తిరుప్పావై
తిరుప్పావై - తిరు అంటే శ్రీ అని అర్థం, పావై అంటే పాటలు లేక వ్రతం అని అర్థం. కలియుగంలో మానవకన్యగా జన్మించిన గోదాదేవి పేరుమోసిన ఆండాళ్ భగవంతుడినే తన భర్తగా భావించి, ఆయనను పెండ్లి చేసుకోవాలని సంకల్పించిన వ్రతమే తిరుప్పావై వ్రతం. దీనిలో భాగంగానే ముప్పై పాశురాలు (చందోబద్ధంగా ఉన్న పాటలు) రచించి, రోజుకి ఒకటి చొప్పున పాడుతూ తిరుప్పావై వ్రతం చేసి, ముప్పైవ రోజున పాండురంగడు ఆండాళ్ ని వివాహం చేసుకున్నాడట. ఆ రోజునే భోగి అని అంటారు. ఆండాళ్ తమిళంలో రాసిన ముప్పై పాశురాలని కలిపి తిరుప్పావై అని అంటారు.
తిరుప్పావై వ్రతానికి కొన్ని విధివిధానాలు ఉన్నాయి. సూర్యోదయానికి ముందే నిద్రలేచి స్నానం చేయడం, స్వామి కీర్తనలను ప్రతిరోజూ క్రమం తప్పకుండా తిరుప్పావై పాశురాలను పాడడం, పేదలకు దానములు, పండితులకు సన్మానము చేయడం, స్వామికి, ఆండాళ్ లకు ఇష్టమైన పుష్ప కైంకర్యం చేయడం, ప్రతిరోజూ స్వామివారికి పొంగలి నైవేద్యంగా నివేదించడం. తమకు మంచి భర్త లభించాలని కోరుకుంటూ కన్నెపిల్లలు చేసే వ్రతాలలో తిరుప్పావై వ్రతం ఒకటి.
Note: HTML is not translated!