తిరుప్పావై పాశురము - 25
ఒరుత్తి మగనాయ్ పిఱన్దు ఓరిరవిల్
ఒరుత్తి మగనాయ్ ఒళిత్తు వళర,
తరక్కిలా నాగిత్తాన్ తీజ్గనినైన్ద
కరుత్తైపిళ్ళైకజ్ఞామ్ వయిట్రిల్
నెరుప్పెన్న నిన్ర నెడుమాలే! యున్నై
అతుత్తిత్తు వన్దోమ్, పఱై తరుతియాగిల్
తిరుర్రక్క శెల్వముమ్ శేవగముమ్ యామ్పాడి
వరుత్తముమ్ తీర్ న్దు మగిళిన్దు ఏలో రెమ్బావాయ్!
భగవానుడే తన కుమారుడుగా కావలెనని కోరి, శంఖచక్రగదాధరుడు అగు భగవానునే కుమారునిగా పొందగల్గిన సాటిలేని దేవకీ దేవికి కుమారుడవై జన్మించి, శ్రీకృష్ణుని లీలలను పరిపూర్ణంగా అనుభవించి, కట్టను - కొట్టాను భగవానుని వశమొనర్చుకొనిన అద్వితీయ వైభవము గల యశోదకు, ఆ రాత్రియే కుమారుడవై, దాగి పెరిగినవాడా! అట్లు పరుగుచున్న నిన్ను చూచి ఓర్వలేక చంపవలెనని దుష్టభావముతో ఉన్న కంసుని అభిప్రాయమును వ్యర్థము చేసి, వాని కడుపులో చిచ్చువై నిన్ను చంపవలెనని తలంచిన వానిని నీవే చంపిన ఆశ్రిత వ్యామోహము కలవాడా! నిన్నే కోరి వచ్చినారము. 'ఱ' అనువాద్యమును ఇచ్చిన ఇమ్ము. సాక్షాత్తు లక్ష్మియే పొందవలెనని కోరదగిన నీ ఐశ్వర్యమును, నీ వీరచరిత్రమును, కీర్తించి శ్రమను వీడి ఆనందించుచున్నాము.
Note: HTML is not translated!