్ట్ వేర్ రంగం వారికి అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. స్నేహితులతో మనస్పర్థలు  వచ్చే అవకాశములు ఉన్నాయి. వీలైనంత జాగ్రత్తగా మాట్లాడడం మంచిది. కుటుంబ పరంగా జీవిత భాగస్వామి తో మాట పట్టింపులు వచ్చే అవకాశములు ఉన్నాయి. ఉద్రేకం, కోపం నియంత్రించుకోండి. 

సంతాన పరంగా సంతోషకరమైన వార్తలు వింటారు.  కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. వివాహయాత్రలు చేస్తారు. ఖర్చు అదుపులో ఉండదు. ఎంత తగ్గించే ప్రయత్నం చేసినా అది జరగని పని అని తెలుసుకుంటారు.  ఏది ఏమైనప్పటికీ  ఈవారం కొంత మిశ్రమ ఫలితములు  కొంత అనుకూల ఫలితాలు ఉంటాయి. ఆందోళన చెందకండి. మానసిక ప్రశాంతత ఏర్పరచుకోండి. విద్యార్థిని విద్యార్థులకు  మంచి ఫలితాలుండే అవకాశములు ఉన్నాయి. పోటీపరీక్షల యందు విజయములు వరిస్తాయి. ఆరోగ్య పరంగా దీర్ఘకాలిక సమస్యలు ఉన్నట్లైతే మరింత  జాగ్రత్త వహించండి. ఆరోగ్య నియమములు పాటించండి. ఆహార క్రమశిక్షణ అలవాటు చేసుకోండి.


మిథునం: కొంత ప్రతికూలమైన ఫలితములుండె అవకాశములు ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి కొంత ఆలోచించి నిదానంగా ముందుకు సాగడం మంచిది. ఉద్యోగంలో మార్పులకు కూడా  ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. ఉద్యోగస్తులకు సామాన్యంగా ఉంటుంది. కొంత ఓర్పు సహనం వహిస్తే కొన్ని వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. టెక్నీకల్ రంగము  వారికి , భూసంబంధమైన వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులకు అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. అయితే కొంత నిదానంగా ముందడుగు వేయడం మంచిది. కుటుంబంలో ఏదన్నా కార్యక్రమములు, వ్యవహారములు  అనుకూలిస్తాయి. చిన్నపాటి విమర్శలు, అవమానములు తప్పవు. 

ఎన్ని  ఇబ్బందులు ఏర్పడినప్పటికీ అవసరముల మేరకు ధనం ఉంటుంది, అయితే  కొంత వృధాకోర్కెలు, అనాలోచితఖర్చులు, నిర్ణయముల విషయంలో జాగ్రత్త వహించడం చెప్పదగ్గ సూచన. ఎంత వచ్చినప్పటికీ ఖర్చులకు సరిపోక అప్పులు చేయడం మంచిది కాదు. ఇప్పుడు అప్పులు చేయడము  వలన ఇబ్బందులలో పడే అవకాశములు ఉంటాయి. శ్రమ  అధికం అవుతుంది. ఆరోగ్య పరంగా  బాగుంటుంది. అయితే శ్రమకు తగ్గ విశ్రాంతి తీసుకోవడం మంచిది, అలసట వలన అశాంతి చోటు చేసుకునే అవకాశములు ఉన్నాయి. విద్యార్థిని విద్యార్థులకు విద్యపై శ్రద్ధాసక్తులు పెరిగినప్పటికీ, కష్టపడినప్పటికీ పరీక్షలలో ఉతీర్ణత సాధించినప్పటికీ అనుకున్న ఫలితములు ఉండకపోవచ్చు. జాగ్రత్త వహించండి.


