మేషం: ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వుంటుంది. కీలక నిర్ణయాలలో జీవిత భాగస్వామి సలహాలు తీసుకుంటారు. ప్రయాణాలలో తొందరపాటు వద్దు. సంతానం నుండి వస్తు లాభాలు పొందుతారు.
వృషభం: కొత్త మిత్రులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. రాజకీయ కళారంగాల వారు సన్మానాలు పొందుతారు. కాంట్రాక్టులు లాబిస్తాయి. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు.
మిథునం: గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు. పనులు నిదానంగా పూర్తి చేస్తారు. తగాదాలకు కోపతాపాలకు దూరంగా వుండండి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును. వస్తులాభాలు.
కర్కాటకం: వృత్తి, వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. నూతన వ్యక్తులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. స్వల్ప ధనలాభం.
సింహం: ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు. మిత్రులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. విందు, వినోదాలు, శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. దూరప్రాంతాల నుండి ఆహ్వనాలు అందుతాయి.
కన్య: మిత్రులతో ఏర్పడిన మాటపట్టింపులు పరిష్కరించుకుంటారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా వుండటం మంచిది. ఆరోగ్య సమస్యలు కొంత వరకు తీరుతాయి. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు.
తుల: బంధువుల నుండి వత్తిడులు ఎదురైనా అధిగమిస్తారు. గృహనిర్మాణ ఆలోచనలు నిదానంగా సాగుతాయి. ఆరోగ్యం, వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు.ఉద్యోగాలలో స్వల్ప మార్పులు వుంటాయి. ధనలాభం.
వృశ్చికం: మీలోని ప్రతిభకు గుర్తింపు పొందుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.
ధనస్సు: వృత్తి, వ్యాపారాలలో అనుకూలస్థితి పొందుతారు. ప్రముఖుల కలయిక. విందు, వినోదాలు ఆర్థికలావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. భూముల క్రయవిక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది. వస్తు కొనుగోలు.
మకరం: ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. ఋణవత్తిడులు కొంత వరకు తీరుస్తారు. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న అవకాశం లభిస్తుంది. సోదరులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు.
కుంభం: నూతన ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. ఆరోగ్యం, వాహనాల విషయాలలో జాగ్రత్త అవసరం. ప్రయాణాలు లాభిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.
మీనం: ప్రయాణాలు లాభిస్తాయి. సంఘసేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. నూతన వస్తు, వస్త్ర కొనుగోలు.
- సోమేశ్వర శర్మ
+91 8466932223,
+91 9014126121