వార ఫలాలు 18-02-2024 నుండి 24-02-2024 వరకు

మేషం: వారికీ ఈ వారం మీ నైపుణ్యాన్నీ అంది వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి  మంచి అవకాశం అని చెప్పవచ్చు, ఉద్యోగ ప్రయత్నాలు ముమ్మరం చేసుకోండి ఉద్యోగం వస్తుంది. పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. భూములు కొనుగోళ్లు అమ్మకాల విషయంలో జాగర్తలు తీసుకోవాలి, గృహం కొనాలనుకునే వాళ్ళకి మంచి సమయంగా చెప్పవచ్చు, ఎప్పటినుండో కళలు కంటున్న వారికీ ఇది మంచి తరుణం అని చెప్పవచ్చు.  ఎన్నో రోజులనుండి వున్న పెండింగ్ పనులు పూర్తి చేయాలి అనుకుంటారు, అవి పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు అనుకూలిస్తాయి, ధన లాభం వుంది, కొత్త ప్రాజెక్టులు మొదలు పెట్టుకోవచ్చు, అయితే అలోచించి నిర్ణయాలు తీసుకుంటే లాభపడతారు లేకపోతె కొంత నష్టం వాటిల్లే పరిస్థి ఏర్పడుతుంది. 

సినీ కళారంగం వారికీ మంచి అనుకూలం అని చెప్పవచ్చు, పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి, బంధు వర్గం నుండి కొంత అపకీర్తి వస్తుంది, స్నేహితులు, బంధువులలో మనస్పర్థలు తలెత్తుతాయి,  సరియైన సమయంలో భోజనాలు లేక గాని అకాల భోజనం ఉంటుంది, మానసిక శారీరక అసౌఖ్యానికి గురువతారు. విహహానికి సంబంధించి మంచి వార్తలు వింటారు, శుభకార్యాలు చేస్తారు, ఎవరు ఎన్ని చెప్పినా మీ మనో ధైర్యంతో ముందుకు సాగుతారు, దైవానుగ్రహం తోడుంటుంది. ఖర్చులు ఎంత తగ్గిద్దాము అనుకుంటే ఎదో రూపేణా ఖర్చు అవుతుంది అయితే మంచి పనికే ఉపయోగ పడుతుంది. రాజకీయ యత్నాలు, చర్చలు ఫలిస్తాయి,  నలుగురు నడిచిందే బాట మనమెందుకు నడవ లేమనే భావన కలుగుతుంది, కార్యాచరణ కోసం యోచన చేస్తారు. విద్యార్థిని విద్యార్థులు మంచి ఫలితాలుంటాయి, మీ యొక్క కష్టానికి మంచి ఫలితం ముందు వుంది అని చెప్పవచ్చు, విదేశాలలో వుంటున్నవారికి ఈ వారం వుద్యోగం లభించే అవకాశం వుంది.


వృషభం: వారికి ఈ వారం స్థాయి లేని వ్యక్తులకు సారధ్యం చేయాల్సి వస్తుంది. వాళ్ళ సలహాలు సంప్రదింపులు నిత్యం అవసరమవుతాయి. విలువైన వాస్తు సామాగ్రి కొనుగోళ్లు చేస్తారు, స్పెక్యులేషన్ లాభించదు. రాజకీయపరంగా జరిగే మార్పులు కొంత ఊరట కలిగిస్తాయి, ఉన్నత స్థాయి వ్యక్తులు తగిన విధంగా ప్రవర్తించలేదని, సాయ పడలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తారు, భూమి సంబంధిత వ్యవరాహాలు కలసి వస్తాయి, ఆర్ధిక ఇబ్బందులు అధిగమిస్తారు, పొదుపుకు సంబంధించి పురోగతి సాధిస్తారు, గతంలో దాచిన ఆర్థిక పత్రాలు ఉపయోగ పడతాయి, మీకు అనుకూలంగా వ్రాయబడిన దస్తా వేజులలో ముఖ్యమైన పత్రాలలో కొన్ని లోపాలను గమనిస్తారు. ఇష్టపడి కొనుగోలు చేసినా వాటిని తిరిగి మార్పు చేయాలనీ యోచిస్తారు. బంధు వర్గం, మిత్ర వర్గం సలహాలు విసుగు కలిగిస్తాయి. ఎవరు ఆప్తులో, ఎవరు నిజమైన హితులో తేలుచుకోలేరు, ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది, రకరకాల సమస్యలు అన్నిటికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. 