కర్కాటకం: కొంత అనుకూలంగా లేదని చెప్పాలి, కోపం, నిరాశను పక్కకు పెట్టి ముందుకు సాగితే అన్ని విధముల విజయములు వరిస్తాయని చెప్పవచ్చు. కొంత ప్రశాంతతను ఏర్పరచుకుని ధైర్యం గా ముందుకు అడుగు వేయండి. విద్యార్థిని విద్యార్థులకు  మంచి ఫలితాలుంటాయి. మీరు ఆశించిన దాని కంటే మంచి అవకాశములు వచ్చే సమయం. లేనిపోని ఆందోళనలు తగ్గించుకోండి. మీప్రయత్నం మీరు చేయండి. భవిష్యత్తు బాగుంది. ఉద్యోగస్తులకు పనిచేసే చోట, కార్యాలయములో సహా ఉద్యోగస్తులు కానీ, శత్రువర్గం కానీ అనుకూలంగా మారే సమయం అని చెప్పవచ్చు. నిన్నమొన్నటి దాకా మిమ్మలని ఇబ్బంది పెట్టినవారు కూడా కొంత అనుకూలంగా మారె అవకాశములు ఉన్నాయి. మీకు ఆశ్రయం కరంగా మారుతుంది. 

స్నేహితులతో సాన్నిహిత్యం ఏర్పరచుకోండి. వ్యాపారస్తులకు జనాకర్షణ పెరుగుతుంది. ప్రజాదరణ పొందుతారు. ఆర్ధిక లాభములుంటాయి. ఆరాధిక స్థిరత్వం లభిస్తుంది. నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి అనుకూలం. అలాగే వివాహ ప్రయత్నములు చేసే  వారికి కూడా అనుకూలమైన ఫలితములు గోచరిస్తున్నాయి. అన్ని విధముల కొంత తెలివితేటలతో, పెద్దల యొక్క సలహాలు తీసుకుని, మిత్రుల సహకారములతో ముందుకు సాగుతారు. ఆరోగ్య పరంగా కొంత సానుకూలత ఉంటుంది. కుటుంబముతో సంతోషంగా గడుపుతారు. స్థిరమైన నిర్ణయములు తీసుకుంటారు. కుటుంబ సభ్యులతో కలసి విహార యాత్ర చేస్తారు.


సింహం: ఏది ఏమైనప్పటికీ కొంత విలాస వంతమైన ఖర్చులు చేయడానికి చూస్తారు. వినోద యాత్రలపై శ్రద్ద చూపిస్తారు. అయితే మీ మనసును అధీనంలో ఉంచుకోండి. అవసరమైతే ప్రయాణాలు చేయండి. వృధా ప్రయాణాలు ఖర్చును మిగులుస్తాయి. ఉద్యోగస్తులకు సామాన్యంగా ఉంటుంది. వ్యవసాయ దారులకు మంచి దిగుబడి వచ్చే సమయం అని చెప్పవచ్చు. కొత్తగా మంచిపేరు కోసం పాకులాడడం కంటే ఉన్న మంచిపేరుని నిలబెట్టుకోవడం మంచిది. మీ అశ్రద్ధ వలన లేనిపోని అపకీర్తి వచ్చే ప్రమాదములు ఉంటాయి. జాగ్రత్త  వహించండి.  

అలాగే కళారంగం వారికి కూడా అనుకూలమైన సమయం.  స్థిరాస్తికి, వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయములు కొంత ఇబ్బంది పెడతాయి. వ్యాపారస్తులకు కొంత  జాగర్త వహించాలిసిన సమయం. ఎవరు స్నేహితులో, ఎవరు విరోధులో తెలుసుకునేలా నిదానంగా ప్రవర్తించడం మంచిది. రియల్ ఎస్టేట్ రంగం వారికి వ్యవహారాలలో  చిక్కులు, చికాకులు ఉంటాయి. కుటుంబ పరంగా కూడా సానుకూలంగా ఉండండి. జీవిత భాగస్వామితో మాటపట్టింపులు, సంతానంతో, ముఖ్యంగా కుమారులతో అభిప్రాయభేదములు వచ్చే అవకాశములు ఉన్నాయి. ఆలోచించి నిర్ణయములు తీసుకోవడం చెప్పదగ్గ సూచన. మీ ఆరోగ్యం తో పాటు మీ సంతానం యొక్క ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించండి. విద్యార్థులకు ఇది పరీక్షా సమయం అని చెప్పవచ్చు. పట్టుదలతో ముందుకు సాగండి. మంచి ఫలితాలుంటాయి.


