తిరుప్పావై పాశురము - 22
అంగణ్ మాజ్ఞాలత్తరశర్ అభిమాన
బజ్ఞ్గమాయ్ నన్దు నిన్ పళ్ళిక్కట్టిల్ కీళే
శజ్ఞ్గమిరుపార్ పోల్ వన్దుతలై ప్పెయ్ దోమ్
కింగిణివాయ్ చ్చెయద తామరప్పూప్పోలే
శెంజ్ఞ్గణ్ శిరిచ్చిరిదే యేమ్మేళ్ విశియావో
తింగుళు మాదిత్తియను మెళున్దార్పోల్
అజ్ఞ్గణ్ణిరన్డుం కొండు ఎజ్ఞ్గళ్ మేల్ నొక్కుదియేల్
ఎజ్ఞ్గళ్ మేల్ చాబ మిళన్దేలో రెమ్బావాయ్
శ్రీ గోదా, నీలాదేవులు శ్రీకృష్ణుని దయను కోరడం ...
భూమండలంలోని చక్రవర్తులంతా తమ శరీరాభిమానాలను, అహంకారాలను పూర్తిగా వదలివేసి, నీ మంచము దగరికి వచ్చి, దేవరవారి దయకై కాచుకొని వున్నవారివలె, మేమూ గుంపుగా వచ్చి నీ దివ్యసన్నిధిలో నిలిచివున్నాము. కృష్ణా! మువ్వల నోరులాగ, అరవిరిసిన ఎఱ్ఱని తామర మొగ్గవలెనున్న నీ కన్నుల్ని మెల్లమెల్లగా తెరచి నీ చల్లనిచూపు మాపై ప్రసరింపజేయుమా! ఓ కన్నయ్య! సూర్యచంద్రులు ఉదయించినట్లుగా మనోహరమైన నీ రెండు కన్నులతో మమ్మల్ని దయతో కటాక్షించినచో మా పాపాలన్నీ భస్మమైపోతాయి. అప్పుడే కదా మా వ్రతం సఫలమవుతుంది.
Note: HTML is not translated!