మేషం: ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దూరప్రాంతాల నుండి శుభవార్తలు అందుకొంటారు. సంఘంలో ఆదరణ పొందుతారు. ఆకస్మిక ధనలాభం పొందుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి. అరుదైన ఆహ్వానాలు.
వృషభం: ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామి సలహాతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. నూతన వస్తు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. వివాహ యత్నాలు ఫలిస్తాయి.
మిథునం: గృహ నిర్మాణ ఆలోచనలు కలిసి వస్తాయి. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. శుభవార్తలు అందుతాయి.
కర్కాటకం: భూవివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు తీరి ఊరట చెందుతారు. ఆరోగ్య సమస్యలు అధిగమించి ముందుకు సాగుతారు.
సింహం: కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. దీర్ఘకాలిక సమస్యలు కొంత వరకు తీరుతాయి. సోదరుల నుండి ధనలాభం పొందుతారు. గృహం, స్థలాలు కొనుగోలు యత్నాలు ఫలిస్తాయి. సభలు, సమావేశాలలో చురుకుగా పాల్గొంటారు.
కన్య: ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు. రుణ బాధలు తొలుగుతాయి. కాంట్రాక్టులు దక్కుతాయి. శ్రమకు తగిన ఫలితం దక్కుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
తుల: వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుతుంది. ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగులకు స్థానమార్పులు వుంటాయి. స్వల్ప ధన, వస్తు లాభాలు.
వృశ్చికం: మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుకొంటారు. పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.
ధనస్సు: సంఘంలో గౌరవం పొందుతారు. విందు, వినోదాలు శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుకొంటారు. వృత్తి, వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి. కాంట్రాక్టులు లాభిస్తాయి.
మకరం: రుణ బాధలు తొలుగుతాయి. అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగాలలో బాధ్యతలు పెరిగినా సమర్థవంతంగా నిర్వహిస్తారు. దూరప్రాంతాల నుండి అరుదైన ఆహ్వానాలు.
కుంభం: ఉద్యోగాలలో పదోన్నతులు పొందుతారు. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన వుంటుంది. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. కీలక నిర్ణయాలు తీసుకొంటారు.
మీనం: ముఖ్యమైన వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. సోదరులను నుండి కీలక సమాచారం అందుతుంది. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా వుండును.
- సోమేశ్వర శర్మ
+91 8466932223,
+91 9014126121