సంతాన పరంగా పురోగతి బాగుంటుంది. పోటీ పరీక్షలు విదేశీ యానం, వుద్యోగం వంటి ముఖ్యమైన విషయాలు కుటుంబానికి కలసి వస్తాయి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉత్సాహంగా చేస్తారు, ఆరోగ్య పరంగా తీసుకునే జాగ్రత్తలు మంచి ఫలితాన్నిస్తాయి. వాహనం స్వయంగా నడిపేటప్పుడు జాగర్తలు అవసరం, డాక్టర్స్, లాయర్స్, చార్టెడ్ అకౌంటెంట్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వీరికి మంచి అవకాశములు, ప్రఖ్యాతి, ధనప్రాప్తి మొదలైనవి లాభిస్తాయి, వివాహం కానివారికి ఈవారం వివాహం నిశ్చయమవవుతుంది. సంతానం లేనివారికి సంతాన ప్రాప్తికి కొద్దీ అవకాశాలు గోచరిస్తున్నాయి. విద్యార్థిని విద్యార్థులకు విదేశీయాన ప్రయత్నములు లాభిస్తాయి, ఒక శుభవార్తను వింటారు. ఇంటర్వ్యూలకు అనుకూల సమయం, వ్యాపారస్తులకు ఈ వారం బాగుంటుంది, నూతన వ్యాపార ప్రయత్నాలను కొద్దీ కాలం  పాటు వాయిదాను వేసుకోవడం మంచిది, పనిలో నైపుణ్యం గల వ్యక్తులు సహాయ సహకారాలనిస్తారు. పాత ఋణాలు వసూలవుతాయి. కష్టానికి తగిన ఫలితం వస్తుంది.


మిథునం: వారికి ఈ వారం మీరు చేయాలి అనుకున్న కార్యక్రమాలను వెంటనే అమలు చేయడం మంచిది, ఉన్నతాధికారుల నుండి అవసరమైన సహాయము అందకపోవచ్చు. అవసరమైన వాటికీ ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు. విద్య సంబంధిత విషయాలు, ఉద్యోగ కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆత్మీయులతో కలసి విందు వినోదాలలో పాల్గొంటారు. దైవానుగ్రహం ఉండడం వలన ఏ కార్యక్రమాలు చేపట్టినా ఆటంకాలు లేకుండా కొనసాగుతాయి. మీరు అనుకున్న పనిని సాధించి విజయాన్ని పొందగలరు. ప్రభుత్వము నుండి రావలసిన బిల్స్, చెక్స్, సమయానికి అందకపోవడం వలన ఆంటంకాలు ఎదురైనా నెమ్మదిగా సానుకూల పడతాయి. గృహ నిర్మాణ, భూమి కొనుగోలు మొదలైన విషయాలు నెమ్మదిగా సానుకల పడతాయి. 

వ్యాపారంలో లాభం వస్తుంది అని చేపట్టిన కార్యక్రమాలు నష్టాలను చవి చూడవలసి వస్తుంది. వ్యాపార సంబంధమైన పేపర్స్, డాకుమెంట్స్ మొదలైనవి అందుతాయి. వృత్తి రీత్యా మీరు చేసే ప్రయాణాలు అనుకూలిస్తాయి, వ్యాపార నిమిత్తం ఆర్ధిక సంస్థలను ఆశ్రయించవలసి వస్తుంది. వ్యాపారంలో చేసే మార్పులు సత్ఫాలితాలనిస్తాయి. సాంస్కృతిక కార్యక్రమాలు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, వైద్యవిద్య, మందుల వ్యాపారము, విదేశీ యత్నాలు అనుకూల దిశలో పయనిస్తాయి. వాహన సౌఖ్యం ఏర్పడుతుంది. స్థిరాస్తులను కొనుగోలు చేసే ఆలోచనలు ఫలిస్తాయి. సంతాన విషయంలో ప్రత్యేక శ్రద్ధను వహిస్తారు. ఈ విషయాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు సంతృప్తిని కలిగిస్తాయి. వ్యక్తిగత సంభాషణలు ద్వారా ప్రత్యర్థుల రహస్య కార్యకలాపాలు బయట పడతాయి. చెడుగా ప్రచారం చేసే వ్యక్తులకు దూరంగా వుండండి. 


