మేషం: పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. రుణ వత్తిడుల నుండి బయటపడతారు. సోదరులను కలిసి ఆనందంగా గడుపుతారు. మిత్రుల నుండి కీలక సమాచారం అందుతుంది. రాబడి పెరుగుతుంది.
వృషభం: అనుకోని సమస్యలు ఎదురైనా అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు. సంఘంలో గౌరవం పొందుతారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. స్వల్ప ధనలాభం.
మిథునం: బంధువులతో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకొంటారు. సంతానంనకు నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా వుండును. మానసిక ఉల్లాసం పెంపొందించుకుంటారు.
కర్కాటకం: ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. పెట్టుబడులకు తగిన లాభాలు అందుకుంటారు.
సింహం: అనుకోని అవకాశాలు లభిస్తాయి. వాటిని సద్వినియోగం చేసుకోండి. వృత్తి- వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆస్తి వివాదాలు తీరి ఊరట చెందుతారు. నూతన ఆభరణాలు కొనుగోలు చేస్తారు.
కన్య: మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. సోదరుల నుండి శుభవార్తలు అందుకొంటారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.
తుల: దీర్ఘకాలిక సమస్యలు ఎదురై చికాకులు పెడతాయి. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. బంధువులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకొంటారు. కుటుంబ సభ్యుల నుండి సహాయ సహకారాలు అందుతాయి.
వృశ్చికం: బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. విలువైన వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సంతానంనకు సాంకేతిక విద్యావకాశాలు లభిస్తాయి.
ధనస్సు: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూర ప్రాంతాల నుండి విలువైన సమాచారం అందుతుంది. క్రయ, విక్రయాలలో లాభాలు పొందుతారు.ఆర్థికపరంగా, ఆరోగ్యపరంగా బాగుంటుంది.
మకరం: ఆర్థిక ఇబ్బందులు ఎదురైన అధిగమించి ముందుకు సాగుతారు. అనుకోని అవకాశాలు ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకొంటారు. ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. ఆరోగ్యం పట్ల మెలుకువ అవసరం.
కుంభం: కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. వివాదాలకు దూరంగా వుండండి. శుభకార్యాలలో చురుకుగా పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభం.
మీనం: వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. దూరపు బంధువుల నుండి కీలక సమాచారం అందును. కీలక నిర్ణయాలలో సొంత ఆలోచనలు శ్రేయస్కరం.ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం.
- సోమేశ్వర శర్మ
+91 8466932223,
+91 9014126121