మేషం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వుండి చికాకు కలిగిస్తుంది. ఉద్యోగాలలో స్వల్ప మారులు వుంటాయి. మిత్రుల నుండి ధనలాభం పొందుతారు. క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు.
వృషభం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థికాభివృద్ధి సాదిస్తారు. ఋణవత్తిడుల నుండి బయటపడతారు. విలువైన వస్తు, వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.
మిథునం: బంధువుర్గం నుండి శుభవార్తలు అందుకుంటారు. పనులలో విజయం సాధిస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. నూతన అవకాశాలు లభిస్తాయి.
కర్కాటకం: మిత్రులతో ఏర్పడిన తగాదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. ప్రయాణాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. స్వల్ప ధన, వస్తు లాభాలు.
సింహం: ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. పట్టుదల పెరుగుతుంది. జీవిత భాగస్వామితో కలహాలు ఏర్పడినా పరిష్కరించుకుంటారు. సోదరుల నుండి ధనలాభం.
కన్య: మీలోని నైపుణ్యం వెలుగుచూస్తుంది. కొత్త పనులు చేపడతారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు, వాహనాలు కొనుగోలు చేస్తారు. సోదరుల కలయిక.
తుల: ముఖ్యమైన నిర్ణయాలు సొంత ఆలోచనలతో తీసుకుంటారు. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూరప్రాంతాల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆనందం కలుగిస్తాయి.
వృశ్చికం: వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వున్నా అవసరాలకు డబ్బు అందుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం. జీవిత భాగస్వామి నుండి ధనలాభం.
ధనస్సు: కుటుంబ సభ్యులను కలిసి ఆనందంగా గడుపుతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మానసిక ప్రశాంతత పొందుతారు. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.
మకరం: ఋణాలు కొంత వరకు తీరి ఊరట చెందుతారు. దీర్ఘకాలిక సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఉద్యోగాలలో స్థాన మార్పులు వుంటాయి. ఆరోగ్యం పట్ల మెలకువ చాలా అవసరం. స్వల్ప ధనలాభం.
కుంభం: వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించు కుంటారు. ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడుతుంది. సంతానం నుండి ధనలాభం.
మీనం: పట్టుదల పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. భూముల క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు పొందుతారు.
- సోమేశ్వర శర్మ
+91 8466932223,
+91 9014126121