తిరుప్పావై పాశురము - 15
ఎల్లే యిలంగిళియే! యిన్న మురంగుడియో?
శిల్లెన్రళై యేన్మిన్? నజ్ఞ్గేమీర్, పోదరుగిన్రేన్
వల్లై ఉన్ కట్టురైగుళ్ పన్దేయున్ వాయఱిదుమ్
వల్లీర్గళ్ నీజ్ఞ్గళే, నానేదా నాయుడుగ
ఒల్లెనీ పోదాయ్, ఉనక్కెన్న వేఱుడైయై?
ఎల్లారుమ్ పోన్దారో? పోన్దార్, పొన్దేణ్ణిక్కొళ్
వల్లానై మాయనై ప్పాడేలో రెమ్బావాయ్
ఒక కీరవాణిని మేల్కొల్పుట (ఇది సంభాషణ రూపంలో సాగినది)
చెలికత్తెలు ఓసీ! చిలుకపలుకుదానా! ఇంటను నిద్రిస్తూ వున్నావా! కీరవాణి - ష్, ఒళ్ళు ఆదరేట్లు ఏమిటా అరుపు! ఇదే లేచి వస్తున్నా. చెలికత్తెలు చతురవాక్కులు కలదానా! నీ నోరు మాకు తెలియదా! కీరవాణి - సరే కానీ, నేను రాలేదని అంటున్నారు కాని, అందరూ వచ్చినారా! చెలికత్తెలు అందరూ వచ్చినారు. నీవే వచ్చి లెక్కించుకో! కువలయాపీడమనే మత్తగజాన్ని సంహరించినవాడూ, కంసారి, శత్రుమర్ధనుడు, మహామాయగాడు అయిన శ్రీకృష్ణుని లీలల గూర్చి నోరారా కీర్తిద్దాం. ఈ వ్రతానికి మమ్ము అనుసరించు.
Note: HTML is not translated!