Dhanur Masam
Dhanur Masam
తిరుప్పావై పాశురము - 21
కుండలు అన్నీ నిండి పోర్లిపోయేవిధంగా పాలను ఇచ్చే ఆవులమందను దండిగా సంపాదించి ప్రసిద్ధిగన్న నందగోపుని కుమారుడైన ఓ గోపాలకృష్ణా! నిదుర మేల్కొవయ్యా! అశ్రితరక్షకా! ప్రపన్నార్తిహరా! శత్రువులు నీవల్ల పరాజితులై దిక్కుగానక నీ ముంగిట వచ్చి నీ పాదాలమీద పడి మీకు సేవచేస్తున్న రీతిని, మేము పొగడుతూ నీకు మంగళాశాసనం పాడటానికిగాను,
తిరుప్పావై పాశురము - 20
ముప్పైమూడుకోట్ల దేవతలకు భయాలు కలగడానికి ముందే వారి దగ్గరకు వెళ్ళి వారి ఆపదలను తొలగించే ఓ గోపాలకృష్ణా! ఇక నిద్దుర మేలుకొనవయ్యా! (కృష్ణయ్య పలుకనందువల్ల) స్వర్గ కలశాలవంటి వక్షోజాలు, పగడాలవంటి ఎఱ్ఱని పెదవులు, సొంపైన సన్నని నడుమూ గలిగి శ్రీమహాలక్ష్మి వంటి సౌందర్యంగల ఓ నీలాదేవీ!
తిరుప్పావై పాశురము - 19
నాలుగుమూలల్లో దీపపు సెమ్మెలు వెలుగుతుండగా, దంతపుకోళ్ళ మంచమ్మీద సుతిమెత్తని దూదిపరుపుపై, జడలో గుత్తులు గుత్తులుగా వికసించిన పువ్వులను పెట్టుకొన్న, నీలాదేవి కౌగిలిలో నిద్రిస్తున్న శ్రీకృష్ణదేవా! నోరు తెరచి ఒక్కమాటైనా మాటాడరాదా!
తిరుప్పావై పాశురము - 18
మదగజాలను అణచునట్టి మహాబలశాలి, శత్రువులను చూసి వెనుకంజవేయని భుజబలశాలి అయిన నందగోపరాయని ముద్దులకోడలా! ఓ నీలాసుందరీదేవీ! నిద్ర మేలుకోవమ్మా! కమ్మనైన పువ్వులతో సుగంధాలు వెదజల్లే కురులుగల రమణీమణీ! నిద్దురలేచి తలుపు తెరువు! అంతటా కోళ్ళు కూస్తున్నవి. గురువిందతీగెల పందిళ్ళపైన కోయిలగుంపులు కూతలు పెడుతున్నాయి.
తిరుప్పావై పాశురము - 17
సంతృప్తిగా నీళ్ళు, అన్నవస్త్రాలనిచ్చి, ఆదరంగా మమ్ము ఆదుకొంటున్న నాయకశిరోమణీ! ఓ నందగోపస్వామీ! నిద్దురమేలుకొనవయ్యా! మానినీ మణులందరిలోను మిన్నయై వన్నె తెస్తూ కులదీపమై ప్రకాశిస్తూవున్న ఓ యశోదమ్మా! నిద్దుర మేలుకోవమ్మా!!
తిరుప్పావై పాశురము - 16
మా నాయకుడైన నందగోపుని భవనానికి కావలివున్న ద్వారపాలకస్వామీ! మకరతోరణాదులు చెక్కబడి పతాకాలతో అందంగా కనపడుతున్న రతనాల వాకిలి గడియతీసి తలుపులు తెరచిపెట్టు. మేము యదువంశంలో పుట్టిన అమాయకమైన భామలం! విచిత్రమైన మాయగాడు, నీలమణుల వంటి శరీరచ్చాయగలిగిన ఆ నల్లని కన్నయ్య, మాకు ఓకే వాద్యాన్ని (వరాన్ని)
తిరుప్పావై పాశురము - 15
చెలికత్తెలు ఓసీ! చిలుకపలుకుదానా! ఇంటను నిద్రిస్తూ వున్నావా! కీరవాణి - ష్, ఒళ్ళు ఆదరేట్లు ఏమిటా అరుపు! ఇదే లేచి వస్తున్నా. చెలికత్తెలు చతురవాక్కులు కలదానా! నీ నోరు మాకు తెలియదా! కీరవాణి - సరే కానీ, నేను రాలేదని అంటున్నారు కాని, అందరూ వచ్చినారా! చెలికత్తెలు అందరూ వచ్చినారు.
తిరుప్పావై పాశురము - 14
కన్యకామణి! మమ్ము మేల్కొలుపుతానని బీరాలు పలికి నీవే ఆదమరచి నిద్రిస్తున్నావా! ఏమిటి? ఇంకా తెల్లవారలేదని బుకాయింపు మాటలు సిగ్గులేకుండా పలుకుతున్నావా? అటు చూడు మీ ఇంటి పెరడు కొలనులోని ఎర్రతామరాలు వికసించాయి! నల్లకలువలు ముడుచుకొన్నాయి! అటు వీథిలో కాషాయాంబరధారులైన సన్యాసులు దేవాలయం తలుపులు తెరచుటకై తాళాల గుత్తులను తీసుకొనిపోతున్నారు.
తిరుప్పావై పాశురము - 13
ఓ గోపికా! బకరాక్షసుణ్ణి చెండాడిన శ్రీ కృష్ణభగవానుని, రావణాసురుని సంహరించిన శ్రీరామచంద్రుని కళ్యాణగుణలీలలను ప్రకటించే పాటలను పాడుకుంటూ మనకంటే చిన్న వయసుగల కన్యకలు అందరూ నోము నోచే చోటికి వెళ్ళి చేరారు. తెలతెలవారుతూవుంది. శుక్రుడు ఉదయించి బృహస్పతి అస్తమించాడు.
తిరుప్పావై పాశురము - 12
ఓ గోపికామణీ! తాళ్ళతో కట్టివేసిన దూడల అరుపువిని, వాటిమీద వాత్సల్యంచేత పొదుగులు చేపి, వాటినుండి పాలు కారిపోవడం వల్ల ఇంటి ముంగిట బురద బురదగా అయిన పశుసంపద వృద్ధిపొందిన గోపకునికి చెల్లెలైనదానా! తలలపై కురిసే మంచువల్ల తడుస్తూ నీ ఇంటిముంగిట కాచుకొనివున్నాం.