కర్కాటకం: వారికి ఈ వారం ఆదాయ వ్యయాలు సమానంగా లేకపోయినా ఏ ఇబ్బంది లేకుండా డబ్బు సర్దుబాటు అవుతుంది. నూతన వస్త్రాలు, వస్తువులు, వాహనాలు కొనేటప్పుడు మీ అంచనాలు దాటకుండా చూసుకోండి. మనసుకు ఇష్టం లేకపోయినా వృత్తి పరమైన బాధ్యతలను చేయవలసి ఉంటుంది. దీని వలన అధికారుల నుండి మాట పడకుండా ముందు జాగర్త చర్యలును పాటించండి. దైవ దర్శనాలు చేస్తారు. దైవానుగ్రహం వలన మనశాంతి పొందగలుగుతారు. మీకు సంబంధము లేని బరువు బాధ్యతలను మీ మీద వేయాలి అని కొంతమంది వ్యక్తులు ప్రయతిస్తారు. మీ తెలివి తేటలతో వాటిని తప్పించుకోండి. ఆహార విషయాలలో తగు జాగ్రత్తలను పాటించ వలసి ఉంటుంది. బంధువులతో కలసి విందు వినోదాలలో పాల్గొంటారు. వివాదాస్పద వ్యవహారాలు పరిస్కారమవుతాయి. టెండర్లు అతి కష్టము మీద అనుకూలంగా వస్తాయి. పెట్టుబడి పెట్టిన వారికీ (భాగస్వాములకు) భాగాలు ఇవ్వవలసి రావచ్చు. వ్యాపారంలో కొత్త సంప్రదాయాలను ప్రవేశ పెడతారు. రాజకీయ పరమైన మార్పులు మీ వృత్తి వ్యవహారాలను ప్రభావితము చేస్తాయి. ధైర్యంతో తీసుకునే నిర్ణయాలు కొంత లాభిస్తాయి. 

అష్టమ శని ప్రభావం వలన ఆరోగ్య పరమైన ఇబ్బందులు తలెత్తవచ్చు. 8 శనివారాలు శనీశ్వరునికి తైలాభిషేకం చేసి నల్ల నువ్వులు దానంగా ఇవ్వండి. మంచి ఫలితాలుంటాయి. ఆరోగ్యం పట్ల జాగర్త వహించండి. బయట జంక్ ఫుడ్స్ కు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలి. శత్రువులుగా భావించిన వ్యక్తులే మీ కార్యక్రమాలకు చేయూతనివ్వడానికి ముందుకు వస్తారు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి కొంత నిరాశ ఎదురవుతుంది, దగ్గర దాకా వచ్చిన సంబంధం చేజారిపోయిందే అని చింతిస్తారు. జీవిత భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు జాగర్త వహించాలి, ముఖ్యంగా  సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో తగు  జాగర్తలు అవసరమని సూచన. విద్య సంబంధమైన విషయంలో తర్జన భర్జన పడతారు ఏ కోర్స్ తీసుకుంటే బాగుంటుంది అని. స్నేహితులు, సన్నిహితులు, పెద్దల సహాయ సహకారం తీసుకొని ముందుకు వెళ్ళండి.


సింహం: వారికి ఈ వారం కొత్తగా వ్యాపార వ్యవహారాలకు, విద్యా సంబంధితమైన విషయాలకు, గృహ నిర్మాణ సంబంధిత కార్యక్రమాలను ప్రారంభించడానికి అనుకూల సమయం. నూతన ఉద్యోగ ప్రయత్నాలకు అనుకూల కాలం, సహోదర వర్గానికి సహాయ పడవలసిన కారణం చేత కొంత ఆర్థిక భారానికి తోడు, కొన్ని మనస్పర్థలు రావచ్చు. అది మీ మనసుకు బాధను, మానసిక అశాంతి కలిగిస్తుంది. దూరంగా ఉన్న ఆత్మీయులు అపార్థం చేసుకున్నాము అనే రోజు వస్తుంది. సహనాన్ని పాటించండి. క్రయ విక్రయాల నందు జాగర్తలు పాటించాలి. ప్రభుత్వం నుండి రావలసిన బెనిఫిట్స్ అందుతాయి. ఎంతో కాలంగా పెండింగ్ లో ఉన్న ఫైలు మీద అధికారుల ఆమోద ముద్ర పడుతుంది.  ఆరోగ్య పరమైన జాగర్తలు వహించండి. మీతో సాన్నిహిత్యం పెంచుకుని మీకు అనుమానం రాకుండా రహస్యాలను సేకరించే ప్రయత్నాలు జరుగుతాయి, జాగర్తపడాల్సిన సమయం అని గ్రహించండి. సాంకేతిక కారణాల వాళ్ళ ముఖ్యమైన విషయాలు వాయిదా పడతాయి.

