తిరుప్పావై పాశురము - 9
తూమణి మాడత్తుచ్చుట్రుమ్ విళక్కెరియ
ధూపమ్ కమళ త్తుయిలణై మేల్ కణ్ వళరుమ్
మామాన్ మగళే! మణిక్కదవమ్ తాళ్ తిరువాయ్
మామీర్! ఆవళై యెళుప్పిరో ఉన్ మగళ్ దాన్
ఊమైయా! అన్రిచ్చెవిడో? అనన్దలో
ఏ ముప్పెరున్దుయిల్ మన్దిరప్పట్టాళో?
మాయాయన్ మాధవన్ వైకున్దన్ ఎన్రెన్రు
నామమ్ పలవుమ్ నవిన్రేలో రెమ్బావాయ్
శ్రీమంతురాలైన ఒక గోపికను మేల్కొల్పడం
ఓ మామ కూతురా! నిదురలేవమ్మా! మాణిక్య భవనంలో మాణిక్య దీపాల వింతవింత కాంతుల్లో కమ్మని ధూపసువాసనలమధ్య సుతిమెత్తని పడకపై నిద్రిస్తున్నదానా! నిద్ర లేవరాదటే! మణిగాకిలి గడియ తియ్యరాదాటే! అత్తా! నీ బిడ్డను నీవైనా నిద్రలేపు. మా మాటలు వినబడినట్లులేదు. చెవిటిదా? ఏమి మాట్లాడటం లేదు మూగదా? లేక మాటామంతీ లేక నిదురపోవునట్లు మందుగాని మంత్రంగానివేసినారా! గొప్ప గొప్ప మాయలు (లీలలు) చేసేవాడా, మాధవా, వైకుంఠనాథుడా అని వేయి విధాల నోరారా స్వామివారిని గూర్చి మేమందరం గానం చేస్తున్నా కూడా నీ కూతురు నిదుర లేవలేదు. దయచేసి మా వ్రతాచరణకు మీ ముద్దుల కూతురిని నిద్దురనుండి లేపండి.
Note: HTML is not translated!