Thirupavai-Pashuram-18

తిరుప్పావై పాశురము - 18 

 

 

ఉన్దు మదకళిత్త! నోడాద తోళ్విలియాన్

నన్దగోపాలన్ మరుమగళే! నప్పిన్నాయ్!

కన్దమ్ కుమళుమ్ కుళలీ! కడై తిరవాయ్

వన్దేజ్ఞ్గమ్ కోళి అళైత్తనకాణ్ మాదవి

పన్దల్ మేల్ పల్ కాల్ కుయిలి నజ్ఞ్గల్ కూవినగాణ్

పన్దార్ విరలి! ఉన్ మైత్తునన్ పేర్వాడ

చెన్దామరైక్కైయాల్ శీరార్ వళై యొళిప్ప

వన్దు తిరువాయ్ మగిళిందేలో రెమ్బావాయ్

 

నీలాసుందరీదేవికి మేలుకొలుపు

 

మదగజాలను అణచునట్టి మహాబలశాలి, శత్రువులను చూసి వెనుకంజవేయని భుజబలశాలి అయిన నందగోపరాయని ముద్దులకోడలా! ఓ నీలాసుందరీదేవీ! నిద్ర మేలుకోవమ్మా! కమ్మనైన పువ్వులతో సుగంధాలు వెదజల్లే కురులుగల రమణీమణీ! నిద్దురలేచి తలుపు తెరువు! అంతటా కోళ్ళు కూస్తున్నవి. గురువిందతీగెల పందిళ్ళపైన కోయిలగుంపులు కూతలు పెడుతున్నాయి. పూలబంతులను పట్టుకొన్న అందమైన చేతివేళ్ళుగల శుభాంగీ! నీ నాథుడగు శ్రీకృష్ణుని గుణాలను కీర్తించేందుకు మేమందరం వచ్చివున్నాము. చూడముచ్చటైన నీ చేతిగాజులు గల్లుగల్లుమని శబ్దం చేస్తుండగా కెందామరలవంటి సొంపైన నీ చేతులతో తెలుపు తీయవమ్మా! ఓ నీలాదేవీ! తెలుపుతీసి మేము నోచుతున్న నోమును ఫలింప జేయవమ్మా!   

Products related to this article

Decorative Table Stand

Decorative Table Stand

Decorative Table Stand ..

₹378.00

Decorative Round Tray (Silver Colour)

Decorative Round Tray (Silver Colour)

Decorative Round Bowl(Silver Colour)..

₹45.00

0 Comments To "Thirupavai-Pashuram-18"

Write a comment

Your Name:
 
Your Comment:
Note: HTML is not translated!