How to Perform sadhana On Makara Sankranthi

మకరసంక్రాంతి

సూర్యుడు మకరరేఖ నుండి ఉత్తర కర్కాటక రేఖ వైపు ప్రయాణించడాన్ని 'ఉత్తరాయణం' అని, దక్షిణంలో మకరరేఖ వైపు ప్రయాణించడాన్ని 'దక్షిణాయనం' అని వ్యవహరిస్తారు. ఉత్తరాయణం ఆరు నెలలలో సూర్యుడు మకరరేఖ నుండి మిథునం వరకు ఆరు రాశులలో సంచరిస్తాడు. దక్షిణాయనం ఆరు నెలలలో సూర్యుడు కర్కాటకరాశి నుండి ధనుస్సురాశి వరకు ఆరు రాశులలో సంచరిస్తాడు. భగవద్గీత ఏం చెబుతుందంటే … 'ఉత్తరాయణం ఆరు మాసాలలో దేహం త్యజించిన బ్రహ్మవేత్తలైన యోగులు బ్రహ్మను చేరుకుంటారు' అని. అందుకే భీష్మపితామహుడు కూడా ఉత్తరాయణ కాలం వచ్చే వరకు వేచి చూసి దేహత్యాగం చేశాడు.

 

మకరసంక్రాంతి సాధనా విధానం

బాహ్యమైన సూర్యతత్వం 365 రోజులూ జాగృతమై ఉంటుంది. కాని, లోపలి సూర్యతత్వాన్ని కొన్ని విశిష్ట మొహూర్తాలలో మత్రమే మేల్కొల్పవచ్చు. అలా రోగ నివారణకు సాధన చేసి సూర్యతత్వాన్ని జాగృతం చేయదగిన ఉత్తమైన ముహూర్తమే మకర సంక్రాంతి. మానవుల శరీరంలోని  ప్రతి అవయవానికి ఒక కారకగ్రహం ఉంటుంది అని శాస్త్రాలు వివరిస్తున్నాయి. అలాగే ఒక్కొక్క గ్రహం బలహీనంగా ఉంటే దానికి సంబంధించన రోగం ప్రాప్తిస్తుంది. జాతకంలో నేత్రాలు గుప్తరోగాలు, ఉదర సంబంధిత రోగాలు, తెల్లమచ్చలు (బొల్లి), హృదయ (హార్ట్) సంబంధిత రోగాలు మొదలిన వాటికి సూర్యుడు కారకుడుగా చెప్పబడుతున్నాడు. సూర్యగ్రహం దూశితమైతే పైన పేర్కొన్న రోగాలలో ఏదైనా రావచ్చు. పైన పేర్కొనబడిన రోగాలలో దేనితోనైనా బాధపడే వారికి ఈ సాధన సహాయపడుతుంది.

సమకూర్చుకోవలసిన పూజాసామాగ్రి:

పావుమీటరు ఎఱ్ఱని రంగు వస్త్రం, ఒకటింపావు కిలోల గోధుమలు, స్వర్ణకాంతి కల సూర్యయంత్రం,  మాణిక్యం చెక్కిన సూర్యప్రతిమ, సూర్యయంత్ర లాకెట్, సిందూరీమాల, వెండిలో పొదిగిన రుద్రాక్ష, నువుల లడ్డు మొదలైనవి.

మకర సంక్రాంతి రోజు సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం లోపున సాధన పూర్తిచేయవచ్చు. ముందుగా కాలకృత్యాలు తీర్చుకుని స్నానాదికాలు, సంధ్యావందనాలు పూర్తి చేసుకున్న వరువాత శుభ్రంగా ఉన్న ఎఱ్ఱని వస్త్రాలు ధరించాలి (ధోవతి, ఉత్తరీయం లేదా పైజామా చొక్కా). ప్రశాంతమైన ప్రదేశం (గది, పూజామందిరం, దేవాలయ ప్రాంగణం లేదా నదీ తీరం)లో ఈ ప్రయోగం చేసుకోవచ్చు. ప్రయోగం చేయడానికి తూర్పుదిషకు అభిముఖంగా కూర్చోవాలి. కూర్చోవడానికి ఎఱ్ఱని ఉన్ని ఆసనంపైన లేదా దర్భాసనంపైన కూర్చుని ఎదురుగా పీట లేదా బల్లపై ఎఱ్ఱని వస్త్రం పరచుకుని దానిపై సూర్యయంత్రం స్థాపించాలి. దీనితోపాటు సూర్యప్రతిమ కూడా స్థాపించుకోవచ్చు. ఎదురుగా పెట్టుకున్న పీట లేదా బల్లపై ఒక పళ్ళెం పెట్టి దానిలో చందనంతో అష్టదళ పద్మం చిత్రించాలి. పద్మం పశ్చిమం నుండి తూర్పుదిశకు, ఉత్తరం నుండి దక్షిణానికి, ఆగ్నేయం నుండి వాయవ్యానికి, ఈశాన్యం నుండి నైరుతికి రేఖలు గీయాలి. ఈ అష్టదళ పద్మం ఒక ప్లస్ గుర్తు, ఒక ఇంటూ గుర్తు కలిసినట్టు ఉంటుంది. వీటి అంచులకు కలిపితే అష్టదళ పద్మం తయారవుతుంది. ఇప్పుడు ఆ అష్టదళ పద్మంపై ఎఱ్ఱని పూల రేకలు పరుచుకుని, వాటిపై మాణిక్యం పొదిగిన సూర్యప్రతిమ, సూర్యయంత్రం లాకెట్ స్థాపించుకోవాలి. పళ్ళెంలో గోధుమలను రాశిగా పోసి వెండిలో పొదిగిన ఆరు ముఖాల రుద్రాక్ష స్థాపించి దానిపై సూర్యయంత్రం ఉంచుకోవాలి. అక్షితలు, నీళ్ళు, కుంకుమ, పువ్వులు తీసుకుని సంకల్పం చెప్పుకుని తన కోరికను విన్నవించి సాధన నిర్విఘ్నంగా పూర్తి కావాలని ప్రార్థించిన చేతిలోని నీటిని వదిలివేసి, సూర్యుణ్ణి ధ్యానించాలి. ఒక పాత్రలో గంగాజలం తీసుకుని అందులో చందనం, గులాబీరేకులు వేరుకుని ఒక పువ్వుతో ఆ నీరు, ఆ మూడింటిపై చిలకరిస్తూ … 'ఓం హ్రారం హ్రీం హ్రౌం సః సూర్యాయ నమః' మంత్రం జపించాలి. జపం మధ్యలో పైకి లేవకూడదు. ఆ దివ్యవస్తువులను శుద్ధమైన నీటితో శుభ్రం చేసి తుడిచి మొదటి పళ్ళెంలో ఉంచాలి. తరువాత వాటికి కుంకుమ, కేసరం, చందనంతో బొట్టుపెట్టి పూలు (ఎఱ్ఱనివి)ర్పించి సంక్షిప్త పూజ చేయాలి. సింధూరీమాల తీసుకుని తీసుకుని …

