తిరుప్పావై పాశురము - 21
ఏట్రకలంగ ళెదిరిపొంగి మీదళిప్ప
మాట్రాదే పాల్ శొరియుమ్ వళ్ళళ్ పెరుమ్ పశుక్కల్
అట్ర ప్పడైత్తాన్ మగనే యరిపురాయ్
ఊట్రముడై యాయ్! పెరియాయ్! ఉలగినిల్
తోట్రమాయ్ నిన్ర శుడరే! తుయిలెళాయ్
మాట్రారునక్కు వలితులైన్దు ఉన్ వా శర్కణ్
అట్రాదు వన్దు ఉన్నడి పణియు మాప్పోలే
పోట్రియామ్ వన్దోమ్ పుగళ్ న్దు ఏలోరెమ్బావాయ్
నీలాదేవి గోదాబృందంతో కలిసి శ్రీకృష్ణుని మేల్కొల్పడం
కుండలు అన్నీ నిండి పోర్లిపోయేవిధంగా పాలను ఇచ్చే ఆవులమందను దండిగా సంపాదించి ప్రసిద్ధిగన్న నందగోపుని కుమారుడైన ఓ గోపాలకృష్ణా! నిదుర మేల్కొవయ్యా! అశ్రితరక్షకా! ప్రపన్నార్తిహరా! శత్రువులు నీవల్ల పరాజితులై దిక్కుగానక నీ ముంగిట వచ్చి నీ పాదాలమీద పడి మీకు సేవచేస్తున్న రీతిని, మేము పొగడుతూ నీకు మంగళాశాసనం పాడటానికిగాను, నీ దగ్గరివాళ్ళం అందరమూ వచ్చివున్నాము. దయచేసి మేలుకో! నీ కళ్యాణ గుణగానం చేస్తున్న మాపై నిండుదయతో మా నోమును సిద్ధింపజేయవలసింది.
Note: HTML is not translated!