కన్య: కొద్దీ పాటి  చిక్కులు చికాకులను  పక్కన పెట్టి జరిగిపోయిన దాని గురించి ఆలోచించకుండా జరిగేది చూసుకుని ముందుకు సాగితే అన్ని మంచి ఫలితములు వస్తాయి. అప్పుడు ఇలా అయింది, అనవసరంగా అన్నాను, లేకపోతే అనవసరంగా వాళ్ళు అన్నారు అంటూ కూర్చోవడం మంచిది కాదు. మానసిక ధైర్యం ఉంటె అన్ని మంచి ఫలితాలుంటాయనడానికి సందేహం లేదు. ధైర్యంగా మీ పనులు మీరు చేసుకోండి. ఉద్యోగస్తులకు ఈవారం బాగుంది,  మీ ప్రతిభను గుర్తిస్తారు. వ్యాపారస్తులకు ఆదాయ వృద్ధి కనబడుతుంది. గతంలో ఉన్న వ్యవహారములు కొంత చక్కబడతాయి. కుటుంబమే కాకుండా బంధువర్గంలోకూడా ఏదైనా  శుభ కార్యములు, వ్యవహారములు వంటివి ఒక కొలిక్కి వస్తాయి. 

వారసత్వ ఆస్తుల వ్యవహారములు ఉన్నవారు ఈ వారం నిదానంగా తెలివితేటలతో పరిష్కరించుకోవడానికి మంచి సమయం అని చెప్పవచ్చు. కుటుంబలో  సానుకూలత ఏర్పడే అవకాశములు ఉన్నాయి. మీ మాటకు వివ్లవనిస్తారు. ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయములు తీసుకోండి. తప్పక శుభ ఫలితములను పొందగలరు. వారం ద్వితీయార్థంలో  అనుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విద్యార్థిని విద్యార్థులకు కూడా అన్ని విధముల బాగుంటుంది. అయితే పోటీ పరీక్షలు కానీ, కొత్త కోర్సులు నిర్ణయాలు  కానీ ఉన్నట్లైతే స్నేహితుల, పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఆరోగ్యం బాగుంటుంది. గతంలో ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ప్రస్తుతం రిలీఫ్ అనేది ఉంటుంది.


తుల: మిశ్రమ ఫలితములు ఉంటాయి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసి విఫలం అయిన వారికి ఈ వారం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగం వస్తుంది, ప్రయత్నములు చేయండి. అయితే మీరు ఇంటర్వూలో ఎదురయ్యే సమస్యలకు చిన్న పాటి ఇబ్బందులకు చికాకు పడడం, తీవ్రమైన కఠినమైన మాటలు మాట్లాడడం మంచిది కాదు. కోపం, ఉద్రేకం మంచిది కాదు. మీ ఓర్పుకు సహనమునకు పరీక్షా అనుకుని మసలుకుంటే  మంచి ఫలితములు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులకు వ్యాపారం బాగుంటుంది,   వలసానికి  అధిక ఖర్చులు చేసే అవకాశం వుంది. ఊహించని బహుమానములు అందుకొనవచ్చు. కుటుంబ పరంగా శుభకార్యములు జరిగే అవకాశములు  ఉన్నాయి. 

వివాహం కానీ వారికి, కెరీర్ పరంగా సమస్యలు ఎదుర్కొనే వారికి కొంత సానుకూలమైన ఫలితాలుంటాయి. ప్రయత్నములు చేయండి. సాఫ్ట్ వేర్ రంగం వారికి, షేర్ల మార్కెట్ వారికి కొంత ప్రతికూలమైన సమయం అని చెప్పవచ్చు. రియల్ ఎస్టేట్ రంగం వారికి కూడా వ్యవహారములు విషయంలో జాగ్రత్త వహించండి, అనుకున్న దాని కంటే ఎక్కువ ఖర్చు పెట్టి కొనడం జరుగవచ్చు. అమ్మితే అడవి, కొంటె కొరివి అనేటట్టు ఆర్థికస్థితి ఉండవచ్చు. కొంత ఆలోచించి నిదానంగా  వ్యవహరించడం  చెప్పదగ్గ సూచన. ఆరోగ్య పరమైన జాగర్తలు తీసుకోవాలి. ముక్యంగా  గ్యోస్ట్రిక్, కంటికి సంబంధమైన వంటివి జాగర్త తీసుకోవాలి.


