తిరుప్పావై పాశురము - 23
మారిమలై ముళజ్ఞ్గిళ్ మన్నిక్కడన్దుఱజ్గమ్
శీరియ శిజ్గరివిత్తుత్తీ విళిత్తు
వేరిమయిర్ పోజ్గ వెప్పాడుమ్ పేర్ న్దుదరి
మూరి నిమిర్ న్దు ముళజ్గిప్పురప్పట్టు
పోదురుమాపోలే, నీ పూవైప్పూవన్నా! ఉన్
కోయిల్ నిన్రిజ్గనే పోన్దరుళి కోప్పుడైయ
శీరియ శిజ్గాపనత్తిరున్దు యామ్ వన్ద
కారియమారాయ్ న్దరుళేలో రెమ్బావాయ్
యదుకిశోరానికి గోదాదేవి విన్నపాలు
వానాకాలంలో గుహలో నిద్రిస్తున్న సింహం ఒక్కసారిగా నిద్రలేచి, వళ్ళు సాగదీసి విరుచుకొని, గగుర్పాటుగా వళ్ళు దులుపుకొని శౌర్యంగా చూస్తూ గంభీరంగా గర్జిస్తూ వచ్చినట్లుగానే అవిసెపుష్పంవలె నల్లని మేనితో నిగనిగ మెరుస్తున్న ఓ కన్నయ్య! శయన మందిరంనుండి బయలు వెడలి కొలువుమంటపానికి విజయంచేసి సింహాసనంపై ఆసీనుడవై మా విన్నపాలు విని అనుగ్రహించుమయ్యా! అపుడే నీ దయతో మా వ్రతం తప్పక ఫలిస్తుంది.
Note: HTML is not translated!