 

ఓం హ్రాం హ్రీం హ్రౌం సః ఓం భూర్భువః సవః ఓం ఆకృష్ణేన రాజసా వర్తమానో నివేశయన్నమృతంత్ర్యం చ !

హిరణ్యయేన సవితా రథేన దేవోయాటి భువనాని పశ్యన్ ఓం స్వః భువః భూః ఓం సః హ్రౌం హ్రీం హ్రాం ఓం సూర్యాయ నమః !!

 

జపం పూర్తయిన తరువాత సూర్యుడిని మళ్ళీ ప్రార్థించాలి. మీ క్రికను నెరవేర్చి, మీకు రోగవిముక్తి కలిగించి కష్టాలను తొలగించమని ప్రార్థించాలి. తరువాత పువ్వులు, లడ్డుప్రసాదం అందరికీ పంచి తాను తీసుకోవాలి. సూర్యయంత్రం పూజాస్థలంలో ఎఱ్ఱని వస్త్రంపై స్థాపించాలి. ప్రతిరోజూ యంత్రాన్ని కడిగి సామాన్య పూజ కుంకుమ అక్షతలతో చేసి దూపదీపాలు సమర్పించాలి బెల్లం నైవేద్యంగా పట్టాలి. నవగ్రహ శాంతి కోసం …

 

ఓం బ్రహ్మమురారి త్రిపురాంతకారీ, భానుః శశి భూమి సుతో బుధశ్చ !

గురుశ్చ శుక్రః శని రాహు కేతవః సర్వగ్రహాః శాంతి కరాః భవంతు !!

 

మంత్రాన్ని కనీసం 21 మార్లు తప్పకుండా జపించాలి. ఎందుకంటే దీనివల్ల భవిష్యత్తులో గ్రహదోష బాధ ఉండడు. రోగగ్రస్త వ్యక్తి వెండిలో పొదిగిన మాణిక్యం, జడిత సూర్యప్రతిమ సూర్యయంత్రం లకేట్ ధరించాలి. వాటిని బంగారు, వెండి గొలుసులో లకేపోతే నల్లని లేదా ఎఱ్ఱని దారంతో ధరించాలి. వెండిలో పొదిగిన రుద్రాక్షను భుజానికి కానీ, మెడలో కానీ ధరించవచ్చు. ఈ ప్రయోగం ఏడాదిలో ఒక్కసారి మకరసంక్రాంతి రోజున మాత్రమె చేయాలి. ఈ సమయంలో చేయటం వల్ల ఎన్నోరెట్ల అధికఫలం లభిస్తుంది అని పండితులు చెబుతున్నారు. మిగిలిన పూజా సామాగ్రిని పూర్తిగా ఏదైనా చెట్టు మొదట్లో వదలాలి. పూజ, ధారణ, విసర్జన తరువాత ఒక కుష్టురోగికి ఏదైనా దానం ఇవ్వాలి. 

Products related to this article

Decorative and Designed Kumkuma Bharani (Duck Stand )

Decorative and Designed Kumkuma Bharani (Duck Stand )

Decorative and Designed Kumkuma Bharani (Duck Stand )This Duck Stand is used for decorative purpose and also it is used as Kumkuma Bharani .The Length of the Duck is : 11 InchsThe Width of the Duck is..

₹125.00 ₹200.00

Kamalam Vattulu

Kamalam Vattulu

..

₹45.00 ₹50.00