తిరుప్పావై పాశురము - 11
కట్రుక్కు ఱ వైక్కణంగళ్ పల ఱన్దు
శట్రార్ టి ఱలళియచ్చెన్రు శెరుచ్చెయ్యుమ్
కుట్రమొన్రిల్లాద కోవలర్తమ్ పోర్కోడియే
పుట్రరవల్ గుల్ పునమయిలే పోదరాయ్
శుట్రత్తుతోళిమా రెల్లారుమ్ వన్దునిన్
ముట్రమ్ పుహున్దుముగిల్వణ్ణన్ పేర్వాడ
శిట్రాదే పేశాదే శెల్వప్పణ్నట్టి! నీ
ఎట్రుక్కు రంగమ్ పోరుళేలో రెమ్బావాయ్
సుగుణాలరాశి, అందాలకుప్ప అయిన ఒక గోపికను మేల్కొల్పడం ...
ఓ గోపికామణీ! ఒకవైపు దూడలతో గూడియుండు ఆవుల బరువైన పోదుగులనుండి పాలుపితుకుతూ, మరోవైపు శత్రువుల బలాన్ని నశింపచేసే ధైర్యసాహసాలతో విలసిల్లుతూ, దోషరహితులైన యదువీరుల ఇంటిలో పుట్టిన బంగారుతీగవు నీవు ! పుట్టనుండి వెడలు పాముపడగవంటి జఘనభాగము కలిగిన అందాలభరణివే నీవు! వనమయూరము వంటి ఛాయ కలిగిన వన్నెలాడీ! లేచిరమ్ము, చుట్టుపక్కలనున్న మన నేస్తులందరూ నీవాకిటి ముందరికి వచ్చి, నీలమేఘశ్యాముడగు శ్రీకృష్ణుని నోరార గానం చేస్తున్న, నీవు ఉలకవు పలుకవు. లక్ష్మీకరములైన శుభలక్షణాలు లేక నీవు ఇంకా నిద్రించడం తగని పని. వెంటనే లేచి వ్రతాచరణమునకు మమ్ము అనుసరించవలసింది.
Note: HTML is not translated!