హడావిడిగా నిర్ణయాలు తీసుకోకండి, ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, విద్యా సంబంధమైన విషయాలు అనూకిలిస్తాయి, పరీక్షా సమయం కాబట్టి అధిక శ్రమ పడాల్సి వస్తుంది, దక్షిణమూర్తి అనుగ్రహానికి మేధోదక్షిణామూర్తి రూపు ధరించండి. అదే విధంగా దక్షిణమూర్తి శ్లోకాన్ని నిత్యం పఠించండి. రాజకీయ పరమైన వ్యవహారాలు ఓ కొలిక్కి వస్తాయి, మీరు ఆశించిన ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయి. ప్రజాధారణ లభిస్తుంది, అయితే కొంత నిదానంగా సాగుతాయి పనులు. వివాహ సంబంధ విషయాలు ఓ కొలిక్కి వస్తాయి, సంబంధం కుదురుతుంది, ఏప్రిల్ లోపు శుభకార్యాలు పూర్తి చేయగలుగుతారు, దిగులు పడవలసిన పని లేదు, ఆ దైవానుగ్రహం మీకు ఎళ్లవేళ రక్షిస్తుంది. భాగస్వామి వ్యాపారాలలో చిక్కులు వస్తాయి, ఫైనాన్స్ విషయంలో జాగర్తలు తీసుకోండి, ఈరోజు కాకుండా రేపటి రోజు కోసం, భవిషత్తు కార్యాచరణ, ప్రణాళికలు చేయండి.


కన్య: వారికి ఈ వారం వృత్తి ఉద్యోగాల పరంగా సానుకూల ఫలితాలు ఏర్పడతాయి, విదేశీ సంబంధమైన విషయాలు కలిసివస్తాయి, ఇతరుల పరపతిని నమ్ముకోకుండా మీ యొక్క స్వయంకృషిని నమ్ముకుని ముందుకు వెళ్ళండి విజయం సిద్ధిస్తుంది. స్వయంగా నూతన ప్రయత్నాలుమొదలుపెట్టి కొంత అభివృద్ధిని కూడా సాధిస్తారు. వ్యాపార విషయాలు బాగుంటాయి, పెట్టిన పెట్టుబడి వస్తుంది, రియల్ ఎస్టేట్ పుంజుకుంటుంది, ప్రయాణాల్లో జాగర్త వహించాలి, భాగస్వామితో విభేదాలు రాకుండా చూసుకోవాలి, బంధు, మిత్రులతో ఆనందంగా గడుపుతారు, శుభకార్యాలలో పాల్గొంటారు. మీరు తలపెట్టిన శుభకార్యలలో ద్విగ్విజయంగా పూర్తిచేస్తారు. ముఖ్య స్థానాలలో ఉన్న వ్యక్తులు సన్నిహితం అవుతారు. విదేశాలలో ఉన్న వారికి చేతి దాకా వచ్చి ఉద్యోగం చేజారి పోతుంది.  అయితే  ఉద్యోగం చేస్తున్నవారికి మీరు కోరుకున్న మార్పులు సానుకూల పడతాయి. 

