Thirupavai-Pashuram-4

తిరుప్పావై పాశురము - 4

అళిమళైక్కన్నా ! ఒన్రు నీకై కరవేల్

ఆళియుళ్ పుక్కు ముగున్దు కోడార్తేరి

ఊళిముదల్వ నురువమ్పోల్ మోయికరుత్తు

పాళియందోళుడై పర్పనాబన్ కైయిల్

ఆళిపోళ్ మిన్ని, వలమ్బురి పోల్ నిన్రదిరిన్దు

తాలాదే శార్ జ్ఞ్గముదైత్త శరమళైపోల్

వాళపులాగినిల్ పెయ్ దిడాయ్ నాంగుళుమ్

మార్గళి నీరాడ మగిళిన్దేలో రెమ్బావాయ్

 

వర్షం కోసం మేఖునికి విన్నపం

 

వానదేవుడా! మేము చేయబోవు వ్రతానికి నీరు చాలా అవసరం. నీటిని నీవు సమృద్ధిగా కురిపించవలసింది. మరి నీళ్ళు నీక్కెక్కడివంటావా! సముద్రానికి వెళ్ళు. వెళ్ళి సముద్రంలోని నీళ్ళను గొంతువరకూ తృప్తిగా తాగి గర్జిస్తూ నింగికెగురు. విష్ణువు యొక్క నల్లని శరీరంవలె నీవునూ నల్లని ఛాయను పొందు. జలధిశాయి ధరించిన చక్రకాంతివలె మెరుపులతోను, శంఖధ్వనివలె ఉరుములతోను, శార్ జ్ఞ్గము నుండి వెలువడిన తీవ్రమైన శరపరంపరవలె సంతత వర్షధారలతో లోకాలన్నీ ఆనందించేటట్లు వర్షించు. గోవిందుని పొందుగోరు మేమంతా మార్గశిరమాసంలో నీట జల్లులాడి వ్రతం ఆచరిస్తాం.

Products related to this article

Howlite Bracelet

Howlite Bracelet

It often used to help one, two recognize the impact of their own actions and behavior. It also brings mental awareness and facilitates calm communication.         ..

₹450.00

Ganesha Car Hanging (Green)

0 Comments To "Thirupavai-Pashuram-4"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!