మేషం: నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. మిత్రుల ద్వారా విలువైన సమాచారం అందుతుంది. విందు, వినోదాలు ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు.
వృషభం: కుటుంబ సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా వుంటుంది. వృత్తి, వ్యాపారాలలో ఆటంకాలు ఎదురైనా సన్నిహితుల సాయం పొందుతారు. స్వల్ప ధనలాభం.
మిథునం: వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాబాలు పొందుతారు. సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. సోదరుల నుండి శుభవార్తలు వింటారు.
కర్కాటకం: కుటుంబ సభ్యులతో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు. ఆరోగ్య సమస్యలు ఎదురైనా అదిగమిస్తారు. చేపట్టిన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. నూతన వస్తు లాభం.
సింహం: పనులలో విజయం సాధిస్తారు. స్థిరాస్థి వివాదాలు పరిష్కారమై లబ్ది పొందుతారు. ప్రయాణాలు లాభిస్తాయి. దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆనందం కలిగిస్తుంది. వాహనయోగం.
కన్య: బంధువులను కలిసి ఉల్లాసంగా గడుపుతారు. ప్రముఖుల నుండి ఆహ్వానాలు అందుతాయి. పాతమిత్రుల నుండి సాయం పొందుతారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. అరుదైన ఆహ్వానాలు.
తుల: చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆరోగ్యం. వాహనాల విషయాలలో నిర్లక్ష్యం తగదు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.
వృశ్చికం: బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. దూరప్రయాణాలు లాభిస్తాయి. ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. శ్రమకు తగిన ఫలితం కష్టమే. స్వల్ప ధనలాభం.
ధనస్సు: వివాదాల నుండి బయటపడతారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. వాహనసౌఖ్యం. సంఘంలో ఆదరణ పొందుతారు. భూముల క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు.
మకరం: నూతన కార్యక్రమాలు చేపడతారు. మిత్రుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. అప్రయత్న కార్యసిద్ధి. రాజకీయ, కళారంగాల వారికి ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం లభిస్తుంది.
కుంభం: కుటుంబ సభ్యులతో ఏర్పడిన మాటపట్టింపులు తొలగుతాయి. వృత్తి, వ్యాపారాలలో అవరోధాలు ఏర్పడినా అధిగమిస్తారు. ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. వస్తులాభాలు.
మీనం: ముఖ్యమైన పనులు నిదానంగా పూర్తి చేస్తారు. గృహనిర్మాణ ఆలోచనలలో తొందరపాటు వద్దు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. క్రయవిక్రయాలలో స్వల్ప లాభాలు.
- సోమేశ్వర శర్మ
+91 8466932223,
+91 9014126121