ప్రింటింగ్, ఇతర రవాణా ఖర్చులు చాల అధికమవుతాయి. సంతాన పరంగా బాగుంటుంది. మానసిక సంతోషానికి ఇది కూడా ఒక కారణం. శ్రమను మర్చిపోతారు. వంశ పారంపర్య విషయ వ్యాపారాలు అభివృద్ధి చేస్తారు. నిర్మాణ వ్యవహారాలు అనుకూలిస్తాయి. మీరు ఆశించిన ఫలితాలను అందుకుంటారు. వీసా పాస్పోర్ట్, గ్రీన్ కార్డు వంటివి ఇతర దేశాలలో అవసరమైన అన్ని విషయాలు లాభిస్తాయి. కొత్త అవకాశాలు కలసి వస్తాయి. రాజకీయ రంగంలో ఉన్నవారికి కొంత ప్రతికూలమైన వాతావరణం ఏర్పడుతుంది, ప్రతి విషయంలోనూ ఆచితూచి నిర్ణయాలు చేయండి. శత్రు వర్గం పొంచివుంది, ఇతరులకి ఏ విషయంలోనైనా అవకాశం ఇవ్వకండి. అన్నింటికీ ముఖ్యం ప్రశాంత వాతావరణం ఏర్పరుచుకొని, మనోధైర్యంతో ముందుకు వెళ్లడం ద్వారా మంచి ఫలితాలను సాధించగలుగుతారు.


తుల: వారికి ఈ వారం ఆధ్యాత్మిక వాతావరణం సంతృప్తి కలిగిస్తుంది. వ్యాపారంలో రోటేషన్స్ బాగుంటాయి. ఆర్ధికంగా లాభం చేకూర్చే వ్యవహారాలు కలసి వచ్చి, సానుకూలిస్తాయి. కొత్త కాంట్రాక్టులు వస్తాయి. కళా సాహిత్య రంగాలలోని వారికీ నూతన అవకాశాలు వస్తాయి. స్థిరాస్తి వృద్ధి చెందుతుంది. సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్స్ రంగాల వారికి మంచి పురోగతి బాగుంటుంది, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్ వచ్చే సూచనలు ఉన్నాయి. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు లాభిస్తాయి. వివాహ విషయాలు ఒక కొలిక్కి వస్తాయి , శుభకార్యలలో చురుకుగా పాల్గొంటారు, ప్రేమ వివాహాలు, ప్రేమ వ్యవహారాలు అంతగా ఫలించవు, ఇబ్బందులు ఎదురుకోవలసి వస్తుంది. కార్యాలయంలో కొంత మంది ప్రవర్తన ఇష్టము లేకపోయినా మౌనంగా భరిస్తారు. సమయం కోసం నిరీక్షిస్తారు. 

ప్రస్తుతానికి మౌనమే మేలు అని గమ్మునుంటారు. ఒక గ్రూపును విడదీసి కొంత మందిని మీ వైపుకు తిప్పుకుంటారు. చిన్ననాటి స్నేహితులతో కలసి విహార యాత్రలు చేస్తారు. వృత్తి వ్యాపారాల పరంగా సమయ స్ఫూర్తి అవసరమౌతుంది. వృత్తి పట్ల నిర్లక్ష్యం వలన పైఅధికారుల నుండి మాట పడవలసి వస్తుంది, జాయింట్ వ్యవహారాలు, కాంట్రాక్టలు మొదలైన వాటికి సంబంధించి వ్యవహారాలు వాయిదా వేయవద్దు, ఎప్పటి కప్పుడు పూర్తి చేయండి. నిర్లక్ష్య ధోరణితో ఉండవద్దు. రాజకీయ రంగంలో ఉన్నవారికి మంచి అభివృద్ధి ఉంటుంది, విషయ వ్యవహార విషయాలలో జాగర్తలు తీసుకోవాలి, లేకపోతె ఇబ్బంది పడవచ్చు, అందరూ మనవాళ్ళు అనుకోవద్దు, వెన్నుపోటు పొడిచేవాళ్ళు ఉంటారని గ్రహించండి. విద్యార్ధులకు విద్యా విషయంలో బాగుంటుంది, మంచి అభివృద్ధి కనబరుస్తారు, ఆరోగ్య విషయం లో జాగర్తలు తీసుకోవాలి.