వృశ్చికం: గతంతో పోలిస్తే కొంత అనుకూలమైన వాతావరణం ఏర్పడుందని చెప్పవచ్చు. విద్యార్థిని విద్యార్థులకు మంచి విద్యాభివృద్ధి ఉంటుంది. శ్రద్ధాశక్తులతో  పాటు పట్టుదల కూడా పెరుగుతుంది. నూతన విద్యా ప్రణాళికలు చేసే వారికి మంచి సమయం. విద్యాభివృద్ధిపై నిర్ణయములు తీసుకుంటారు. ఉద్యోగస్తులకు కొంత నిరసలు ఉంటాయి. అనుకున్న పనులు అవ్వకపోవడం, అధికారుల నుండి ఒత్తిడి ఉండవచ్చు. చిన్నపాటి అవమానములు ఎదుర్కొనవలసి రావచ్చు, అయితే ఇది అందరి విషయములో కాదు కొంత ఉద్యోగ పరంగా బాగా ఇబ్బందులు చికాకులు ఉన్నవారికి మాత్రమే.  వ్యాపారస్తులకు అతి కష్టం మీద కార్యానుకూలత ఏర్పడుతుంది. ఆర్ధికంగా యధాతధంగా ఉంటుంది. కంగారు పడకండి. 

లాభాలు వుండవు ఆలా అని నష్టము ఉండదు అన్నట్టు  గడిచిపోతుంది. అయితే లాభములు లేకపోయినా పర్వాలేదు కానీ ఎదుటి వారిచే నమ్మక ద్రోహం జరగకుండా జాగ్రత్త వహించండి. వంచనకు గురి అయ్యే అవకాశములు ఉన్నాయి, నిర్లక్ష్య ధోరణిని అదుపులో పెట్టుకోండి. మీ కోపాన్ని అందరి ముందు  ప్రదర్శించడం మంచిది కాదు. మీ కోపం వలన మీ ఎదురుగా ఊరుకున్నప్పటికీ అంతర్గత శత్రువులు  ఎక్కువ అయ్యే ప్రమాదం లేకపోలేదు. శారీరక అనారోగ్యం కంటే మానసిక సంతృప్తి బాగుంటుంది. చిన్న చిన్న సమస్యలకు పట్టించుకోకుండా ముందుకు సాగండి. విద్యార్థిని విద్యార్థులకు కష్టపడిన దాని కంటే తక్కువ ప్రతిఫలం వచ్చిందనే భాధ ఉండవచ్చు.  భవిష్యత్తు బాగుంటుంది.


ధనస్సు: అత్యంత జాగ్రత్త వహించాల్సిన సమయం అని చెప్పవచ్చు. మీ మానసిక ధైర్యానికి పరీక్షా సమయం అని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు ప్రతికూల వున్నాయి,  మీ పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లకుండా చూసుకోవాలి. మీమీద ఇష్టం లేనివారు, మీ అభివృద్ధి ని ఓర్వలేని వారు  మీ వ్యక్తిత్వం పై  బురద చల్లే  అవకాశములు ఉన్నాయి.  కార్యాలయాలలో కానీ ముఖ్యం గా స్త్రీలతో వివాదములు దిగవద్దు. జాగ్రత్త వహించడం మంచిది. మీ కంటే తక్కువ స్థాయిలో ఉన్నవారితో మాటలు పడవలసి రావచ్చు. అది మీ మనో వేదనకు గురిచేస్తుంది ఎదో ఒకరకంగా అధిక ధన వ్యయం అయ్యే అవకాశములు ఉన్నాయి. వ్యాపారస్తులకు ప్రతికూల ఫలితాలు, వస్తునష్టం, శత్రువులు  ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి.  

