మేషం: ఆర్థిక లావాదేవీలు లాభసాటిగా సాగుతాయి. ప్రముఖులను కలుస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనగోలు చేస్తారు. అనుకోని అతిథుల నుండి శుభవార్తలు అందుతాయి. వాహన సౌఖ్యం.
వృషభం: అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి. మిత్రుల నుండి వచ్చిన ఆహ్వానాలు వల్ల ఆనందం కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. సోదరుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. కాంట్రాక్టులు దక్కుతాయి. ఇంటాబయటా ప్రోత్సాహం.
మిథునం: రుణ బాధల నుండి బయటపడతారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వివాదాలకు దూరంగా వుండండి. ఇంటాబయటా మీదే పై చేయిగా వుంటుంది. ఉద్యోగాలలో స్థానమార్పులు వుంటాయి. నూతన వస్తుకొనుగోలు.
కర్కాటకం: దూరప్రాంతాల నుండి వచ్చిన వార్త ఆశ్చర్యపరుస్తుంది. వృత్తి, వ్యాపారాలు విస్తరిస్తారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుతుంది. తండ్రి నుండి ఆస్తి లాభాలు పొందుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు.
సింహం: అనుకోని ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు. సంఘంలో ఆదరణ పొందుతారు. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. కాంట్రాక్టులు లాభిస్తాయి.
కన్య: ఆర్థిక పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తి, వ్యాపారాలు లాభిస్తాయి. రాజకీయ, పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వరంగాల నుండి ఆహ్వానాలు అందుతాయి. సోదరుల నుండి శుభవార్తలు అందుకొంటారు.
తుల: ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధి పొందుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇతరుల విషయాలలో జోక్యం తగదు. వృత్తి, వ్యాపారాలలో ఎదురైన ఆటంకాలు తొలుగుతాయి. వస్తు లాభాలు.
వృశ్చికం: అనుకోని అవకాశాలు పొందుతారు. వాటిని సద్వినియోగం చేసుకోండి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా వుండును. దీర్ఘకాలిక సమస్యలు కొంత వరకు తీరుతాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. వివాహ యత్నాలు.
ధనస్సు: కుటుంబ సమస్యలు తీరి ప్రశాంతత పొందుతారు. దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు.
మకరం: రుణాలు తీరి ఊరట చెందుతారు. పూర్వపు మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. పట్టుదలతో ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.
కుంభం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సంఘంలో ఆదరణ పొందుతారు. చిన్ననాటి మిత్రులను కలిసి కష్టసుఖాలను పంచుకొంటారు. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. క్రయవిక్రయాలలో లాభాలు. వస్తు లాభం.
మీనం: ముఖ్యమైన వ్యవహారాలలో ఎదురైన ఆటంకాలు కొంతవరకు తొలుగుతాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. సంగీత, సాహిత్యాలపై ఆసక్తి చూపుతారు. ఉద్యోగ, వివాహ యత్నాలు ఫలిస్తాయి.
- సోమేశ్వర శర్మ
+91 8466932223,
+91 9014126121