వృశ్చికం: వారికి ఈ వారం వృత్తి వ్యాపార, ఉద్యోగాలలో మీ నైపుణానికి ఉన్న శక్తిని చూపిస్తారు. విదేశీ ఉద్యోగము, సాఫ్ట్వేర్ కోర్స్ మొదలగు విషయాలు లాభిస్తాయి. డ్రైవింగ్ విషయంలో జాగర్త వహించండి, ఈ వారం ఓర్పుతోనే విజయం సాధించగలరు. విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్య, ఉద్యోగ విషయంలో  నూతన వృత్తి వ్యాపారాలకు మంచి శుభప్రదం అని చెప్పవచ్చు. విద్యార్థులకు విద్య సంబందించిన దూర ప్రయాణాలు ఫలిస్తాయి. వివాహ ప్రయత్నాలు సానుకూల పడతాయి అయితే మీరు మధ్యవర్తి వ్యవహారంలో మాట పడవలసి వస్తుంది కానీ అందరు మనవాళ్ళు కదా అని ముందుకు సాగుతారు, మీ విలువ వాళ్ళకి అర్థం కాదు. అన్ని మేమే చేసాము కదా అనుకుంటారు. 

ఏదయితేనే సంబంధం కుదిరింది కదా అని సంతోషపడతారు.  స్థిరాస్తి విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. వైద్య రంగం, సాఫ్ట్వేర్ రంగం, సినీ కళారంగం వారికీ శుభ ఫలితాలు. దంపతుల మధ్యన కొద్దిపాటి భేదాభిప్రాయాలు  రావచ్చు. కుటుంబ విషయంలో ఇతరుల జోక్యం అధిక మౌతుంది. ఓర్పు బాగా అవసరమని చెప్పదగిన సూచన.  ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి, విందు, వేడుకలు, శుభకార్యములలో పాల్గొంటారు. శుభకార్యాలు, పూజలు ధాన ధర్మాలకు ధనాన్ని వెచ్చిస్తారు. రావల్సిన బకాయిలు వసూలు అవుతాయి. జాయింట్ వ్యాపారం, కాంట్రాక్టులకు అనుకూలం. నూతనంగా భాగస్వామ్య వ్యాపారాలు ప్రారంభించాలి అనుకుంటే అన్నీ చెక్ చేసుకొని, దగ్గరుండి చూసుకోండి. తద్వారా మీకు వ్యాపార లావాదేవిల విషయాలపై మంచి అవగాహన ఏర్పడుతుంది. భవిష్యత్తు కాలంలో మీకు అక్కరకు వస్తుంది. రాజాకీయ పరంగా బాగుంటుంది, ప్రజాధారణ  పొందుతారు.


ధనస్సు: వారికి ఈ వారం శుభప్రదంగా ఉంది. వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధి ఉంటుంది. గతంలో ఆగిపోయిన ప్రొమోషన్స్ వచ్చే అవకాశాలు వున్నాయి, ఆరోగ్య పరమైన జాగర్తలు తీసుకోవాలి, పాదాలు, కండరాలు సంబదించిన ఇబ్బందులు తలెత్తవచ్చు. వ్యాపార రీత్యా ఆర్థిక స్థితి బాగుంటుంది. విదేశీ వ్యవహారాల అనుకూలిస్తాయి. మీరు నిర్వహిస్తున్న సంస్థలు అభివృద్ధి పథంలో నడుస్తాయి, లాభాలు బాగుంటాయి, అనుకున్న పనిని పెండింగ్ లేకుండా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. భూమి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, భూ సంబంధమైన ముఖ్యమైన విషయ వ్యవహారాలు నత్త నడక నడుస్తాయి. కాలం కలసి రానప్పుడు మన అనుకున్నవాళ్ళు కూడా మొహం చాటేసే విధంగా ప్రవర్తిస్తారు, మీ ఉపాయలతో చాల విషయాల వరకు విజయం సాధిస్తారు.