స్నేహాలు విషయంలో జాగ్రత్త వహించాలి,  సహాయం చేసే  వారు ఎటువంటివారైనప్పటికీ మన విషయంలో సహాయం చేస్తున్నారు కదా అని అతి చొరవ ఇవ్వకండి.  మీకు ఉపయోగపడినప్పటికీ వారి వ్యక్తిత్వం  మారదు  కదా. ముల్లును తీయదానికి ఉపయోగపడింది అని ముల్లుని మంత్తో ఉంచుకోకూడదు. కుటుంబ పరంగా కొంత ఇబ్బందులు ఉంటాయి. కొంత దూరంగా జీవించడం జరుగవచ్చు. చంచల మనస్తత్వంతో ఆస్తి నష్టం జరిగే అవకాశములు ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ మీ యొక్క మనసును అధీనంలో ఉంచుకుంటే అన్ని శుభ ఫలితాలుంటాయి. విద్యార్థిని విద్యార్థులకు విద్యపై దృష్టి  తగ్గకుండా జాగ్రత్త వహించండి. సామాన్యంగా ఫలితాలుంటాయి. అనారోగ్య సమస్యలు కంటే మానసిక అశాంతి చోటు చేసుకునే అవకాశములు ఉన్నాయి. మానసికధైర్యంతో ముందుకు సాగండి.


మకరం: మంచి ఫలితములు సూచిస్తున్నాయి. వివాహం కానీ వారికి వివాహం కోసం  చేసే ప్రయత్నములు నెరవేరుతాయి. కుటుంబంలో ఎప్పటి నుండో వాయిదా పడిన శుభకార్యక్రమముల గురించి స్పందించడం జరుగుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ రంగం వారికి మంచి ఆదాయాభివృద్ది ఉంటుంది. వ్యాపారస్తులకు, కళారంగం వారికి, సినిమా రంగం వారికి కూడా అభివృద్ధి  కనబడుతుంది. మంచి అవకాశములు వచ్చే సమయం అని చెప్పవచ్చు.  ఉద్యోగస్తులకు సామాన్యంగా యధాతధంగా ఉండే అవకాశములు గోచరిస్తున్నాయి. అధికారులతో ఏదైనా వ్యవహారాలు ఉన్నట్లైతే కొంత ఆలస్యం జరుగుతుంది. చంచలత్వంతో కాకుండా మానసిక ధైర్యంతో ముందుకు సాగండి మంచి ఫలితాలు అందుకుంటారు. 

కొంత అనుకూల ఫలితాల కోసం ఉద్రేక పడకుండా  వేచి చూడడం మంచిది. ఫలితాలు రానందున లేని పోనీ అనుమానములు పెట్టుకోవడం మంచిది కాదు.  ఎవరిని నిందించవద్దు, దేవునిపై నమ్మకం పెట్టుకోండి. ఏది ఏమైనప్పటికీ అవసరాలకి  డబ్బు చేతికి అందడం వలన అనుకున్న పనులు  నిర్వహించగలుగుతారు. స్థిరాస్తి వృద్ధి చేసుకోవాలనుకునే వారికీ ప్రయత్నాలు చేస్తే మంచి ఫలితాలుంటాయి. నూతన వస్తువులు కొనుగోలు చేయడానికి మంచి సమయం అని చెప్పవచ్చు. కుటుంబ పరంగా  చిన్న చిన్న అభిప్రాయభేదములు వచ్చినప్పటికీ   తరువాత అవి సద్దుకుంటాయి.  ఆందోళన చెందకండి. విద్యార్థిని విద్యార్థులకు టెక్నీకల్ రంగం వారికి మంచి ఫలితాలుంటాయి. క్రీడాకారులకు మంచి అవకాశములు దొరుకుతాయి.


