Thirupavai-Pashuram-14

తిరుప్పావై పాశురము - 14

 

ఉజ్ఞ్గళ్ పుళైక్కడై తోట్టత్తు వావియుల్

శెజ్ఞ్గుళునీర్ వాయ్ నెగిలి న్దాంబల్ వాయ్ కూంబినకాణ్

శెజ్ఞ్గల్పోడిక్కూరై వెణ్ పల్ తవత్తవర్

తజ్ఞ్గళ్ రిక్కోయిన్ శజ్ఞ్గిడువాన్ పోగిన్రార్

ఎజ్ఞ్గలై మున్న మెళుప్పువాన్ వాయ్ పేశుమ్

నజ్ఞ్గా యెలున్దిరాయ్ నాణాదాయ్ నావుడై యాయ్

శజ్ఞ్గోడు శక్కర మేన్దుమ్ తడక్కైయన్

పజ్ఞ్గయక్కన్నానై ప్పాడేలో రెమ్బావాయ్

వేలుగురేకలు విచ్చుకున్నవి, లేవమ్మా! లే!

కన్యకామణి! మమ్ము మేల్కొలుపుతానని బీరాలు పలికి నీవే ఆదమరచి నిద్రిస్తున్నావా! ఏమిటి? ఇంకా తెల్లవారలేదని బుకాయింపు మాటలు సిగ్గులేకుండా పలుకుతున్నావా? అటు చూడు మీ ఇంటి పెరడు కొలనులోని ఎర్రతామరాలు వికసించాయి! నల్లకలువలు ముడుచుకొన్నాయి! అటు వీథిలో కాషాయాంబరధారులైన సన్యాసులు దేవాలయం తలుపులు తెరచుటకై తాళాల గుత్తులను తీసుకొనిపోతున్నారు. మమ్ములను లేపెదనని మాటలు చెప్పినదానవు కొంచెమైనా బిడియం లేకుండా ఇంకా నిద్రిస్తున్నావా? శంఖచక్రాలు ధరించిన, పద్మాలవంటి కన్నులుగలవాడైన శ్రీకృష్ణభగవానుని లీలల గూర్చి నోరార గానం చేయడానికి నిద్రలేచిరావమ్మా! ఇది మన వ్రతం కదా!  

Products related to this article

Durga Devi(Bamboo Photo Frame)

Durga Devi(Bamboo Photo Frame)

Durga Devi(Bamboo Photo Frame)..

₹685.00

Decorative Table Stand

Decorative Table Stand

Decorative Table Stand ..

₹378.00

Simhasanam (Red Colour)

Simhasanam (Red Colour)

Simhasanam..

₹1,050.00

0 Comments To "Thirupavai-Pashuram-14"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!