విద్యార్ధులు చదువు మీద శ్రద్ధను చూపించాలి. ఇన్నాళ్ళు ఏదోలా చదువుని సాగించినా ఇప్పుడు మీ భవిష్యత్తు కోసం కష్టపడాల్సిన సమయం.  చదువుపై అశ్రద్ధ చేస్తే మొదటికే మోసం అయ్యే అవకాశాలున్నాయి. జాగ్రత్త వహించండి. వివాహం కోసం చేసే ప్రయత్నాలలో ఫలితాలు కొంత ఆలస్యంగా వస్తాయి, శుభకార్యాలలో పాల్గొంటారు. అయితే మాట విషయంలో జాగర్తలు తీసుకోవాలి. జీవిత భాగస్వామితో మనస్పర్ధలు ఏర్పడతాయి. అనవసరమైన చర్చల వలన ఇబ్బందులను కొనితెచ్చుకుంటారు. సంతాన పరంగా ఆధ్యాత్మిక విషయాలు సంతృప్తిని ఇస్తాయి. పాత స్నేహితులతో కలసి నూతన ప్రణాళికలు రచిస్తారు. రాజకీయ రంగంలోని వారికి కొంత జాగర్తలు తీసుకోవాలి, ఆరోగ్య పరమైన జాగర్తలు కూడా తీసుకోవాలి, ముఖ్యమైన వ్యవహారాలను నమ్మకస్తులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి.


మకరం: వారికి ఈ వారం చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు, ముఖ్యమైన వ్యవహారాలు మాత్రం నిదానంగా సాగుతాయి, ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా ఉంటాయి. గృహం కొనుగోలు కోసం చేసే ప్రయత్నాలు కొంత వరకు ఫలిస్తాయి. ఉద్యోగ రీత్యా అనుకూలంగా ఉన్నా సహచర్యలు నుండి ఇబ్బంది ఏర్పడవచ్చు. అనుకోని దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. నూతన వస్తువులు, వాహనాలు కొనుగోలు చేస్తారు. బంధువుల నుండి శుభవార్తలు వింటారు. కళా, రాజకీయ రంగంలోని వారికి సన్మాన, సత్కారాల  యోగం గోచరిస్తున్నది. క్రయ విక్రయాలలో ఊహించిన లాభాలు అందుకుంటారు. భూ సంబంధమైన, రియల్ ఎస్టేట్ రంగం వారికి అనుకూల ఫలితాలుంటాయి, ఆర్థిక  పరమైన ఇబ్బందుల నుండి బయట పాడటానికి  ఋణాలు తీసుకోవలసి వస్తుంది. ఆత్యవసరమైతే తప్పా ఋణాల జోలికి వెళ్ళవద్దు. 

బంధువులతో, మిత్రులతో విభేదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎగుమతి, దిగుమతి వ్యాపార వ్యవహారాలు అనుకూలిస్తాయి, రావాలసిన ధనం సకాలంలో అందక ఆర్ధిక పరంగా ఇబ్బంది పడతారు, ఉన్నత విద్యా,  విదేశాలలో చదువుకుంటున్న వారు తొందరపాటు నిర్ణయాల వల్ల కొంత ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఏలినాటి శని నడుస్తుంది వలన 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేయించండి, అఘోర పాశుపత హోమం చేయడం చెప్పదగిన సూచన. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ వారం కొంత అనుకూలం అని చెప్పవచ్చు, వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడుల విషయం లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి, అవసరమైతే తప్పా ఈ వారం ఇన్వెస్ట్ చేయకపోవడం మంచిది,  ఆరోగ్య పరంగా కొంత జాగర్తలు అవసరం. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని ఇబ్బంది పెడతాయి.


కుంభం: వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగంలో ఇబ్బందులు ఏర్పడవచ్చు, కష్టానికి తగ్గ ఫలితం అందదు, మీరు ఎంత కష్టపడ్డా ఇంతేనా అన్న మాటలు వినవలసి వస్తుంది. ఆరోగ్య పరమైన జాగర్తలు తీసుకోవాలి, మోకాళ్ళ నొప్పులు, వెన్ను నొప్పి ఎక్కువవుతుంది, శుభకార్యాలలో పాల్గొనడానికి ఇష్టపడరు. అయితే శుభకార్యాలు చేయడానికి ఆలోచనలు చేస్తారు, ఋణాలు తీసుకోవలసి వస్తుంది, ఎన్ని బాధలు ఉన్నా ఎవరికీ చెప్పారు. ఎవరో ఎదో చెప్పారు అని, మన అనుకున్న వాళ్ళు మోసం చేసారని భావిస్తారు, నిజ నిజాలు తెలుసుకోకుండా నిందిస్తారు. అవి తరవాత బాధపడతారు. అన్నిన్నిటికి డబ్బే మూలం అని భావిస్తారు. దాని వలన కొంత మంది అప్తులను వదులు కుంటారు.  