కుంభం: అనుకూలమైన ఫలితములు గోచరిస్తున్నాయి.  ఉద్యోగస్తులకు కొంత పని భారం  తగ్గుతుంది.  గృహంలో  ఏదైనా సమస్యలు ఉన్నట్లైతే ఒక కొలిక్కి వస్తాయి. కొత్తగా ఉద్యోగంలో చేరిన వారికీ కొంతఒడిదుడుకులు ఎదురవుతాయి.  ఆదాయం బాగుంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నములు చేసే వారికి అనుకూలమైన సమయము  అని చెప్పవచ్చు. మంచి ఫలితములు సంప్రాప్తిస్తాయి. ప్రయత్నములు చేయండి, మానసిక ఆందోళనలు పెట్టుకోవద్డు,  ఫలితాలను దేవునిపై భారం వేయండి.  తప్పక విజయాలు సాధిస్తారు. కుటుంబ పరంగా కూడా సుఖసంతోషములు ఉంటాయి. ఆదాయం బాగుంటుంది. 

సంతాన పరంగా కూడా వారి విజయములు వలన కూడా సంతోషం లభించే అవకాశములు గోచరిస్తున్నాయి.  సంతానం కొరకు వేచి చూసే వారికి శుభవార్తలు వినే  అవకాశములు ఉన్నాయి. విద్యార్థిని విద్యార్థులకు కొంత జాగ్రత్త వహించాల్సిన సమయం, అనుకున్నంత ఫలితాలుండకపోవచ్చు,  చెడు స్నేహాలకు దూరంగా ఉండడం మంచిది. ఎటువంటి ప్రలోభములకు లొంగవద్దు. మీ యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రవర్తించడం మంచిది. మీయొక్క సోమరితనం, నిర్లక్ష్య కారణంగా ఫలితాలు తారుమారు అయ్యే ప్రమాదం ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. కీళ్ల నొప్పులు, ఉబ్బసం, గ్యాస్ట్రిక్ , ఏ పని ముందుకు సాగకపోవడం వంటివి ఉంటాయి. ఈ రాసి వారికీ అఘోర పాశుపత  హోమం చేయించడం చెప్పదగిన సూచన.


మీనం: కొంత శుభకరమైన ఫలితములు గోచరిస్తున్నాయి. వివాహం కొరకు ప్రయత్నము చేసే వారికి కొంత సానుకూల ఫలితాలు ఏర్పడుతుంది. ఒకవిధముగా చేప్పాలంటే వివాహ విషయంలో   ఆలస్యం చేయకుండా నిర్ణయములు తీసుకోవడం మంచిది. ప్రస్తుతం గ్రహస్థితి  బాగుంది. ఉద్యోగ పరంగా కూడా ప్రమోషన్లు, చేతి వృత్తుల వారికి అనుకూలమైన లాభములు ఉండే అవకాశములు ఉన్నాయి. వ్యాపారస్తులకు ఆర్ధిక లాభములతో పాటు అనుకున్న పనులు పూర్తవుతాయి.  ఏదైనా వివాదాలు కానీ, వ్యవహారాలు ఒక కొలిక్కి వస్తాయి. ఏ విధమైన సమస్యలు వచ్చినప్పటికీ  బంధువర్గంలో ఎలా ఉన్నప్పటికీ   కుటుంబం యొక్క అండదండలు ఉంటాయి.  

ఆర్ధిక పరంగా యధాతధంగా ఉంటుంది. కుటుంబంలో పెద్దవారిపై ప్రేమాభిమానములు ఏర్పడతాయి, వారి సౌఖ్యం గురించి కూడా ఆలోచన చేస్తారు. వ్యాపారస్తులకు జానాదారణ పెరుగుతుంది. గతంలో స్వల్ప ఇబ్బందులు ఉన్నవారికి కొంత సానుకూలత ఏర్పడుతుంది. కోర్ట్ వ్యవహారములు ఒక కొలిక్కి వస్తాయి. మీరు పడిన కష్టానికి  మంచి ఫలితం లభిస్తుంది. ఆరోగ్యపరంగా శ్రద్ద వహించండి. దీర్ఘ కాలిక వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండండి. వాహనములు నడిపేటప్పుడు, ప్రయాణముల విషయంలో జాగ్రత్త వహించండి. విద్యార్థులకు సానుకూలంగా ఉంది. నూతన విద్యావిధానం కానీ, ఉద్యోగం కానీ ప్రయత్నం చేసే వారికి మంచి సమయం అని చెప్పవచ్చు. కష్టపడి చదివితే మంచి ఫలితాలుంటాయి.


                                            


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121