ఇతరుల పేరు మీద చేస్తున్న వ్యాపార లావాదేవిల  ఆదాయం మనది కాదని తెలుసుకుంటారు. ఊహించిన లాభాలు మాత్రం లెక్కలో కనిపించవు. విదేశీయన ప్రయత్నాలు, విదేశాలలో ఉంటున్న వారికి, మీరు కోరుకున్న ఉద్యోగం వస్తుంది. ముఖ్యమైన పోటీ పరీక్షలలో కష్టం మీద విజయం సాధిస్తారు. ప్రతి పని మీరు దగ్గరుండి చూసుకోవడం మంచిది, ఆత్మీయ వర్గం వల్ల,  భాగస్వాముల వల్ల కొన్ని ప్రయోజనాలను కోల్పోతారు. రాజకీయ పరమైన విషయాలలో ఇబ్బందులు ఏర్పడవచ్చు. ఆశించిన ఫలితాలకోసం ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. ముఖ్యమైన వ్యవహారాలు అలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాల వలన తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.


మీనం: వారికి ఈ వారం ఆర్థిక పరమైన అంశాలు కొంత మేర మెరుగు పడతాయి. వృత్తి ఉద్యోగాలలో కొన్ని అనుకోని మార్పులు వస్తాయి. అదనపు ఆదాయం లభించే అవకాశాలు, మార్గాలు లభ్యమౌతాయి. పాస్ పోర్ట్, వీసాలకు సంబందించిన విషయాలలో సాంకేతిక లోపాలు రాకుండా జాగర్త వహించండి. ఎడతెరిపి లేని మీ ఆలోచనల వలన మానసిక ఒత్తిడి అధికం అవుతుంది. కోర్టు వ్యవహారాలు సానుకూలపకూడతాయి.  వ్యాపారపరమైన వ్యవహారాలు అనుకూలిస్తాయి. ఆత్మీయుల వలన మానసికంగా కొంత అశాంతి ఉంటుంది. మీ స్థానాన్ని లాక్కోవాలని ఆశించిన వారు భంగ పడతారు. దైవానుగ్రహము తోడుంటే చెడు కూడా మంచిగా మారుతుందని రుజువవుతుంది. వ్యాపార విషయంలో నిర్లక్ష్యము పనికి రాదు, సంఘంలో పరపతి పెరగడంతో పాటు శత్రువులు కూడా అధికమవుతారు. రాజకీయ వ్యవహారాలలో మధ్యవర్తి వలన కొంత మేర లాభ పడతారు. మీ నిజాయతీని నిరూపించుకోవల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అతి కష్టము మీద ఈ సమస్య నుండి బయటపడతారు. 

ఆరోగ్య సమస్యలు ఉంటాయి, స్కిన్ ఎలెర్జి, గ్యాస్ట్రిక్ వంటివి ఇబ్బందులు పెట్టవచ్చు. అప్రమత్తంగా ఉండండి, ఆహార నిలయమాలు పాటించండి. జీవిత భాగస్వామితో విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. ఒక మాటకి వంద మాటలు పేర్చుకొని మాటామాట పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆధ్యాత్మిక పూజ కార్యక్రమాలు, అలాగే  బంధువులతో కలసి శుభకార్యాలలో పాల్గొంటారు. మనం ఏమి చేసినా చెల్లుతుంది, నేను చెప్పిందే వేదం అనే మీ ధోరణి వలన మీకు మీరే ఇబ్బందులలో పడతారు, ఇది అందిరికి కాదు కొంతమంది మాత్రమే.  సంతాన విషయంలో తగు జాగర్తలు అవసరం, విద్యార్థిని విద్యార్థులు స్ట్రెస్ తగ్గించ్చుకోవాలి, సరైన సమయంలో ఆహరం తీసుకోవాలి, కొత్త కోర్స్ అభ్యసించాలని నిర్ణయం తీసుకునే వారు అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి, ఇప్పుడు పరిస్థితులు అంత అనువుగా లేవు. నిత్యం గణపతి గకారస్తోత్రం పఠించండి మంచి ఫలితాలుంటాయి.


- సోమేశ్వర శర్మ 

+91 8466932223,

+91 9014126121